డిఫరెంట్ సినిమాలు చేస్తూ గుర్తింపు తెచ్చుకున్న తమిళ నటుడు ఆర్య. ఇంతకు ముందు నాన్ కడవుల్, మద్రాసు పట్టణం, మహాముని, టెడ్డీ, సార్పట్ట పరంపరై తదితర మూవీస్ చేశాడు. ప్రస్తుతం పా.రంజిత్ దర్శకత్వంలో 'వెట్టవన్'లో నటిస్తున్నాడు. దీని తర్వాత 'సార్పట్ట పరంపరై 2'లో కూడా నటించడానికి సిద్ధమవుతున్నాడు. తన 40వ చిత్రాన్ని జీవశంకర్ దర్శకత్వంలో చేయడానికి రెడీ అయ్యాడు. ఇందులో నిఖిలా విమల్, వైష్ణవి చైతన్య హీరోయిన్లుగా నటిస్తున్నారు.
(ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చేసిన అనుపమ పరమేశ్వరన్ థ్రిల్లర్ సినిమా)
నిఖిల్ మురళి నిర్మిస్తున్న ఈ చిత్రానికి జీవీ.ప్రకాష్‌కుమార్ సంగీతాన్ని అందిస్తున్నారు. గత ఏడాది డిసెంబర్ 12న పూజా కార్యక్రమాలతో షూటింగ్ ప్రారంభమైంది. తాజాగా ఆర్యతో హీరోయిన్లు నిఖిలా విమల్, వైష్ణవి చైతన్య జిమ్‌లో కలిసి వర్కౌట్స్ చేస్తున్నట్లు ఫొటోలకు పోజులిచ్చారు. ఇంకా పేరు నిర్ణయించని ఈ చిత్రం.. రొమాంటిక్ ప్రేమకథగా ఉండనుందని తెలుస్తోంది. 'బేబి' మూవీ ఫేమ్ వైష్ణవి చైతన్యకు ఇదే తమిళంలో తొలి మూవీ.
(ఇదీ చదవండి: తారకరత్న చివరి గుండె చప్పుడూ విన్నా.. 23 రోజులు కొన ఊపిరితో)


