సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చిన రోజా.. టీజర్‌ అదిరింది! | Roja Selvamani Re Entry In Films With Anbe Diana, Teaser Out | Sakshi
Sakshi News home page

సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చిన రోజా.. టీజర్‌ అదిరింది!

Mar 2 2026 8:32 AM | Updated on Mar 2 2026 8:40 AM

Roja Selvamani Re Entry In Films With Anbe Diana, Teaser Out

తమిళం,తెలుగు తదితర భాషల్లో కథానాయకిగా పలు చిత్రాల్లో నటించి ప్రేక్షకుల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్న నటి రోజా. రాజకీయ రంగప్రవేశం చేసిన తరువాత ఆమె నటనకు దూరంగా ఉన్నారు. కాగా ఇప్పుడు మళ్లీ నటనపై దృష్టి సారించారు. అలా నటి రోజా ప్రధాన పాత్రను పోషిస్తున్న అన్బే డయానా(Anbe Diana) చిత్రంలో జమ చిత్రం ఫేమ్‌ పారిఇళవళగన్‌ కథానాయకుడిగా నటిస్తూ స్వీయ దర్శకత్వం వహిస్తున్నారు. 

నటి రమ్యా రంగనాథన్‌ నాయకిగా నటిస్తున్నారు. నటుడు చేతన్‌, యూట్యూబర్‌ పరితాపంగళ్‌ గోపి,ఇస్మత్‌భాను, సుదర్శన్‌ గాంధీ, సెల్‌ మురగన్‌ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఇంతకు ముందు గుడ్‌నైట్‌,లవర్‌,టూరిస్ట్‌ ప్యామిలీ వంటి విజయవంతమైన చిత్రాలను నిర్మించిన మిలియన్‌ డాలర్‌ స్టూడియోస్‌ సంస్థ నిర్మిస్తున్న 7వ చిత్రం ఇది. కాగా పెరంబూర్‌ నేపధ్యంలో రూపొందుతున్న ఈ చిత్రం షూటింగ్‌ను పూర్తి చేసుకుని ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలను జరుపుకుంటోంది. ఇది చైన్నెని మరో కోణంలో ఆవిష్కరించే కథా చిత్రంగా ఉంటుందని యూనిట్‌ సభ్యులు మీడియాకు విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. 

అంతే కాకుండా ప్రేమ , వినోదం, మత విభేదాలు వంటి అంశాలతో కథ, కథనాలు కొత్తగా ఉంటాయని చెప్పారు.ఉత్తర చైన్నెలోని ఒక మిడిల్‌క్లాస్‌ కుటుంబంలో జరిగే ఘటనల ఇతి వృత్తంతో సాగే ఈ చిత్రానికి అబ్బే డయానా అనే టైటిల్‌ను నిర్ణయించారు. ఆ కుటుబానికి చెందిన యువకుడు ఆంగ్లో ఇండియన్‌ యువతిని ప్రేమిస్తే జరిగే పరిణామాలను ఆసక్తిగా చిత్రీకరించినట్లు చెప్పారు. ఈ సందర్బంగా చిత్ర టీజర్‌ను విడుదల చేశారు. టీజర్‌కు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వస్తోందన్నారు. కాగా చిత్ర ట్రైలర్‌, ఆడియోను త్వరలోనే విడుదల చేయనున్నట్లు పేర్కొన్నారు. ఈ చిత్రానికి భరత్‌ శంకర్‌ సంగీతాన్ని, షెల్లీ కెలిస్ట్‌ చాయాగ్రహణం అందిస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement