
యంగ్ హీరో తేజ సజ్జ (Teja Sajja) వరుస బ్లాక్‌బస్టర్స్ అందుకుంటున్నాడు. గతేడాది హనుమాన్‌తో సూపర్ డూపర్ హిట్ అందుకున్న ఈ హీరో ఈ ఏడాది మిరాయ్ (Mirai Movie)తో మరో ఘన విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు. కేవలం రూ.60 కోట్ల బడ్జెట్‌తో విజువల్ వండర్‌గా తెరకెక్కిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద అద్భుతాలు సృష్టించింది. ఏకంగా రూ.150 కోట్లకుపైగా వసూళ్లు రాబట్టింది. సెప్టెంబర్ 12న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం నెల తిరిగేలోపే ఓటీటీలోకి వచ్చేస్తోంది.
ఓటీటీలో మిరాయ్
ఈ విషయాన్ని జియో హాట్‌స్టార్ అధికారికంగా ప్రకటించింది. అక్టోబర్ 10న హాట్‌స్టార్‌లో రిలీజ్ చేస్తున్నట్లు వెల్లడించింది. తెలుగుతో పాటు తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో అందుబాటులోకి రానున్నట్లు తెలిపింది. మిరాయ్ విషయానికి వస్తే.. కార్తీక్ ఘట్టమనేని డైరెక్ట్ చేసిన ఈ సినిమాని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ మీద టీజీ విశ్వప్రసాద్ నిర్మించారు. రితికా నాయక్ హీరోయిన్ కాగా మంచు మనోజ్ విలన్‌గా నటించారు. శ్రియ, జగపతిబాబు తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమా ఓటీటీలో ఎన్ని రికార్డులు సృష్టిస్తుందో చూడాలి!
చదవండి: సంజనా శాడిజం.. చచ్చినా, బతికినా తనతోనే.. ఇమ్మూ లవ్‌స్టోరీ