టాలీవుడ్ హీరో నాగచైతన్య కొన్నేళ్ల క్రితం షోయూ పేరుతో క్లౌడ్ కిచెన్ ప్రారంభించాడు. ముఖ్యంగా జపనీస్ వంటకాలకు ఇది బాగా ఫేమస్. ఈ ఫుడ్ బిజినెస్ ప్రారంభం నుంచి విజయవంతంగా రన్ అవుతోంది. దాని గురించి తాజాగా చై మాట్లాడుతూ.. జపనీస్ వంటకాలంటే నాకెంతో ఇష్టం. ప్రపంచంలో ఎక్కడికెళ్లినా జపనీస్ వంటకాలనే ఫస్ట్ ఆర్డర్ చేస్తాను.
రెస్టారెంట్ అనుకున్నాం
ఆ వంటకాలను హైదరాబాద్‌కు తీసుకురావాలనిపించింది. నిజానికి ఏకంగా రెస్టారెంటే ప్రారంభించాలనుకున్నాను. కానీ, కరోనా వల్ల పరిస్థితులన్నీ తలకిందులయ్యాయి. అప్పుడే క్లౌడ్ కిచెన్ ఆలోచన వచ్చింది. కస్టమర్లకు నేరుగా ఇంటికే డెలివరీ చేసే ఆలోచన బాగుందనిపించింది. మా కిచెన్‌లో కొత్తగా ఏ వంటకం చేయాలన్నా ముందు ఇంట్లో టెస్ట్ చేయాల్సిందే!
నాన్నకు పిజ్జా ఇష్టం
ఇంట్లో వంటపై ప్రయోగాలు చేసినప్పుడు శోభిత దాన్ని టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తుంది. మెనూ తయారీలో తన సూచనలు ఉపయోగపడ్డాయి. నాన్నకు షోయూలో సూజితో చేసే పిజ్జా అంటే బాగా ఇష్టం. ప్రతి ఆదివారం పిలిచి.. ఈసారి కొత్తగా ఏం పిజ్జాలు చేశారు? నాకు పంపించు అని అడుగుతూ ఉంటారు అని నవ్వుతూ చెప్పుకొచ్చాడు. కాగా నాగచైతన్య ప్రస్తుతం వృషకర్మ సినిమాతో బిజీగా ఉన్నాడు. ఇందులో మీనాక్షి చౌదరి హీరోయిన్‌గా నటిస్తోంది. విరూపాక్ష ఫేమ్ కార్తీక్ దండు దర్శకత్వం వహిస్తుండగా బాపినీడు సమర్పణలో బీవీఎస్‌ఎన్ ప్రసాద్, సుకుమార్ నిర్మిస్తున్నారు.


