పెళ్లి తర్వాత తొలిసారి విజయ్‌, రష్మిక డ్యాన్స్‌.. వీడియో వైరల్‌ | Vijay Deverakonda And Rashmika Dance With Anand Devarakonda First Time After Marriage, Video Viral On Social Media | Sakshi
Sakshi News home page

పెళ్లి తర్వాత తొలిసారి విజయ్‌, రష్మిక డ్యాన్స్‌.. వీడియో వైరల్‌

Mar 12 2026 2:38 PM | Updated on Mar 12 2026 2:59 PM

Vijay Deverakonda, Rashmika Dance With Anand Devarakonda, Video Goes Viral

మొన్నటి వరకు పెళ్లి పనులు, రిసెప్షెన్లతో బిజీగా గడిపిన టాలీవుడ్ స్టార్ కపుల్‌ విజయ్‌ దేవరకొండ, రష్మిక..ఇప్పుడు రిలాక్స్‌ మోడ్‌లోకి వెళ్లిపోయారు. షూటింగ్స్‌కి గ్యాప్‌ ఇచ్చి.. ఖాలీ సమయాన్ని కుటుంబ సభ్యులతో గడుపుతున్నారు. తాజాగా ఈ జంట..ఆనంద్‌ దేవరకొండ పాటకు డ్యాన్స్‌ చేసింది. పెళ్లి తర్వాత తొలిసారి విజయ్‌, రష్మిక కలిసి డ్యాన్స్‌ చేయడంతో ఆ వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారింది.

సరదాగా ‘సంచారమే..’
ఆనంద్ దేవరకొండ నటిస్తున్న తాజా చిత్రం ఎపిక్: ఫస్ట్ సెమిస్టర్ . ఈ మూవీ నుంచి ఇటీవల సంచారమే అనే పాట రిలీజ్ అయింది. ప్రముఖ గేయరచయిత గొరటి వెంకన్న లిరిక్స్‌ అందించిన ఈ పాట ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారింది. 

నెటిజన్స్‌ పెద్ద ఎత్తున ఈ పాటకు రీల్స్‌ చేస్తున్నారు.  ఇప్పుడీ ట్రెండీ సాంగ్ ను విజయ్ దేవరకొండ, రష్మిక, ఆనంద్ దేవరకొండ కలిసి రీక్రియేట్ చేశారు. ముగ్గురు కలిసి సరదాగా స్టెప్పులేశారు. ఇందుకు సంబంధించిన వీడియోను ఆనంద్ దేవరకొండ ఇన్ స్టా గ్రామ్ లో షేర్ చేస్తూ ‘ఇది కొంచెం గందరగోళంగా కనిపించవచ్చు. కానీ ఆ క్షణంలో మేమంతా చాలా ఆనందంగా ఉన్నాం. మనకు ఇష్టమైన వారితో కలిసి ప్రయాణిస్తూ, డ్యాన్స్ చేస్తే దానికన్నా ఆనందం ఇంకేముంటుంది’ అని రాసుకొచ్చాడు. 

Advertisement
 
Advertisement
Advertisement