లగ్జరీ కారులో సంపూర్ణేశ్‌బాబు.. ధరెంతో తెలుసా? | Actor Sampoornesh Babu Spotted with His New Brand Sports Car | Sakshi
Sakshi News home page

Sampoornesh Babu: ప్యారడైజ్‌ పారితోషికంతో లగ్జరీ కారు కొన్న సంపూ!

Mar 2 2026 5:40 PM | Updated on Mar 2 2026 6:19 PM

Actor Sampoornesh Babu Spotted with His New Brand Sports Car

హృదయకాలేయం (2014) సినిమాతో హీరోగా వెండితెరకు పరిచయమయ్యాడు సంపూర్ణేశ్‌బాబు. మొదటి సినిమాతోనే ఫుల్‌ వైరల్‌ అయిపోయాడు. ఆ తర్వాత హీరోగా, క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా అనేక సినిమాలు చేశాడు. మధ్యలో బిగ్‌బాస్‌ షోలోనూ పాల్గొన్నాడు. కానీ, పట్టుమని పది రోజులు కూడా ఉండలేకపోయాడు. నావల్ల కాదు నేనొచ్చేస్తానంటూ స్వతాహాగా బయటకు వచ్చేశాడు.

స్పోర్ట్స్‌ కారులో తిరిగిన సంపూ
అయితే ఇటీవల ప్యారడైజ్‌లో సంపూ లుక్‌ రిలీజ్‌ చేయగా మరోసారి నెట్టింట వైరల్‌ అయిపోయాడు. చింపిరి జుట్టు, మాసిన గడ్డంతో గొడ్డలి పట్టుకుని రౌడీ అవతార్‌లో కనిపించాడు. తాజాగా సంపూర్ణేశ్‌బాబు స్పోర్ట్స్‌ కారులో కనిపించాడు. హైదరాబాద్‌ రోడ్లపై రెడ్‌ కలర్‌ స్పోర్ట్స్‌ కారు వేసుకుని తిరిగాడు. ఇది చూసిన అభిమానులు సంపూ ఈ కారెప్పుడు కొన్నాడని ఆశ్చర్యపోతున్నారు. 

ఆ డబ్బుతోనే కొన్నాడా?
ఈ కారు ఎంజీ సైబర్‌స్టర్‌ బ్రాండ్‌కు చెందినది అని తెలుస్తోంది. దీని ధర రూ.75 లక్షలపైనే ఉంటుంది. ఏదేమైనా ఒకప్పుడు సైకిల్‌ మీద తిరిగే నటుడు ఇప్పుడు లగ్జరీ కారు నడుపుతుండటంపై నెటిజన్లు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ప్యారడైజ్‌ సినిమాకు ఇచ్చిన రెమ్యునరేషన్‌తోనే ఈ కారు కొని ఉండొచ్చని మరికొందరు కామెంట్లు చేస్తున్నారు. ప్యారడైజ్‌ సినిమా విషయానికి వస్తే.. నాని-శ్రీకాంత్‌ ఓదెల కాంబినేషన్‌లో వస్తున్న రెండో మూవీ ఇది! 

సినిమా
గతంలో వీరిద్దరూ దసరా చిత్రంతో బాక్సాఫీస్‌పై వసూళ్ల వర్షం కురిపించారు. ఈ సారి వినూత్న కాన్సెప్ట్‌తో మరోసారి ప్రేక్షకుల ముందుకు రానున్నారు. నాని జడల్‌ పాత్రలో నటిస్తుండగా మోహన్‌బాబు విలన్‌గా శికంజ మాలిక్‌గా, సంపూర్ణేశ్‌ బిర్యానీ పాత్రలో కనిపించనున్నారు. ఇప్పటికే రిలీజ్‌ చేసిన టీజర్‌, పోస్టర్స్‌, సాంగ్‌ మూవీపై అంచనాలను భారీగా పెంచేశాయి.

 

 

చదవండి: దుబాయ్‌లో మెగా డాటర్‌ శ్రీజ

Advertisement
 
Advertisement
Advertisement