సర్జరీ ఫెయిల్‌.. దేవుడి ముందు మోకరిల్లి..: జేమీ లివర్‌ | Johnny Lever Daughter Jamie About Jessey Tumour battle at Age 10 | Sakshi
Sakshi News home page

సర్జరీ ఫెయిల్‌.. దేవుడి ముందు మోకరిల్లి..: జేమీ లివర్‌

Mar 11 2026 3:51 PM | Updated on Mar 11 2026 4:00 PM

Johnny Lever Daughter Jamie About Jessey Tumour battle at Age 10

వెండితెరపై నవ్వులు పూయించే జానీ లివర్‌ ఒకానొక సమయంలో ఎంతో మానసిక క్షోభను అనుభవించాడు. కన్నకొడుకు జెస్సీ చిన్నవయసులో ట్యూమర్‌తో బాధపడుతుంటే చూడలేక తల్లడిల్లిపోయాడు. అతడే కాదు అతడి కుటుంబం కూడా మానసిక క్షోభ అనుభవించింది. ఈ విషయాన్ని తాజాగా జానీ లివర్‌ కూతురు జేమీ ఓ ఇంటర్వ్యూలో వెల్లడించింది.

కవర్‌ చేసేందుకు..
ఆమె మాట్లాడుతూ.. నా తమ్ముడు స్కూల్‌లో ఉండగా వాడికి ట్యూమర్‌ ఉన్నట్లు తెలిసింది. మొదట్లో అదేంటో మాకూ అర్థం కాలేదు. కానీ, ఆ ట్యూమర్‌ సైజు పెరుగుతూ వాడిని ఇబ్బందిపెట్టింది. రానురానూ దాన్ని కవర్‌ చేయడం కోసం డ్రెస్సింగ్‌ స్టైల్‌ కూడా మార్చేశాడు. మేమిద్దరం ఒకటే స్కూల్‌లో చదువుకునేవాళ్లం. తననెప్పుడూ జాగ్రత్తగా చూసుకునేదాన్ని. ముంబైలో చేసిన మొదటి సర్జరీ విజయవంతం కాలేదు. అప్పుడు చాలా భయపడ్డాం. తన ఆరోగ్యం కుదుటపడాలని, బాగుండాలని నాన్న దేవుడి ముందు మోకాళ్లపై కూర్చుని ప్రార్థించేవాడు.

రెండుసార్లు సర్జరీ
జెస్సీ అడిగినవేవీ కాదనేవాళ్లం కాదు. అతడి కోరిక మేరకే అమెరికా ట్రిప్‌ వెళ్లాం. అనుకోకుండా అక్కడ సర్జరీకి ప్రయత్నించగా అది విజయవంతమైంది. రెండేళ్లలో రెండు సర్జరీలు జరిగాయి. దేవుడి దయ వల్ల అనారోగ్యం నుంచి కోలుకున్నాడు అని చెప్పుకొచ్చింది. జెస్సీ.. కిస్‌ కిస్కో ప్యార్‌ కరూన్‌, హౌస్‌ఫుల్‌ 4, భూత్‌ పోలీస్‌ వంటి సినిమాలు చేసింది. ఆ ఒక్కటి అడక్కు చిత్రం ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది.

చదవండి: సీజీ చేయడం రాక మా మీద తోస్తున్నారు: ఛోటా కె నాయుడు

Advertisement
 
Advertisement
Advertisement