హీరోయిన్ రష్మికని పెళ్లి చేసుకున్న తర్వాత విజయ్ దేవరకొండ.. సోమవారం తన సొంతూరు అయిన తుమ్మనపేటకు వచ్చాడు. ఈ గ్రామం తెలంగాణలోని అచ్చంపేట నియోజకవర్గం బల్మూర్ మండలంలో ఉంది. సొంతూరిలోని ఫామ్ హౌస్‌లో నూతన వధూవరులిద్దరూ సత్యనారాయణ వ్రతం నిర్వహించారు. అనంతరం గ్రామంలోని ప్రజలందరికీ వెజ్-నాన్ వెజ్ భోజనాలు కూడా పెట్టారు. అనంతరం విజయ్ దేవరకొండ మాట్లాడుతూ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
(ఇదీ చదవండి: భర్తని చూస్తూ సిగ్గుపడిపోతూ.. రష్మిక వీడియో వైరల్)
సొంతూరితో ఎంతో ఎమోషనల్ బాండింగ్ ఉంది. ఊర్లో పొలం కొందాం వ్యవసాయం చేసుకుందాం ఇల్లు కట్టుకుందామని నాన్న ఎప్పుడూ అడిగేవాడు. ఆ కోరిక నెరవేరినందుకు సంతోషంగా ఉంది . ఊరిలో ఇల్లు కట్టుకోవడం పెళ్లి చేసుకోవడం ఒకేసారి జరగడంతో హ్యాపీ. ఇకనుంచి గ్రామానికి రెగ్యులర్‌గా వస్తాం. తమ్ముడు ఆనంద్ పెళ్లి గ్రామంలోని అందరి సమక్షంలో చేస్తాం. ఊరికి చేసేది చాలా ఉంది. అందరం కలిసి ఊరిని అభివృద్ధి చేసుకుందాం. దేవరకొండ ఫౌండేషన్ ద్వారా అచ్చంపేట నియోజకవర్గంలోని 44 ప్రభుత్వ స్కూళ్లలో 9వ తరగతి, 10వ తరగతి విద్యార్థులకు స్కాలర్‍షిప్స్ అందిస్తాం అని విజయ్ దేవరకొండ చెప్పుకొచ్చాడు.
ఇకపోతే నిన్న అనగా ఆదివారం.. దేశవ్యాప్తంగా పలు ఆలయాల్లో అభిమానుల కోసం 'విరోష్' జంట అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు. పలుచోట్ల స్వీట్ల పంపిణీ కూడా చేశారు. ఈ బుధవారం(మార్చి 04) హైదరాబాద్‌లో రిసెప్షన్ జరగనుంది. దీనికి టాలీవుడ్‌కి చెందిన సినీ, రాజకీయ ప్రముఖులు చాలామంది హాజరు కానున్నారు.
(ఇదీ చదవండి: సీఎం ఇంట్లో కొత్త పెళ్లికూతురు రష్మిక.. ఫొటోలు వైరల్)
విరోష్ పెళ్లికానుక.. విద్యార్థులకు విజయ్ దేవరకొండ శుభవార్త
విజయ్ దేవరకొండ తన 'విరోష్' పెళ్లికానుకగా విద్యార్థులకు భారీ శుభవార్త చెప్పారు. తమ ట్రస్ట్ ద్వారా మొదట అచ్చంపేట డివిజన్లోని 44 ప్రభుత్వ పాఠశాలల్లో 9, 10 తరగతి ప్రతిభావంతులకు స్కాలర్షిప్లు అందజేయనున్నారు. భవిష్యత్తులో ఈ… pic.twitter.com/nwMlm0M7sI— ChotaNews App (@ChotaNewsApp) March 2, 2026


