ఓటీటీలోకి తమిళ రొమాంటిక్ కామెడీ సినిమా | Anbe Diana Movie OTT Release Date Confirmed, Check Out Streaming Platform Details | Sakshi
Sakshi News home page

Anbe Diana In OTT: రోజా రీఎంట్రీ సినిమా ఓటీటీలోకి.. అధికారిక ప్రకటన

Aug 23 2026 5:05 AM | Updated on Aug 23 2026 10:32 AM

Anbe Diana Movie OTT Streaming Date Latest

ఒకప్పటి హీరోయిన్ రోజా చాన్నాళ్ల తర్వాత తమిళ సినిమాలతో నటిగా రీఎంట్రీ ఇచ్చారు. ఈ ఏడాది అలా ఓ రొమాంటిక్ కామెడీ మూవీలో హీరోకు తల్లి పాత్ర చేసింది. థియేటర్లలో ఆడిన ఈ చిత్రం ఇప్పుడు ఓటీటీలోకి తెలుగులోనూ స్ట్రీమింగ్ అయ్యేందుకు సిద్ధమైంది. ఈ మేరకు అధికారికంగానూ ప్రకటించారు. ఇంతకీ దీని సంగతేంటి? ఎప్పుడు ఎందులోకి రానుంది?

పారి ఎలవళగన్ హీరో కమ్ దర్శకుడిగా చేసిన 'అన్బే డయానా'. రమ్య రంగనాథన్ హీరోయిన్. రోజా కీలక పాత్ర చేశారు. జూలై 17న తమిళంలో థియేటర్లలో రిలీజైంది. హిట్ టాక్ సొంతం చేసుకుంది. ఇప్పుడీ చిత్రాన్ని ఈ నెల 28 నుంచి సోనీ లివ్ ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. తమిళంతో పాటు తెలుగు, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లోనూ అందుబాటులోకి రానుంది. ఈ మేరకు ట్రైలర్ రిలీజ్ చేశారు.

'అన్బే డయానా' విషయానికొస్తే.. కృష్ణ(పారి ఎలవళగన్) ఓ మిడిల్ క్లాస్ కుర్రాడు. ఆంగ్లో ఇండియ‌న్ అమ్మాయి డ‌యానా(రమ్య రంగనాథన్)తో ప్రేమ‌లో ప‌డ‌తాడు. డ‌యానా ఫ్రీ బర్డ్ అంటే మందు, సిగ‌రెట్లు లాంటి అల‌వాట్లు ఉంటాయి. కానీ కృష్ణ భిన్నమైన వాతావ‌ర‌ణంలో పెరుగుతాడు. డ‌యానాతో ప్రేమ‌కు కృష్ణ త‌ల్లి స‌ర‌ళ(ఆర్కే రోజా) అడ్డు చెబుతుంది. త‌న కులానికే చెందిన మ‌రో అమ్మాయితో కొడుకు పెళ్లి ఫిక్స్ చేస్తుంది. ఆ త‌ర్వాత ఏమైంది? త‌ను ప్రేమించిన డ‌యానా కోసం కృష్ణ ఏం చేశాడు? కొడుకు ప్రేమ.. స‌ర‌ళ‌లో ఎలాంటి మార్పును తీసుకొచ్చిందనేది మిగతా స్టోరీ.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement