తమిళసినిమా: ఇంతకుముందు ఇరుదిపక్కం, డియర్ రది వంటి విభిన్న కథా చిత్రాలను నిర్మించిన ఇన్సోమినియక్స్ డ్రీమ్ క్రియేషన్‌న్స్ నిర్మిస్తున్న మూడు చిత్రానికి మంగళవారం పూజా కార్యక్రమం చైన్నెలో నిర్వహించారు. ఇరుదిపక్కం చిత్రం ఫేమ్ మనో వి.కన్నదాసన్ దర్శకత్వం వహిస్తున్న తాజా చిత్రం ఇది. ఇందులో పాండియన్ స్టోర్స్, కుమార్ సంభం టీవీ సీరియళ్ల ఫేమ్ కుమరన్ రంగరాజన్, స్నేహ హీరోహీరోయిన్గా నటిస్తున్నారు. రాజేష్ బాలచంద్రన్, అభిషేక్, జోసఫ్, సత్య ముఖ్యపాత్రను పోషిస్తున్నారు. చిత్ర వివరాలను దర్శకుడు వివరిస్తూ ఇది తన గత చిత్రాల బాణీలోనే క్రైమ్, సస్పెన్స్, ఇన్వెస్టిగేషన్, థ్రిల్లర్ కథాచిత్రంగా ఉంటుందన్నారు. అయితే ఈ చిత్రం కథాంశం వాటికి పూర్తి భిన్నంగా ఉంటుందని పేర్కొన్నారు. ప్రేక్షకులకు సరికొత్త అనుభవాన్ని కలిగిస్తుందని అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. తిరుచ్చి, పెరంబలూర్ ప్రాంతాల్లో షూటింగులు నిర్వహించనున్న ఈ చిత్ర కథ ఎమోషనల్‌తో సాగుతుందన్నారు. వాస్తవానికి దగ్గరగా ఉండే విధంగా ఆ ప్రాంతాల్లో షూటింగ్‌ను నిర్వహించనున్నట్లు చెప్పారు. చిత్రానికి లోకేష్ ఇళంగోవన్ చాయాగ్రహణంను, జోన్‌న్స్‌రూపర్ట్ సంగీతాన్ని అందిస్తున్నట్లు చెప్పారు.


