సినిమా ఒక మాయాజాలం. ఇక్కడ ఎవరు, ఎప్పుడు పాపులర్ అవుతారో, ఎవరు ఎవరితో కలసి చిత్రాలు చేస్తారో ఊహించలేం. ఉదాహరణకు రజనీకాంత్ 173వ చిత్రం విషయానికే వస్తే దానికి ఎవరు దర్శకత్వం వహిస్తారా అనే చర్చ జరిగింది. ధనుష్ సహా పలువురు దర్శకుల పేర్లు సామాజిక మాధ్యమాల్లో హల్ చల్ చేశాయి. అలాంటి పరిస్థితుల్లో అనూహ్యంగా దర్శకుడు సుందర్ సి పేరు ఖరారైంది.
డాన్ దర్శకుడితో రజనీకాంత్
దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వెలువడింది. అలాంటిది హఠాత్తుగా ఆయన ఆ చిత్రం నుంచి వైదొలిగారు. ఆ తరువాత పార్కింగ్ చిత్రం ఫేమ్ రామ్‌కుమార్ బాలకృష్ణన్ పేరు తెరపైకి వచ్చింది. ఆహా.. లక్కీచాన్స్ అని అందరూ అనుకున్నారు. అంతలోనే డ్రాగన్ చిత్రం ఫేమ్ అశ్వద్ మారిముత్తు పేరు వినిపించింది. అయితే తాజాగా డాన్ చిత్రం ఫేమ్ శిబి చక్రవర్తి పేరు ఖరారైంది.
పార్కింగ్ డైరెక్టర్
ఇకపోతే పార్కింగ్ చిత్రం ఫేమ్ రామ్‌కుమార్ బాలకృష్ణన్ ఏం చేస్తున్నారని ఆరా తీస్తే ఆయన ఇటీవల శివకార్తికేయన్‌కు కథ వినిపించినట్లు తెలిసింది. శివకార్తికేయన్ గ్రీన్ సిగ్నల్ ఇస్తారా? లేదా? అనేది ఇప్పుడు ఆసక్తిగా మారింది. ఆయన నటించిన పరాశక్తి చిత్రం ఈనెల 10న తెరపైకి రానుంది. తర్వాత వెంకట్ ప్రభు దర్శకత్వంలో నటించడానికి సిద్ధం అవుతున్నారు. ఒక వేళ రామ్‌కుమార్ బాలకృష్ణన్ కథకు పచ్చజెండా ఊపితే వెంకట్ ప్రభుతో మూవీ చేశాకే ఆయన చిత్రం ఉండే అవకాశం ఉంది.
చదవండి: ఉస్తాద్ భగత్‌సింగ్‌లో ఛాన్స్.. అందుకే వదిలేసుకున్నా: హీరోయిన్


