ఓటీటీలోకి వచ్చేసిన హిట్‌ సినిమా.. ప్రేక్షకులకు ట్విస్ట్‌ | Couple Friendly Movie Now Streaming OTT But With Twist | Sakshi
Sakshi News home page

ఓటీటీలోకి వచ్చేసిన హిట్‌ సినిమా.. ప్రేక్షకులకు ట్విస్ట్‌

Mar 13 2026 10:34 AM | Updated on Mar 13 2026 10:46 AM

Couple Friendly Movie Now Streaming OTT But With Twist

ప్రేమికుల రోజు సందర్భంగా విడుదలైన 'కపుల్‌ ఫ్రెండ్లీ' చిత్రం  ఓటీటీలోకి వచ్చేసింది. తమిళ్‌లో కూడా రిలీజైన ఈ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద ప్రేక్షకులను మెప్పించింది. ఇందులో సంతోష్‌ శోభన్‌ (Santosh Sobhan), మానస వారణాసి (Manasa Varanasi) జంటగా నటించారు. దర్శకుడు అశ్విన్‌ చంద్రశేఖర్‌ తెరకెక్కించిన ఈ చిత్రాన్ని యూవీ క్రియేషన్స్‌ నిర్మించింది. అయితే, ఈ మూవీ విడుదల తర్వాత చిత్ర యూనిట్‌తో ప్రభాస్‌ ఇచ్చిన ఇంటర్వ్యూ వల్ల మంచి బజ్‌ క్రియేట్‌ అయింది. ఆపై కథలో కూడా విషయం ఉండటంతో బాక్సాఫీస్‌ వద్ద హిట్‌ సినిమాగా నిలిచింది.

‘అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో’ (Amazon Prime Video)లో కపుల్‌ ఫ్రెండ్లీ చిత్రం స్ట్రీమింగ్‌ అవుతుంది.  తెలుగు, తమిళం వర్షన్‌లలో  స్ట్రీమింగ్‌ అందుబాటులోకి వచ్చేసింది. అయితే, ఈ చిత్రాన్ని చూడాలంటే అధనంగా రూ. 279 రెంట్‌ చెల్లించాల్సి వస్తుంది. ఈ మూవీ కోసం రూ. 3 కోట్ల వరకు మాత్రమే ఖర్చు చేసినట్లు సమాచారం. అయితే, బాక్సాఫీస్‌ వద్ద సుమారుగా రూ. 14 కోట్లకు పైగానే రాబట్టినట్లు తెలుస్తోంది. స్టోరీ నెమ్మదిగా సాగినప్పటికీ కథ బాగుందని ప్రేక్షకులు రివ్యూ ఇచ్చారు.

కథేంటంటే..
నెల్లూరుకు చెందిన శివ..ఓ బడ్డింగ్‌ ఆర్కిటెక్ట్‌. ఉద్యోగం కోసం  చెన్నై వస్తాడు. ఏళ్లు గడిచినా ఆయనకు సరైన ప్రాజెక్టు దొరకదు. దీంతో డైలీ ఖర్చుల కోసం బైక్‌ పూలింగ్‌ చేస్తుంటాడు. అలా మిత్ర(మానన వారణాసి) అనే అమ్మాయి బైక్‌ రైడ్‌లో పరిచయం అవుతుంది. చిత్తూరుకు చెందిన మిత్ర.. సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగం కోసం చెన్నై వస్తుంది. శివలాగే ఆమె కూడా ఉద్యోగం కోసం వెతుకుతూ ఉంటుంది. ఓ కారణంగా ఇద్దరూ కలిసి ఒకే ఇంట్లో ఉండాల్సి వస్తుంది. ఈ క్రమంలో ఇద్దరి మధ్య ప్రేమ చిగురురించి.. లివింగ్‌ రిలేషన్‌ని కొనసాగిస్తారు. కొన్నాళ్లకు ఇంట్లో వాళ్లకి చెప్పి పెళ్లి చేసుకోవాలనుకుంటారు. అదే సమయంలో వీరిద్దరి జీవితంలో ఊహించని పరిణామం ఎదురవుతుంది. అదేంటి? శివ, మిత్ర ఒకే ఇంట్లో ఎందుకు ఉండాల్సి వచ్చింది. మిత్ర రాకతో శివ జీవితంలో ఎలాంటి మార్పులు వచ్చాయి? చివరకు వీరిద్దరి ప్రేమ కథ ఎలా ముగిసింది? అనేదే మిగతా కథ.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement