సాక్షి,చైన్నె: బ్లూ స్టార్ లిమిటెడ్ 2026 వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకుని వినియోగదారుల కోసం అత్యాధునిక ఫీచర్లతో కూడిన సరికొత్త రూమ్ ఎయిర్ కండీషనర్లను మార్కెట్లోకి విడుదల చేసింది. ఈ కొత్త శ్రేణిలో మొత్తం 125 మోడళ్లను కంపెనీ ప్రవేశపెట్టింది. జనవరి 1 నుండి అమలులోకి వచ్చిన కొత్త బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషిఝెన్సీ ప్రమాణాలకు అనుగుణంగా ఈ ఏసీలన్నీ రూపొందించామని ఆ సంస్థ ఎండీ బి త్యాగరాజన్ ప్రకటించారు. మంగళవారం చైన్నెలో ఈ విస్తృత శ్రేణులను పరిచయంచేశారు. ఇందులో ఐకోనియా సిరీస్,సూపర్ ఎనర్జీ ఎఫిషియంట్ ఏసీలు, హెవీ డ్యూటీ ఏసీలు ఉన్నాయని తెలిపారు.. గాలిలోని హానికరమైన సూక్ష్మక్రిములను నిర్మూలించి, స్వచ్ఛమైన గాలిని అందించే ఫిల్టర్లు వీటిలో ఉన్నాయని వివరించారు.. ఇవి ఎయిర్ ప్యూరిఫైయర్‌గా కూడా పనిచేస్తాయన్నారు. ఈమేరకు ఇందులో యాంటీ వైరస్ టెక్నాలజీ , స్మార్ట్ ఫీచర్లు ఉన్నట్టు తెలిపారు. తమ ఉత్పత్తులకు టైర్ 3, 4, 5 పట్టణాల నుండి డిమాండ్ ఎక్కువగా ఉందని పేర్కొంటూ, 2030 నాటికి దేశీయ ఏసీ మార్కెట్ 30 మిలియన్ యూనిట్లకు చేరుకుంటుందని అంచనా వేస్తున్నామని తెలిపారు. కమర్షియల్ విభాగంలో డీప్ ఫ్రీజర్లు, కోల్డ్ రూమ్స్ , హెల్త్‌కేర్ రిఫ్రిజిరేషన్ వంటి ఉత్పత్తులతో బ్లూస్టార్ తన పట్టును మరింత బలోపేతం చేసుకుంటోందన్నారు.


