breaking news
Anbe Diana Movie
-
ఈ వారం ఓటీటీల్లోకి 20 సినిమాలు.. ఆ ఐదు డోంట్ మిస్
మరోవారం వచ్చేసింది. ఈసారి యష్ 'టాక్సిక్', నయనతార 'హాయ్' లాంటి డబ్బింగ్ సినిమాలతో పాటు 'కికు చిరంజీవి' అనే తెలుగు మూవీ థియేటర్లలోకి రానుంది. వీటిలో యష్ చిత్రానికి మంచి హైప్ ఉంది. అందుకు తగ్గట్లే రెగ్యులర్‌గా శుక్రవారం నాడు కాకుండా బుధవారమే(ఆగస్టు 26) పాన్ ఇండియా వైడ్ రిలీజ్ చేస్తున్నారు. మరోవైపు ఓటీటీల్లోనూ చెప్పుకోదగ్గ మూవీస్ స్ట్రీమింగ్ కాబోతున్నాయి.(ఇదీ చదవండి: ఓటీటీ సినిమా 'ప్యార్ ప్రేమ కళ్యాణం' తెలుగు రివ్యూ)ఓటీటీల్లో రిలీజయ్యే సినిమాల విషయానికొస్తే.. పృథ్వీరాజ్ సుకుమారన్ 'ఐ నోబడీ', మైఖేల్, బబితా సింగ్ రిపోర్టింగ్, అన్బే డయానా, ఆల్ఫా మూవీస్ ఉన్నంతలో ఆసక్తి కలిగిస్తున్నాయి. దీనితో పాటు ఆకలిరాజ్యం 2026, పార్ట్ టైమర్స్ లాంటి తెలుగు సిరీసులు.. బంధర్ అనే హిందీ చిత్రం కూడా ఇంట్రెస్టింగ్‌గానే అనిపిస్తోంది. ఇంతకీ ఏ మూవీ ఏ ఓటీటీలోకి రానుందంటే?ఈ వారం ఓటీటీల్లో రిలీజయ్యే మూవీస్ (ఆగస్టు 24 నుంచి 30 వరకు)హాట్స్టార్ఐ నోబడీ (తెలుగు డబ్బింగ్ సినిమా) - ఆగస్టు 25అడల్ట్స్ సీజన్ 2 (ఇంగ్లీష్ సిరీస్) - ఆగస్టు 27పార్ట్ టైమర్స్ (తెలుగు సిరీస్) - ఆగస్టు 28మైఖేల్ (హిందీ డబ్బింగ్ మూవీ) - ఆగస్టు 29నెట్ఫ్లిక్స్ద లాస్ట్ సెల్యూట్: ఏ లవ్ లెటర్ టూ MiG-21 (హిందీ డాక్యుమెంటరీ) - ఆగస్టు 26లిన్ (ఇంగ్లీష్ సిరీస్) - ఆగస్టు 27బ్యూటీ ఇన్ బ్లాక్ సీజన్ 3 (ఇంగ్లీష్ సిరీస్) - ఆగస్టు 27ఆల్ ద ట్రూత్ ఇన్ మై లైస్ (ఇంగ్లీష్ సిరీస్) - ఆగస్టు 28చుంబక్ (హిందీ సిరీస్) - ఆగస్టు 28గ్రేవ్ యార్డ్ సీజన్ 3 (టర్కిష్ సిరీస్) - ఆగస్టు 28ద విస్పర్ మ్యాన్ (ఇంగ్లీష్ మూవీ) - ఆగస్టు 28ఆల్ఫా (హిందీ మూవీ) - ఆగస్టు 28అమెజాన్ ప్రైమ్ద లాస్ట్ సన్‌రైజ్ (ఇంగ్లీష్ మూవీ) - ఆగస్టు 26బబితా సింగ్ రిపోర్టింగ్ (తెలుగు డబ్బింగ్ సినిమా) - ఆగస్టు 28బెట్టి లా ఫియా సీజన్ 3 (ఇంగ్లీష్ సిరీస్) - ఆగస్టు 28సోనీ లివ్అన్బే డయానా (తెలుగు డబ్బింగ్ చిత్రం) - ఆగస్టు 28జీ5బంధర్ (హిందీ మూవీ) - ఆగస్టు 28ఆహాఆకలిరాజ్యం 2026 (తెలుగు సిరీస్) - ఆగస్టు 28ఆపిల్ టీవీ ప్లస్డార్క్ మేటర్స్ సీజన్ 2 (ఇంగ్లీష్ సిరీస్) - ఆగస్టు 28లయన్స్ గేట్ ప్లేహంగ్రీ (ఇంగ్లీష్ సినిమా) - ఆగస్టు 28(ఇదీ చదవండి: దేశ విభజనతో నలిగిపోయిన 'ప్రేమ'కథ.. ఓటీటీ సినిమా రివ్యూ) -
ఓటీటీలోకి తమిళ రొమాంటిక్ కామెడీ సినిమా
ఒకప్పటి హీరోయిన్ రోజా చాన్నాళ్ల తర్వాత తమిళ సినిమాలతో నటిగా రీఎంట్రీ ఇచ్చారు. ఈ ఏడాది అలా ఓ రొమాంటిక్ కామెడీ మూవీలో హీరోకు తల్లి పాత్ర చేసింది. థియేటర్లలో ఆడిన ఈ చిత్రం ఇప్పుడు ఓటీటీలోకి తెలుగులోనూ స్ట్రీమింగ్ అయ్యేందుకు సిద్ధమైంది. ఈ మేరకు అధికారికంగానూ ప్రకటించారు. ఇంతకీ దీని సంగతేంటి? ఎప్పుడు ఎందులోకి రానుంది?పారి ఎలవళగన్ హీరో కమ్ దర్శకుడిగా చేసిన 'అన్బే డయానా'. రమ్య రంగనాథన్ హీరోయిన్. రోజా కీలక పాత్ర చేశారు. జూలై 17న తమిళంలో థియేటర్లలో రిలీజైంది. హిట్ టాక్ సొంతం చేసుకుంది. ఇప్పుడీ చిత్రాన్ని ఈ నెల 28 నుంచి సోనీ లివ్ ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. తమిళంతో పాటు తెలుగు, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లోనూ అందుబాటులోకి రానుంది. ఈ మేరకు ట్రైలర్ రిలీజ్ చేశారు.'అన్బే డయానా' విషయానికొస్తే.. కృష్ణ(పారి ఎలవళగన్) ఓ మిడిల్ క్లాస్ కుర్రాడు. ఆంగ్లో ఇండియన్ అమ్మాయి డయానా(రమ్య రంగనాథన్)తో ప్రేమలో పడతాడు. డయానా ఫ్రీ బర్డ్ అంటే మందు, సిగరెట్లు లాంటి అలవాట్లు ఉంటాయి. కానీ కృష్ణ భిన్నమైన వాతావరణంలో పెరుగుతాడు. డయానాతో ప్రేమకు కృష్ణ తల్లి సరళ(ఆర్కే రోజా) అడ్డు చెబుతుంది. తన కులానికే చెందిన మరో అమ్మాయితో కొడుకు పెళ్లి ఫిక్స్ చేస్తుంది. ఆ తర్వాత ఏమైంది? తను ప్రేమించిన డయానా కోసం కృష్ణ ఏం చేశాడు? కొడుకు ప్రేమ.. సరళలో ఎలాంటి మార్పును తీసుకొచ్చిందనేది మిగతా స్టోరీ. -
ఓటీటీలోకి రోజా రీఎంట్రీ సినిమా
ప్రముఖ నటి, వైఎస్సార్సీపీ నేత ఆర్కే రోజా గత పదిపదకొండేళ్ల నుంచి సినిమాలు చేయట్లేదు. అడపాదడపా షోల్లో మాత్రమే కనిపిస్తున్నారు. ఓ తమిళ సినిమాతో నటిగా రీఎంట్రీ ఇచ్చింది. తమిళంలో హిట్ అయిన చిత్రం ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేందుకు సిద్ధమైంది. ఇంతకీ ఈ చిత్రం సంగతేంటి? ఎందులోకి రానుంది?(ఇదీ చదవండి: దేశ విభజనతో నలిగిపోయిన 'ప్రేమ'కథ.. ఓటీటీ సినిమా రివ్యూ)రోజా రీఎంట్రీ ఇచ్చిన తమిళ సినిమా 'అన్బే డయానా'. పారి ఎలావళగన్ హీరో కమ్ దర్శకుడు. రమ్య రంగనాథన్ హీరోయిన్. జూలైలో తమిళం వరకు థియేటర్లలో రిలీజైంది. హిట్ టాక్ సొంతం చేసుకుంది. ఇప్పుడీ చిత్రాన్ని ఈ నెల 28 నుంచి సోనీ లివ్ ఓటీటీలో స్ట్రీమింగ్ చేయనున్నారు. తమిళంతో పాటు తెలుగు, కన్నడ, మలయాళ భాషల్లోనూ అందుబాటులోకి తీసుకురానున్నారు.'అన్బే డయానా' విషయానికొస్తే.. కృష్ణ ఓ మిడిల్ క్లాస్ కుర్రాడు. ఆంగ్లో ఇండియన్ అమ్మాయి డయానాతో ప్రేమలో పడతాడు. డయానా ఫ్రీ బర్డ్ అంటే మందు, సిగరెట్లు లాంటి అలవాట్లు ఉంటాయి. కానీ కృష్ణ భిన్నమైన వాతావరణంలో పెరుగుతాడు. డయానాతో ప్రేమకు కృష్ణ తల్లి సరళ(ఆర్కే రోజా) అడ్డు చెబుతుంది. తన కులానికే చెందిన మరో అమ్మాయితో కొడుకు పెళ్లి ఫిక్స్ చేస్తుంది. ఆ తర్వాత ఏమైంది? తను ప్రేమించిన డయానా కోసం కృష్ణ ఏం చేశాడు? కొడుకు ప్రేమ.. సరళలో ఎలాంటి మార్పును తీసుకొచ్చిందనేది మిగతా స్టోరీ.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 22 సినిమాలు.. ఆ మూడు డోంట్ మిస్) -
తమిళ సాంగ్ రిలీజ్.. స్టెప్పులేసిన రోజా
మిలియన్ డాలర్స్ స్టూడియోస్, నీయో కాస్టిల్స్ క్రియేషన్స్ సంస్థల అధినేతలు సత్య కరికాలన్, యువరాజ్ గణేశన్ కలిసి నిర్మిస్తున్న చిత్రం అన్బే డయానా. జమా చిత్రం ఫేమ్ పారి ఇళవళగన్ కథానాయకుడిగా నటిస్తుండటంతో పాటు కథ, కథనం, దర్శకత్వ బాధ్యతలను నిర్వహిస్తున్నాడు. ఈ చిత్రంలో ఆయనకు జంటగా రమ్య రంగనాథన్ నటిస్తోంది.సాంగ్ రిలీజ్తమిళనాడులోని ఒక గ్రూప్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ మూవీ.. షూటింగ్ పూర్తి చేసుకుని ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలను జరుపుకుంటోంది. తాజాగా ఈ సినిమా నుంచి సింగిల్ సాంగ్‌ను విడుదల చేశారు. ఇందులో హీరోహీరోయిన్లతో పాటు నటి రోజా కూడా స్టెప్పులేశారు. జెస్సీ గిఫ్ట్ ఆలపించిన ఈ పాటను ఇప్పుడు సంగీత ప్రియులు రిపీట్ మోడల్ వింటున్నారు. సినిమారొమాంటిక్ వైబ్‌తో పాటు ఫ్యామిలీ ఎంటర్టైనర్గా సాగే అన్బే డయానా ఆడియో, ట్రైలర్ లాంచ్ వివరాలను త్వరలోనే వెల్లడించనున్నట్లు పేర్కొన్నారు. నటుడు చేతన్, వైరల్ యూట్యూబర్ పరితాపంగల్ గోపి, ఇస్మత్ భాను, సుదర్శన్ గాంధీ, సెల్ మురుగన్ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి భరత్ శంకర్ సంగీతాన్ని, షెల్లీ గెలిస్ట్ ఛాయాగ్రహణాన్ని అందిస్తున్నారు. -
సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చిన రోజా.. టీజర్ అదిరింది!
తమిళం,తెలుగు తదితర భాషల్లో కథానాయకిగా పలు చిత్రాల్లో నటించి ప్రేక్షకుల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్న నటి రోజా. రాజకీయ రంగప్రవేశం చేసిన తరువాత ఆమె నటనకు దూరంగా ఉన్నారు. కాగా ఇప్పుడు మళ్లీ నటనపై దృష్టి సారించారు. అలా నటి రోజా ప్రధాన పాత్రను పోషిస్తున్న అన్బే డయానా(Anbe DianaAnbe Diana) చిత్రంలో జమ చిత్రం ఫేమ్ పారిఇళవళగన్ కథానాయకుడిగా నటిస్తూ స్వీయ దర్శకత్వం వహిస్తున్నారు. నటి రమ్యా రంగనాథన్ నాయకిగా నటిస్తున్నారు. నటుడు చేతన్, యూట్యూబర్ పరితాపంగళ్ గోపి,ఇస్మత్భాను, సుదర్శన్ గాంధీ, సెల్ మురగన్ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఇంతకు ముందు గుడ్‌నైట్,లవర్,టూరిస్ట్ ప్యామిలీ వంటి విజయవంతమైన చిత్రాలను నిర్మించిన మిలియన్ డాలర్ స్టూడియోస్ సంస్థ నిర్మిస్తున్న 7వ చిత్రం ఇది. కాగా పెరంబూర్ నేపధ్యంలో రూపొందుతున్న ఈ చిత్రం షూటింగ్‌ను పూర్తి చేసుకుని ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలను జరుపుకుంటోంది. ఇది చైన్నెని మరో కోణంలో ఆవిష్కరించే కథా చిత్రంగా ఉంటుందని యూనిట్ సభ్యులు మీడియాకు విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. అంతే కాకుండా ప్రేమ , వినోదం, మత విభేదాలు వంటి అంశాలతో కథ, కథనాలు కొత్తగా ఉంటాయని చెప్పారు.ఉత్తర చైన్నెలోని ఒక మిడిల్‌క్లాస్ కుటుంబంలో జరిగే ఘటనల ఇతి వృత్తంతో సాగే ఈ చిత్రానికి అబ్బే డయానా అనే టైటిల్‌ను నిర్ణయించారు. ఆ కుటుబానికి చెందిన యువకుడు ఆంగ్లో ఇండియన్ యువతిని ప్రేమిస్తే జరిగే పరిణామాలను ఆసక్తిగా చిత్రీకరించినట్లు చెప్పారు. ఈ సందర్బంగా చిత్ర టీజర్‌ను విడుదల చేశారు. టీజర్‌కు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వస్తోందన్నారు. కాగా చిత్ర ట్రైలర్, ఆడియోను త్వరలోనే విడుదల చేయనున్నట్లు పేర్కొన్నారు. ఈ చిత్రానికి భరత్ శంకర్ సంగీతాన్ని, షెల్లీ కెలిస్ట్ చాయాగ్రహణం అందిస్తున్నారు.


