అల్లు ఫ్యామిలీలో పెళ్లి.. నయనిక సిస్టర్స్‌ ఫోటో వైరల్‌ | Nayanika Reddy Sister Photo trend in social media | Sakshi
Sakshi News home page

అల్లు ఫ్యామిలీలో పెళ్లి.. నయనిక సిస్టర్స్‌ ఫోటో వైరల్‌

Mar 2 2026 11:15 AM | Updated on Mar 2 2026 11:31 AM

Nayanika Reddy Sister Photo trend in social media

టాలీవుడ్‌లో మరో పెళ్లి వేడుక మొదలైంది. సినీ నటుడు అల్లు శిరీష్‌, నయనికల వివాహం మార్చి 6న ఘనంగా జరగనుంది. ఈ క్రమంలో కాబోయే కొత్తజంట కలిసి ఫోటోలు దిగారు. వాటిని ఎప్పటికప్పడు సోషల్‌మీడియాలో అభిమానులతో పంచుకుంటున్నారు. ఈ క్రమంలో తాజాగా అల్లు అరవింద్‌ నివాసంలో పెళ్లి కొడుకు వేడుక నిర్వహించారు.  ఈ వేడుకలో విజయ్‌, రష్మికలతో పాటు చిరంజీవి కుటుంబ సభ్యులు, బాలకృష్ణ సతీమణి వసుంధర పాల్గొన్నారు.

సోషల్‌మీడియాలో నయనిక సిస్టర్స్‌ ఫోటో వైరల్‌ అవుతుంది. అల్లు కుటుంబానికి కాబోయే కోడలు తన ఇద్దరు సిస్టర్స్‌తో కలిసి దిగిన ఫోటోను షేర్‌ చేసింది. త్రీ సిస్టర్స్‌ సూపర్‌ అంటూ కామెంట్ల రూపంలో నెటిజన్లు తెలుపుతున్నారు. సిస్టర్స్‌ వైబ్‌ అదిరింది అంటూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement