నాలుగు పెళ్లిళ్లు.. మీ కన్నా హిందువులే నయం: ముంతాజ్‌ | Mumtaz about Polygamy, Marrying three-four times is Wrong | Sakshi
Sakshi News home page

Mumtaz:: నాలుగు పెళ్లిళ్లు చేసుకోవడం మహా పాపం.. నా ఇంట్లో శివుడు..

Mar 12 2026 4:50 PM | Updated on Mar 12 2026 4:59 PM

Mumtaz about Polygamy, Marrying three-four times is Wrong

చైల్డ్‌ ఆర్టిస్ట్‌గా.. ఆ తర్వాత హీరోయిన్‌గా అనేక సినిమాలు చేసింది సీనియర్‌ నటి ముంతాజ్‌. ఖిలోనా, దో రాస్తే, ఆప్‌కీ కసమ్‌, తేరే మేరే సాప్నే, రోటి వంటి పలు చిత్రాలతో స్టార్‌ హీరోయిన్‌ స్టేటస్‌ అందుకుంది. 1974లో వ్యాపారవేత్త మయూర్‌ మద్వానిని పెళ్లి చేసుకుంది. పెళ్లి తర్వాత కూడా సినిమాల్లో రాణించింది. అయితే 1990లో సినిమాలకు రిటైర్‌మెంట్‌ ప్రకటించింది.

హిందూ దేవుళ్లంటే ఇష్టం
తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆమె మతాంతర వివాహాలు, దేవుళ్ల గురించి మాట్లాడింది. ముంతాజ్‌ మాట్లాడుతూ.. నేను దేవుళ్లను బాగా నమ్ముతాను. శంకరుడు, కృష్ణుడు అంటే చాలా ఇష్టం. నేను ముస్లిం అయినప్పటికీ ఈ దేవుళ్లపై నాకెంతో విశ్వాసం ఉంది. మా ఇంట్లో మెట్లు దిగి వస్తుంటే బొజ్జ గణపయ్య విగ్రహం కనిపిస్తుంది. ఎప్పుడూ ఆయనకు నమస్కరిస్తూ ఉంటాను.

ఎందుకీ గొడవ?
నేను అన్నిమతాలను నమ్ముతాను. నా భర్త హిందువు. నా సోదరి కూడా హిందువునే పెళ్లాడింది. మేమంతా సంతోషంగా ఉన్నాం. కానీ జనాలెందుకు ఈ మతాల గురించి ​కొట్టుకుంటారో అర్థం కాదు. కాకపోతే మా కమ్యూనిటీలో ఉన్న బహుభార్యత్వం నాకు ఏమాత్రం నచ్చదు. చాలామంది మూడు, నాలుగు పెళ్లిళ్లు చేసుకుంటారు. అంతకుముందు ఉన్న భార్యల్ని నడిరోడ్డుమీద వదిలేస్తారు. అలా చేస్తే హిందువుల కన్నా మీరెలా గొప్పవారవుతారు? ఏ ఒక్కరూ కూడా మూడునాలుగు పెళ్లిళ్లు చేసుకోకూడదు. అది చాలా పెద్ద తప్పు.

అది చాలా తప్పు
భార్య ఉండగా మరొకర్ని పెళ్లి చేసుకోవడమేంటి? ఆ మహిళ మిమ్మల్ని ఎంతగా ప్రేమిస్తుందో ఎప్పుడైనా ఆలోచించారా? అలాంటి ఆమెను వదిలేసి మరొకర్ని షాదీ చేసుకోవడం కరెక్ట్‌ కాదు. ఇది మహా పాపం. ఈ విషయంలో హిందువులే నయం. కొన్నిసార్లు వాళ్లు కూడా రెండో పెళ్లి చేసుకుంటారు. కానీ కట్టుకున్న భార్యని అర్ధాంతరంగా వదిలేసి మరొకరి దగ్గరకు అంత ఈజీగా వెళ్లిపోవడం మాత్రం చాలా తప్పు అని ముంతాజ్‌ నొక్కి చెప్పింది.

చదవండి: బలవంతంగా ఐటం సాంగ్స్‌.. చెండాలమైన లిరిక్స్‌: నటి

Advertisement
 
Advertisement
Advertisement