ముఖానికే కాదు అక్కడ కూడా మేకప్.. ఇబ్బందిపడ్డా: హీరోయిన్‌ | Actress Sameera Reddy Reveals She Was Forced To Do Fairer Body Makeup For Films | Sakshi
Sakshi News home page

ముఖానికే కాదు శరీరానికి కూడా మేకప్... ఇబ్బందిపడ్డా: సమీరారెడ్డి

Mar 11 2026 1:30 PM | Updated on Mar 11 2026 1:50 PM

Actress Sameera Reddy Reveals She Was Forced To Do Fairer Body Makeup For Films

సినిమా ఇండస్ట్రీలో టాలెంట్‌ కంటే అందానికి ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది అంటుంది నటి సమీరా రెడ్డి. ముఖ్యంగా హీరోయిన్ల విషయంలో.. కలర్ డిస్క్రిమినేషన్ ఎక్కువ ఉంటుందని, తాను కూడా ఇది ఫేస్‌ చేశానని చెబుతోంది. తెలుగులో `నరసింహుడు`, `అశోక్‌` ‘జై చిరంజీవా’ లాంటి సినిమాలతో అలరించిన ఈ బ్యూటీ.. 2014లో ఓ వ్యాపారవేత్తను పెళ్లి చేసుకొని సినిమాలకు దూరం అయింది. పిల్లలు పుట్టిన తర్వాత ఆమె శరీరంలో భారీ మార్పులు వచ్చాయి. కాస్త బొద్దుగా మారడంతో..సోషల్‌ మీడియాలో పెద్ద ఎత్తున ట్రోల్స్‌ కూడా వచ్చాయి. తాజాగా ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో  ఈ ట్రోల్స్‌ గురించి, ఇండస్ట్రీలో హీరోయిన్‌గా తాను ఎదుర్కొన్న సవాళ్లను గురించి వివరించింది.

‘సినిమా ఇండస్ట్రీలో  అందానికే ఎక్కువ ప్రాధాన్యత. టాలెంట్‌ గురించి పట్టించుకోరు. తెల్లతోలు వ్యామోహం నన్న చాలా ఇబ్బందికి గురి చేసింది. సాధారణంగా ఒక నటిగా, మహిళగా ఎప్పుడూ అందంగా ఉండడానికే ప్రయత్నించాను. కానీ మరింత అందంగా కనబడాలంటూ నాకు మేకప్‌ వేసేవాళ్లు. ముఖానికి మాత్రమే కాకుండా.. శరీరానికి కూడా మేకప్‌ వేసుకోవాలని ఒత్తిడి చేశారు. అలా చెప్పడం నన్ను చాలా బాధించింది. నిజంగానే నేను అందంగా లేనేమో అనే భావన నాలో కలిగింది. 

అంతేకాదు నేను స్లిమ్‌గా లేనని బాధపడేదాన్ని. నేను చాలా పొడుగ్గా ఉండడంతో.. వయసులో పెద్దదిగా చూసేవాళ్లు. అది నా మైండ్‌లో అలా ఉండిపోయేది. ఇండస్ట్రీలో ఉన్నన్ని రోజులు నా బాడీ సైజు గురించే మాట్లాడేవాళ్లు కానీ..టాలెంట్‌, యాక్టింగ్‌ గురించి చర్చ జరిగేది కాదు. ఇప్పుడు నేను వెనక్కి తిరిగి ఆలోచిస్తే.. అసలు నేను వాళ్లు చెప్పినట్లు ఎందుకు చేశాను. అలా అనుమతి ఇవ్వకుండా ఉండాల్సింది అనిపిస్తుంది. కానీ సినిమా ఇండస్ట్రీలో కామన్‌. అలా చేయకతప్పదు’ అని సమీరా(Sameera Reddy) చెప్పుకొచ్చింది.

ఇక బాడీ షేమింగ్‌ గురించి మాట్లాడుతూ.. ‘పిల్లలు పుట్టిన తర్వాత నా శరీరంలో మార్పు వచ్చింది. వెయిట్ గైన్ అవ్వడం వల్ల నా ఆత్మవిశ్వాసాన్ని పూర్తిగా కోల్పోయాను.. ఆ సమయంలో నెటిజన్స్ నుంచి ఎదురైన విమర్శలు మానసికంగా నన్ను ఆవేదనకు గురి చేశాయి. ఇక రెండోసారి తల్లి అయినప్పుడు మాత్రం నా ఆలోచన విధానాన్ని పూర్తిగా మార్చుకున్నాను.. సోషల్ మీడియాలో నెటిజన్లు ఎంతటి దారుణమైన కామెంట్స్ చేసినా.. ఆ నెగిటివ్ కామెంట్స్ చూస్తే నాకేమీ అనిపించడం లేదు. నేను ప్రస్తుతం న్యూట్రల్ గానే ఉన్నాను”
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement