పెళ్లికి ముందే పిల్లల విషయంలో ఆ నిర్ణయం తీసుకున్నాం: అల్లు శిరీష్‌ | Allu Sirish Opens Up About Marries Nayanika And Plans To Raise Future Kids Speaking Telugu, Read Story Inside | Sakshi
Sakshi News home page

Allu Sirish: పెళ్లికి ముందే పిల్లల గురించి మాట్లాడుకున్నాం

Mar 13 2026 2:44 PM | Updated on Mar 13 2026 3:25 PM

Allu Sirish Opens Up About His Children

టాలీవుడ్‌ యంగ్‌ హీరో అల్లు శిరీష్‌ ఇటీవల వైవాహిక బంధంలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. మార్చి 6న తన ప్రియురాలు నయనికను వివాహం చేసుకున్నాడు. అయితే పెళ్లికి ముందే ఈ జంట తమకు పుట్టబోయే పిల్లల గురించి ఓ కీలక నిర్ణయం తీసుకున్నారట. పుట్టబోయే పిల్లలను తెలుగులో మాట్లాడేలా పెంచాలనుకుంటున్నారట. ఈ విషయాన్ని స్వయంగా అల్లు శిరీషే చెప్పారు. తాజాగా ఓ జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన లవ్‌స్టోరీ గురించి వివరించాడు.

అత్తయ్యకు దొరికిపోయాం..
మేమిద్దరం ప్రేమలో ఉన్న విషయం మొదట మా అత్తయ్య(చిరంజీవి సతీమణి సురేఖ)కు తెలిసింది. మేమిద్దరం ఓ రోజు కాఫీ తాగేందుకు బయటకు వెళ్లాం. కాఫీ షాపులో మా అత్తయ్యకు తెలిసివాళ్లు కూడా ఉన్నారు. అది మాకు తెలియదు. మేము కాఫీతాగి బయటకు రాగానే.. వాళ్లు మా అత్తయ్యకు ఫోన్‌ చేసి చెప్పారు. అలా మా ప్రేమ విషయంలో ఇంట్లో తెలిసింది. నేను కూడా నయనికను ప్రేమిస్తున్నానే విషయాన్ని ఇంట్లోవాళ్లకు చెప్పాను. వాళ్ల అంగీకారంతో పెళ్లి చేసుకున్నాం.

నయనిక సెన్స్‌ ఆఫ్‌ హ్యూమర్‌ అంటే నాకు ఇష్టం
నయనిక సెన్స్‌ ఆఫ్‌ హ్యూమర్‌ అంటే నాకు చాలా ఇష్టం.  ఏ విషయానైనా ముక్కు సూటిగా మాట్లాడుతుంది. నచ్చకపోతే ముఖం మీదనే నచ్చలేదని చెప్పెస్తుంది. నా సినిమాల్లో నచ్చిన విషయాలను షేర్‌ చేసుకునేది. పెళ్లికి ముందే మేము పిల్లల గురించి కూడా మాట్లాడుకున్నాం. మాకు పుట్టబోయే పిల్లలు ఇంట్లో తెలుగులోనే మాట్లాడాలనేది నా కోరిక. దీనిపై మేమిద్దరం చర్చించుకున్నాం’ అని శిరీష్‌ చెప్పుకొచ్చాడు. 

Advertisement
 
Advertisement
Advertisement