చిరంజీవికి ఆహ్వానం | Dil Raju invite to chiranjeevi for gaddar awards ceremony | Sakshi
Sakshi News home page

చిరంజీవికి ఆహ్వానం

Mar 13 2026 9:14 AM | Updated on Mar 13 2026 10:56 AM

Dil Raju invite to chiranjeevi for gaddar awards ceremony

టాలీవుడ్‌ ప్రముఖ నటుడు చిరంజీవిని టీఎఫ్‌డీసీ ఛైర్మన్‌, నిర్మాత దిల్‌రాజు కలిశారు. గద్దర్‌ అవార్డ్స్‌- 2025 ప్రదానోత్సవానికి ఆయన్ను ఆహ్వానించారు. ఉగాది సందర్భంగా ఈనెల 19న ఈ కార్యక్రమం హైదరాబాద్‌లో జరగనున్న విషయం తెలిసిందే. కొద్దిరోజుల క్రితం అవార్డ్స్‌ విజేతలను జ్యూరీ కమిటీ ప్రకటించిన విషయం తెలిసిందే. ఎన్టీఆర్‌ నేషనల్‌ అవార్డుకు మెగాస్టార్‌ ఎంపిక అయ్యారు. ఉత్తమ చిత్రం రాజు వెడ్స్ రాంబాయి, ఉత్తమ హీరో నాగచైతన్య (తండేల్‌), ఉత్తమ నటి రష్మిక (ది గర్ల్ ఫ్రెండ్ ) అవార్డ్స్‌ అందుకోనున్నారు. తాజాగా చిరంజీవిని కలిసినవారిలో టీఎఫ్‌డీసీ ఎండీ ప్రియాంక కూడా ఉన్నారు.

గద్దర్‌ అవార్డ్స్‌-2025 విజేతలు.. ఉత్తమ నటుడు నాగచైతన్య
 

Advertisement
 
Advertisement
Advertisement