థియేటర్లలో మళ్లీ కాంచన.. రీ రిలీజ్ ఎప్పుడంటే? | Raghava lawrence Kanchana Movie re release in theatres | Sakshi
Sakshi News home page

Kanchana Movie: థియేటర్లలో మరోసారి కాంచన.. రీ రిలీజ్ ఎప్పుడంటే?

Mar 9 2026 1:02 PM | Updated on Mar 9 2026 1:12 PM

Raghava lawrence Kanchana Movie re release in theatres

తమిళ స్టార్, దర్శకుడు రాఘవ లారెన్స్ స్వీయ డైరెక్షన్‌లో తెరకెక్కించిన చిత్రం కాంచన(ముని-2). 2011లో రిలీజైన ఈ హీరర్ థ్రిల్లర్‌ అభిమానులను ఓ రేంజ్‌లో భయపెట్టేసింది. ముని సిరీస్‌లో వచ్చిన  రెండో చిత్రమే కాంచన. ఈ మూవీ బాక్సాఫీస్‌ వద్ద బ్లాక్‌ బస్టర్‌ హిట్‌గా నిలిచింది. ఈ చిత్రంలో శరత్ కుమార్, కోవై సరళ, లక్ష్మీ రాయ్, దేవదర్శిని, శ్రీమాన్ ప్రధాన పాత్రల్లో నటించారు.

దాదాపు 15 ఏళ్ల తర్వాత ఈ మూవీని మరోసారి ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. సరికొత్త 4కె వర్షన్‌లో ఈ సినిమాను రీ రిలీజ్ చేస్తున్నారు. ఈనెల 13న కాంచన థియేటర్లలో విడుదల కానుంది. ఈ చిత్రాన్ని హార్రర్- కామెడీ నేపథ్యంలో తెరకెక్కించారు.  ఈ చిత్రానికి అప్పట్లోనే రూ.7 కోట్ల బడ్జెట్‌తో రూపొందించారు.  ఈ మూవీ రీ రిలీజ్‌కు సంబంధించిన టికెట్స్ బుకింగ్స్ త్వరలోనే ప్రారంభం కానున్నాయి.  
 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement