తండ్రిగా ప్రమోషన్‌ పొందిన 'పార్కింగ్‌' హీరో | Actor Harish Kalyan, Narmada Couple Welcomes Baby Girl | Sakshi
Sakshi News home page

Harish Kalyan: పెళ్లయిన నాలుగేళ్లకు గుడ్‌న్యూస్‌ చెప్పిన హీరో

Mar 2 2026 8:05 PM | Updated on Mar 2 2026 8:07 PM

Actor Harish Kalyan, Narmada Couple Welcomes Baby Girl

తమిళ హీరో, పార్కింగ్‌ ఫేమ్‌ హరీశ్‌ కల్యాణ్‌ గుడ్‌ న్యూస్‌ చెప్పాడు. తాను తండ్రిగా ప్రమోషన్‌ పొందినట్లు వెల్లడించాడు. తనకు కూతురు పుట్టిందన్న శుభవార్తను సోషల్‌ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నాడు. నా జీవితంలోని అద్భుతమైన విషయాన్ని మీతో పంచుకుంటున్నందుకు సంతోషంగా ఉంది. మా జీవితాల్లో కొత్త అధ్యాయం మొదలైంది. నాకు, నర్మదకు ఈరోజు (మార్చి 2న) పాప పుట్టింది. 

ఆనందంగా ఉంది
తల్లీబిడ్డ క్షేమంగా ఉన్నారు. కుటుంబసభ్యులు, బంధుమిత్రులు, శ్రేయోభిలాషులు మాపై చూపిస్తున్న ప్రేమాభిమానాలకు మాకెంతో ఆనందంగా ఉంది. ఈ సందర్భంగా అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఓం నమఃశివాయ అంటూ ఓ లేఖ షేర్‌ చేశాడు. కాగా హరీశ్‌ కల్యాణ్‌- నర్మద ఉదయకుమార్‌ 2022 అక్టోబర్‌లో పెళ్లి చేసుకున్నారు.

సినిమా
2010లో వచ్చిన సింధు సామావెల్లి చిత్రంతో కోలీవుడ్‌కు హీరోగా పరిచయమయ్యాడు. చందమామ, పొరియాలన్‌, ప్యార్‌ ప్రేమ కాదల్‌, లెట్స్‌ గెట్‌ మ్యారీడ్‌, పార్కింగ్‌, లబ్బర్‌ పండు, డీజిల్‌ సినిమాలు చేశాడు. తెలుగులో జై శ్రీరామ్‌, జెర్సీ సినిమాల్లో సహాయక పాత్రలు పోషించాడు. కెరీర్‌ తొలినాళ్లలో తమిళ బిగ్‌బాస్‌ మొదటి సీజన్‌లో పాల్గొని సెకండ్‌ రన్నరప్‌గా నిలిచాడు. ప్రస్తుతం తమిళ ఇండస్ట్రీలో హీరోగా నిలదొక్కుకున్న హరీశ్‌ కల్యాణ్‌ నూరు కోడి వానవిల్‌ మూవీ చేస్తున్నాడు.

 

 

చదవండి: పెళ్లికి ముందు సహజీవనం.. నాకు అవకాశం ఇచ్చుంటే..: లయ

Advertisement
 
Advertisement
Advertisement