రియలిస్టిక్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచే దర్శకుడు మణికందన్.. కాకా ముట్టై, కడైసి వివసాయి వంటి సినిమాలతో జాతీయ అవార్డ్స్ అందుకున్న ఆయన ‘కాట్టాన్’ (ముత్తు అలియాస్ కాట్టాన్) అనే వెబ్ సిరీస్ తెరకెక్కించారు. మార్చి 27న జియోహాట్‌స్టార్‌లో విడుదల కానుంది. తమిళ్‌తో పాటు తెలుగు, కన్నడ, హిందీ, మలయాళంలో స్ట్రీమింగ్ కానుంది. ఇందులో హీరోగా విజయ్ సేతుపతి నటిస్తున్నడంతో భారీ అంచనాలు నెలకొన్నాయి.

జియో హాట్‌స్టార్(JioHotstar) స్పెషల్ సిరీస్‌గా మార్చి 27, 2026న కాట్టాన్ (Kaattaan) ప్రీమియర్ అవుతుందని అధికారికంగా ప్రకటించింది. ఈ ప్రాజెక్ట్‌ను విజయ్ సేతుపతి తన సొంత ప్రొడక్షన్ బ్యానర్‌పై నిర్మించగా.., రాజేష్ మురుగేశన్ సంగీతం సమకూర్చారు. విజయ్ సేతుపతి - మణికందన్ కాంబినేషన్‌లో ఇప్పటికే ఆండవన్ కట్టలై, కడైసి వివసాయి వంటి బ్లాక్‌బస్టర్ సినిమాలు వచ్చాయి. విమర్శకుల నుంచి కూడా ప్రశంసలు అందుకున్నాయి. తాజాగా వీరి కాంబినేషన్‌లో వెబ్ సిరీస్ రానున్నడంతో ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
ఈ వెబ్ సిరీస్ రా అండ్ రస్టిక్ రూరల్ యాక్షన్ డ్రామాగా ఉండబోతోందని మేకర్స్ ప్రకటించారు. ఇందులో విజయ్ సేతుపతి పాత్ర గతంలో ఎన్నడూ చూడని అత్యంత ఉగ్ర రూపంలో కనిపిస్తారని టాక్. ఇందులో హింస తీవ్రత కాస్త ఎక్కువగానే ఉండనుందని తెలుస్తోంది.


