డైరెక్ట్ ఓటీటీలో రిలీజైన తెలుగు హారర్ థ్రిల్లర్ సినిమా | Ravam Movie 2026 Telugu OTT Streaming Now | Sakshi
Sakshi News home page

OTT Movie: తెలుగు హారర్ మూవీ.. ఓటీటీలో సైలెంట్‌గా స్ట్రీమింగ్

Mar 10 2026 4:13 PM | Updated on Mar 10 2026 4:25 PM

Ravam Movie 2026 Telugu OTT Streaming Now

ఈ వారం ఓటీటీల్లోకి చాలానే సినిమాలు రాబోతున్నాయి. వాటిలో రవితేజ 'భర్త మహాశయులకు విజ్ఞప్తి', విశ్వక్ సేన్ 'ఫంకీ', ప్రియాంక మోహన్ 'మేడిన్ కొరియా' తదితర మూవీస్ ఉన్నంతలో ఆసక్తి కలిగిస్తున్నాయి. వీటితో పాటు జుటోపియా 2, ద తాజ్ స్టోరీ, పూకీ చిత్రాలు కూడా చూడొచ్చనే ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తున్నాయి. వీటి సంగతి అలా ఉంచితే ఇప్పుడో తెలుగు సినిమా.. నేరుగా ఓటీటీలోకి వచ్చేసింది. హరర్ థ్రిల్లర్ కాన్సెప్ట్‌తో తీసిన ఈ మూవీ సంగతేంటి? ఎందులో స్ట్రీమింగ్ అవుతుందనేది చూద్దాం.

(ఇదీ చదవండి: వడివేలుని తట్టుకోలేను.. అందుకే 16 సినిమాలు తిరస్కరించా)

ప్రశాంత్, అనుశ్రీ అనే కొత్తవాళ్లు హీరోహీరోయిన్లుగా నటించిన సినిమా 'రవం'(Ravam Movie). శ్రీరామ్ మన్నార్ దర్శకత్వం వహించాడు. రీసెంట్‌గానే ఇది ఆహా ఓటీటీలోకి వచ్చేసింది. సబ్‌స్క్రిప్షన్ లేకపోయినా సరే ఈ మూవీ చూడొచ్చు. 'రవం' విషయానికొస్తే.. ఓ ఈఎన్‌టీ డాక్టర్ భూషణ్, తన రీసెర్చ్ నిరూపించుకోవడం కోసం ఆత్మల మీద డాక్యుమెంటరీ తీయమని, తర్వాత నేను మీ సినిమాని నిర్మిస్తానని యువ దర్శకుడు మౌళికి చెప్తాడు. దీంతో మౌళి తన ప్రియురాలు పూజ, స్నేహితుడు రవితో కలిసి పింజర్లపల్లి అనే ఓ మారుమూల పల్లెటూరికి వెళ్తాడు. అక్కడికి వెళ్లిన తర్వాత వీళ్లకు ఎలాంటి అనుభవాలు ఎదురయ్యాయనేదే స్టోరీ లైన్.

(ఇదీ చదవండి: ఓటీటీలో క్రేజీ యాక్షన్ సైన్స్ ఫిక్షన్ సినిమా.. తెలుగు రివ్యూ)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement