వెరైటీగా 'మిస్టర్‌ వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌' సినిమా ప్రమోషన్స్‌ | Mr Work From Home Promotions with Stalls | Sakshi
Sakshi News home page

వెరైటీగా 'మిస్టర్‌ వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌' సినిమా ప్రమోషన్స్‌

Mar 11 2026 8:41 PM | Updated on Mar 11 2026 10:38 PM

Mr Work From Home Promotions with Stalls

ఈ రోజుల్లో సినిమా తీయడం ఒక ఎత్తయితే, దాన్ని ప్రమోట్ చేయడం మరో ఎత్తు! ఇటీవల ఒక సినిమా వినూత్నమైన ప్రమోషన్స్‌తో అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. అదే “మిస్టర్ వర్క్ ఫ్రమ్ హోమ్”. సినిమా కాన్సెప్ట్ మాత్రమే కాకుండా, ఈ చిత్రబృందం చేస్తున్న ప్రచార కార్యక్రమాలు కూడా ప్రత్యేకంగా నిలుస్తున్నాయి.

వినూత్న ప్రమోషన్స్‌
రైతులకు ఉపయోగపడే అంశాన్ని ఈ సినిమాలో చూపించడంతోపాటు సినిమా ప్రమోషన్స్‌ కూడా రైతుల మధ్య నుంచే ప్రారంభించారు. హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ స్టేడియంలో జరిగిన రాజేందర్ రెడ్డి రైతుబడి అగ్రి షోలో చిత్రబృందం ప్రత్యేకంగా ఒక స్టాల్ ఏర్పాటు చేసింది. అక్కడికి వచ్చిన రైతులకు సినిమా కాన్సెప్ట్‌ను వివరించారు. సాధారణంగా అగ్రికల్చర్ ఎగ్జిబిషన్లలో వ్యవసాయానికి సంబంధించిన పరికరాలు, విత్తనాలు, కంపెనీల స్టాళ్లు మాత్రమే కనిపిస్తాయి. కానీ ఒక సినిమాకు ప్రత్యేకంగా స్టాల్ ఏర్పాటు చేయడం అరుదైన విషయమే అని చెప్పాలి.

ఆరోజు కూడా..
అదేవిధంగా మహిళా దినోత్సవం సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్న ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం (PJTSAU)లో జరిగిన మెగా రైతు మేళాలో కూడా “మిస్టర్ వర్క్ ఫ్రమ్ హోమ్” సినిమా టీమ్ స్టాల్ ఏర్పాటు చేసింది. మహిళా దినోత్సవం సందర్భంగా వ్యవసాయ విశ్వవిద్యాలయంలో జరిగిన కార్యక్రమానికి హాజరైన మంత్రులు, అధికారులు, స్కాలర్లు, యాక్టివిస్టులు, మహిళా యాక్టివిస్టులు, రైతులు మూవీ స్టాల్‌ను సందర్శించి చిత్రబృందాన్ని అభినందించారు. రైతుల కోసం వారు చేస్తున్న ప్రయత్నాన్ని ప్రశంసించారు.

ప్రధాన ఉద్దేశం
వ్యవసాయం, సాంకేతికత మధ్య ఉన్న అంతరాన్ని తగ్గించడమే ఈ సినిమా ప్రధాన ఉద్దేశమని చిత్రబృందం చెబుతోంది. “మిస్టర్ వర్క్ ఫ్రమ్ హోమ్” వ్యవసాయంతో పాటు ఆధునిక సమాజంలో పెరుగుతున్న విడాకుల సమస్యను కూడా ప్రస్తావిస్తుంది. మునుపటి తరాలు జంటలకు మార్గనిర్దేశం చేయడంలో, కుటుంబ విభేదాలను పరిష్కరించడంలో కీలక పాత్ర పోషించాయని ఈ సినిమా గుర్తుచేస్తుంది. అలాగే దాదాపు 10 మంది ప్రముఖ కమెడియన్స్‌తో నవ్వులు పంచేలా రూపొందించారు. ఈ మూవీని వేసవిలో విడుదల చేయనున్నారు.

 

Advertisement
 
Advertisement
Advertisement