రామ్‌చరణ్ హీరోగా నటించిన పాన్ ఇండియా మూవీ ‘పెద్ది’. బుచ్చిబాబు సానా దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటించారు. మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సమర్పణలో వృద్ధి సినిమాస్‌పై వెంకట సతీష్ కిలారు నిర్మించిన ఈ సినిమా ఏప్రిల్ 30న విడుదల కానుంది. కాగా ఈ చిత్రాన్ని డాల్బీ సినిమాస్ ఫార్మాట్‌లో రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించి, రామ్‌చరణ్ కొత్త ఫొటోను విడుదల చేశారు.
‘‘యాక్షన్ డ్రామాగా రూపొందిన చిత్రం ‘పెద్ది’. ఈ మూవీని అత్యాధునిక డాల్బీ సినిమాస్ ఫార్మాట్‌లో కూడా విడుదల చేస్తున్నాం. రామ్‌చరణ్ మాస్ రగ్డ్ అవతార్‌ను డాల్బీ సినిమాస్ ఫార్మాట్‌లో చూడడం ప్రేక్షకులకు ఓ గొప్ప అనుభూతి దక్కేలా చేస్తుంది. అలాగే ‘పెద్ది’ వంటి భారీ యాక్షన్, ఎమోషన్ కలిగిన ఈ చిత్రాన్ని డాల్బీ సినిమాస్‌లో చూడడం వల్ల ప్రేక్షకులు పూర్తిగా సినిమాలో లీనమయ్యే అవకాశం ఉంది’’ అని చిత్రయూనిట్ పేర్కొంది.


