టీమిండియా ముచ్చటగా మూడోసారి టీ20 వరల్డ్ కప్‌ను ముద్దాడింది. సూర్యకుమార్ యాదవ్ నేతృత్వంలోని టీమిండియా.. న్యూజిలాండ్‌ను చిత్తు చేసి విశ్వవిజేతగా నిలిచింది. దీంతో ఇండియా క్రికెట్ అభిమానులు సంతోషంలో మునిగిపోయారు. ఈ విజయాన్ని ప్రతి ఒక్కరు గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఈ గెలుపును తమకు నచ్చినట్లుగా పోస్టులు పెడుతూ ఎంజాయ్ చేస్తున్నారు.
తాజాగా ఈ విజయాన్ని పెద్ది డైరెక్టర్ బుచ్చిబాబు సనా సెలబ్రేట్ చేసుకున్నారు. ఇటీవల రిలీజైన పెద్ది సెకండ్ సింగిల్ రైరా రారా అంటూ సాగే పాటతో టీమిండియా వీడియోను షేర్ చేశారు. రైరా రారా అంటూ సాగే ఈ పాటకు టీమిండియా ఆటగాళ్లతో వీడియోను రూపొందించారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో రామ్ చరణ్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. కాగా.. రామ్ చరణ్-బుచ్చిబాబు కాంబోలో వస్తోన్న పెద్ది మూవీ ఏప్రిల్ 30న థియేటర్లలో సందడి చేయనుంది. ఈ చిత్రంలో జాన్వీ కపూర్ హీరోయిన్‌గా కనిపించనుంది.
🔥🔥🔥🔥🔥 pic.twitter.com/xLVcvmd1yM
— BuchiBabuSana (@BuchiBabuSana) March 8, 2026


