ఓటీటీలోకి వచ్చేసిన థ్రిల్లర్ సినిమా.. తెలుగులోనూ స్ట్రీమింగ్ | Lockdown Movie 2026 OTT Streaming Now Telugu | Sakshi
Sakshi News home page

Lockdown OTT: అనుపమ కొత్త మూవీ.. సడన్‌గా స్ట్రీమింగ్‌లోకి

Mar 11 2026 7:52 AM | Updated on Mar 11 2026 7:59 AM

Lockdown Movie 2026 OTT Streaming Now Telugu

మలయాళీ అయినప్పటికీ తెలుగులోనూ బోలెడన్ని సినిమాలు చేసిన అనుపమ పరమేశ్వరన్.. గతేడాది అర డజను మూవీస్ చేసింది. వాటిలో దాదాపు మూడు నాలుగు చిత్రాలు ప్రేక్షకుల్ని అలరించాయి. కొత్త ఏడాదిలోనూ ఓ థ్రిల్లర్‌తో వచ్చింది. ఇప్పుడా సినిమా ఎలాంటి ప్రకటన లేకుండా ఓటీటీలోకి వచ్చేసింది. తెలుగులోనూ స్ట్రీమింగ్ అయిపోతోంది. ఇంతకీ ఏంటా చిత్రం? ఎందులో చూడొచ్చు?

(ఇదీ చదవండి: ఓటీటీలోకి తెలుగు రొమాంటిక్ సినిమా 'కపుల్ ఫ్రెండ్లీ')

అనుపమ లీడ్ రోల్ చేసిన తమిళ థ్రిల్లర్ మూవీ 'లాక్ డౌన్'. లెక్క ప్రకారం గతేడాది డిసెంబరులో దీన్ని థియేటర్లలోకి తీసుకురావాలనుకున్నారు. కానీ ఎందుకనో వాయిదాల మీద వాయిదాలు పడింది. ఎట్టకేలకు ఈ జనవరి 30న రిలీజైంది. కానీ ఫ్లాప్ అయింది. లాక్‌డౌన్ అనేది ముగిసిన కాన్సెప్ట్. దాన్ని తీసుకొచ్చి ఇప్పుడు చూపించాలనుకున్నారు. అస్సలు వర్కౌట్ కాలేదు. ఇప్పుడీ చిత్రం సైలెంట్‌గా అమెజాన్ ప్రైమ్‌లోకి వచ్చేసింది. తెలుగు, తమిళ, హిందీ వెర్షన్ స్ట్రీమింగ్ అవుతున్నాయి.

'లాక్‌డౌన్' విషయానికొస్తే.. చదువు పూర్తి చేసిన అనిత(అనుపమ పరమేశ్వరన్) ఉద్యోగం ప్రయత్నాల్లో ఉంటుంది. ఓ రోజు స్నేహితులతో కలిసి పార్టీలో పాల్గొంది. తర్వాత కొన్నాళ్లకు ఈమెకు ప్రెగ్నెన్సీ వస్తుంది. దీనిని ఇంట్లో వాళ్ల నుంచి దాచేందుకు ప్రయత్నిస్తుంది. ఈ క్రమంలోనే లాక్ డౌన్ రావడంతో వైద్య సహాయం అందక ఇబ్బంది పడుతుంది. మరోవైపు ఆదాయం కోల్పోయిన కుటుంబం, ఊరికి వెళ్లలేక చిక్కుకున్న కార్మికుడు, ప్రాణాలని లెక్కచేయకుండా పనిచేసే వైద్యులు, ఒంటరితనంతో బాధపడే యువత, విరహ వేదలో ఉన్న ప్రేమ జంటలు కూడా ఈ లాక్ డౌన్ వల్ల చాలా ఇబ్బందులు పడుతుంటాయి. చివరకు అనిత జీవితం ఏమైందనేదే మిగతా స్టోరీ.

(ఇదీ చదవండి: డైరెక్ట్ ఓటీటీలో రిలీజైన తెలుగు హారర్ థ్రిల్లర్ సినిమా)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement