మెగాస్టార్ చిరంజీవి నటించిన 'మనశంకర వరప్రసాద్‌గారు' 50రోజులు పూర్తి చేసుకుంది. దర్శకుడు అనిల్ రావిపూడి తెరకెక్కించిన ఈ చిత్రం జనవరి 12న ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. ఇందులో నయనతార హీరోయిన్‌గా నటించగా.. వెంకటేశ్ కీలకపాత్రలో మెప్పించారు. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు సాధించి ఆల్‌టైమ్ రీజనల్ ఇండస్ట్రీ రికార్డ్ క్రియేట్ చేసింది. 50రోజులు పూర్తి కావడంతో తాజాగా మేకర్స్ ఒక పోస్టర్‌ను విడుదల చేశారు.
'మనశంకర వరప్రసాద్‌గారు' 109 సెంటర్స్‌లో 50రోజులు పూర్తి చేసుకున్నట్లు అధికారికంగా మేకర్స్ ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్ (97), తెలంగాణ (5), కర్ణాటక (6), ఒరిస్సా(1) సెంటర్లలో విజయవంతంగా ఈ మూవీ రన్ అవుతుంది. అయితే, అనిల్ రావిపూడి- వెంకటేష్ కాంబినేషన్‌లో 2025 పొంగల్ కానుకగా వచ్చిన సంక్రాంతికి వస్తున్నాం మూవీ కూడా 92 కేంద్రాల్లో 50రోజులు పూర్తి చేసుకుంది. ఇప్పుడు ఈ రికార్డ్‌ను 'మనశంకర వరప్రసాద్‌గారు' దాటేసింది.

'మనశంకర వరప్రసాద్‌గారు' ఫైనల్ కలెక్షన్స్
'మనశంకర వరప్రసాద్‌గారు' కేవలం 25రోజుల్లోనే రూ. 375 కోట్ల గ్రాస్ రాబట్టినట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. అయితే, ఆ తర్వాత నుంచి వారు కలెక్షన్స్ అధికారికంగా ప్రకటించలేదు. అయితే, ఇండస్ట్రీ అంచన ప్రకారం ఈ చిత్రం ఫైనల్ కలెక్షన్స్ రూ. 395 కోట్ల వరకు ఉండొచ్చు అనే అంచనా వుంది. ఈ మూవీ సుమారు రూ. 200 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కినట్లు సమాచారం.


