'జైలర్‌-2'లో పోలీస్‌ ఆఫీసర్‌గా బాలీవుడ్‌ కింగ్‌ | Bollywood Top Actor Enter In Jailer 2 Movie | Sakshi
Sakshi News home page

'జైలర్‌-2'లో పోలీస్‌ ఆఫీసర్‌గా బాలీవుడ్‌ కింగ్‌

Mar 10 2026 12:20 PM | Updated on Mar 10 2026 12:30 PM

Bollywood Top Actor Enter In Jailer 2 Movie

జైలర్‌-2 సినిమాలో బాలీవుడ్‌ కింగ్‌ షారుఖ్ ఖాన్ నటించబోతున్నట్లు కథనాలు వస్తున్నాయి. ముత్తువేల్‌ పాండియన్‌గా మరోసారి రజనీకాంత్‌ సందడి చేయనున్నారు. 2023లో విడుదలైన జైలర్‌ సినిమాకు సీక్వెల్‌గా పార్ట్‌-2ను దర్శకుడు నెల్సన్‌ దిలీప్‌కుమార్‌ తెరకెక్కిస్తున్నారు. ఇదే ఏడాదిలో ఈ మూవీ విడుదల కానుంది. అయితే, ఇప్పుడీ సీక్వెల్‌కు సంబంధించిన ఒక వార్త సోషల్ మీడియాలో ప్రచారంలో ఉంది.

జైలర్‌-2లో ప్రత్యేక పాత్రలో షారుఖ్‌ ఖాన్‌ నటిస్తున్నట్లు బాలీవుడ్‌లో కథనాలు వస్తున్నాయి. ఈ మూవీలో పవర్‌ఫుల్‌ పోలీస్‌ పాత్రలో నటించేందుకు ఆయన ఓకే అన్నట్లు సమాచారం.  ఏడు నుండి ఎనిమిది రోజుల పాటు చిత్రీకరించబడే అతని సన్నివేశాలతో సినిమా ముగుస్తుందని భావిస్తున్నారు. మార్చి చివరి వారంలో జైలర్‌-2 సెట్స్‌లోకి షారుఖ్‌ ఎంట్రీ ఇస్తారని తెలుస్తోంది.

‘జైలర్‌’లో శివరాజ్‌కుమార్‌, మోహన్‌లాల్‌ వంటి స్టార్‌ నటులు సినిమాను మలుపుతిప్పే అతిథి పాత్రల్లో నటించిన విషయం తెలిసిందే. ఇప్పుడు షారుఖ్‌ ఖాన్‌ కూడా అలాంటి పాత్రలోనే కనిపిస్తారని సమాచారం. ఇందులో ఎస్.జె. సూర్య కూడా నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రంలో రజనీకాంత్ కోడలు శ్వేతా పాండియన్ పాత్ర పోషించిన నటి మిర్నా కూడా ఈ సీక్వెల్‌లో కీలక పాత్ర పోషించనుందని వర్గాలు చెబుతున్నాయి.

Advertisement
 
Advertisement
Advertisement