విజయ్‌ సొంతూరుకు 'విరోష్‌' జోడీ | Vijay Devarakonda visit his home town with wife Rashmika | Sakshi
Sakshi News home page

విజయ్‌ సొంతూరుకు 'విరోష్‌' జోడీ

Mar 2 2026 10:34 AM | Updated on Mar 2 2026 12:07 PM

Vijay Devarakonda visit his home town with wife Rashmika

విజయ్‌ దేవరకొండ - రష్మిక మందన్న ఫిబ్రవరి 26న వివాహ బంధంతో ఒక్కటయ్యారు. పెద్దల అంగీకారంతో ఉదయ్‌పూర్‌లో ప్రేమ వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. పెళ్లి తర్వాత తొలిసారి సతీమణితో పాటుగా తన సొం‍తూరుకు విజయ్‌ చేరుకున్నారు. దీంతో  భారీగా అభిమానులు, కుటుంబ సభ్యులు తరలివచ్చారు. 

తెలంగాణలోని మారుమూల గ్రామంలో జన్మించిన విజయ్‌ స్వశక్తితో ఎదిగి ప్రేక్షకుల్లో ప్రత్యేకమైన గుర్తింపుని సాధించారు. తనకు ఇష్టమైన రష్మికని సినిమానే దగ్గర చేసింది. తమకు అభిమానులు పెట్టిన ‘విరోష్‌’ ట్యాగ్‌నే వివాహ వేడుకకి పేరుగా పెట్టుకుని వారికి ప్రథమ స్థానం ఇచ్చారు. అంతటితో ఆగని ఈ జంట దేశవ్యాప్తంగా పలు నగరాల్లో స్వీట్లు పంపిణీ చేసి ఫ్యాన్స్‌ నుంచి ఆశీర్వాదం తీసుకున్నారు. అయితే, ఇప్పుడు వివాహ అనంతరం సొంత ఊరుకు తొలిసారి జంటగా చేరుకోవడంతో అక్కడ సందడి వాతావారణం నెలకొంది.

విజయ్ దేవరకొండ స్వస్థలం తెలంగాణలోని అచ్చంపేట నియోజకవర్గం బల్మూర్ మండలం తుమ్మనపేట. తన వివాహం తర్వాత తొలిసారి సతీమణి రష్మికతో సొంతూరు రావడంతో తన చిన్ననాటి స్నేహితులు అందరూ చేరుకున్నారు. నేడు (మార్చి 2న) తుమ్మనపేటలోని ఆయన ఫామ్ హౌస్‌లో సత్యనారాయణ వ్రతం జరిపించనున్నారు. ఇప్పటికే  సంబంధించిన ఏర్పాట్లు కూడా పూర్తి అయ్యాయి. విజయ్‌ అనుకుంటే హైదరాబాద్‌లోనే ఈ కార్యక్రమం జరిపించవచ్చు. కానీ, తన సొంతూరు గ్రామ ప్రజల సమక్షంలో ఈ వేడుక జరగాలని ఆయన కోరుకున్నట్లు తెలుస్తోంది. 

(వీడియో క్రెడిట్‌ — Telugu Scribe)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement