ఓటీటీలో బోర్డర్‌-2 సినిమా.. స్ట్రీమింగ్‌ ఎప్పుడంటే | Border 2 movie ott streaming date locked | Sakshi
Sakshi News home page

ఓటీటీలో భారత్‌-పాక్‌ యుద్ధ సినిమా.. స్ట్రీమింగ్‌ ఎప్పుడంటే

Mar 13 2026 11:47 AM | Updated on Mar 13 2026 12:17 PM

Border 2 movie ott streaming date locked

బాలీవుడ్‌ హిట్‌ ప్రాంఛైజీ చిత్రం బోర్డర్‌-2 ఓటీటీలోకి రానుంది. ఈమేరకు అధికారికంగా ప్రకటన వచ్చేసింది. సన్నీ డియోల్ కీలక పాత్రలో నటించిన ఈ చిత్రం రిపబ్లిక్ డే కానుకగా థియేటర్లలోకి వచ్చింది. 1997లో రిలీజై భారీ హిట్‌ అందుకున్న బోర్డర్‌ చిత్రానికి సీక్వెల్‌  తెరకెక్కించారు. ఇందులో వరుణ్‌ ధావన్‌, దిల్జీత్‌ దొసాంజ్‌ తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. ఈ మూవీని అనురాగ్‌ సింగ్‌ దర్శకత్వం వహించారు. 1971 ఇండో-పాక్ యుద్ధం తీవ్రతను, భారత సాయుధ దళాల వీరత్వాన్ని ఈ సినిమా చూపిస్తుంది. అందరిలో దేశభక్తిని రగిల్చేలా ఈ చిత్రం ఉంటుంది.

బోర్డర్‌ 2(Border 2) మూవీ మార్చి 20 నుంచి నెట్‌ఫ్లిక్స్ (Netflix) వేదికగా స్ట్రీమింగ్‌ కానుంది. అయితే, హిందీ వర్షన్‌లో మాత్రమే అందుబాటులో ఉంటుంది. సుమారు రూ. 275 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈచిత్రం ప్రపంచవ్యాప్తంగా దాదాపు రూ. 485 కోట్లకు పైగానే వసూలు చేసినట్లు తెలుస్తోంది. బోర్డర్ ఫ్రాంచైజీని కొనసాగిస్తూ మరో చిత్రాన్ని కూడా మేకర్స్ ప్రకటించారు.

పార్ట్‌-1 మాదిరే  ‘బోర్డర్‌ 2’ కూడా దేశభక్తిని పెంచేలా ఉంటుంది. భారత్‌ను దొంగదెబ్బ కొట్టేందుకు పాకిస్థాన్‌ 1971లో ఎలాంటి కుట్రలు చేసిందో ఈ చిత్రంలో చూడొచ్చు. భారత్‌పై  భూ, జల, వాయు మార్గాల ద్వారా కశ్మీర్, పంజాబ్, గుజరాత్‌ సరిహద్దుల ద్వారా భారీ దాడులకు దిగుతుంది. అయితే, భారత ప్రభుత్వం దీనిని ముందే గ్రహించి సైనికులను యుద్ధ రంగంలోకి దింపుతుంది. పాక్‌ సైన్యాన్ని ఎలా మట్టికరిపించారో ఇందులో చూపించారు.
 

Advertisement
 
Advertisement
Advertisement