జన నాయగన్‌కు మరో షాక్.. స్క్రీనింగ్ వాయిదా..! | Vijay Jana Nayagan revising committee screening postponed | Sakshi
Sakshi News home page

Jana Nayagan: జన నాయగన్‌కు మరో షాక్.. స్క్రీనింగ్ వాయిదా..!

Mar 9 2026 4:32 PM | Updated on Mar 9 2026 4:45 PM

Vijay Jana Nayagan revising committee screening postponed

కోలీవుడ్ స్టార్ విజయ్ హీరోగా వస్తోన్న మూవీ జన నాయగన్. పొలిటికల్ ఎంట్రీ తర్వాత విజయ్ నటించిన చివరి చిత్రం ఇదే. ఈ ఏడాది సంక్రాంతికి రిలీజ్ కావాల్సిన ఈ చిత్రం.. సెన్సార్‌ బోర్డ్ వివాదంతో వాయిదా పడుతూ వస్తోంది. ఇప్పటికీ ఈ మూవీకి సెన్సార్ బోర్డ్‌ రివైజింగ్ కమిటీ క్లియరెన్స్ ఇవ్వకపోవడంతో జన నాయగన్ రిలీజ్ మరింత ఆలస్యమవుతోంది. 

అయితే తాజాగా సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ రివైజింగ్ కమిటీ ఈ మూవీని సోమవారం మధ్యాహ్నం 2 గంటలకు రివ్యూ చేయాల్సి ఉంది. కానీ ఊహించని విధంగా జన నాయగన్ రివైజింగ్ కమిటీ స్క్రీనింగ్ వాయిదా పడింది. కమిటీలోని ఓ సభ్యుడు అనారోగ్యానికి గురి కావడంతో వాయిదా వేయాల్సి వచ్చింది. చివరి నిమిషంలో ప్రదర్శన రద్దు చేశారు. దీని వల్ల సినిమా సర్టిఫికేషన్ ప్రక్రియ మరింత ఆలస్యం కానుంది. ఇప్పటికే పలుసార్లు వాయిదా పడుతూ వస్తోన్న జన నాయగన్‌ మేకర్స్‌కు మరోసారి నిరాశే ఎదురైంది. అయితే దీనిపై సెన్సార్ బోర్డ్ సభ్యులు మరింత క్లారిటీ ఇవ్వాల్సి ఉంది. అయితే స్క్రీనింగ్ కోసం మరో తేదీని కేటాయిస్తారో? లేదో తెలియాల్సి ఉంది. 

కాగా.. ఈ చిత్రంలో మమిత బైజు, బాబీ డియోల్, గౌతమ్ వాసుదేవ్ మీనన్, ప్రకాష్ రాజ్, ప్రియమణి, పూజా హెగ్డే, నరైన్ కీలక పాత్రల్లో నటించారు. ఈ చిత్రం జనవరి 9న విడుదల కావాల్సిన ఉన్నా వాయిదాల పర్వం కొనసాగుతోంది. అయితే గతేడాది రివ్యూ చేసిన సెన్సార్‌ బోర్డ్‌ కొన్ని సవరణలు సూచించింది. అయినప్పటికీ కొన్ని మతపరమైన అంశాలు, సాయుధ దళాల లోగోలను ఉపయోగించడంపై సెన్సార్‌ కమిటీ సభ్యుడు ఫిర్యాదు చేశారు. దీంతో ఈ మూవీని మరోసారి సెన్సార్‌ చేయాలని రివైజింగ్ కమిటీ స్క్రీనింగ్‌కు పంపారు. ప్రస్తుతం ఈ ప్రక్రియ మరింత ఆలస్యమవుతోంది.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement