Nayanika
-
పెళ్లికి ముందే పిల్లల విషయంలో ఆ నిర్ణయం తీసుకున్నాం: అల్లు శిరీష్
టాలీవుడ్ యంగ్ హీరో అల్లు శిరీష్ ఇటీవల వైవాహిక బంధంలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. మార్చి 6న తన ప్రియురాలు నయనికను వివాహం చేసుకున్నాడు. అయితే పెళ్లికి ముందే ఈ జంట తమకు పుట్టబోయే పిల్లల గురించి ఓ కీలక నిర్ణయం తీసుకున్నారట. పుట్టబోయే పిల్లలను తెలుగులో మాట్లాడేలా పెంచాలనుకుంటున్నారట. ఈ విషయాన్ని స్వయంగా అల్లు శిరీషే చెప్పారు. తాజాగా ఓ జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన లవ్‌స్టోరీ గురించి వివరించాడు.అత్తయ్యకు దొరికిపోయాం..మేమిద్దరం ప్రేమలో ఉన్న విషయం మొదట మా అత్తయ్య(చిరంజీవి సతీమణి సురేఖ)కు తెలిసింది. మేమిద్దరం ఓ రోజు కాఫీ తాగేందుకు బయటకు వెళ్లాం. కాఫీ షాపులో మా అత్తయ్యకు తెలిసివాళ్లు కూడా ఉన్నారు. అది మాకు తెలియదు. మేము కాఫీతాగి బయటకు రాగానే.. వాళ్లు మా అత్తయ్యకు ఫోన్ చేసి చెప్పారు. అలా మా ప్రేమ విషయంలో ఇంట్లో తెలిసింది. నేను కూడా నయనికను ప్రేమిస్తున్నానే విషయాన్ని ఇంట్లోవాళ్లకు చెప్పాను. వాళ్ల అంగీకారంతో పెళ్లి చేసుకున్నాం.నయనిక సెన్స్ ఆఫ్ హ్యూమర్ అంటే నాకు ఇష్టంనయనిక సెన్స్ ఆఫ్ హ్యూమర్ అంటే నాకు చాలా ఇష్టం. ఏ విషయానైనా ముక్కు సూటిగా మాట్లాడుతుంది. నచ్చకపోతే ముఖం మీదనే నచ్చలేదని చెప్పెస్తుంది. నా సినిమాల్లో నచ్చిన విషయాలను షేర్ చేసుకునేది. పెళ్లికి ముందే మేము పిల్లల గురించి కూడా మాట్లాడుకున్నాం. మాకు పుట్టబోయే పిల్లలు ఇంట్లో తెలుగులోనే మాట్లాడాలనేది నా కోరిక. దీనిపై మేమిద్దరం చర్చించుకున్నాం’ అని శిరీష్ చెప్పుకొచ్చాడు. -
నా పెళ్లికి ముందు అన్న ఇచ్చిన సలహా..: అల్లు శిరీష్
టాలీవుడ్ హీరో అల్లు శిరీష్ ఇటీవలే వైవాహిక బంధంలోకి అడుగుపెట్టాడు. అన్నావదినలైన అల్లు అర్జున్- స్నేహల పెళ్లిరోజు (మార్చి 6న)న ప్రేయసి నయనిక మెడలో మూడు ముళ్లు వేశాడు. అప్పటినుంచి వెడ్డింగ్ సెలబ్రేషన్స్‌కు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూనే ఉన్నాడు.విలువైన సలహాతాజాగా తన పెళ్లికి ముందు అన్నయ్య ఇచ్చిన ఐడియా గురించి చెప్పుకొచ్చాడు. వెరైటీ ఇండియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో శిరీష్ మాట్లాడుతూ.. కొన్ని విషయాలు స్వయంగా అనుభూతి చెందాలని అన్నయ్య, నాన్న భావిస్తారు. అందుకనే మనం అడగనంతవరకు వాళ్లు ఎటువంటి సలహాలు ఇవ్వరు. అయితే నా అన్న నాకో విలువైన సలహా ఇచ్చాడు. ఇవే జీవితంలో మధుర క్షణాలుకొన్నిసార్లు పరిస్థితులు మన చేతిలో ఉండవు. అన్నీ అనుకున్నట్లుగా జరగవు. ఫంక్షన్లో కరెక్ట్ సమయానికి దుస్తులు రాకపోవచ్చు, లేదంటే కాస్త ఆలస్యం అవొచ్చు.. అంతమాత్రానికి ఒత్తిడికి లోనవద్దు. ఇవి నీ జీవితంలోనే మధురమైన క్షణాలు.. వాటిని ఆస్వాదించు అని చెప్పాడని గుర్తు చేసుకున్నాడు.లవ్స్టోరీతన లవ్‌స్టోరీ గురించి మాట్లాడుతూ.. నా కజిన్ వరుణ్ తేజ్ - లావణ్య త్రిపాఠి 2023 అక్టోబర్‌లో పెళ్లి చేసుకున్నారు. ఆ సమయంలో ఏర్పాటు చేసిన ఓ పార్టీలో మేమిద్దరం కలుసుకున్నాం. సరదాగా మాట్లాడుకున్నాం.. ఫ్రెండ్స్ అయిపోయాం. తెలియకుండానే ప్రేమలో పడిపోయాం. అయితే నయనిక సోదరి.. మా వదిన స్నేహ మంచి ఫ్రెండ్స్. సీరియస్ కాదేమోనని అనుమానంనావల్ల వారి స్నేహానికి ఆటంకం రాకూడదని భావించాను. అలాగే తను కూడా నేను యాక్టర్‌ను, నేను సీరియస్‌గా ప్రేమించడం లేదేమోనని భయపడింది. అయితే హీరో నితిన్ భార్య షాలిని తనకు మంచి స్నేహితురాలు. నాగురించి రెండు మంచి మాటలు చెప్పేసరికి ధైర్యం తెచ్చుకుంది. అలా గతేడాది అక్టోబర్‌లో డేటింగ్ మొదలుపెట్టాం అని శిరీష్ చెప్పుకొచ్చాడు. View this post on Instagram A post shared by Allu Sirish (@allusirish) -
మిమ్మల్ని కలిసే ఛాన్స్ రాలేదు.. ఆ ప్రేమని జీవితాంతం కొనసాగిస్తూ
అల్లు శిరీష్ పెళ్లి చేసుకున్నాడు. నయనిక మెడలో శుక్రవారం రాత్రి మూడు ముళ్లు వేశాడు. ఏడడుగులు నడిచాడు. ఈ శుభకార్యానికి సినీ, రాజకీయ ప్రముఖులు చాలామంది హాజరయ్యారు. నూతన వధూవరుల్ని ఆశీర్వదించారు. ఈ వివాహానికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో చాలానే వైరల్ అవుతున్నాయి. అయితే నయనికతో పెళ్లి తర్వాత శిరీష్.. తొలిసారి ఎమోషనల్ పోస్ట్ పెట్టాడు. ఈమె తండ్రి శరత్ చంద్రారెడ్డిని గుర్తుచేసుకుంటూ భావోద్వేగానికి గురయ్యాడు.(ఇదీ చదవండి: నేను బెస్ట్ ఎక్స్ బాయ్‌ఫ్రెండ్‌ని.. బ్రేకప్ తర్వాత చాలా ఏడ్చా: షణ్ముఖ్ జస్వంత్)'మావయ్యా.. మిమ్మల్ని కలిసే అవకాశం నాకు రాలేదు. కానీ నేను ఇప్పుడు భార్యగా పిలుచుకునే ఆ మహిళని మీరు పెంచినందుకు మీకు ధన్యవాదాలు. మీరు ఆమెను ప్రేమించడం మొదలుపెట్టారు. ఈ భూమిపై నేను ఉన్నంత వరకు ఆ ప్రేమని నేను ఆమెకు అందిస్తాను' అని శిరీష్ ఎమోషనల్ అయ్యాడు. అలానే ఆయన ఫొటోతో పాటు కొన్ని పెళ్లి ఫొటోలని కూడా షేర్ చేశాడు.శిరీష్ విషయానికొస్తే నిర్మాత అల్లు అరవింద్ చిన్న కొడుకు. ఇతడి సోదరుల్లో అల్లు అర్జున్ స్టార్ హీరో కాగా బాబీ నిర్మాతగా ఒకటి రెండు సినిమాలు చేశారు. శిరీష్ కూడా హీరోగా పలు మూవీస్ చేసినప్పటికీ పెద్దగా గుర్తింపు తెచ్చుకోలేకపోయాడు. నయనిక విషయానికొస్తే.. హైదరాబాద్‌కి చెందిన ఈమెది బిజినెస్ ఫ్యామిలీ. ఈమె కూడా ఔత్సాహిక పారిశ్రామికవేత్తనే. వరుణ్-లావణ్య బ్యాచిలర్ పార్టీ టైంలో శిరీష్ తో ఈమెకు పరిచయం ఏర్పడింది. తర్వాత ప్రేమించుకున్నారు. ఇప్పుడు పెద్దల అంగీకారంతో పెళ్లి బంధంలోకి అడుగుపెట్టారు.(ఇదీ చదవండి: టాలీవుడ్ హీరో బెల్లంకొండ శ్రీనివాస్ ప్రేమ పెళ్లి.. అమ్మాయి ఎవరంటే?) View this post on Instagram A post shared by Allu Sirish (@allusirish) -
హైదరాబాద్‌లో గ్రాండ్‌గా అల్లు శిరీష్ పెళ్లి వేడుక (ఫొటోలు)
-
'నీ కొత్త ప్రయాణం చూస్తుంటే ఆనందంగా ఉంది'.. రామ్ చరణ్ స్పెషల్ పోస్ట్
టాలీవుడ్ హీరో అల్లు శిరీష్- నయనిక జంటకు మెగా హీరో రామ్ చరణ్ విషెస్ చెప్పారు. పెళ్లి వేడుకలో పాల్గొన్న చెర్రీ నూతన దంపతులకు అభినందనలు తెలిపారు. అల్లు శిరీష్-నయనిక జంటను చూస్తుంటే చాలా సంతోషంగా ఉందన్నారు. నయనికతో ఈ అద్భుతమైన కొత్త ప్రయాణాన్ని ప్రారంభించినందుకు శిరీష్‌ను అభినందించారు. మీ వైవాహిక జీవితం ఇద్దరికీ అంతులేని ఆనందం, ప్రేమ, ఆశీర్వాదాలు ఎల్లప్పుడు ఉండాలని రామ్ చరణ్ ఆకాంక్షించారు.కాగా.. అల్లు అర్జున్ తమ్ముడు అల్లు శిరీష్ వెడ్డింగ్ గ్రాండ్‌గా జరిగింది. హైదరాబాద్‌లోని కొల్లూరు ఐనా ఈవెంట్ స్పేస్‌లో ఈ పెళ్లి వేడుక నిర్వహించారు. ఈ వెడ్డింగ్‌కు పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు. ఈ సందర్భంగా పెళ్లికి హాజరైన రామ్ చరణ్ నూతన జంటను ఆశీర్వదించారు.కాగా.. అల్లు శిరీష్- నయనిక కొన్నేళ్లుగా ప్రేమలో ఉన్నారు. హీరో నితిన్ భార్య షాలినికి నయనిక బెస్ట్ ఫ్రెండ్ కావడం మరో విశేషం. వరుణ్‌తేజ్- లావణ్య తమ పెళ్లిలో నయనికతో శిరీష్‌కు పరిచయం ఏర్పడింది. అలా వీరిద్దరు డేటింగ్ కొనసాగించారు. తాజాగా పెళ్లి బంధంలోకి అడుగుపెట్టారు. కాగా.. అల్లు శిరీశ్ కొత్త జంట, శ్రీరస్తు శుభమస్తు, ఒక్క క్షణం, ఏబీసీడీ, బడ్డీ, ఊర్వశివో రాక్షసివో లాంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకులను అలరించాడు. So happy to see @AlluSirish begin this wonderful new journey with #Nayanika Wishing the both of you endless happiness, love and a blessed married life ❤️Congratulations ✨ pic.twitter.com/2FYRvGcNXX— Ram Charan (@AlwaysRamCharan) March 6, 2026 -
ఓ ఇంటివాడైన అల్లు శిరీష్.. ప్రియురాలి మెడలో మూడు ముళ్లు
టాలీవుడ్ హీరో అల్లు శిరీష్ వివాహబంధంలోకి అడుగుపెట్టారు. తన ప్రియురాలు నయనిక మెడలో మూడుముళ్లు వేశారు. వీరిద్దరి పెళ్లి వేడుక హైదరాబాద్‌లో గ్రాండ్‌గా జరిగింది. ఈ పెళ్లిలో టాలీవుడ్ సినీ ప్రముఖులు, రాజకీయ నాయకులు సందడి చేశారు. అల్లు అర్జున్ పెళ్లి రోజు కూడా ఇదే కావడంతో ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కాగా.. అల్లు శిరీష్- నయనిక కొన్నేళ్లుగా ప్రేమలో ఉన్నారు. హీరో నితిన్ భార్య షాలినికి నయనిక బెస్ట్ ఫ్రెండ్ కావడం మరో విశేషం. వరుణ్‌తేజ్- లావణ్య తమ పెళ్లిలో నయనికతో శిరీష్‌కు పరిచయం ఏర్పడింది. అలా వీరిద్దరు డేటింగ్ కొనసాగించారు. తాజాగా పెళ్లి బంధంలోకి అడుగుపెట్టారు. కాగా.. అల్లు శిరీశ్ కొత్త జంట, శ్రీరస్తు శుభమస్తు, ఒక్క క్షణం, ఏబీసీడీ, బడ్డీ, ఊర్వశివో రాక్షసివో లాంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకులను అలరించాడు. -
నయనిక పెళ్లి కూతురి వేడుక.. అల్లు ఫ్యామిలీ సందడి (ఫొటోలు)
-
అల్లు శిరీష్ పెళ్లి.. నయనిక ఇంట సందడి.. ఫొటోలు వైరల్
అల్లు అర్జున్ సోదరుడు శిరీష్.. ఈ రోజే నయనికని పెళ్లి చేసుకోనున్నాడు. కుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంలో ఈ వేడుక జరగనుంది. రెండు రోజుల క్రితం హైదరాబాద్‌లో రిసెప్షన్ జరగ్గా.. టాలీవుడ్ సినీ ప్రముఖులు హాజరయ్యారు. కాబోయే వధూవరులకు శుభాకాంక్షలు చెప్పారు. ఇకపోతే గురువారం, నయనిక ఇంట్లో పెళ్లి కూతురు వేడుక, పసుపు దంచడం తదితర కార్యక్రమాలు జరిగాయి. ఆ ఫొటోలని నయనిక తన సోషల్ మీడియాలో పంచుకుంది.(ఇదీ చదవండి: క్యూటీ.. నీ వల్లే ఇదంతా సాధ్యం.. భార్యపై బన్నీ ప్రేమవర్షం)నయనిక ఇంట్లో జరిగిన ఈ శుభకార్యానికి అల్లు అరవింద్, తన సతీమణి, అల్లు అర్జున్, స్నేహ కుటుంబం హాజరైంది. ఈ వేడుకల్లో పాల్గొన్నారు. నయనిక అక్కాచెల్లితో పాటు కుటుంబ సభ్యులందరూ ఫొటోల్లో కనిపించారు. ప్రీ వెడ్డింగ్ పార్టీ, రిసెప్షన్ గ్రాండ్‌గా జరిగినప్పటికీ వివాహం మాత్రం కుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంలో హడావుడి లేకుండా జరగనుంది.(ఇదీ చదవండి: విజయ్, శిరీష్ దారిలో టాలీవుడ్లో మరో హీరో ప్రేమ పెళ్లి) View this post on Instagram A post shared by Nayanika Reddy (@nayanika_reddy) -
అల్లు శిరీష్ ప్రీ వెడ్డింగ్ రిసెప్షన్లో సినీ, రాజకీయ ప్రముఖులు ( ఫోటోలు)
-
గ్రాండ్‌గా అల్లు శిరీష్-నయనిక ప్రీ వెడ్డింగ్ రిసెప్షన్.. ఫొటోలు, వీడియోలు
స్టార్ హీరో అల్లు అర్జున్ సోదరుడు శిరీష్.. ఈ శుక్రవారం(మార్చి 06న) నయనిక అనే అమ్మాయిని పెళ్లి చేసుకోనున్నాడు. ఈ క్రమంలోనే సోమవారం(మార్చి 02) సాయంత్రం హైదరాబాద్‌లోని అల్లు స్టూడియోస్‌లో ప్రీ వెడ్డింగ్ రిసెప్షన్ గ్రాండ్‌గా జరిగింది. దీనికి టాలీవుడ్ ప్రముఖులైన నాగార్జున, నాగచైతన్య, బాలకృష్ణ, మోహన్ బాబు, రాజేంద్రప్రసాద్, నాని, బ్రహ్మానందం, డైరెక్టర్ అట్లీతో పాటు పలువురు రాజకీయ నాయకులు హాజరయ్యారు. ఈ ఈవెంట్‌కి సంబంధించిన ఫొటోలు, వీడియోలో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. The Akkineni family at #AlluSirish & #Nayanika’s Pre-Wedding Reception.#AlluArjunpic.twitter.com/HbwSFXAW7B— cinee worldd (@Cinee_Worldd) March 2, 2026Legendary Brahmanandam Garu with Icon Star #AlluArjun💜At Pre Wedding Reception of #AlluSirish pic.twitter.com/TKvFEMcaZg— cinee worldd (@Cinee_Worldd) March 2, 2026Gopichand at #AlluSirish Pre Wedding Reception #AlluArjun pic.twitter.com/oQSTeUk4eG— cinee worldd (@Cinee_Worldd) March 2, 2026Lakshmi Manchu at #AlluSirish Pre Wedding Reception #AlluArjun #AlluSnehaReddy pic.twitter.com/QGtwefE6sN— cinee worldd (@Cinee_Worldd) March 2, 2026 -
అల్లు ఫ్యామిలీలో పెళ్లి.. నయనిక సిస్టర్స్ ఫోటో వైరల్
టాలీవుడ్లో మరో పెళ్లి వేడుక మొదలైంది. సినీ నటుడు అల్లు శిరీష్, నయనికల వివాహం మార్చి 6న ఘనంగా జరగనుంది. ఈ క్రమంలో కాబోయే కొత్తజంట కలిసి ఫోటోలు దిగారు. వాటిని ఎప్పటికప్పడు సోషల్‌మీడియాలో అభిమానులతో పంచుకుంటున్నారు. ఈ క్రమంలో తాజాగా అల్లు అరవింద్ నివాసంలో పెళ్లి కొడుకు వేడుక నిర్వహించారు. ఈ వేడుకలో విజయ్, రష్మికలతో పాటు చిరంజీవి కుటుంబ సభ్యులు, బాలకృష్ణ సతీమణి వసుంధర పాల్గొన్నారు.సోషల్‌మీడియాలో నయనిక సిస్టర్స్ ఫోటో వైరల్ అవుతుంది. అల్లు కుటుంబానికి కాబోయే కోడలు తన ఇద్దరు సిస్టర్స్‌తో కలిసి దిగిన ఫోటోను షేర్ చేసింది. త్రీ సిస్టర్స్ సూపర్ అంటూ కామెంట్ల రూపంలో నెటిజన్లు తెలుపుతున్నారు. సిస్టర్స్ వైబ్ అదిరింది అంటూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. View this post on Instagram A post shared by Nayanika Reddy (@nayanika_reddy) -
అల్లు వారి పెళ్లి సందడి.. ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ ఎప్పుడంటే?
టాలీవుడ్ మరో పెళ్లి సంబురం మొదలు కానుంది. రష్మిక- విజయ్ దేవరకొండ పెళ్లి అయిపోయిన వెంటనే మరో టాలీవుడ్ హీరో పెళ్లికి అంతా సిద్ధమైంది. అల్లు అర్జున్ తమ్ముడు అల్లు శిరీష్ ఓ ఇంటివాడు కాబోతున్నారు. ఇటీవల దుబాయ్‌లో శిరీష్- నయనిక గ్రాండ్‌గా బ్యాచిలర్ పార్టీ కూడా సెలబ్రేట్ చేసుకున్నారు. తాజాగా అల్లు శిరీష్ తన పెళ్లి వేడుకకు సంబంధించి అప్డేట్ ఇచ్చారు. మార్చి 2న తెలుగు చిత్ర పరిశ్రమ సభ్యులతో ప్రీ వెడ్డింగ్ వేడుకలు చేసుకోబోతున్నట్లు ట్వీట్ చేశారు. అల్లు స్టూడియోస్‌లో ఈ సెలబ్రేషన్స్ జరుగుతాయని వెల్లడించారు. మా ప్రీ వెడ్డింగ్ వేడుకలను ప్రతిష్టాత్మకంగా జరుపుకోవడానికి సంతోషిస్తున్నామని అల్లు శిరీష్ పోస్ట్ చేశారు.కాగా.. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తమ్ముడు, హీరో అల్లు శిరీష్ గతేడాది అక్టోబర్ 31న ఎంగేజ్మెంట్ చేసుకున్నాడు. ప్రియురాలు నయనికకు అందరి సమక్షంలో ఉంగరం తొడిగాడు. ఇప్పుడు ఈ ప్రేమ జంట పెళ్లిబంధంతో ఒక్కటి కానుంది. శిరీష్- నయనికల వివాహం మార్చి 6న జరగనుంది. Nayanika & I are having an intimate wedding with family & friends on 6th March. We are excited to celebrate our Pre Wedding Celebrations with the Telugu film industry prestigiously at Allu Studios on the 2nd March.— Allu Sirish (@AlluSirish) February 26, 2026 -
బ్లాక్ అండ్ బ్లాక్‌లో మెరిసిపోతున్న శిరీష్-నయనిక (ఫొటోలు)
-
పార్టీ టైమ్
అల్లు శిరీష్ – నయనికల వివాహం మార్చి 6న జరగనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పెళ్లి పనులు ఊపందుకున్నాయి. ఇటీవలే ఫ్రెండ్స్‌తో కలిసి దుబాయ్‌లో బ్యాచిలర్ పార్టీ చేసుకున్నారు అల్లు శిరీష్.సోదరుడి వివాహం సందర్భంగా తెలుగు చిత్ర పరిశ్రమలోని ప్రముఖుల కోసం అల్లు అర్జున్ తన నివాసంలో ఓ గ్రాండ్ పార్టీని నిర్వహించారు. ఈ పార్టీకి రామ్‌చరణ్ దంపతులతో పాటు పలువురు సినీ ప్రముఖులు హాజరయ్యారు. -
అల్లు శిరీష్, నయనిక వాలెంటైన్స్ డే ఎలా జరుపుకున్నారంటే.. (ఫోటోలు)
-
కాబోయే భార్యకు ముద్దుపేరు.. వాలంటైన్స్ డే వీడియో
అల్లు వారి కుటుంబంలో పెళ్లి హడావుడి మొదలైపోయింది. బన్నీ సోదరుడు శిరీష్.. త్వరలో పెళ్లి చేసుకోబోతున్నాడు. నయనికతో కొత్త జీవితం ప్రారంభించబోతున్నాడు. రెండు రోజుల క్రితమే పసుపు దంచుడు కార్యక్రమాన్ని వేడుకగా నిర్వహించారు. ఇందుకు సంబంధించిన వీడియోని శిరీష్ పోస్ట్ చేశాడు. ఇప్పుడు వాలంటైన్స్ డే సందర్భంగా తన ప్రేమకథ గురించి, కాబోయే భార్యతో క్యూట్ మూమెంట్స్ ఉన్న వీడియోని షేర్ చేశాడు.శిరీష్.. తనకు కాబోయే భార్య నయనికకు 'క్యూటేష్' అనే ముద్దుపేరు పెట్టుకున్నాడు. వీడియోలో అదే విషయాన్ని చూపించాడు. ప్రపంచం తమని కలిపిందని చెప్పుకొచ్చాడు. పారిస్ వీధుల్లో కొన్ని రొమాంటిక్ క్షణాల్ని చూపించడంతో పాటు నిశ్చితార్థానికి సంబంధించిన విజువల్స్‌ని చూపించాడు. ఇకపోతే మార్చి 6న శిరీష్-నయనిక పెళ్లి జరగనుంది. View this post on Instagram A post shared by Allu Sirish (@allusirish) -
టాలీవుడ్ హీరో అల్లు శిరీష్ హల్దీ వేడుక (ఫొటోలు)
-
దుబాయిలో అల్లు శిరీష్ బ్యాచిలర్ పార్టీ.. ఫొటోలు వైరల్
అల్లు కుటుంబంలో పెళ్లి సందడి. అల్లు అర్జున్ తమ్ముడు శిరీష్.. వచ్చే నెలలో పెళ్లి చేసుకోబోతున్నాడు. నయనిక అనే అమ్మాయితో కొత్త జీవితం ప్రారంభించబోతున్నాడు. మూడు నెలల క్రితం నిశ్చితార్థం జరగ్గా.. మరికొన్ని రోజుల్లో వివాహ వేడుక గ్రాండ్‌గా జరగనుంది. దీంతో ఇప్పుడు అందరూ కలిసి బ్యాచిలరేట్ పార్టీ చేసుకున్నాడు. దీనికి దుబాయి వేదికగా నిలిచింది.(ఇదీ చదవండి: నిజంగా పెళ్లాన్ని అడిగినట్లే అడిగారు: శ్రీలీల)అల్లు శిరీష్, నయనికల బ్యాచిలరేట్ పార్టీ.. శనివారం రాత్రి దుబాయిలో జరిగింది. ఓ పడవలో వీళ్లంతా గ్రాండ్ సెలబ్రేషన్స్ చేసుకున్నారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అల్లు శిరీష్ అన్న బాబీ కూడా తన ఇన్ స్టాలో కొన్ని ఫొటోలని పోస్ట్ చేయగా.. బన్నీ భార్య స్నేహ కూడా పలు ఫొటోలని తన ఇన్ స్టా స్టోరీలో షేర్ చేసింది.(ఇదీ చదవండి: 'చరణ్' చేతిలో రెండేళ్ల బిడ్డ.. మెగా ఫ్యాన్స్ అత్యుత్సాహం)#AlluSirish Pre Wedding shooting Dubai ♥️ pic.twitter.com/HFrY0ux2Rs— Swaasthi (@swaasthi) January 31, 2026 -
మెడలో నెక్లెస్‌తో అల్లు శిరీష్.. కాబోయే భార్యతో..
ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ తనయుడు, అల్లు అర్జున్ తమ్ముడు, హీరో శిరీష్ (Allu Sirish) ఇటీవలే ఎంగేజ్మెంట్ చేసుకున్నాడు. ప్రియురాలు నయనిక వేలికి ఉంగరం తొడిగాడు. అక్టోబర్ 31న ఈ నిశ్చితార్థ వేడుక అంగరంగ వైభవంగా జరిగింది. తాజాగా తన ఎంగేజ్మెంట్ ఫోటోలను శిరీష్ సోషల్ మీడియాలో షేర్ చేశాడు. అందులో అతడు వైట్ డ్రెస్సులో మెడకు నెక్లెస్‌తో కనిపించాడు. అటు నయనిక ఎరుపు రంగు లెహంగాలో, ముత్యాల దండతో మెరిసిపోయింది. ఈ ఫోటోలు చూసిన అభిమానులు త్వరలో పెళ్లి పీటలెక్కబోతున్న ఈ జంటకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.శిరీష్ లవ్స్టోరీఅల్లు శిరీష్‌కు పెళ్లి చేయాలని అరవింద్ కొన్నేళ్లుగా ప్రయత్నిస్తున్నాడు. కానీ, శిరీష్ ఓకే చెప్పాలిగా! అలాంటి సమయంలో (2023లో) వరుణ్‌తేజ్- లావణ్యల పెళ్లి జరిగింది. ఈ జంట కోసం హీరో నితిన్- షాలిని దంపతులు ఓ పార్టీ ఏర్పాటు చేశారు. అక్కడికి షాలిని బెస్ట్ ఫ్రెండ్ నయనిక కూడా వచ్చింది. ఇటు వరుణ్ తరపున శిరీష్ పార్టీకి హాజరయ్యాడు. అక్కడే శిరీష్- నయనిక చూపులు కలిశాయి, మనసులు కూడా కలుసుకున్నాయి. పెద్దలు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో రెండేళ్ల ప్రేమ ఇప్పుడు మూడుముళ్ల బంధంగా మారనుంది.శిరీష్ జర్నీ'గౌరవం' (2013) సినిమాతో వెండితెరపై హీరోగా ఎంట్రీ ఇచ్చాడు శిరీష్. కొత్త జంట, శ్రీరస్తు శుభమస్తు, ఒక్క క్షణం, ఏబీసీడీ, ఊర్వశివో రాక్షసివో, బడ్డీ తదితర చిత్రాలు చేశాడు. హిట్ల కన్నా ఎక్కువ ఫ్లాపులే అందుకోవడంతో సినిమాలు తగ్గించేశాడు. ఏడాదిన్నరకాలంగా అతడి నుంచి ఏ సినిమా రాలేదు. View this post on Instagram A post shared by Allu Sirish (@allusirish) చదవండి: నీళ్ల బాటిల్ రూ.100.. కాఫీ రూ.700.. సుప్రీంకోర్టు సీరియస్ -
నా పిల్లలకైనా చెప్పాలిగా.. లవ్‌స్టోరీ బయటపెట్టిన అల్లు శిరీష్
ఎంగేజ్మెంట్ అయిందంటే సగం పెళ్లయిపోయినట్లే! నిర్మాత అల్లు అరవింద్ కుమారుడు, అల్లు అర్జున్ సోదరుడు శిరీష్ (Allu Sirish)కు హైదరాబాద్‌కు చెందిన నయనికతో నిశ్చితార్థం జరిగింది. శుక్రవారం నాడు ఇరుకుటుంబ సభ్యుల సమక్షంలో జరిగిన ఈ వేడుకలో మెగా ఫ్యామిలీ సందడి చేసింది. శిరీష్-నయనికల ఎంగేజ్మెంట్ ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో తెగ హల్చల్ చేశాయి.వరుణ్- లావణ్యకు పెళ్లిరోజు శుభాకాంక్షలుఅయితే నయనిక ఎవరు? ఇది పెద్దలు కుదర్చిన సంబంధమా? లేక లవ్‌లో పడ్డారా? ఈ ప్రేమకహానీ ఎప్పుడు మొదలైంది? అని అభిమానులు నెట్టింట ఆరా తీస్తున్నారు. ఈ గందరగోళానికి ఫుల్స్టాప్ పెడుతూ నయనికతో పరిచయం- ప్రేమ గురించి ఓపెనయ్యాడు శిరీష్. నవంబర్ 1న వరుణ్ తేజ్-లావణ్య త్రిపాఠిల పెళ్లిరోజు. ఈ సందర్భంగా ఎంగేజ్మెంట్లో వారితో కలిసిన దిగిన ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేశాడు శిరీష్. అలా మొదలైందివరుణ్, లావణ్యకు రెండో పెళ్లి రోజు శుభాకాంక్షలు. 2023 అక్టోబర్‌లో మీ పెళ్లి జరిగేటప్పుడు హీరో నితిన్- షాలిని దంపతులు మీకోసం ఓ పార్టీ ఏర్పాటు చేశారు. ఆ పార్టీకి షాలిని తన బెస్ట్ ఫ్రెండ్ నయనికను కూడా రమ్మని ఆహ్వానించింది. అలా ఆ సెలబ్రేషన్స్ జరుగుతున్న రోజు రాత్రి తొలిసారి నయనికను చూశాను. అప్పుడే తనను కలుసుకున్నాను.నా లవ్‌స్టోరీ పిల్లలకు చెప్తా..కట్ చేస్తే రెండేళ్లుగా ప్రేమించుకుంటున్నాం.. ఇప్పుడు ఎంగేజ్మెంట్ కూడా అయింది. ఫ్యూచర్లో నా పిల్లలు మీరెలా కలుసుకున్నారు నాన్న? అని అడిగితే ఇదిగో, ఇలా మీ అమ్మను కలిశా.. అని ఈ కహానీ అంతా చెప్తాను. నయనిక స్నేహితులకు కూడా పెద్ద థాంక్స్. మీ సర్కిల్లో నన్ను కలుపుకున్నందుకు, ఎంతో బాగా చూసుకున్నందుకు థాంక్స్ అని రాసుకొచ్చాడు. అంటే, వరుణ్-లావణ్యల మ్యారేజ్ సమయంలోనే శిరీష్ పెళ్లికి పునాది పడిందన్నమాట! నితిన్ భార్య ఇచ్చిన పార్టీతోనే శిరీష్‌కు లైఫ్ పార్ట్నర్ దొరికింది. View this post on Instagram A post shared by Allu Sirish (@allusirish)చదవండి: షో ఇమేజ్ ఏం కాను? నాగ్ ఉగ్రరూపం.. మోకాళ్లపై కూర్చుని పవన్ వేడుకోలు


