breaking news
Buchi Babu
-
ఆ మార్పే మ్యాజిక్ పెద్ది గాడి కలెక్షన్ల జాతర మొదలు!
-
పెద్దిలో కొత్త సీన్స్.. ఎన్ని నిమిషాలు.. థియేటర్లలో ఎప్పుడంటే?
రామ్ చరణ్ హీరోగా వచ్చిన పెద్ది ప్రస్తుతం థియేటర్లలో సందడి చేస్తోంది. జూన్ 4న ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ మూవీ ఇప్పటికే అరుదైన రికార్డ్ సాధించింది. ఈ ఏడాదిలోనే అత్యధిక వసూళ్లు సాధించిన సౌతిండియా సినిమాగా నిలిచింది. ఇప్పటికే ఈ మూవీ రూ.400 కోట్లకు పైగా వసూళ్లు సాధించి బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసింది.అయితే జాన్వీ కపూర్ సీన్స్‌పై వివాదం రావడంతో పెద్ది మేకర్స్ సరిదిద్దే ప్రయత్నం చేశారు. ఆ సీన్స్‌ను తొలగిస్తున్నట్లు ప్రకటించిన డైరెక్టర్ బుచ్చిబాబు కొత్త వాటిని యాడ్ చేస్తామని ప్రకటించారు. కానీ అవీ ఎప్పటి నుంచి అనేది మాత్రం క్లారిటీ ఇవ్వలేదు. తాజాగా ఈ విషయాన్ని పెద్ది మేకర్స్ అనౌన్స్ చేశారు. ఎన్ని నిమిషాల సీన్స్ కొత్తగా యాడ్ చేస్తున్నామనే విషయాన్ని ప్రకటించారు.పెద్ది అభిమానులకు మేకర్స్ సర్ప్రైజ్ ఇచ్చారు. ఈ మూవీ కొత్తగా దాదాపు ఐదు నిమిషాల 56 సెకన్ల పాటు కొత్త సన్నివేశాలు యాడ్ చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ సీన్స్ నేటి నుంచే థియేటర్లలో సందడి చేస్తాయని వెల్లడించారు. ఇప్పటికే కొత్త సన్నివేశాలకు సంబంధించిన సెన్సార్ కూడా పూర్తి కావడంతో పెద్ది మూవీకి లైన్ క్లియర్ అయింది. దీంతో గురువారం నుంచి అదనంగా వచ్చిన సన్నివేశాలతో పెద్ది రన్ కానుంది. దీంతో రామ్ చరణ్ ఫ్యాన్స్ మళ్లీ థియేటర్లకు క్యూ కట్టడం ఖాయంగా కనిపిస్తోంది.రూ. 500 కోట్ల క్లబ్లో పెద్ది..?ఇప్పటికే రూ.400 కోట్లకు పైగా వసూళ్లతో దూసుకెళ్తోన్న పెద్ది బాక్సాఫీస్ వద్ద మరో రికార్డ్ సాధించే అవకాశం కనిపిస్తోంది. ఇప్పుడు కొత్తగా సీన్స్ రావడంతో ఫ్యాన్స్ మళ్లీ థియేటర్లకు వెళ్లే ఛాన్స్ ఉంది. అందువల్లే మేకర్స్ కూడా పక్కా ప్లాన్‌తోనే ఈ సన్నివేశాలను కాస్తా ఆలస్యంగా థియేటర్లకు తీసుకొచ్చినట్లు తెలుస్తోంది. ఈ సన్నివేశాల కోసమైనా అభిమానులు, సినీ ప్రియులు మరోసారి పెద్దిని చూసేందుకు ఆసక్తి చూపిస్తారనడంలో ఎలాంటి సందేహం లేదు. అదే జరిగితే పెద్ది రూ.500 కోట్ల మార్క్ చేరుకోవడం పెద్ద కష్టమేమి కాదు. కాగా.. బుచ్చిబాబు దర్శకత్వం వహించిన ఈ రూరల్ స్పోర్ట్స్ డ్రామాలో జాన్వీ కపూర్ హీరోయిన్గా ఆకట్టుకుంది. The #Peddi experience gets better 🤩5 mins 56 seconds of new scenes will be added from tomorrow in theatres.🎟️ https://t.co/EMhY3eMGKq pic.twitter.com/N91oIPEYdR— PEDDI (@PeddiMovieOffl) June 17, 2026 -
పెద్దిలో కొత్త సీన్స్.. థియేటర్లలో ఎప్పుడంటే?
రామ్ చరణ్ హీరోగా వచ్చిన రూరల్ స్పోర్ట్స్ డ్రామా పెద్ది. ఈ మూవీ ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తోంది. తొలి రోజే పాజిటివ్ టాక్ అందుకున్న ఈ సినిమా రూ.400 కోట్ల మార్క్ దిశగా దూసుకెళ్తోంది. ఈ చిత్రంలో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్గా కనిపించింది. అయితే ఆమె రోల్ అచియ్యమ్మ పాత్రపై విమర్శలొచ్చాయి. జాన్వీ కపూర్ సీన్స్ అభ్యంతరకరంగా ఉన్నాయని విమర్శించారు. దీంతో జాన్వీ కపూర్‌పై సన్నివేశాలపై డైరెక్టర్ బుచ్చిబాబు క్షమాపణలు కూడా చెప్పారు. ఆ తర్వాత ఆ సీన్స్‌ను మూవీ నుంచి తొలగించారు.అయితే జాన్వీ కపూర్ సీన్స్ తొలగించిన పెద్ది మేకర్స్ మరి కొన్ని సన్నివేశాలను యాడ్ చేశారు. కొత్త వర్షన్లో జాన్వీ కపూర్ పాత్రపై రెండు సన్నివేశాలు, సీనియర్ నటుడు జగపతి బాబుకు సంబంధించిన ఓ సీన్ ఉంటుందని ప్రకటించారు. కొత్తగా సీన్స్ యాడ్ చేసి పెద్దిని థియేటర్లలో రన్ చేయనున్నారు. కొత్త సన్నివేశాలు ఈ నెల 17 నుంచి అందుబాటులోకి వస్తాయని మేకర్స్ ప్రకటించారు. సక్సెస్ మీట్లో బుచ్చిబాబు మాట్లాడుతూ.. "మేము ఇప్పటికే ఎడిటింగ్ పూర్తి చేశాం. ఈ బుధవారం నుంచి కొత్త సీన్స్ జోడిస్తాం. మేము మొత్తం మూడు సన్నివేశాలను చేర్చాం. హీరోయిన్‌కు సంబంధించిన సన్నివేశాలు.. అలాగే జగపతి బాబు కోసం ఓ సీన్ ఉంటుంది. ఈ సన్నివేశాలు అచియ్యమ్మ పాత్రకు మరింత భావోద్వేగ లోతును తీసుకొస్తాయి. జాన్వీ పాత్ర మరో స్థాయికి చేరుకుంటుందని నమ్ముతున్నా" అని బుచ్చి బాబు సానా అన్నారు. -
పెద్ది సక్సెస్.. బుచ్చి బాబు నెక్ట్స్ ప్రాజెక్ట్ స్టార్ హీరో అతడేనా?
పెద్ది డైరెక్టర్ బుచ్చిబాబు ప్రస్తుతం ఈ మూవీ సక్సెస్ ఎంజాయ్ చేస్తున్నారు. వరుస ఇంటర్వ్యూలతో తన ఆనందాన్ని పంచుకుంటున్నారు. పెద్ది కథకు కారణం గ్రామీణ క్రీడాకారులను బయటి తీసుకురావడమే తన ఉద్దేశమని తెలిపారు. ఈ విషయాన్ని మెగాస్టార్ చిరంజీవితో పంచుకున్నారు. రామ్ చరణ్‌తో సినిమా తీశా.. భవిష్యత్తులో మీరు కూడా అవకాశమిస్తే చేస్తానని చిరుతో బుచ్చిబాబు సరదాగా అన్నారు.అయితే పెద్ది హిట్ తర్వాత బుచ్చిబాబు ప్లాన్ నెక్ట్స్ ఏంటనేది ఆసక్తిగా మారింది. ఇంతకీ తదుపరి ప్రాజెక్ట్ కోసం ఎలా ముందుకెళ్తున్నారన్న ఇంట్రెస్ట్ నెలకొంది. ఈ నేపథ్యంలోనే బుచ్చికి సంబంధించి ఓ టాక్ టాలీవుడ్లో నడుస్తోంది. ఇటీవల హైదరాబాద్‌లో జరిగిన సక్సెస్ ఈవెంట్లో మహేశ్‌బాబుతో నెక్ట్స్ సినిమా చేస్తున్నారా? అని కొందరు ప్రశ్నించారు. కానీ దీనికి బుచ్చిబాబు రియాక్ట్ కాలేదు. ఎలాంటి కామెంట్స్ చేయలేదు.మహేశ్ బాబుతో పౌరాణిక చిత్రం ఏదైనా ప్లాన్ చేస్తున్నారా అని బుచ్చిబాబును మరోసారి అడిగారు. దీనికి స్పందిస్చూ సరైన సమయం కోసం వేచి చూద్దాం. పెద్దలు ఇక్కడ ఉన్నారు. కాలమే ఏదైనా నిర్ణయిస్తుందని హింట్ ఇచ్చారు. దీంతో తన నెక్ట్స్ ప్రాజెక్ట్ మహేశ్‌బాబుతోనే అని టాలీవుడ్ ఫ్యాన్స్ భావిస్తున్నారు. ఈ అరుదైన కాంబోపై అభిమానులలో మరింత ఆసక్తి పెరిగింది. అయితే ప్రస్తుతానికి ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు.కాగా.. మహేష్ బాబు ప్రస్తుతం ఎస్.ఎస్. రాజమౌళి దర్శకత్వంలో నటిస్తున్నారు. వీరిద్దరి కాంబోలో 'వారణాసి' మూవీ రానుంది.ఈ ప్రతిష్టాత్మక గ్లోబల్ యాక్షన్ అడ్వెంచర్ వచ్చే ఏడాది ఏప్రిల్ 7న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ చిత్రంలో ప్రియాంక చోప్రా జోనస్ హీరోయిన్గా నటిస్తున్నారు. అయితే రాజమౌళి సినిమా తర్వాత మహేష్ తన తదుపరి ప్రాజెక్ట్‌ను ఇంకా ప్రకటించలేదు. కానీ ఇండస్ట్రీలో మాత్రం సందీప్ రెడ్డి వంగా, సుకుమార్ లాంటి దర్శకుల పేర్లు తరచుగా వినిస్తున్నాయి. తాజాగా ఇప్పుడు ఆ జాబితాలో బుచ్చి బాబు కూడా చేరారు. మరి ఎవరికీ ఓకే చెబుతాజో మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే. -
రామ్ చరణ్ తో మరో మూవీ..?
-
'పెద్ది' వివాదం.. బుచ్చిబాబు సారీ చెప్పడం నచ్చలేదు
రామ్ చరణ్ 'పెద్ది' సినిమా భారీ అంచనాలతో థియేటర్లలోకి వచ్చింది కానీ దానికి తగ్గట్లే ఫెర్ఫార్మెన్స్ ఇవ్వలేకపోయింది. సినిమాలోని హీరోయిన్ జాన్వీ కపూర్‌ని చూపించిన విధానం దగ్గర నుంచి హీరో పాత్ర పలికే డైలాగ్స్, చేసే పనులపై కూడా విమర్శలు వచ్చాయి. మరీ ముఖ్యంగా ఐటం సాంగ్ లిరిక్స్ కూడా మరీ దారుణంగా ఉన్నాయనే ట్రోల్స్ కనిపించాయి. ఇప్పుడీ విషయంపై సదరు లిరిక్ అనంత శ్రీరామ్ స్పందించాడు. ఆదివారం 'పెద్ది' సక్సెస్ మీట్లో విమర్శకులకు కౌంటర్ ఇచ్చాడు.(ఇదీ చదవండి: పేరు మార్చుకున్న రష్మిక.. కొత్త పేరు ఇదే!)'పీహెచ్‌డీలు, పట్టభద్రులు.. వాళ్ల ఆలోచన విధానమే సరైనది అనేది ఎక్కువైపోవడం వల్ల, సోషల్ మీడియాలో కొందరు తన అభిప్రాయాన్ని రుద్దేశారు. అలా ప్రభావితం అవ్వడం తప్ప.. దర్శకుడికి ఓ పాత్ర ఇలా ప్రవర్తిస్తాది అనే స్వేచ్ఛ కూడా ఇవ్వకపోతే మనం సృజనాత్మకతకు ఏం చేసినట్లు? ముట్టేస్తానని హీరో పాత్రధారి తన ట్రైబ్ భాషలో మట్లాడితేనేమో వల్గారిటీ అంటారు. ఇలా చేస్తే సృజనాత్మకతకని తొక్కినట్లే. ఎవరినీ బాధపెట్టకూడదనే ఉద్దేశంతో బుచ్చిబాబు సారీ చెప్పి ఉండొచ్చు. ఇలా జరుగుతూపోతే రాబోయే రోజుల్లో డాక్యుమెంటరీలో తప్పితే కమర్షియల్ సినిమాల్లో గొప్ప పాయింట్ చెప్పలేం' అని గేయ రచయిత అనంత్ శ్రీరామ్ చెప్పారు.అలానే ఐటమ్ సాంగ్‌లోని వారానికి వెయ్యి, నాకోసం దాయి లాంటి లిరిక్స్‌పై వస్తున్న విమర్శలకు బదులిస్తూ.. ఐటమ్ సాంగ్ ఆస్వాదించలేని వాళ్లే అసలైన ఐటమ్ గాళ్లు అని అనంత్ శ్రీరామ్ విమర్శించారు. ఇందుకు సంబంధించిన వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.(ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు థ్రిల్లర్ సినిమా)Lyricist Anantha Sriram counters social media warriors & so called progressive audience. pic.twitter.com/3mxy02S6fE— Aakashavaani (@TheAakashavaani) June 14, 2026 -
'పెద్ది కథ వెనక నా అసలు ఉద్దేశం అదే'.. డైరెక్టర్ బుచ్చిబాబు
పెద్ది మూవీ కథపై డైరెక్టర్ బుచ్చిబాబు ఆసక్తికర కామెంట్స్ చేశారు. ఈ సినిమాతో మేము చెప్పాలనుకున్న ఉదేశం అదేనని వెల్లడించారు. చిరంజీవితో చిట్ చాట్ సందర్భంగా పెద్ది కథ చెప్పడం వెనక ఉన్న ఉద్దేశమేంటో తెలిపారు. ఈ జనరేషన్‌కు ఆదర్శంగా నిలవాలనే ఈ కథ చేశానని బుచ్చిబాబు చెప్పారు. పిల్లలకు స్కూల్లో కేవలం బిల్డింగ్స్ మాత్రమే కాదు.. వెనక గ్రౌండ్ కూడా ఉండాలన్నదే నా ఉద్దేశమన్నారు.దీనిపై మెగాస్టార్ కూడా మాట్లాడారు. కార్పొరేట్ విద్యావ్యవస్థ వచ్చినప్పటి నుంచి ఎంతసేపు మార్కులు, మార్కులు అంటున్నారని చిరంజీవి అన్నారు. ఈ రోజుల్లో పిల్లలకు ఫిజికల్ యాక్టివిటీస్ లేకుండా పోయాయన్నారు. ఇక నుంచైనా పిల్లలకు క్రీడల కోసం సరైన వసతులు కల్పించాలని ప్రభుత్వాలను కోరారు. గ్రామీణ ఆటగాళ్లను బయటకు తీయడానికి ప్రభుత్వాలు సహకరించాలని మెగాస్టార్ విజ్ఞప్తి చేశారు. పెద్ది సినిమాలో ఇదే మెసేజ్ ఇచ్చారని.. ఈ విషయంలో నాకు చాలా సంతృప్తిగా ఉందని చిరు తెలిపారు. -
పెద్ది చూసి సురేఖ ఏం చెప్పిందంటే
-
పెద్ది టీమ్‌కు మెగా ప్రశంసలు
రామ్ చరణ్ పెద్ది టీమ్‌ను మెగాస్టార్ చిరంజీవి అభినందించారు. ఈ సినిమా సూపర్ హిట్ కావడంపై చిరు ఆనందం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పెద్ది డైరెక్టర్ బుచ్చిబాబుపై ప్రశంసలు కురిపించారు. దీనికి సంబంధించిన ఫోటోలను పెద్ది టీమ్ ట్విటర్లో పంచుకుంది.రామ్ చరణ్- బుచ్చిబాబు కాంబోలో వచ్చిన రూరల్ స్పోర్ట్స్ డ్రామా ప్రస్తుతం థియేటర్లలో సందడి చేస్తోంది. జూన్ 4న రిలీజైన ఈ మూవీ ఇప్పటి వరకు రూ.345 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. ఈ చిత్రంలో రామ్ చరణ్ సరసన జాన్వీ కపూర్ హీరోయిన్గా కనిపించింది. ఈ మూవీలో జగపతిబాబు అప్పలసూరి పాత్రలో మెప్పించారు. కన్నడ సూపర్‌స్టార్ శివరాజ్‌కుమార్, బోమన్ ఇరానీ కీలక పాత్రలు పోషించారు. A MEGA APPRECIATION 💥Megastar @KChiruTweets Garu congratulated and appreciated team #Peddi on the blockbuster success of the film ❤️#PEDDI Now In Cinemas 💥https://t.co/EMhY3eMGKq pic.twitter.com/0aN2EgDNtD— PEDDI (@PeddiMovieOffl) June 12, 2026 -
Buchi Babu: పెద్ది పై కావాలనే నెగిటివిటీ
-
జాన్వీ అందాలు...! సారీ చెప్పిన డైరెక్టర్ బుచ్చి బాబు
-
పెద్ది సినిమాపై అల్లు అర్జున్ రివ్యూ
బుచ్చిబాబు దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా నటించిన ‘పెద్ది’ చిత్రం బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తోంది. ఈ నెల 4న విడుదలైన ఈ చిత్రం కేవలం నాలుగు రోజుల్లోనూ రూ. 292.5 కోట్లు వసూలు చేసి రికార్డు సృష్టించింది. సినిమా చూసిన ప్రతి ఒక్కరు రామ్ చరణ్ నటనపై ప్రశంసలు కురిపిస్తున్నాయి. అయితే టాలీవుడ్ స్టార్స్ మాత్రం ఈ సినిమాపై నిన్నటి వరకు స్పందించలేదు. తాజాగా అల్లు అర్జున్ పెద్ది సినిమాపై తన రివ్యూ ఇచ్చాడు. నిన్న రాత్రి సినిమా చూసిన ఆయన ఈ రోజు ట్విటర్ వేదికగా తన అభిప్రాయాన్ని వెల్లడించాడు. (పెద్ది సినిమా రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)‘నిన్న రాత్రి పెద్ది సినిమా చూశా. రామ్ చరణ్ నటన మైండ్ బ్లోయింగ్. ఆయన బాడీ ట్రాన్స్ఫర్మేషన్, నటన,అదిరిపోయే స్టెప్పులు.. ఇలా ప్రతి విషయంలోనూ అద్భుతంగా రాణించాడు. నా బ్రదర్‌ని చూసి నిజంగా ఎంతో గర్వంగా ఫీలవుతున్నా. ఈ ప్రశంసలన్నింటికి చరణ్ నిజమైన అర్హుడు. జగపతి బాబుతో పాటు ఇతర నటీనటులు చాలా బాగా నటించారు. జాన్వీ కపూర్‌కి ప్రేమపూర్వక అభినందనలు. టెన్నికల్ టీమ్‌కు, నిర్మాతలకు నా అభినందనలు. చరణ్‌ను అత్యున్నత స్థాయిలో కూర్చోబెట్టేలా చేసిన దర్శకుడు బుచ్చిబాబుకి ప్రత్యేక అభినందనలు’ అని బన్నీ తన ఎక్స్‌లో రాసుకొచ్చాడు.పెద్ది విషయానికొస్తే.. బుచ్చిబాబు సానా దర్శకత్వంలో రామ్‌చరణ్, జాన్వీకపూర్ జోడీగా నటించిన ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సమర్పణలో వృద్ధి సినిమాస్‌పై వెంకట సతీష్ కిలారు నిర్మించారు. ఏఆర్ రెహమాన్ సంగీతం అందించారు. Watched #Peddi last night. Mind-blowing performance by my dear @AlwaysRamCharan. A Gritty, raw performance, extraordinary body transformation, and graceful dance moves. He absolutely aced it in every aspect. Genuinely very proud of my brother. Truly deserves every bit of the…— Allu Arjun (@alluarjun) June 9, 2026 -
పెద్ది.. ఎంతపని చేశావ్ బుచ్చిబాబు?
గ్లింప్స్‌తోనే అంచనాలు పెంచేసిన రామ్‌చరణ్ పెద్ది వరల్డ్ వైడ్ గ్రాండ్‌గా రిలీజైన విషయం తెలిసిందే..! గేమ్ ఛేంజర్ లాంటి డిజాస్టర్ తర్వాత చెర్రీ నుంచి వచ్చిన పాన్ ఇండియా మూవీ ఇది. ఉప్పెన లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత ఐదేళ్ల గ్యాప్‌తో బుచ్చిబాబు తీసిన సినిమా కూడా ఇదే. చాలా కాలం తర్వాత ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ కంపోజ్ చేసిన తెలుగు మూవీ ఇదే కావడం మరో ప్రత్యేకం. ఈ సినిమాకు థియటర్లలో ఇప్పటి వరకూ ఐతే.. ఓకే అనే ఫీడ్‌బ్యాక్ వస్తోంది. స్టోరీ అద్భుతం కాకపోయినా.. మేకింగ్, రామ్‌చరణ్ యాక్టింగ్, మేకోవర్, ఏఆర్ రెహ్మాన్ మ్యూజిక్, టెక్నికల్ వాల్యూస్ సినిమాను గట్టెక్కించిందనే టాక్ వినిపిస్తోంది.కాగా.. రిలీజ్‌కు ముందు తానేదో సొంతంగా స్టోరీ తయారు చేసుకుని తీసిన అద్భుతమైన సినిమా అని బుచ్చిబాబు బిల్డప్ ఇచ్చారు. కానీ.. రెండేళ్ల క్రితం బాలీవుడ్లో వచ్చిన చందు ఛాంపియన్ సినిమాను కొంచెం అటుఇటు తిప్పి తీసిన సినిమా పెద్ది అని టాలీవుడ్ జనాలు తొలి రోజే కనిపెట్టేశారు. చందు ఛాంపియన్ మూవీ చూసిన వారికి ఖచ్చితంగా పెద్ది రీమేక్ మూవీనా అనే డౌట్ రాక మానదు. ఇందులో కార్తీక్ ఆర్యన్ హీరో. స్టార్ డైరక్టర్ కబీర్‌ఖాన్ డైరక్షన్లో వచ్చిన ఈ మూవీ రెండేళ్ల క్రితం సరిగ్గా ఇదే సమ్మర్లో రిలీజైంది. ఐతే.. ఇది ఓ క్రీడాకారుడి రియల్ స్టోరీ అని మేకర్స్ ప్రకటించారు.(చదవండి: పెద్ది మూవీ రివ్యూ)చందు ఛాంపియన్ కూడా పీరియాడిక్ మూవీనే. 1960-70లో జరిగిన ఓ బాక్సర్ స్టోరీ ఇది. సేమ్ పెద్దిలో లాగానే ఓ మారుమూల గ్రామం నుంచి వచ్చిన పహిల్వాన్ కథ. పెద్దిలో హీరో తొలుత క్రికెటర్, తర్వాత పహిల్వాన్, ఆ తర్వాత పారా స్ప్రింటర్‌గా మారతాడు హీరో. చందు ఛాంపియన్‌లోనూ ఇంతే. ఇందులో హీరో తొలుత కుస్తీ వీరుడుగా కనిపిస్తాడు. ఆ తర్వాత మిలటరీలో చేరి బాక్సర్‌గా అవతారమెత్తుతాడు. అక్కడ యుద్ధంలో బుల్లెట్ తగిలి కాలు పోవడంతో స్విమ్మర్‌గా మారి పారా ఒలిపింక్స్‌లో పాల్గొని సత్తా చాటుతాడు. సేమ్ మన పెద్దిలో కూడా హీరో మొదట క్రికెటర్‌గా.. ఆ తర్వాత పహిల్వాన్‌గా.. అక్కడ్నుంచి రన్నర్‌గా మారి పారా ఒలింపిక్‌లో పాల్గొంటాడు. పెద్ది లాగా ఇది కూడా పీరియాడిక్ మూవీనే. అంతెందుకు చివరికి ప్రోమో కటింగ్ కూడా చందు ఛాంపియన్‌నే రెఫరెన్స్‌గా తీసుకున్నట్టు కనిపిస్తుంది. కాకపోతే పెద్ది స్టోరీకి విలేజ్ బ్యాక్‌డ్రాప్‌ను తగిలించి ఫుల్లుగా ఎమోషన్స్ పండించాడు బుచ్చిబాబు. అలాగే కేజీఎఫ్‌లో హీరోకి ఎలివేషన్ ఇస్తూ ముక్కలుముక్కులుగా చెప్పడం జరిగింది. చందు ఛాంపియన్‌ను మక్కీకి మక్కీ దించేయకుండా రెఫరెన్స్‌గా తీసుకోవడం వరకు బానే ఉందిగాని.. పెద్ది చూసిన వెంటనే ఆ సినిమా ఖచ్చితంగా గుర్తుకు వస్తుందంటూ సోషల్ మీడియాలో కామెంట్లు పేలుతున్నాయి. -
'ఆయనను చూస్తే నా కళ్లలో నీళ్లు తిరిగాయి'.. రామ్ చరణ్ ఎమోషనల్
పెద్ది మూవీ సక్సెస్‌తో రామ్ చరణ్ ఆనందం వ్యక్తం చేశారు. ఇవాళ హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన థ్యాంక్ యూ మీట్లో పాల్గొన్న రామ్ చరణ్ తాము పడ్డ కష్టాన్ని పంచుకున్నారు. ఈ సినిమా కోసం టీమ్ అంతా సమష్టిగా కృషి చేశామని తెలిపారు. నిజాయతీగా, మనస్ఫూర్తిగా పని చేస్తే ఏ సినిమా అయినా హిట్ కావాల్సిందేనని అన్నారు. ఇంతటి ఘనవిజయం అందించిన అభిమానులకు, ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలిపారు.రామ్ చరణ్ మాట్లాడుతూ..' నచ్చిన పని చేస్తూ మీ అందరి ప్రేమ పొందడం ఆశ్చర్యంగా ఉంది. ఇది ఎవరో పుష్ చేస్తే చేసిన సినిమా కాదు. బుచ్చిబాబు చెప్పిన కథను నమ్మి చేశా. ఈ విషయంలో నేను చాలా సంతృప్తిగా ఉన్నా. చాలా రోజుల తర్వాత నేను థియేటర్లలో సినిమా చూశా. నేను ఊహించని సీన్స్‌కు కూడా ప్రేక్షకులు చప్పట్లు కొట్టడం చాలా ఆనందం కలిగించింది. ఇంత మంచి హిట్ అందించిన బుచ్చిబాబుకు, పెద్ది టీమ్‌కు థాంక్స్. నా లైబ్రరీలో నంబర్‌వన్‌గా పెద్ది నిలుస్తుంది. తొలిసారి ఈ కథ విన్నప్పుడే బుచ్చిబాబును హగ్ చేసుకున్నా. నిజాయతీగా పని చేస్తే ఏదైనా హిట్ కావాల్సిందే. పెద్ది సినిమాలో జగపతి బాబుని చూసినప్పుడు.. ఒక ఆర్టిస్ట్‌గా నా కళ్లలో నీళ్లు తిరిగాయి' అని అన్నారు.కాగా.. బుచ్చిబాబు- రామ్ చరణ్ కాంబోలో పెద్ది మూవీని తెరకెక్కించారు. శ్రీకాకుళం బ్యాక్‌డ్రాప్‌లో రూరల్ స్పోర్ట్స్ డ్రామాగా ఈ సినిమాను తెరకెక్కించారు. ఈ చిత్రంలో బాలీవుడ్ భామ జాన్వీ కపూర్ హీరోయిన్గా మెప్పించింది. జగపతిబాబు, శివరాజ్‌కుమార్ కీలక పాత్రలు పోషించారు. ఈ మూవీకి ఏఆర్ రెహమాన్ సంగీతం మరింత క్రేజ్‌ను తీసుకొచ్చింది. జూన్ 4న థియేటర్లలో రిలీజైన ఈ సినిమా ఇప్పటి వరకు రూ.292 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. -
'మోదీ ఆలోచనే పెద్దికి ఆదర్శం'.. బుచ్చిబాబు ఆసక్తికర కామెంట్స్
రామ్ చరణ్ హీరోగా వచ్చిన పెద్ది ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తోంది. తొలిరోజే పాజిటివ్ టాక్ అందుకున్న ఈ సినిమా వసూళ్లపరంగా దూసుకెళ్తోంది. ఈ నెల 4న విడుదలైన ఈ చిత్రం ఇప్పటికే రూ. 292 కోట్లకు పైగా వసూళ్లను సాధించి సరికొత్త రికార్డును సృష్టించింది. ఈ సినిమాకు ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు సనా దర్శకత్వం వహించారు. శ్రీకాకుళం బ్యాక్‌డ్రాప్‌లో రూరల్ స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కించారు. ఈ మూవీలో చెర్రీ సరసన బాలీవుడ్ భామ జాన్వీ కపూర్ హీరోయిన్గా నటించింది.తాజాగా పెద్ది టీమ్ హైదరాబాద్‌లో థ్యాంక్ యూ మీట్ నిర్వహించింది. ఈ ఈవెంట్‌కు డైరెక్టర్ బుచ్చిబాబుతో పాటు హీరో రామ్ చరణ్ కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా దర్శకుడు బుచ్చిబాబు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. పెద్ది మూవీ కథకు స్ఫూర్తి ఏంటనే విషయాన్ని రివీల్ చేశారు. ఇది ఒక ఆదర్శమైన కథ అని తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లోని క్రీడాకారులను బయటి ప్రపంచానికి పరిచయం పెద్ది మూవీ ఉద్దేశమని బుచ్చిబాబు అన్నారు. 2017లో ప్రధాని నరేంద్ర మోదీ తీసుకొచ్చిన ఖేలో ఇండియానే పెద్ది కథకు స్ఫూర్తి అని తెలిపారు. మట్టిలో ఆటగాళ్లను వెతుకుదాం.. ఓట్లలాగే ఇంటింటికి వెళ్లి ఆటగాళ్లను కూడా అడుక్కుందాం అనే ఉద్దేశంతో ఈ పథకాన్ని ప్రవేశపెట్టారు. ఇండియాకు మెడల్స్ తీసుకొచ్చేలా గ్రామీణ మారుమూల ప్రాంతాల్లోని క్రీడాకారులను ప్రోత్సహించడమే ఖేలో ఇండియా ఉద్దేశమన్నారు. భారత జీవన విధానంలోనే ఆట కూడా ఓ భాగమని చెప్పాలనుకున్నా.. అందుకే పెద్దిని మీ ముందుకు తీసుకొచ్చానని అన్నారు. పెద్ది అనేది కమర్షియల్ చిత్రం కాదన్నారు. ఈ మూవీ గ్రామీణ క్రీడాకారుందరికీ ఆదర్శమని బుచ్చిబాబు తెలిపారు. -
‘పెద్ది’ కాంట్రవర్సీ.. జాన్వీని టార్గెట్ చేయొద్దు: జగపతి బాబు
రామ్ చరణ్ తాజా చిత్రం ‘పెద్ది’ బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తోంది. ఈ నెల 4న విడుదలైన ఈ చిత్రం ఇప్పటికే రూ. 292 కోట్లకు పైగా వసూళ్లను సాధించి..రికార్డును సృష్టించింది. మరోవైపు అదే స్థాయిలో పెద్దిపై విమర్శలు వస్తున్నాయి. ఈ సినిమాలో జాన్వీ కపూర్ పాత్రను చూపించిన తీరుపై నెటిజన్స్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సాధారణ మహిళలే కాదు సినీ తారలు కూడా జాన్వీ పాత్రను తీర్చిదిద్దిన విధానంపై అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే నిత్యా మీనన్, డింపుల్ హయాతీ, అషికా లాంటి తారలు ఈ వివాదంపై స్పందిస్తూ.. సినిమాల్లో హీరోయిన్లను గ్లామర్ బొమ్మలా చూపిండాన్ని తప్పుపట్టారు. తాజాగా పెద్ది సినిమాలో కీలక పాత్ర పోషించిన సీనియర్ నటుడు జగపతి బాబు కూడా ఈ వివాదంపై స్పందించాడు. సినిమా క్యారెక్టరైజేషన్ విషయంలో నటీనటులను వ్యక్తిగతంగా ట్రోల్ చేయడం ఏమాత్రం సరికాదంటూ జాన్వీకి అండగా నిలిచాడు. తాజాగా ఆయన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ‘సినిమా విషయంలో ఆర్టిస్టులను ట్రోల్ చేయొద్దు. పాపం ఆ అమ్మాయి(జాన్వీ కపూర్) జోలికి వెళ్లడం కరెక్ట్ కాదు. తాను సొంతంగా అలా చేయలేదు కాదా? దర్శకుడు ఇలా చెయ్ అంటేనే ఆమె చేస్తుంది. ఇష్టం ఉందో లేదో మనకేమి తెలియదు కానీ దర్శకుడిని నమ్మి వచ్చినప్పుడు.. ఆయన మాట వినాలి. డైరెక్టర్ చెప్పింది చేస్తాం. తన జస్టిఫికేషన్ తనకు ఉంది. కానీ కొన్నిసార్లు అది మిస్ ఫైర్ అవుతుంది. ఈ విషయంలో నేను జాన్వీకపూర్‌కు సపోర్ట్ చేస్తాను. తనను వ్యక్తిగతంగా టార్గెట్ చేయొద్దు. ట్రోల్ చేసి మానసికంగా ఇబ్బంది పెట్టడం కరెక్ట్ కాదు’ అని జగపతి బాబు అన్నాడు.ఇక తాను పోషించిన అప్పల సూరి పాత్రకు వచ్చిన రెస్పాన్స్ గురించి మాట్లాడుతూ.. పెద్ది’ విడుదలయ్యాక నాకు ఓ పెద్ద డైరెక్టర్ ఫోన్ చేశారు. ‘‘పెద్ది’లో మీరు చాలా గొప్ప పాత్ర చేసినా ఎందుకు ఎవరూ గుర్తించట్లేదు. అదే పాత్రను వేరే భాషకు చెందిన నటులు చేసి ఉంటే బాగా హైలైట్ చేసేవారు. వాళ్లకు 20 సినిమాలు ఆఫర్ చేసేవారు. మిమ్మల్ని ఎవరూ పట్టించుకోవట్లేదు ఏంటి?’ అని అన్నారు. ఏ ఇండస్ట్రీలో అయినా పరభాష నటులకు ఎక్కువ గౌరవం ఇస్తారు. నేను కన్నడలో చేస్తే అక్కడ బాగా గౌరవిస్తారు. పెద్ది సినిమా కోసం నేను ప్రాణం పెట్టాను. అందుకే గుర్తింపు కోసం అడిగే హక్కు నాకు ఉంది. మిగతా సినిమాలకు నేను ఎప్పుడూ ఇలా అడగలేదు. ‘పెద్ది’ ఇంకా ఆదరణ దక్కాల్సిన చిత్రం. కచ్చితంగా ఆదరణ దక్కుతుంది. ఇందులో పనిచేసిన ప్రతిఒక్కరూ దీన్ని చూసి గర్వంగా ఫీల్ అవుతారు’ అని అన్నారు. -
పెద్దిలో జాన్వీ సీన్లు కట్..! సారీ చెప్పిన బుచ్చిబాబు..
-
'పెద్ది' వివాదంలో మరో మలుపు.. జాన్వీ కపూర్ చాట్ లీక్?
'పెద్ది' సినిమా వచ్చింది. చూసినవాళ్లు మరీ సూపర్ కాకపోయినా ఓ మాదిరిగా బాగానే ఉందంటున్నారు. హీరోయిన్ జాన్వీ కపూర్ సీన్స్ గురించి మాత్రం ఎడతెగని చర్చ నడుస్తోంది. మరీ దారుణమైన యాంగిల్స్‌లో ఈమెని చూపించారని, ఈమె పాత్రకు అనుమతి లేకుండా హీరో ముద్దు పెట్టుకోవడం లాంటి సీన్స్పైనా విమర్శలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే దర్శకుడు బుచ్చిబాబు కూడా సారీ చెప్పేశాడు. దీంతో సమస్య ముగిసిపోయిందని అంతా అనుకున్నారు. కానీ జాన్వీ కపూర్ గతంలో ఓ అభిమానితో 'పెద్ది'లో సన్నివేశాల గురించి చాట్ చేసిందంటూ ఇప్పుడు ఒకటి వైరల్ అవుతోంది.(ఇదీ చదవండి: రెండో రోజుకే దారుణంగా పడిపోయిన 'పెద్ది' కలెక్షన్)వైరల్ అవుతున్న చాట్ ప్రకారం.. 'పెద్ది' షూటింగ్ టైంలోనే తనని చూపించిన కెమెరా యాంగిల్స్ పట్ల జాన్వీ కపూర్ అసౌకర్యం వ్యక్తం చేసిందట. మరీ ముఖ్యంగా తన శరీరాన్ని జూమ్ చేసి చూపించే సన్నివేశాల్ని సినిమాలో ఉపయోగించొద్దని కూడా మూవీ టీమ్‌ని కోరిందట. తాను ఎందుకు అసౌకర్యానికి గురువుతున్నానో కూడా పలుమార్లు చెప్పే ప్రయత్నం చేసిందట. ఈ విషయంలో తనకు రామ్ చరణ్ మద్దతుగా నిలిచాడని, ఆయన కూడా కొన్ని కెమెరా యాంగిల్స్ పట్ల అభ్యంతరం వ్యక్తం చేశారని అందులో ఉంది. ఈ చాట్ గతేడాది అక్టోబరులో జరిగినట్లు కూడా సదరు వీడియోలో ఉంది. మరి ఇది నిజమా కాదా అనేది తెలియాల్సి ఉంది.'పెద్ది' రిలీజ్ తర్వాత జాన్వీ కపూర్ చేసిన అచ్చియమ్మ పాత్రపైనే దాదాపు చాలామంది ప్రేక్షకులు అసంతృప్తి వ్యక్తం చేశారు. యాక్టింగ్ కంటే అందచందాల ప్రదర్శన కోసమే ఈమెని తీసుకున్నారా అని సోషల్ మీడియాలో తెగ ట్రోల్ చేస్తున్నారు. జాన్వీ పాత్ర తీరుతెన్నులపై పలువురు సెలబ్రిటీలు కూడా పరోక్షంగా పోస్టులు పెట్టారు. ఏదేమైనా ఈ సినిమాకు వచ్చిన పాజిటివిటీ అంతా కూడా జాన్వీ పాత్ర వల్ల నెగిటివ్‌గా మారిపోయిందని చెప్పొచ్చు.(ఇదీ చదవండి: హీరోయిన్లకు ‘క్యారెక్టర్’ అక్కర్లేదా?)#janhvikapoor #Ramcharan #peddiPr game 🎯 pic.twitter.com/y5Jn6ZgGuI— C FOR CINEMA (@cforcinemaaa) June 6, 2026 -
‘పెద్ది’ వివాదం.. అనసూయ సంచలన పోస్ట్
పెద్ది సినిమాలో జాన్వీ కపూర్ పాత్రపై విమర్శలు వెల్లువెత్తుతున్న సంగతి తెలిసిందే. తెరపై ఆమెను చూపించిన తీరుపై, కొన్ని సీన్లపై మహిళలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. దీంతో దర్శకుడు బుచ్చిబాబు క్షమాపణలు చెబుతూ.. ఆ సన్నివేశాలను తొలగిస్తున్నామని చెప్పారు. ప్రస్తుతం నెట్టింట దీనిపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్న వేళ.. తాజాగా నటి, యాంకర్ చేసిన ఓ పోస్ట్ ఇప్పుడు సంచలనంగా మారింది. సినిమా అనేది కేవలం ఒక కల్పిత కథ మాత్రమేనని, అందులోని మంచి చెడులను నిర్ణయించుకునే పూర్తి విచక్షణ ప్రేక్షకులకే ఉంటుందని అనసూయ అన్నారు. సమాజంలో జరిగే ప్రతి విషయానికి సినిమాలను ముడిపెట్టకూడదని ఆమె అభిప్రాయపడ్డారు. చిత్రరంగంలో ఉండాల్సిన సామాజిక బాధ్యత, సృజనాత్మక స్వేచ్ఛ గురించి ఆమె సోషల్ మీడియా వేదికగా ఒక సుదీర్ఘమైన పోస్ట్ పెట్టారు.ఒకప్పుడు నైతికత..ఇప్పుడు గందరగోళం‘ఒకప్పటి సినిమాల్లోని కథలలో నైతికత కనిపించేది. హీరో పాత్రలు స్ఫూర్తిదాయకంగా, విలన్ పాత్రలు మనం అనుకరించకూడదనే విధంగా ఉండేవి. కానీ, ఈ రోజుల్లో వచ్చే కథల్లో ఆ స్పష్టత లోపిస్తోంది. కేవలం పాత్రను గొప్పగా చూపించడం కోసమే దర్శకులు ఈ విధమైన గందరగోళాన్ని సృష్టిస్తున్నారు. ఒక కథను తెరకెక్కిస్తున్నప్పుడు సమాజంపై దాని ప్రభావం ఎలా ఉంటుందనే విషయంలో.. సాంకేతిక నిపుణుల నుంచి దర్శక నిర్మాతలు, నటీనటులు, చివరకు ప్రేక్షకుల వరకు ప్రతి ఒక్కరూ కీలక పాత్రధారులే. అందుకే సినిమా ఎప్పుడూ బాధ్యతాయుతంగా ఉండాలి.నేను కూడా ఇబ్బందులు ఎదుర్కొన్నా..నేను కూడా గతంలో సృజనాత్మకత విషయంలో వచ్చిన భేదాభిప్రాయాల వల్లే కొన్ని షోల నుంచి తప్పుకున్న సందర్భాలు ఉన్నాయి. దానివల్ల నా ప్రతిభకు తగిన అవకాశాలు రావడంలో ఇబ్బందులు ఎదురయ్యాయి. అయినప్పటికీ సిద్ధాంతాల కోసమే నిలబడ్డాను.ప్రతి తప్పుకూ సినిమాను మాత్రమే నిందించడం సరికాదుసినిమాలకు సృజనాత్మక స్వేచ్ఛ ఎంత అవసరమో, సామాజిక స్పృహ ఉండటం కూడా అంతే ముఖ్యం. సినిమాలు సమాజాన్ని మంచి మార్గంలో నడిపిస్తాయని ఆశించకూడదు. అలాగని, అవి సమాజంపై ఎలాంటి ప్రభావం చూపవని కూడా అనుకోలేం. సమాజంలో జరిగే ప్రతి తప్పుకూ సినిమాను మాత్రమే నిందించడం సరికాదు. ప్రస్తుతం సోషల్ మీడియాలో చాలామంది ఇలాంటి విషయాలపై చర్చలు జరపడం, కథల్లో పాత్రలను చూపించే విధానాలను ప్రశ్నించడం, విమర్శనాత్మకంగా ఆలోచించడం వంటివి చూస్తుంటే తనకు సంతోషంగా ఉంది. అవసరమైనప్పుడు తప్పులను ప్రశ్నించడం అంటే సృజనాత్మకతపై దాడి చేయడం కాదు, అది సమాజంలో అవగాహన పెంచడమే. నేను ఎవరినీ వ్యక్తిగతంగా నిందించడం లేదు. ఈ చిత్ర పరిశ్రమ అనే వ్యవస్థలో మనమంతా భాగమేనని గుర్తుచేయడమే నా ఉద్దేశం. ఇకనైనా క్రియేటర్స్, నటీనటులు, దర్శకనిర్మాతలు, ఇన్ఫ్లుయెన్సర్లు, ఆడియన్స్ మరింత సామాజిక స్పృహతో, బాధ్యతాయుతంగా కంటెంట్‌ను రూపొందిస్తారని ఆశిస్తున్నాను’ అని అనసూయ తన పోస్టులో రాసుకొచ్చింది.🙏🏻 pic.twitter.com/gfQfdsaLV4— Anasuya Bharadwaj (@anusuyakhasba) June 6, 2026 -
పెద్ది.. అప్పటి నుంచి నా ఫోన్ రింగ్ అవడం ఆగలేదు : బుచ్చిబాబు
‘‘బుచ్చిబాబు రాసిన ‘పెద్ది’ కథలో మా హీరో రామ్ చరణ్‌గారు అద్భుతంగా నటించారు. సినిమా చూసిన ప్రతి ఒక్కరూ ఆయన నటన గురించే మాట్లాడుకుంటున్నారు. చరణ్‌గారి పెర్ఫార్మెన్స్ న భూతో న భవిష్యతి. మిగతా నటీనటులందరూ కూడా బాగా నటించారు’’ అని నిర్మాత వై. రవిశంకర్ (మైత్రి మూవీ మేకర్స్) తెలిపారు.రామ్ చరణ్, జాన్వీ కపూర్ జోడీగా నటించిన చిత్రం ‘పెద్ది’. బుచ్చిబాబు సానా దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సమర్పణలో వృద్ధి సినిమాస్‌పై వెంకట సతీష్ కిలారు నిర్మించిన ఈ చిత్రం గురువారం విడుదలైంది. శుక్రవారం నిర్వహించిన ‘బాక్సాఫీస్ ఛాంపియన్’ సక్సెస్ ప్రెస్మీట్లో వై. రవిశంకర్ మాట్లాడుతూ–‘‘తెలుగు సినిమాల్లో ఇప్పటివరకు చూడని విధంగా మల్టిపుల్ స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్‌లో రూపొందిన సినిమా ‘పెద్ది’. పిల్లలకు ఈ సినిమా ఎంతో ఉపయోగపడుతుంది’’ అని పేర్కొన్నారు.వెంకట సతీష్ కిలారు మాట్లాడుతూ– ‘‘పెద్ది’ తొలి రోజే రూ. 135 కోట్లకు పైగా వసూలు చేసింది. ప్రేక్షకుల నుంచి, ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియన్స్ నుంచి వస్తున్న స్పందన అద్భుతంగా ఉంది. ఇది రామ్ చరణ్‌గారి కెరీర్లోనే బెస్ట్ సినిమా. ఆ స్థాయిలో ఓపెనింగ్స్ వచ్చాయి’’ అని తెలిపారు. బుచ్చిబాబు మాట్లాడుతూ– ‘‘పెద్ది’ విడుదలైనప్పటి నుంచి నా ఫోన్ రింగ్ అవడం ఆగలేదు. ‘ఉప్పెన’ సమయంలోనూ ఇదే జరిగింది. అయితే ‘ఉప్పెన’ కంటే పది రెట్లు ఎక్కువ రెస్పాన్స్ ‘పెద్ది’ కి వస్తోంది’’ అన్నారు. ‘‘రామ్ చరణ్‌గారి కెరీర్లోనే ఫస్ట్ డే హయ్యెస్ట్ రికార్డ్ ఇది. ఈ సినిమా మరిన్ని రికార్డులు నెలకొల్పుతుందని నమ్ముతున్నాను’’ అని మైత్రి డిస్ట్రిబ్యూటర్ శశిధర్ చెప్పారు. -
రామ్ చరణ్ ‘పెద్ది’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)
-
పెద్ది మూవీ టాక్ పై బూచి బాబు రియాక్షన్
-
‘పెద్ది’.. క్షమాపణలు చెప్పిన బుచ్చిబాబు
పెద్ది సినిమాలో జాన్వీ కపూర్ పాత్రపై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చిన సంగతి తెలిసిందే. మహిళలను అవమానించేలా జాన్వీ కపూర్ పాత్రను తీర్చిదిద్దారంటూ పలువురు నెటిజన్స్ బుచ్చిబాబుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సినిమాలో హీరోయిన్ని చూపించిన తీరు, కొన్ని సన్నివేశాలపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో బుచ్చిబాబు తాజాగా ఈ విమర్శలపై స్పందించాడు. క్షమాపణలు కోరుతూ సోషల్ మీడియాలో ఓ సుధీర్గమైన పోస్ట్ పెట్టాడు.ఒక ఫిల్మ్ మేకర్‌గా.. సినిమా అనేది ప్రేక్షకులను అలరించాలి, వారిలో స్ఫూర్తిని నింపాలి అనుకుంటాను. ఎవరినీ అసౌకర్యానికి, అగౌరపరచాలని చూడను. పెద్దిలో కొన్ని సన్నివేశాలు ఇబ్బందిగా అనిపించినట్లు మా దృష్టికి వచ్చింది. వాటిని తీవ్రంగా పరిగణించాం. తెరపైన, తెర వెనుక కూడా మహిళలంటే నాకు ఎప్పుడూ అపారమైన గౌరవం ఉంది. మహిళల పాత్రలను అగౌరవపరచడం నా ఉద్దేశం కాదు. ఈ సినిమాలో సన్నివేశాలు మీ మనోభావాలు దెబ్బతీసేలా ఉంటే.. మనస్ఫూర్తిగా క్షమాపణలు కోరుతున్నాను. అలాగే ఆయా సన్నివేశాలలో మార్పులు చేయాలని నిర్ణయం తీసుకున్నాం (జాన్వీ కపూర్‌కి సంబంధించిన రొమాంటిక్ సీన్లన్నీ తొలగించాలని నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం). ప్రేక్షకులు ఆదరిస్తేనే సినిమా ఎదుగుతుంది. అభిమానులతో ఉన్న అనుబంధమే సినిమా రంగాన్ని ముందుకు తీసుకెళ్తుంది. అలాంటి అభిమానుల భావోద్వేగాలు, అంచనాలను దృష్టిలో పెట్టుకుని కథలు రాసుకోవాల్సిన బాధ్యత మాపై ఉంది. కొన్ని సున్నితమైన అంశాలపై కచ్చితంగా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. ప్రతి మహిళా గౌరవానికి అర్హురాలే. వారిని శక్తిమంతంగా చూపించడానికి, వారి విలువను పెంచే కథలు చెప్పడానికి మేం కట్టుబడి ఉన్నాం. తమ అభిప్రాయాలను నిజాయితీగా, మనస్ఫూర్తిగా పంచుకున్న ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు’ అని బుచ్చిబాబు తన ఎక్స్ ఖాతాలో రాసుకొచ్చాడు.As a filmmaker, I believe cinema should entertain, inspire, and connect with audiences. It should never make anyone feel uncomfortable or disrespected. We have heard the feedback regarding certain scenes in Peddi and have taken it seriously.I have always had immense respect for…— BuchiBabuSana (@BuchiBabuSana) June 6, 2026 -
చరణ్-జాన్వీల ముద్దు సీన్‌పై విమర్శలు... స్పందించిన బుచ్చిబాబు
బుచ్చిబాబు దర్శకత్వంలో రామ్ చరణ్-జాన్వీ కపూర్ జంటగా నటించిన ‘పెద్ది’ చిత్రం ఈ నెల 4న విడుదలై హిట్ టాక్‌తో దూసుకెళ్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమాలో జాన్వీ కపూర్ పాత్రపై విమర్శలు వస్తున్నాయి. సినిమా చూసినవారంతా గ్లామర్ షో కోసమే జాన్వీ కపూర్‌ని పెట్టారని, కథకు ఆమె పాత్రకు ఎలాంటి సంబంధం లేదంటున్నారు. ఇక సోషల్ మీడియాలో అయితే జాన్వీపై పెద్ద ఎత్తున ట్రోలింగ్ జరుగుతుంది. ఈ సినిమాలో రామ్ చరణ్-జాన్వీల ముద్దు సీన్‌పై కూడా విమర్శలు వచ్చాయి. ఏ సందర్భం లేకుండా ఉద్దేశపూర్వకంగా ఆ సీన్ పెట్టారంటూ ట్రోల్ చేస్తున్నారు. ఈ విమర్శలపై తాజాగా దర్శకుడు బుచ్చిబాబు స్పందించాడు. ముద్దు సీన్‌పై ఇలాంటి నెగెటివ్ స్పందన వస్తుందని ఊహించలేదన్నారు.రామ్ చరణ్-జాన్వీల మధ్య సరదా సాగే ఓ ప్రేమ కథను మాత్రమే తెరపై చూపించాలనుకున్నామని.. అందులో భాగంగానే ముద్దు సీన్ పెట్టామని వివరణ ఇచ్చాడు. ప్రేక్షకుల నుంచి వచ్చిన స్పందనను దృష్టిలో పెట్టుకొని ఇకపై అలాంటి సీన్లను తెరకెక్కించే ముందు మరింత జాగ్రత్తలు తీసుకుంటామని చెప్పారు. తన తదుపరి సినిమాల్లో అలాంటి సీన్లు ఉంటే.. ప్రేక్షకులను నచ్చే విధంగా తెరకెక్కిస్తామని తెలిపారు.పెద్ది విషయానికొస్తే.. 1990 నేపథ్యంలో సాగే కథ ఇది. ఆంధ్రప్రదేశ్‌లోని విజయనగరంలోని కొండకింద ఊరికి చెందని ఓ యువకుడు.. గుర్తింపు కోసం చేసే పోరాటమే ఈ సినిమా కథ. ఇందులో రామ్ చరణ్ గిరిజన యువకుడిగా కనిపిస్తూ.. క్రికెటర్‌గా, కుస్తీ ఆటగాడిగా, అథ్లెట్‌గా మూడు విభిన్నమైన పాత్రలు పోషించి, ప్రతి పాత్రలోనూ వేరియేషన్ చూపించి ఆకట్టుకున్నాడు. మొదటి రోజు ఈ చిత్రం రూ. 135 కోట్లకు పైగా వసూళ్లను సాధించింది. -
'ఉప్పెన కంటే ఎక్కువ.. ఆయన లేకపోతే పెద్దినే లేదు'
రామ్ చరణ్ పెద్ది సక్సెస్‌తో మేకర్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. బుచ్చిబాబు డైరెక్షన్లో వచ్చిన ఈ రూరల్ స్పోర్ట్స్ డ్రామా ప్రస్తుతం థియేటర్లలో సందడి చేస్తోంది. ఈ మూవీకి తొలిరోజే పాజిటిక్ రావడంతో మెగా ఫ్యాన్స్ పండుగ చేసుకుంటున్నారు. ఈ సందర్భంగా మూవీ టీమ్ హైదరాబాద్‌లో సక్సెస్ ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ మీట్‌కు హాజరైన డైరెక్టర్ బుచ్చిబాబు ఆసక్తికర కామెంట్స్ చేశారు.ఇంత పెద్ద విజయాన్ని అందించినందుకు అభిమానులకు బుచ్చిబాబు ధన్యవాదాలు తెలిపారు. ప్రీమియర్స్ నుంచే నాకు ఫోన్ కాల్స్ రావడం మొదలైందన్నారు. పెద్ది విజయానికి కారణం రామ్ చరణ్ మాత్రమేనన్నారు. ఉప్పెన కంటే ఎక్కువగా ఫోన్ కాల్స్ వస్తున్నాయని సంతోషం వ్యక్తం చేశారు. ఈ మూవీలోని పెద్ది క్యారెక్టర్ ఆదర్శమని పలువురు కొనియాడారని తెలిపారు. చరణ్ గారు పడిన కష్టాన్ని అందరూ గుర్తించారు.. చరణ్ లేకపోతే ఈ సినిమా లేదు.. థ్యాంక్ యూ చరణ్ సార్ అంటూ తన ఆనందాన్ని పంచుకున్నారు.కాగా.. బుచ్చిబాబు- రామ్ చరణ్ కాంబోలో వచ్చిన లేటేస్ట్ మూవీనే పెద్ది. ఈ చిత్రంలో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్గా నటించింది. ఈ మూవీలో జగపతి బాబు, శివరాజ్ కుమార్ కీలక పాత్రలు పోషించగా.. శృతిహాసన్ ప్రత్యేక సాంగ్‌లో మెరిసింది. ఈ సినిమాకు ఏఆర్ రెహమాన్ సంగీతమందించారు. -
మొన్న 'దేవర'.. ఇప్పుడు 'పెద్ది'.. అదే తంతు
'పెద్ది' సినిమా బాగుందా? బాగోలేదా? ఎన్ని కోట్లు కలెక్షన్స్ వస్తాయనేది ఇక్కడ విషయం కాదు. ఒక మంచి ఉద్దేశం లేదా మంచి పాయింట్‌తో మూవీ తీద్దామనుకున్నప్పుడు అందులో ప్రతి విషయం జాగ్రత్తగా ప్లాన్ చేసుకోవాలి. పంటి కింద రాళ్లలా అనవసర సీన్స్ ఉండకూడదు. అలా కాకుండా కమర్షియల్ పేరిట నచ్చిన అంశాలు నచ్చినట్లు పెట్టేస్తే మంచి కంటే మిగతా విషయాలే ఆడియెన్స్ దృష్టిని ఆకర్షిస్తాయి. ఇప్పుడు 'పెద్ది' విషయంలో అదే జరుగుతోంది.(ఇదీ చదవండి: ‘పెద్ది’ మూవీ రివ్యూ అండ్ రేటింగ్)'పెద్ది' సినిమాలో ఊరి గుర్తింపు కోసం ఓ కుర్రాడు ఎంతవరకు వెళ్లాడు అనే అంశాన్ని చూపించాలనుకున్నారు. అదే చూపించారు కూడా. సినిమాలో రామ్ చరణ్ యాక్టింగ్ బాగుంది. పాత్ర కోసం అతడు పడిన కష్టం తెరపై కనిపించింది. కానీ హీరోయిన్ పాత్ర తీరుతెన్నులే అత్యంత దారుణంగా ఉన్నాయి. సినిమా చూసిన చాలామంది ఇదే అంటున్నారు. అందచందాల ప్రదర్శన తప్పితే జాన్వీ చేసిందేం లేదు. దీని కోసమే జాన్వీని తీసుకున్నారా అని తెగ ట్రోలింగ్ చేస్తున్నారు.ఈ సినిమాలో ఓ సందర్భంలో హీరో పాత్ర.. అనుమతి లేకపోయినా సరే హీరోయిన్‌కి ముద్దు పెడతాడు. పైగా దానిని రొమాన్స్ అని జస్టిఫికేషన్ కూడా ఇచ్చే ప్రయత్నం చేశారు. ఇది ఏ మాత్రం కరెక్ట్ కాదని చాలామంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే సినిమాలు.. జనాలపై విపరీతమైన ప్రభావం చూపిస్తాయి. పైగా 'పెద్ది' సినిమాకు యూ/ఏ సెన్సార్ సర్టిఫికెట్ ఇచ్చారు. అంటే 16 ఏళ్ల అబ్బాయి లేదా అమ్మాయిలు కూడా ఈ మూవీ చూడొచ్చు. ఇలాంటి సీన్స్ చూస్తే సదరు పిల్లల ఆలోచన ఎలా ఉంటుంది? సదరు సన్నివేశాలపై వీళ్లపై ఎలాంటి ప్రభావం చూపిస్తాయనేది సెన్సార్ బోర్డ్, హీరో, దర్శకనిర్మాత కచ్చితంగా ఆలోచించాలి.జాన్వీ కపూర్లోనూ నటి ఉండొచ్చు. తెలుగు దర్శకులు మాత్రం ఆమెలోని నటి కంటే గ్లామర్‌నే చూస్తున్నారా? అనే సందేహం కలుగుతోంది. ఎందుకంటే ఎన్టీఆర్ 'దేవర'లోనూ గ్లామర్ షో తప్పితే మరొకటి చేయలేదు. కనీసం 'పెద్ది'లోనైనా కాస్తంత గుర్తింపు ఉన్న పాత్ర చేస్తుందనుకుంటే ఇందులోనూ అదే తంతు. కావాలనే ఈమెతో దర్శకులు అలా చేయిస్తున్నారా? లేదంటే అన్ని తెలిసే జాన్వీ ఇలాంటి రోల్స్ చేయడానికి ఒప్పుకొంటుందా అనేది ఇక్కడ అర్థం కాని ప్రశ్న. ఇదే కొనసాగితే మాత్రం జాన్వీ.. టాలీవుడ్లో ఎక్కువ రోజులు నిలబడటం కష్టమే!(ఇదీ చదవండి: 'పెద్ది' మొదటిరోజు కలెక్షన్.. ఎన్ని కోట్లు వచ్చాయ్?) -
పెద్ది సొంత కథ అని చెప్పి ఆ మూవీ రీమేక్ తీసాడా ?
-
పెద్ది రిలీజ్ వేళ.. శ్రీవారి సేవలో బుచ్చిబాబు ఫ్యామిలీ
పెద్ది రిలీజ్ వేళ బుచ్చిబాబు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. తన ఫ్యామిలీతో కలిసి వెళ్లిన ఆయన స్వామివారికి మొక్కులు చెల్లించుకున్నారు. దర్శన అనంతరం అర్చకులు వారికి తీర్థ ప్రసాదాలు అందజేశారు. పెద్ది కోసం రామ్ చరణ్‌తో సహా తాము చాలా కష్టపడ్డామని తెలిపారు. ఈ మూవీ ఘన విజయం సాధించాలని శ్రీవారిని కోరుకున్నట్లు వెల్లడించారు.కాగా.. బుచ్చిబాబు- రామ్ చరణ్ కాంబోలో వచ్చిన రూరల్ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా పెద్ది. శ్రీకాకుళం బ్యాక్‌డ్రాప్‌లో ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. జూన్ 3 రాత్రి నుంచే పెద్ది ప్రీమియర్స్ షోలు థియేటర్లలో సందడి చేస్తున్నాయి. ఈ చిత్రంలో బాలీవుడ్ భామ జాన్వీ కపూర్ హీరోయిన్గా నటించింది. ఈ చిత్రంలో శివరాజ్ కుమార్, జగపతిబాబు కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమాకు ఏఆర్ రెహమాన్ సంగీతమందించారు. -
పెద్ది ఫ్యాన్స్‌కు తీవ్ర నిరాశ.. ఆ విషయంలో బిగ్ ట్విస్ట్..!
మెగా ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తోన్న తరుణం రానే వచ్చింది. ఈ రోజు రాత్రి నుంచే పెద్ది మూవీ ప్రీమియర్స్ షురూ కానున్నాయి. ఈ రోజు 8 గంటల నుంచే థియేటర్లలో సందడి చేయనుంది. ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో టికెట్ బుకింగ్స్ ఓపెన్ అవ్వగా.. కొద్ది గంటల్లోనే హాట్ కేకుల్లా అమ్ముడైపోతున్నాయి. ఈ మూవీలో రామ్ చరణ్ సరసన బాలీవుడ్ భామ జాన్వీ కపూర్ హీరోయిన్గా కనిపించనుంది.అయితే ఈ మూవీని పలు ఫార్మాట్లలో రిలీజ్ చేస్తామని మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు. ఐమ్యాక్స్, డాల్బీతో పాటు 4డీఎక్స్ ఫార్మాట్లో విడుదల చేస్తామని అనౌన్స్ చేశారు. ఆడియన్స్ ఎక్కువగా 4డీఎక్స్ ఫార్మాట్లో చూసేందుకు ఆసక్తి చూపుతారు. ఎందుకంటే స్పోర్ట్స్ యాక్షన్ డ్రామాను ఈ ఫార్మాట్లో చూస్తే వచ్చే కిక్ వేరే లెవెల్లో ఉంటుంది.అయితే 4డీఎక్స్ ఫార్మాట్లో పెద్దిని రిలీజ్ చేస్తామని ప్రకటించిన మేకర్స్.. ఇప్పటి వరకు ఈ వర్షన్లో టికెట్ బుకింగ్స్ మాత్రం ఓపెన్ చేయలేదు. హైదరాబాద్‌తో సహా బార్కో లేజర్, ఎపిక్, డాల్బీ సినిమా ఫార్మాట్లతో మాత్రమే టికెట్స్ బుక్ అవుతున్నాయి. దీంతో 4డీఎక్స్ వర్షన్లో చూడాలనుకున్న ఫ్యాన్స్‌కు నిరాశే మిగలనుంది. ఈ విషయంలో మాత్రం పెద్ది మేకర్స్ ఫ్యాన్స్‌ను డిసప్పాయింట్ చేశారనే చెప్పుకోవాలి. -
పుష్పరాజ్ మైండ్‌లో ఉంటే... పెద్ది గుండెల్లో ఉంటాడు
‘ఉప్పెన’ లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత ఐదేళ్ల గ్యాప్ తీసుకొని ‘పెద్ది’తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు దర్శకుడు బుచ్చిబాబు. రామ్‌చరణ్ హీరోగా నటించిన ఈ మూవీ ఈనెల 4న రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో బుచ్చిబాబు తాజాగా మీడియాతో ముచ్చటించారు. ఆ విశేషాలు..‘పెద్ది’ ఎలా మొదలైంది?నా తొలి చిత్రం ఉప్పెన బ్లాక్‌బస్టర్ తర్వాత దాదాపు ఐదేళ్లకు పెద్దితో వస్తున్నాను. సాధారణంగా ఇండస్ట్రీలో ఒక బ్లాక్‌బస్టర్ విజయం తర్వాత దర్శకుడికి ఐదేళ్ల సమయం పట్టడం జరగదు. కానీ నా విషయంలో అలా జరిగింది (నవ్వుతూ). మా గురువుగారు సుకుమార్ నన్ను చరణ్ గారి దగ్గరకు తీసుకెళ్లారు. నేను కథ చెప్పాను. చరణ్ గారికి నచ్చింది. ఉప్పెన తర్వాత చరణ్ గారి దగ్గరకు వెళ్లడానికే నాకు రెండున్నరేళ్లు పట్టింది. ఆయన కథ ఓకే చేసిన తర్వాత దాదాపు ఏడాదిన్నరలో షూటింగ్ మొత్తం పూర్తయ్యింది.ఇది స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్‌లో ఉండే సినిమా కదా? ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు?ఇందులో హీరో క్రికెట్‌తో పాటు మరో రెండు ఆటలు కూడా ఆడతాడు. దాని కోసం ప్రత్యేక శ్రద్ద తీసుకున్నాం.క్రికెట్ మన అందరికీ తెలిసిన ఆటే. కానీ కుస్తీ విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నాం. దంగల్ చిత్రంలో అమీర్ ఖాన్ గారికి కోచింగ్ ఇచ్చిన ట్రైనర్‌ను తీసుకొచ్చాం. అలాగే తెలంగాణలోని పహిల్వాన్లను కూడా టీమ్‌లో భాగం చేశాం. ఆర్టిస్టులందరికీ ప్రత్యేక శిక్షణ ఇచ్చాం. రామ్ చరణ్ ఈ సినిమా కోసం దాదాపు మూడు నుంచి నాలుగు నెలల పాటు ప్రత్యేకంగా పహల్వాన్ శిక్షణ తీసుకున్నారు.పెద్ది విజయం ఇప్పుడు ఇండస్ట్రీకి చాలా అవసరం కదా?ఏ సినిమా సక్సెస్ అయినా ఇండస్ట్రీకి, డైరెక్టర్లకు, హీరోలకు, సినిమాకు పనిచేసిన అందరికీ అవసరమే. అయితే ఇప్పుడు ఆ అవసరం కాస్త గట్టిగా ఉంది. నా కెరీర్ మొత్తం అలానే జరిగింది (నవ్వుతూ). ఉప్పెన సమయంలో కూడా ఇండస్ట్రీ పరిస్థితి అలానే ఉండేది. అప్పట్లో అసలు థియేటర్లకు ప్రేక్షకులు వస్తారా లేదా అనే సందేహం ఉండేది. సినిమా రిలీజ్‌కు మూడు రోజుల ముందు మాత్రమే 100% ఆక్యుపెన్సీకి అనుమతి వచ్చింది. జనం థియేటర్స్ కి వచ్చారు. పెద్ద హిట్ ఇచ్చారు.‘పెద్ది’ కథ ముందు ఎన్టీఆర్ కోసం రాసుకున్నారా?లేదు. ఎన్టీఆర్ గారి కోసం అనుకున్న కథ వేరు. పెద్ది కథ వేరు. ఇది పూర్తిగా చరణ్ గారి కోసం తయారు చేసిన కథ.చరణ్ ని అంత ఈజీగా ఎలా కన్విన్స్ చేశారు?అంత ఈజీగా ఏమీ జరగలేదు. ఆయనకు కథ నచ్చింది కాబట్టే ఒప్పుకున్నారు. కథతోనే ఆయనను కన్విన్స్ చేశాను. చరణ్ ఎప్పటినుంచో ఒక స్పోర్ట్స్ డ్రామా చేయాలనే ఆసక్తి ఉంది. ఆయనకు నచ్చేలా పెద్ది కథను సిద్ధం చేశాం.జాన్వీ కపూర్ పాత్ర ఎలా ఉంటుంది?జాన్వి కపూర్ ఈ సినిమాకు ఒక ప్రత్యేకమైన కలర్ తీసుకొచ్చారు. లవ్ ట్రాక్‌లో చాలా బాగుంటారు. జాన్వి చాలా తెలివైన అమ్మాయి. చాలా డెడికేటెడ్ పర్సన్. సినిమాపై చాలా ప్యాషన్ ఉంది. చాలా వినయంగా ఉంటారు.శివరాజ్ కుమార్, జగపతి బాబు పాత్రల గురించి చెప్పండిఇందులో శివన్న ఒక గురువుగా కనిపిస్తారు. ఆటను బ్రతికించేవాడి పాత్ర అది. అలాగే జగపతిబాబు అప్పలసూరి పాత్ర చాలా బరువైనది. హీరో తర్వాత అంత పవర్‌ఫుల్‌గా ఉండే పాత్ర అది. దివ్యేందు పాత్ర కూడా చాలా క్రేజీగా ఉంటుంది.రెండో సినిమాకే రూ. 350 కోట్ల బడ్జెట్.. ఎలా అనిపిస్తోంది?ఇది చరణ్ గారి వల్లే సాధ్యమైంది. హీరోని బట్టి సినిమా తయారయ్యే విధానం మారుతుంది. ఇదే కథను రూ.20 కోట్లలో తీయాలనుకుంటే కథకు కావాల్సినవి జరగకపోవచ్చు.ఈ సినిమాలో 'అబ్బనీ తీయని దెబ్బ' పాటను రీక్రియేట్ చేశారని విన్నాం?లేదు. అది రేడియోలో మాత్రమే వినిపిస్తుంది. అది వచ్చినప్పుడు ప్రేక్షకులు కథ నుంచి బయటకు వచ్చే అవకాశం ఉందని భావించి దాన్ని కూడా మ్యూట్ చేసేశాం.ఏఆర్ రెహమాన్ గారి గురించి?నాకు రోజా, బొంబాయి.. రెహమాన్ గారి ఆల్బమ్స్ చాలా ఇష్టం. ఆయనతో పనిచేయాలని ఎప్పటినుంచో కల కన్నాను. ఈ సినిమా ద్వారా ఆ అవకాశం వచ్చింది. ఆయన పాటలను స్వయంగా పాడుతుంటే వింటూ చాలా ఎంజాయ్ చేశాను. లైఫ్ లాంగ్ ఆయనతో సినిమాలు చేయాలని ఫిక్స్ అయిపోయాను.ఈ సినిమాలో ఇంకా రెండు పాటలు ఉన్నాయి. ఆ రెండు కూడా అదిరిపోతాయి.మీరు పుష్ప గురించి మాట్లాడినప్పుడు ‘పది కేజీఎఫ్‌లతో సమానం’ అన్నారు. మరి పెద్ది గురించి?పుష్పరాజ్ మైండ్‌లో ఉంటే... పెద్ది గుండెల్లో ఉంటాడు(నవ్వుతూ..)షూటింగ్ సమయంలో చరణ్‌కు చాలా గాయాలయ్యాయని విన్నాం?అవును. ముఖ్యంగా రెజ్లింగ్ సన్నివేశాల్లో దెబ్బలు తగిలాయి. కంటికి గాయం అయ్యి రక్తం కారినప్పుడు మాత్రం నాకు చాలా భయమేసింది. చిరంజీవి గారు తిడతారేమో అని భయమేసింది. అది కెమెరాలో కూడా రికార్డ్ అయింది. ఒక ఫైట్ సీన్లో పొరపాటున తగిలింది. అయితే చిరంజీవి గారు "బుచ్చి వీడియో పంపించు" అన్నారు (నవ్వుతూ).చరణ్ గారి ట్రాన్స్ఫర్మేషన్ గురించి?పెద్ది జర్నీని మూడు దశలుగా విభజించాం. ప్రతి దశకు లుక్ ఎలా ఉండాలో ఏఐలో డిజైన్ చేసి ఆయన దగ్గరకు తీసుకెళ్లాను. నేను డిజైన్ చేసిన దానికంటే ఇంకా అద్భుతంగా ట్రాన్స్‌ఫార్మ్ అయ్యారు. ఆయన ట్రాన్స్ఫర్మేషన్ మైండ్బ్లోయింగ్గా అనిపించింది.క్లైమాక్స్ గురించి అందరూ మాట్లాడుతున్నారు. అది ఎలా ఉంటుంది?ఒక కమర్షియల్ హీరోను ఆర్గానిక్‌గా చూపించడం కత్తి మీద సాము లాంటిది. క్లైమాక్స్ ఎలా ఉంటుందో మీరు బిగ్ స్క్రీన్‌పై అనుభవించాలి. ఇప్పటివరకు చూసినవాళ్లంతా ఎక్స్ట్రార్డినరీగా ఉందని చెప్పారు.చిరంజీవి గారు సినిమా చూశారా?-ఇంకా చూడలేదు. ఎప్పుడు చూస్తారా అని ఎదురుచూస్తున్నాను. సురేఖ మేడమ్ ఒక సీక్వెన్స్ చూశారు. చాలా ఎమోషనల్ అయ్యారు.పెద్ది గురించి ఒక మాటలో చెప్పాలంటే?ఫ్యామిలీతో కలిసి వెళ్లి హ్యాపీగా చూడండి. సూపర్‌గా ఉంటుంది. చాలా ఎమోషనల్‌గా ఉంటుంది. కమర్షియల్‌గా ఉంటుంది. ఇందులో చరణ్ గారు కనిపించరు... పెద్ది మాత్రమే కనిపిస్తాడు. పెద్ది ఆట నుంచి ఏం నేర్చుకున్నాడు, ఆ ఆట అతనికి ఏమిచ్చింది అనేది ప్రతి ఒక్కరికీ కనెక్ట్ అవుతుంది. -
‘పెద్ది’ ట్రైలర్‌కు యావరేజ్ టాక్, కారణం ఇదే : బుచ్చిబాబు
పెద్ది సినిమా అనౌన్స్మెంట్ దగ్గర నుంచి అంచనాలు పెంచుతూనే ఉంది. రామ్ చరణ్ లుక్ రిలీజ్, గ్లింప్స్‌తో పాటు పాటలు కూడా ఆ అంచనాలు భారీగా పెంచాయి. అయితే ట్రైలర్ మాత్రం ఆ స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. సోషల్ మీడియాలో ఈ ట్రైలర్‌కు మిశ్రమ స్పందన లభించింది. ఇదే విషయాన్ని తాజాగా జరిగిన ప్రెస్మీట్లో బుచ్చిబాబు దగ్గర ప్రస్తావించాడు ఓ విలేకరి. దానికి బుచ్చిబాబు తనదైన స్టైల్లో సమాధానం చెప్పాడు.‘కథను ఎక్కువగా చెబితే అసలు విషయం తెలిసిపోతుంది. అందుకే ట్రైలర్‌ని అలా కట్ చేశాం. అసలు కంటెంట్‌ని తీసుకోలేదు కాబట్టి.. ట్రైలర్లో చెప్పాల్సినంత చెప్పలేకపోయాం. అయితే ఒకప్పుడు ఘన విజయం సాధించిన చిత్రాల ట్రైలర్లన్నీ యావరేజ్ టాకే సంపాదించుకున్నాయి(నవ్వుతూ..). ఈ లెక్కన పెద్ది కూడా సరైన దారిలోనే వెళ్తుందేమో అనిపిస్తుంది’ అని బుచ్చిబాబు అన్నారు. ఇక రిలీజ్ దగ్గరపడుతున్నకొద్ది తనకు టెన్షన్ ఎక్కువైపోయిందన్నారు. మరికొన్ని గంటల్లో(జూన్ 4) ప్రేక్షకుల ముందుకు రానుందని, హిట్ టాక్ వస్తే హ్యాపీగా ఫీలవుతానని బుచ్చిబాబు చెప్పారు. ఇక తన కొత్త సినిమాల గురించి చెబుతూ..అల్రెడీ ఓ అద్భుతమైన కథను రెడీ చేసుకున్నానని చెప్పారు. మూడో సినిమా ఎన్టీఆర్తోనే చేస్తారా అని అడగ్గా.. ‘ఆయన టైమ్ ఇవ్వాలనే కానీ క్షణాల్లో వెళ్లి కథ చెబుతా’ అన్నారు. -
రామ్ చరణ్ కంటికి గాయం.. చిరంజీవి ఏమన్నారంటే..: బుచ్చిబాబు
‘పెద్ది’ షూటింగ్ సమయంలో రామ్ చరణ్ పలు సార్లు ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. అవన్నీ బయటకు రాలేదు కానీ..కంటికి గాయమైన విషయం మాత్రం క్షణాల్లో వైరల్ అయిపోయింది. సోషల్ మీడియా ద్వారా ఈ విషయం తెలుసుకున్న అభిమానులు అప్పుడు ఆందోళ చెందారు. చివరకు చిరంజీవి స్పందిస్తూ.. చిన్న సర్జరీ మాత్రమే జరిగిందని చెప్పడంతో అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. అయితే ఈ ప్రమాదం జరిగినప్పుడు దర్శకుడు బుచ్చిబాబు కూడా ఆందోళన చెందాడట. అంతేకాదు ఈ విషయం చిరంజీవికి తెలిస్తే ఎంత తిడతాడేమోనని భయపడ్డాడట. కానీ చిరంజీవి మాత్రం ఒక్కమాట కూడా అనలేదని బుచ్చిబాబు చెప్పాడు.తాజాగా ఆయన మీడియాతో ముచ్చటిస్తూ.. రామ్ చరణ్ కంటికి గాయం ఎలా గాయం అయిందో వివరించాడు. ‘ఫైట్ సీన్ షూటింగ్ సమయంలో చరణ్ కంటికి గాయం అయింది. కింద ఉన్న ఫైటర్ ఒక్కసారిగా లేవడంతో పైన ఉన్న చరణ్ కంటికి దెబ్బతాకింది. చాలా రక్తం పడిపోయింది. భయపడిపోయా. ఈ విషయం చిరంజీవి తెలిస్తే ఎంత తిడతాడేమోనని టెన్షన్ పడ్డా. భయంతోనే చిరంజీవికి కాల్ చేసి మాట్లాడా. అయితే ఆయన ఒక్క మాట కూడా అనలేదు. పైగా ‘ఆ వీడియో ఉంటే పంపు బుచ్చిబాబు’ అన్నాడు. అది విని నేనే షాకయ్యా’ అని బుచ్చిబాబు చెప్పుకొచ్చాడు. -
విజయవాడలో గ్రాండ్ గా ‘పెద్ది ’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)
-
అభిమానుల కోసం రక్తమైనా చిందిస్తా : రామ్‌చరణ్
పెద్ది సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ విజయవాడ ఇందిరాగాంధీ మునిసిపల్ కార్పొరేషన్ స్టేడియంలో సోమవారం సాయంత్రం జరిగింది. ఈ సందర్భంగా రామ్‌చరణ్ మాట్లాడుతూ.. విజయవాడ నా అదృష్టమైన నగరం. ఇక్కడే ‘ఇంద్ర’, ‘ఖైదీ నంబర్ 150’ సెలబ్రేషన్స్ చేశాం. ఆర్టిస్ట్‌గా నేను ఎన్నో కథలు వింటాను. అందులో కొన్ని నచ్చుతాయి. ఇంకొన్ని ఆశ్చర్యపరుస్తాయి. కానీ ఈ కథ విన్నప్పుడు హృదయానికి హత్తుకుంది. ఈ కథ విన్నప్పుడు హృదయానికి హత్తుకుంది. నాన్నగారు చెప్పినట్లు ఇలాంటి కథ పదేళ్లకు ఒకసారి మాత్రమే వస్తుంది. ఇంతమంచి కథను నా దగ్గరకు తీసుకొచ్చిన సుకుమార్‌గారికి ధన్యవాదాలు. బుచ్చిబాబు దీనిని ఒక సినిమా కథలా చెప్పలేదు. ఒక వ్యక్తి ప్రయాణంలా చెప్పారు. నా సినిమాల లైబ్రరీలో ఈ చిత్రం టాప్‌లో నిలుస్తుంది. ఈ సినిమాని చాలా ఇష్టం, ప్రేమతో చేశాను. ఇలాంటి కథ కోసం కాకపోతే ఇంకెప్పుడు కష్టపడతాం? ఇది పడి లేచిన మనిషి ప్రయాణం. ఈ చిత్రంతో బుచ్చిబాబు ఇండియాలో టాప్ డైరెక్టర్స్ జాబితాలో నిలుస్తారు. అభిమానుల కోసం చేతులు విరగొట్టుకుని పనిచేయడమే కాదు. రక్తమైనా చిందిస్తా. నాకు తెలిసిందల్లా సినిమాయే. నేను చనిపోయే వరకూ మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తా అంటూ చరణ్ తన అభిమానులపై ప్రేమను వ్యక్తం చేశారు. హీరోయిన్ జాన్వీకపూర్ తెలుగులో మాట్లాడి ఆకట్టుకున్నారు. ప్రేక్షకులే దేవుళ్లు అని అమ్మ శ్రీదేవి తనకు చెప్పేదని గుర్తుచేసుకున్నారు. జగదేకవీరుడు అతిలోకసుందరి సినిమాలోని డైలాగ్‌ను యాంకర్ సుమ జాన్వీతో చెప్పించారు. హిందీ నటుడు దివ్వేందు కూడా తెలుగులో మాట్లాడి అబ్బురపరిచారు. నిర్మాత కిలారు వెంకట సతీష్ మాట్లాడుతూ తన సొంతూరు పెనమలూరు అని, ఇక్కడ ఈ వేడుక జరగడం ఆనందంగా ఉందన్నారు. ఏఆర్ రెహమాన్ నిర్వహించిన లైవ్ మ్యూజికల్ నైట్ సంగీత ప్రియులను అలరించింది. పెద్ది సినిమాలోని పాటలను ఆయన స్వయంగా పాడటమే కాకుండా స్టెప్పులు కూడా వేశారు. చికిరి చికిరి పాటకు ప్రేక్షకులతో నృత్యాలు చేయించారు. కార్యక్రమంలో మంత్రి కందుల దుర్గేష్, దర్శకుడు బుచ్చిబాబు పాల్గొన్నారు. అనంతరం ఈనెల 9వ తేదీ నుంచి ప్రారంభం కానున్న ఆంధ్రా ప్రీమియర్ లీగ్ (ఏపీఎల్) పోస్టర్‌ను ఈవెంట్ వేదికపై ఆవిష్కరించారు. ఎంపీ కేశినేని శివనాథ్, ఏపీఎల్‌లో ఆడే జట్ల కెప్టెన్లు పాల్గొన్నారు. బుచ్చిబాబు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా జూన్ 4న పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రానుంది. -
ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్ ప్రీమియర్ షోస్ ఫిక్స్...
-
Ram Charan: ప్రధాని మోదీ నాతో ఓ స్ఫూర్తి నింపే స్టోరీ చెప్పారు
పాన్ ఇండియా స్థాయిలో జూన్ 4న విడుదల కానున్న పెద్ది సినిమాకు ప్రమోషన్స్ ఊపందుకున్నాయి. భోపాల్, బెంగళూరులో ఇప్పటికే ప్రచారం చేసిన చిత్ర బృందం గురువారం ఢిల్లీలో సందడి చేసింది. అక్కడ నిర్వహించిన ప్రెస్మీట్లో ఈ చిత్ర హీరో మెగాపవర్ స్టార్ రామ్‌చరణ్, జాన్వీ కపూర్, దివ్యేందు శర్మ, బొమన్ ఇరానీ తదితరులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా రామ్‌చరణ్ మాట్లాడుతూ.. ప్రధాని మోదీతో గతంలో జరిగిన భేటీని గుర్తుచేసుకున్నారు. ఢిల్లీలో ప్రధాని మోదీని కలిసినప్పుడు ఆయన ‘పెద్ది’ సినిమా కథ దేని గురించి అని అడిగారు. దానికి నేను వికసిత్ భారత్ గురించి చెప్పే కథ అని వివరించాను. అప్పుడు ఆయన నాతో ఓ స్ఫూర్తినింపే కథను పంచుకున్నారు. ‘పశ్చిమ బెంగాల్‌లోని ఓ చిన్న గ్రామంలో మహ్మద్ అనే ఓ ఫుట్‌బాల్ క్రీడాకారుడు ఉండేవాడు. అతను భారత్ తరఫున ఆడి తన ఊరికి గుర్తింపు తెచ్చాడు. ఆ గ్రామం నుంచి ఇప్పుడు 85 మంది ప్లేయర్స్ ఉన్నారని చెప్పారు. ఒక వ్యక్తి తలుచుకుంటే ఎంతటి మార్పు తీసుకురాగలడో దానికి ఇది ఓ ఉదాహరణ. పెద్ది పాత్ర కూడా అలాంటిదే’ అని చరణ్ వివరించారు.ఇక భోపాల్‌లో హిందీ మాట్లాడి ఇబ్బందులు ఎదుర్కొన్న రామ్ చరణ్ ఈసారి జాగ్రత్త పడ్డారు. తాజాగా ఢిల్లీలో జరిగిన పెద్ది సినిమా ప్రచార కార్యక్రమంలో చరణ్ పూర్తిగా ఇంగ్లిష్‌లోనే మాట్లాడాడు. ఒక దశలో ఎవరి పేరైనా మరిచిపోతే, తన టీమ్‌ను అడిగి నిర్ధారించుకొని మరీ చెప్పాడు. ఇక పెద్ది సినిమాను చిన్నారులందరికీ చూపించాలని తల్లిదండ్రులను చరణ్ కోరాడు. 'పిల్లలపై ఈ సినిమా ఎంత ప్రభావం చూపుతుందో నేను చెప్పలేను. కానీ ఈ సినిమా చూపించిన తల్లిదండ్రులు మాత్రం అసంతృప్తి చెందరు" అని హామీ ఇచ్చాడు. గతంలో భోపాల్‌లో జరిగిన ఈవెంట్లో హిందీ మాట్లాడే ప్రయత్నంలో చరణ్ గందరగోళానికి గురయ్యాడు. ఒక దశలో భోపాల్ అనడానికి బదులు బిహార్ అన్నాడు. చివర్లో క్రికెటర్ బుమ్రాను ఫుట్‌బాల్ ప్లేయర్‌గా పేర్కొనడంతో సోషల్ మీడియాలో ట్రోలింగ్ ఎదుర్కొన్నాడు. బుమ్రాకు సంబంధించి వివరణ ఇచ్చినా, ట్రోలింగ్ మాత్రం ఆగలేదు. అందుకే ఈసారి ఇంగ్లిష్‌లోనే మాట్లాడాడు. మరోవైపు, పెద్ది సినిమాకు మద్రాస్ హైకోర్టు యాంటీ పైరసీ ఇంజెక్షన్ ఆర్డర్ మంజూరు చేసింది. సినిమా రిలీజ్ తర్వాత ఏదైనా క్లిప్స్ లీక్ చేయడం లేదా అక్రమంగా షేర్ చేయడం వంటివి జరిగితే, చిత్ర యూనిట్ చట్టరీత్యా చర్యలు తీసుకోవడానికి పూర్తి స్వేచ్చ ఉంటుంది. కోర్టు మధ్యంతర ఉత్తర్వుల ప్రకారం సినిమా కంటెంట్‌ను అనధికారికంగా అప్లోడ్, స్ట్రీమింగ్ లేదా షేర్ చేయరాదు. భారీ బడ్జెట్ చిత్రాలకు ఇలాంటి లీగల్ రక్షణ చర్యలు చాలా కీలకమనే చెప్పాలి. -
రాంచరణ్ పెద్దిని ఒవర్ హైప్ చేస్తున్నారా..?
-
చరణ్ డాన్స్‌తో వాటి అందం రెట్టింపు అయింది: ఏఆర్ రెహమాన్
మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్ హీరోగా బుచ్చిబాబు దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన పాటలు ప్రేక్షకులను ఊర్రూతలూగిస్తున్నాయి. మొదట విడుదలైన “చికిరి.. చికిరి” పాట దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించంది. “రయ్.. రయ్.. రారా” పాట కూడా భారీ హిట్ అయింది. తాజాగా విడుదలైన స్పెషల్ మాస్ సాంగ్ కూడా అభిమానులను ఆకట్టుకుంటోంది. అయితే ఈ పాటల్లో ఏదీ తన ఫేవరెట్ సాంగ్ కాదని ఈ చిత్ర సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ స్పష్టం చేశారు. ఎందుకంటే ఆయన అభిప్రాయం ప్రకారం, తనకు అత్యంత ఇష్టమైనవి ఈ చిత్రంలోని ఇంకా విడుదల కాని బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌లోని సాంగ్స్ అని తెలిపారు. ఈ సినిమాలో కీలకమైన రెండు మాంటేజ్ సాంగ్స్ ఉన్నాయట. వాటిలో ఒకటి అత్యంత ఎమోషనల్‌గా ఉంటుందని దర్శకుడు బుచ్చిబాబు కూడా ఓ ఇంటర్వూలో ధృవీకరించారు.రామ్‌చరణ్ గురించి రెహమాన్ మాట్లాడుతూ.. నేను పాటలు కంపోజ్ చేసినప్పుడు అవి బాగానే ఉన్నాయి. కానీ ఆ పాటలకు చరణ్ డాన్స్ చేసిన తర్వాత వాటి అందం రెట్టింపు అయింది. రీ-రికార్డింగ్ సమయంలో చరణ్ పెర్ఫామెన్స్ చూసి ఆశ్చర్యపోయాను. సినిమాలో బెస్ట్ పార్ట్ చరణ్ యాక్టింగ్ అని అన్నారు. కాగా స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కిన 'పెద్ది'లో జాన్వీ కపూర్ హీరోయిన్. కన్నడ హీరో శివరాజ్ కుమార్ కీలక పాత్ర చేశారు. జగపతిబాబు, దివ్యేందు ఇతర కీలక పాత్రలు చేశారు. ఈ చిత్రం జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంచి. -
క్లైమాక్స్ చూస్తే షాక్ అవుతారు.. ఉప్పెన కి మించి TWIST
-
'మా పాపను కూడా ఎత్తుకోలేకపోయా..': రామ్ చరణ్
మెగా ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తోన్న చిత్రం పెద్ది. ఈ మూవీ రామ్ చరణ్ డిఫరెంట్ పాత్రల్లో అభిమానులను మెప్పించనున్నారు. ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు డైరెక్షన్లో వస్తోన్న ఈ సినిమా జూన్ 4న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే ట్రైలర్ రిలీజ్ కాగా.. ఆడియన్స్ నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. ఏ క్రీడ ఆడాలన్నా పెద్దినే అనే స్పోర్ట్స్ కాన్సెప్ట్ ట్రైలర్ చూస్తేనే అర్థమవుతోంది. ఈ మూవీని స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కించిన సంగతి తెలిసిందే.ప్రస్తుతం పెద్ది మూవీ ప్రమోషన్లతో బిజీగా ఉన్నారు. ఈ సందర్భంగా డైరెక్టర్ బుచ్చిబాబుతో రామ్ చరణ్ తన అనుభవాలను పంచుకున్నారు. ముఖ్యంగా రెజ్లర్లతో సీన్ల గురించి వివరించారు. ఇసుకలో, ఎండలో షూటింగ్ చాలా కష్టంగా అనిపించలేదా అని బుచ్చిబాబ.. చెర్రీని ప్రశ్నించారు. దీనికి రామ్ చరణ్ బదులిస్తూ నేనైతే చాలా బాగా ఎంజాయ్ చేశానని అన్నారు. కష్టమైన పనిని ఇష్టంగా చేస్తే ఎలాంటి అలసట రాదన్నారు. అయితే కుస్తీలో చేయి పట్టి అదురు రావడంతో మా పాపను కూడా ఎత్తుకోలేకపోయానని తెలిపారు.మీరు నిజమైన పహిల్వాన్లను పెట్టారని రామ్ చరణ్ అన్నారు. వాళ్లు నటించమంటే.. రియల్‌గా ఆడేస్తున్నారని రామ్ చరణ్ గుర్తు చేశారు. తర్వాత మళ్లీ సారీ చెబుతున్నారని తెలిపారు. ఎందుకంటే వాళ్లలో నిజమైన స్పోర్ట్స్ మ్యాన్ స్పిరిట్ అనేది వాళ్లలో ఉంటుందని చెర్రీ వివరించారు. యాక్టింగ్ చేయమంటే వారికి అది రాదని అన్నారు. కాగా.. ఈ చిత్రంలో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్గా కనిపించనుంది. ఈ మూవీలో శృతిహాసన్ స్పెషల్ సాంగ్‌లో మెప్పించనుంది. -
‘పెద్ది’ కష్టం చూశారా? అయితే ఈ ఫోటోలు చూడాల్సిందే
-
జాన్వీని చూసి రామ్ చరణ్ షాక్ అయ్యాడట.. ఎందుకంటే?
-
పెద్దితో జాన్వీ శ్రీదేవి గారి రేంజికి వెళ్ళిపోతారు
-
పెద్ది తర్వాత బుచ్చిబాబుతో చరణ్ మరో మూవీ
-
రామ్ చరణ్ పెరఫార్మెన్స్ కి బాక్సాఫీస్ బద్దలవడం ఖాయం
-
రామ్ చరణ్ 'పెద్ది' మూవీ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ (ఫొటోలు)
-
'పెద్ది' స్టోరీ ఏంటి? ఊహించని ట్విస్ట్ గురించి అప్పుడే
'పెద్ది' ట్రైలర్ వచ్చేసింది. కొందరికి నచ్చింది. మరికొందరికి నచ్చలేదు. ముఖ్యంగా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ విషయంలో అసంతృప్తి ఎక్కువగా వినిపిస్తోంది. అదే టైంలో కంటెంట్ పరంగా మాత్రం స్టోరీపై రకరకాల డిస్కషన్స్ నడుస్తున్నాయి. ఇంతకీ 'పెద్ది' స్టోరీ ఏమై ఉండొచ్చు? ఊహించని ట్విస్ట్ ఏంటి?(ఇదీ చదవండి: చేతికైన గాయం గురించి క్లారిటీ ఇచ్చిన చరణ్)ఇప్పటివరకు వచ్చిన 'పెద్ది' ప్రమోషనల్ కంటెంట్‌లో హీరో పాత్ర క్రికెట్, కుస్తీ ఆడతాడు అన్నట్లు మాత్రమే చూపించారు. కానీ ట్రైలర్లో రన్నర్ అని కూడా రివీల్ చేశారు. అయితే క్రికెట్, రెజ్లింగ్‌కి సంబంధించిన సీన్స్ చూపించారు గానీ రన్నింగ్‌కి సంబంధించిన ఒక్క షాట్ కూడా పెట్టలేదు. చివరలో రన్నింగ్ ట్రాక్‌పైకి పెద్ది వెళ్తున్న సీన్ చూపించారు. 'పెద్ది బ్యాక్ ఆన్ హిజ్ ఫీట్' అనే డైలాగ్ వినిపించారు. దీంతోనే డిస్కషన్స్ మొదలయ్యాయి.బెల్లం ఫ్యాక్టరీలో పనిచేసే పెద్ది.. క్రికెట్, కుస్తీ, రన్నింగ్‌లో ఎక్స్పర్ట్. కానీ అనుకోని సంఘటనల వల్ల 'పెద్ది'.. ఒంటి కాలి వ్యక్తి అవుతాడు. అయినా సరే తనకున్న ప్రతిభతో పారా ఒలింపిక్స్ వరకు వెళ్తాడు. ఇదే ట్విస్ట్ అనిపిస్తోంది. గత కొన్నిరోజుల నుంచి ఇందులో రామ్ చరణ్ పాత్రకు కాలు ఉండదనే రూమర్స్ వినిపిస్తున్నాయి. అందుకు తగ్గట్లే దర్శకుడు బుచ్చిబాబు కూడా మూవీ చివరి 50 నిమిషాల ఎమోషనల్‌గా ఉంటుందని, చూస్తున్న ప్రతి ఒక్కరూ డిస్ట్రబ్ అవుతారని ఇంటర్వ్యూలో చెప్పాడు.డైరెక్టర్ బుచ్చిబాబు చెప్పిన మాటలు.. ట్రైలర్ చివరలో పెద్ది పాత్ర కుంటుతూ నడుస్తున్నట్లు అనిపించడం లాంటివి చూస్తుంటే.. ఈ దర్శకుడి గత చిత్రం 'ఉప్పెన'లానే ఇందులో 'కటింగ్' గ్యారంటీనా అని నెటిజన్లు మాట్లాడుకుంటున్నారు. మరి ఇందులో నిజానిజాలేంటి? అనేది తెలియాలంటే జూన్ 4 వరకు ఆగాల్సిందే.(ఇదీ చదవండి: ఆటకూలీ పోరాటం.. 'పెద్ది'పైనే టాలీవుడ్ భారమంతా!) -
చేతికైన గాయం గురించి క్లారిటీ ఇచ్చిన చరణ్
రామ్ చరణ్ 'పెద్ది' విడుదలకు సిద్ధమైంది. వచ్చే నెల 4న పాన్ ఇండియా వైడ్ రిలీజ్ కానుంది. సోమవారం మధ్యాహ్నం ముంబైలో ట్రైలర్ లాంచ్ అయింది. ఈ కార్యక్రమంలోనే తన చేతికైనా గాయం గురించి రామ్ చరణ్ క్లారిటీ ఇచ్చాడు.(ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చిన తెలుగు సినిమాలు)'చెయ్యి బాగానే ఉంది. బుచ్చిబాబు(దర్శకుడు) ఇచ్చిన బహుమతి ఇది. గత 25-30 రోజుల నుంచి కుస్తీ సన్నివేశాల షూటింగ్ చేశాం. ట్రైన్డ్ ఆర్టిస్టులని తీసుకురమ్మంటే నిజమైన పహిల్వాన్లని తీసుకొచ్చాడు. యాక్షన్ చెప్పగానే వాళ్లు బలంగా పట్టేసుకున్నారు. అందుకే చేతికి గాయమైంది. మణికట్టు దగ్గర ఎముక విరిగింది. 'పెద్ది'కి సంబంధించి ఇదో అందమైన జ్ఞాపకం' అని రామ్ చరణ్ చెప్పుకొచ్చాడు.'పెద్ది' షూటింగ్ టైంలో మూడుసార్లు చరణ్ గాయపడ్డారు. కుస్తీ ప్రాక్టీస్ చేస్తున్న టైంలో ఓసారి గాయపడగా.. రీసెంట్గా చేసిన చిత్రీకరణలో కంటికి, మణికట్టుకి గాయాలయ్యాయి. రెండు మూడు రోజుల్లో వాటికి సంబంధించి సర్జరీలు జరగనున్నాయని నిర్మాత చెప్పారు. అయితే మణికట్టుకి ఎలా గాయమైందని ఇప్పుడు చరణ్ స్వయంగా చెప్పాడు.స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో చరణ్.. క్రికెటర్, రెజ్లర్, రన్నర్‌గా కనిపించబోతున్నాడు. పల్లెటూరిలో ఉండే ఇతడు ఢిల్లీకి వెళ్లి కూలీపని ఎందుకు చేయాల్సి వచ్చింది? ఈ ప్రయాణంలో పెద్ది ఎలాంటి సవాళ్లు ఎదుర్కొన్నాడనేదే స్టోరీలా అనిపిస్తుంది. ట్రైలర్లో మూవీ ఎలా ఉండబోతుందో చూపించారు గానీ స్టోరీపై పెద్దగా హింట్ ఇవ్వలేదు. బుచ్చిబాబు దర్శకుడు కాగా జాన్వీ కపూర్ హీరోయిన్. ఏఆర్ రెహమాన్ సంగీతమందించాడు.(ఇదీ చదవండి: ఆటకూలీ పోరాటం.. 'పెద్ది'పైనే టాలీవుడ్ భారమంతా!) -
పెద్ది మూవీ హీరోయిన్.. అందుకే దూరంగా ఉందా?
ప్రస్తుతం టాలీవుడ్లో అందరి చూపులు పెద్ది సినిమా వైపే ఉన్నట్లు కనిపిస్తోంది. రామ్ చరణ్ హీరోగా వస్తోన్న ఈ చిత్రం జూన్ 4న థియేటర్లలో సందడి చేసేందుకు వచ్చేస్తోంది. ఈ నేపథ్యంలోనే మేకర్స్ ప్రమోషన్స్‌తో ఫుల్ బిజీ అయిపోయారు. ఈ నెల 18న పెద్ది ట్రైలర్ రిలీజ్ చేస్తామని ఇప్పటికే ప్రకటించారు. డైరెక్టర్ బుచ్చిబాబు సనా సైతం పెద్ది ప్రమోషన్స్‌లో ఫుల్ యాక్టివ్‌గా పాల్గొంటున్నారు. అంతేకాకుండా ట్రైలర్ కోసం మెగా ఫ్యాన్స్ సైతం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.ఈ నేపథ్యంలోనే పెద్ది మూవీ గురించి మరో చర్చ మొదలైంది. ఈ సినిమా హీరోయిన్ జాన్వీ కపూర్ ఎక్కడా కనిపించకపోవడంతో ఫ్యాన్స్ ఫీలవుతున్నారు. మూవీ ప్రమోషన్స్ వీడియోల్లోనూ జాన్వీ పెద్దగా కనిపించడం లేదు. ఈ నేపథ్యంలో జాన్వీ పెద్ది ప్రమోషన్స్‌కు దూరంగా ఉండడంపై టాలీవుడ్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది.కారణం అదేనా??అయితే జాన్వీ కపూర్ కేవలం భారీ రెమ్యూనరేషన్ కోసమే ఈ ప్రాజెక్టుకు సంతకం చేసిందని ఓ టాక్ వినిపిస్తోంది. అంతేకాకుండా సినిమాలో తన పాత్రకు పెద్దగా ప్రాధాన్యత లేకపోవడం వల్లే ప్రమోషన్లకు దూరంగా ఉండాలని నిర్ణయించుకుందని ఓ కథనంలో వెల్లడైంది.ఈ విషయంపై చిత్ర యూనిట్ నుంచి ఇంకా ఎలాంటి క్లారిటీ రాలేదు. అయితే ట్రైలర్ రిలీజ్‌కు వేడుకలోనైనా జాన్వీ కపూర్ కనిపించే అవకాశమున్నట్లు తెలుస్తోంది. ఎందుకంటే ముంబయిలో ట్రైలర్ రిలీజ్‌కు ప్లాన్ చేస్తున్నారు. అయితే ఒకవేళ ప్రమోషన్ల విషయంలో జాన్వీ వెనక్కి తగ్గితే అది ఆమె కెరీర్‌పై ప్రభావం చూపే ఛాన్స్ ఉంది. ఎందుకంటే ‘పెద్ది’ లాంటి పాన్ ఇండియా చిత్రంతో జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చే అవకాశాన్ని బాలీవుడ్ బ్యూటీ మిస్ చేసుకున్నట్లే. -
రామ్ చరణ్ ‘పెద్ది’ మూవీ ఈ ఫోటోలు చూశారా...(ఫొటోలు)
-
‘పెద్ది’లో ఆటే కాదు.. అసలు కథే వేరే!
టాలీవుడ్ బాక్సాఫీస్ గత కొంతకాలంగా డల్ అయిపోయింది. చాలా వారాలుగా పెద్ద సినిమాలేవి విడుదల కావడం లేదు. చిన్న చిత్రాలేవి ఆశించిన స్థాయిలో విజయం సాధించలేదు. దీంతో థియేటర్స్ దగ్గర సందడే కనిపించడం లేదు. మళ్లీ ఆ సందడి రావాలంటే ఓ భారీ చిత్రం రావాలి.. సూపర్ హిట్ కొట్టాలి. అందుకే ఇప్పుడు అందరి చూపులు ‘పెద్ది’వైపు ఉన్నాయి. చాలా రోజుల తర్వాత తెలుగు నుంచి విడుదల అవుతున్న పాన్ ఇండియా చిత్రం ఇది. జూన్ 4న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతుంది. ఒక్క రోజు ముందే అంటే జూన్ 3నే ప్రీమియర్లతో పెద్ది సందడి మొదలవుంది. ఇప్పటికే ప్రమోషన్స్ మొదలయ్యాయి. వరుస ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. మే 18న ట్రైలర్ రిలీజ్ చేస్తారు. ఆ తర్వాత రామ్ చరణ్ కూడా ప్రమోషన్లలో పాల్గొంటాడు. ఇలా నెల మొత్తం ఇండస్ట్రీలో పెద్ది టాపిక్కే నడుతుంది.ఇదిలా ఉండగా.. పెద్దికి సంబంధించి ఓ ఆసక్తికర వార్త బయటకు వచ్చింది. ఇది కేవలం గ్రామీణ నేపథ్యంలో సాగే స్పోర్ట్స్ డ్రామా మాత్రమే కాదట. అంతకు మించిన స్టోరీ సినిమాలో ఉందట. ఆటతో పాటు ఊరికి సంబంధించిన ఎమోషన్ని ఈ కథలో బలంగా చూపించబోతున్నాడట దర్శకుడు బుచ్చిబాబు. ఊరి బాగుకోసం హీరో ఏం చేశాడనేది ఈ సినిమా కథ. దానికి స్పోర్ట్స్ బ్యాక్‌గ్రౌండ్‌ని ఎంచుకొని.. అద్భుతమైన సన్నివేశాలను అల్లాడట బుచ్చిబాబు.కోచ్‌గా శివరాజ్ కుమార్, హీరో తండ్రిగా జగపతిబాబు పాత్రలను కూడా బలంగా తీర్చిదిద్దాడట. హీరోతో పాటు ఈ రెండు పాత్రల నిడివి కూడా ఎక్కువగానే ఉంటుందని సమాచారం. సినిమాలలో కీలక పాత్రల తీరు ఎలా ఉంటుందో ట్రైలర్లో చూపించే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటి వరకు పెద్ది కథ ఏంటి అనేది ఎవరికీ తెలియదు. ఎక్కడ లీక్ కూడా కాలేదు. ట్రైలర్ వస్తే కానీ అసలు ఈ సినిమా స్టోరీ ఏంటి అనేది తెలియదు. కుస్తీ, క్రికెట్ ఆటలకు ఈ కథతో ఉన్న సంబంధం ఏంటనేది కూడా ట్రైలర్లో చూపించే అవకాశం ఉంది. -
రామ్ చరణ్ పెద్ది.. నార్త్ రైట్స్ దక్కించుకున్న ప్రముఖ నిర్మాణ సంస్థ
మెగా ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తోన్న మూవీ పెద్ది. ఈ మూవీలోని రామ్ చరణ్ పహిల్వాన్ లుక్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంది. ఇప్పటికే రెండు సార్లు వాయిదా పడినా ఈ చిత్రం జూన్ 4న ప్రేక్షకుల ముందుకు రానుంది. రూరల్ స్పోర్ట్స్ డ్రామాగా వస్తోన్న ఈ మూవీకి బుచ్చిబాబు సనా దర్శకత్వం వహించారు. పెద్ది ట్రైలర్‌ను మే 18న విడుదల చేస్తామని ఇప్పటికే ప్రకటించారు.తాజాగా ఈ మూవీ నార్త్ ఇండియా రైట్స్‌ను ప్రముఖ నిర్మాణ సంస్థ జియో స్టూడియోస్ దక్కించుకుంది. ఈ విషయాన్ని అఫీషియల్‌గా ప్రకటించారు. హీందీతో పాటు తెలుగు హక్కులను కూడా జియో స్టూడియోస్ సొంతం చేసుకుంది. కాగా.. ఈ చిత్రంలో రామ్ చరణ్ సరసన బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్గా మెప్పించనుంది. పెద్ది మూవీ స్పెషల్ సాంగ్‌లో కోలీవుడ్ భామ శృతిహాసన్ స్టెప్పులు వేయనుంది. ఈ మూవీకి ఏఆర్ రెహమాన్ సంగీతమందించారు. Excited to bring Peddi to theatres across North India in Hindi & Telugu.Peddi in cinemas worldwide on 4th June.#GetReadyForPeddi 💥💥Mega Power Star @AlwaysRamCharan @NimmaShivanna #JanhviKapoor @BuchiBabuSana @arrahman @RathnaveluDop @artkolla @NavinNooli @bomanirani… pic.twitter.com/TvSYP8hRzt— Jio Studios (@jiostudios) May 12, 2026 -
వెయిటింగ్ ఈజ్ ఓవర్.. పెద్ది ట్రైలర్ రిలీజ్ ఎప్పుడంటే?
రామ్ చరణ్ హీరోగా వస్తోన్న రూరల్ స్పోర్ట్స్ డ్రామా పెద్ది. ఈ మూవీ కోసం మెగా ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ సినిమాకు ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు సనా దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ డేట్ ప్రకటించిన మేకర్స్ ప్రమోషన్స్‌తో బిజీ అయిపోయారు. ఈ నేపథ్యంలోనే ట్రైలర్ రిలీజ్ డేట్‌ను ప్రకటించారు.ఈనెల 18న పెద్ది మూవీ ట్రైలర్ రిలీజ్ చేయనున్నట్లు వెల్లడించారు. ఈ విషయాన్ని దర్శకుడు బుచ్చిబాబు సనా ప్రకటించారు. ఈ మేరకు పెద్ది మూవీ పోస్టర్‌ను పంచుకున్నారు. దీంతో మెగా ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. ఈ బిగ్ ఈవెంట్ ఎక్కడనేది అనేది మాత్రం వెల్లడించలేదు. ఈ సారి పుష్ప-2 తరహాలో నార్త్‌లో ప్లాన్ చేస్తున్నారని తెలుస్తోంది. త్వరలోనే వేదికపై కూడా క్లారిటీ వచ్చే ఛాన్స్ ఉంది. ఈ చిత్రంలో చెర్రీ సరసన బాలీవుడ్ బ్యూటీ జాన్వీకపూర్ హీరోయిన్గా కనిపించనుంది. ఈ మూవీ జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో సందడి చేయనుంది.#PEDDI will stay in your hearts❤️TRAILER From 18th May💥💥#PEDDI WORLDWIDE RELEASE IN CINEMAS ON JUNE 4th, with PREMIERES on JUNE 3rd Mega Power Star @AlwaysRamCharan @NimmaShivanna #JanhviKapoor @BuchiBabuSana @arrahman @RathnaveluDop @artkolla @NavinNooli @bomanirani… pic.twitter.com/4Ub5AiwEGH— BuchiBabuSana (@BuchiBabuSana) May 11, 2026 -
రామ్ చరణ్ పెద్ది గాయాల కథ...
-
పుష్ప-2 బాటలో పెద్ది.. రన్ టైమ్ అన్ని గంటలా?
రామ్ చరణ్ హీరోగా వస్తోన్న రూరల్ స్పోర్ట్స్ డ్రామా పెద్ది. ఈ మూవీ కోసం మెగా ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి కాగా.. జూన్ 4న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ మూవీలో చెర్రీ సరసన బాలీవుడ్ భామ జాన్వీ కపూర్ కనిపించనుంది. త్వరలోనే పెద్ది ట్రైలర్‌ను రిలీజ్ చేయనున్నారు. ఇప్పటికే రిలీజైన టీజర్ గ్లింప్స్, రామ్ చరణ్ లుక్స్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. శ్రీకాకుళం బ్యాక్‌డ్రాప్‌లో బుచ్చిబాబు సనా ఈ మూవీని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు.తాజాగా ఈ మూవీ రన్‌టైమ్ నెట్టింట చర్చ మొదలైంది. ఈ సినిమా నిడివి దాదాపు 3 గంటల 20 నిమిషాలు ఉండనుందని తెలుస్తోంది. గతంలో రిలీజైన యానిమల్, కల్కి, పుష్ప-2, ఆర్ఆర్ఆర్ సినిమా రన్ టైమ్ కూడా 3 గంటలకు పైగానే ఉంది. ఈ సినిమాలన్నీ బాక్సాఫీస్ వద్ద బ్లాక్‌బస్టర్‌గా నిలిచాయి. తాజాగా ఈ రన్ టైమ్ చూస్తుంటే పెద్ది కూడా సూపర్ హిట్ కావడం ఖాయమని సినీ వర్గాల టాక్. అంతేకాకుండాఉత్తరాదిలో ట్రైలర్ రిలీజ్..పెద్ది ట్రైలర్ విషయంలో బుచ్చిబాబు పుష్ప-2 ఫాలో అవుతున్నట్లు తెలుస్తోంది. గతంలో పుష్ప-2 ట్రైలర్‌ను బిహార్‌లోని పాట్నాలో రిలీజ్ చేశారు. దీంతో నార్త్ ఆడియన్స్‌లోనూ ఓ రేంజ్లో వసూళ్లు సాధించింది. ఇప్పుడు అదే బాటలో పెద్ది మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమా ట్రైలర్‌ను ఈ నెల 17న ఇండోర్ లేదా పాట్నాలో విడుదల చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని టాలీవుడ్లో ఇన్సైడ్ టాక్ నడుస్తోంది. దీనిపై త్వరలోనే క్లారిటీ రానుంది. కాగా.. ఇప్పటికే రెండు సార్లు వాయిదా పడిన ఈ చిత్రం జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో సందడి చేయనుంది. -
పెద్ది సెట్స్‌లో మెగాస్టార్ సందడి.. వీడియో వైరల్
రామ్ చరణ్ మూవీ పెద్ది షూటింగ్ సెట్లో మెగాస్టార్ సందడి చేశారు. షూటింగ్ సెట్‌కు వెళ్లిన దర్శకుడు బుచ్చిబాబు, సుకుమార్‌తో ముచ్చటించారు. దీనికి సంబంధించిన వీడియోను బుచ్చిబాబు సోషల్ మీడియాలో పంచుకున్నారు. ది బాస్, మై గురు పెద్ది సెట్స్‌లో అడుగుపెట్టారని.. ఇది నా జీవితంలో ఓ మధురమైన జ్ఞాపకమంటూ పోస్ట్ చేశారు. పెద్దిని ఆదర్శంగా తీసుకుని నా కండలు పెంచానని ఫన్నీగా రాసుకొచ్చారు. ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.రామ్ చరణ్- బుచ్చిబాబు కాంబోలో వస్తోన్న రూరల్ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా పెద్ది. ఈ మూవీలో చెర్రీ సరసన బాలీవుడ్ భామ జాన్వీ కపూర్ కనిపించనుంది. ఇప్పటికే షూటింగ్ పూర్తయిన ఈ సినిమా జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో సందడి చేయనుంది. ఈ చిత్రంలోని స్పెషల్ సాంగ్‌లో కోలీవుడ్ బ్యూటీ శృతిహాసన్ సందడి చేయనుంది. ఈ చిత్రానికి ఏఆర్ రెహమాన్ సంగీతమందించారు. త్వరలోనే పెద్ది ట్రైలర్ రిలీజ్ చేసేందుకు మేకర్స్ రెడీ అవుతున్నారు.The BOSS and my GURU on sets of #Peddi...It's one of the best memories ❤️And yes...I've built a bit of muscle with my Peddi's inspiration 💪🏻😅@KChiruTweets Sir @AlwaysRamCharan Sir ❤️❤️❤️🤗🤗🤗 pic.twitter.com/gvgcNmkffZ— BuchiBabuSana (@BuchiBabuSana) May 8, 2026 -
ఇంకా ట్రైలర్ రాలేదు.. అప్పుడే పెద్ది రికార్డ్..!
రామ్ చరణ్ హీరోగా వస్తోన్న రూరల్ స్పోర్ట్స్ డ్రామా పెద్ది. ఈ మూవీ కోసం మెగా ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి కాగా.. జూన్ 4న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ మూవీలో చెర్రీ సరసన బాలీవుడ్ భామ జాన్వీ కపూర్ కనిపించనుంది. ఇప్పటికే ఈ సినిమా ప్రీ టికెట్ బుకింగ్స్ ఓపెన్ అయ్యాయి. గురువారం నుంచే ఓవర్సీస్ ఆడియన్స్‌కు టికెట్స్ బుకింగ్స్ అందుబాటులోకి వచ్చేశాయి.ఓవర్సీస్లో తొలి రోజే ఊహించని రెస్పాన్స్ వచ్చింది. రిలీజైన 24 గంటల్లోపే లక్ష టికెట్స్ బుకింగ్స్ పూర్తయ్యాయి. నార్త్ అమెరికాలో అభిమానులు టికెట్ల కోసం ఎగబడ్డారు. జూన్ 3వ తేదీన ప్రీమియర్ షోల టికెట్స్ ఓపెన్ అవ్వగా కేవలం కొన్ని గంటల్లోనే కొనేశారు. దీంతో ఉత్తర అమెరికాలో అత్యంత వేగంగా లక్షకు పైగా టికెట్స్ అమ్ముడైన చిత్రంగా పెద్ది నిలిచింది. ఇటీవలే ఈ మూవీ ఫైనల్ కాపీ కూడా రెడీ అయిందని మేకర్స్ వెల్లడించారు. త్వరలోనే పెద్ది ట్రైలర్‌ను రిలీజ్ చేయనున్నారు.ట్రైలర్ రిలీజ్ కాకపోయినా పెద్దికి ఊహించని రెస్పాన్స్ వస్తోంది. ఇప్పటికే రిలీజైన టీజర్ గ్లింప్స్, రామ్ చరణ్ లుక్స్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. శ్రీకాకుళం బ్యాక్‌డ్రాప్‌లో బుచ్చిబాబు సనా ఈ మూవీని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఇప్పటికే రెండు సార్లు వాయిదా పడిన ఈ చిత్రం జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో సందడి చేయనుంది. ALL TIME RECORD 💥#PEDDI - FASTEST $100K+ Pre-Sales for North America Premieres🔥🔥🔥#PEDDITakeOver 🧨⚡️MEGA POWERSTAR #RamCharan's MASS HYSTERIA 💥💥MASSIVE Release by @PrathyangiraUS, Premieres On JUNE 3rd 🔥@AlwaysRamCharan @NimmaShivanna #JanhviKapoor @BuchiBabuSana… pic.twitter.com/NkA8VDFKwi— Prathyangira Cinemas (@PrathyangiraUS) May 8, 2026 -
రామ్ చరణ్ పెద్ది.. ఫైనల్ కాపీ రెడీ.. ప్రీమియర్స్ ఎప్పుడంటే?
రామ్ చరణ్ పెద్ది మూవీ కోసం మెగా ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే రెండుసార్లు వాయిదా పడిన ఈ సినిమా జూన్ 4న థియేటర్లలో సందడి చేయనుంది. ఐటమ్ సాంగ్ షూటింగ్ కూడా పూర్తి కావడంతో మేకర్స్ ఫైనల్ కాపీని రెడీ చేస్తున్నారు. తాజాగా పెద్ది ఫైనల్ కాపీ కూడా పూర్తయిందని మేకర్స్ వెల్లడించారు. ఎడిటింగ్ పూర్తి కావడంతో ఎడిటర్‌తో కలిసి దర్శకుడు బుచ్చిబాబు దిగిన ఫోటోను షేర్ చేశారు.పెద్ది ఫైనల్ కాపీ సిద్ధం కావడంతో మెగా ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. ఈ సినిమా ప్రీమియర్స్ ఉన్నాయని నిర్మాణ సంస్థ వృద్ధి సినిమాస్ ప్రకటించింది. జూన్ 3న సాయంత్రం నుంచే పెద్ది ప్రీమియర్ షోలు ప్రదర్శించనున్నారు. ఈ చిత్రంలో బాలీవుడ్ భామ జాన్వీ కపూర్ హీరోయిన్గా కనిపించనుంది. ఈ మూవీలోని ప్రత్యేక సాంగ్‌లో కోలీవుడ్ బ్యూటీ శృతిహాసన్ సందడి చేయనుంది. ఈ సినిమాకు ఏఆర్ రెహమాన్ సంగీతమందించిన సంగతి తెలిసిందే. The #PEDDI Edit has been locked🔒All set and ready for massive premieres from JUNE 3rd 2026💥💥💥#PEDDI WORLDWIDE RELEASE IN CINEMAS ON June 4th ❤🔥#GetReadyForPeddi 💥💥Mega Power Star @AlwaysRamCharan @NimmaShivanna #JanhviKapoor @BuchiBabuSana @arrahman… pic.twitter.com/e240haEItl— Vriddhi Cinemas (@vriddhicinemas) May 7, 2026 -
పెద్ది కథ విన్నాక తేరుకోలేకపోయా..! ఆర్ట్ డైరెక్టర్ షాకింగ్ కామెంట్స్
-
‘పెద్ది’లో వాటిని గుర్తుపట్టలేరు.. నేనే షాకయ్యా : అవినాష్
‘‘పెద్ది’ కథ విని షాక్ అయ్యాను. నా పదేళ్ల కెరీర్లో ఒక సినిమా కథకు ఇంతలా ఎగ్జైట్ కావడం ఇదే తొలిసారి. ఈ సినిమా కథ అంతలా నన్ను కదిలించింది’’ అని తెలిపారు ప్రొడక్షన్ డిజైనర్ అవినాష్ కొల్లా. రామ్‌చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో రూపొందించిన చిత్రం ‘పెద్ది’. జాన్వీ కపూర్ హీరోయిన్గా నటించారు. సుకుమార్ రైటింగ్స్ సమర్పణలో వృద్ధి సినిమాస్ పతాకంపై వెంకట సతీష్ కిలారు నిర్మించిన ఈ సినిమా జూన్ 4న విడుదల కానుంది. బుధవారం జరిగిన విలేకరుల సమావేశంలో అవినాష్ కొల్లా మాట్లాడుతూ– ‘‘విజయనగరం నేపథ్యంలో 1970–1980 కాలంలో జరిగే కథ ఇది. గతంలో కొన్ని పీరియాడికల్ సినిమాలకు పని చేసిన అనుభవం నాకు ఉంది. అది ‘పెద్ది’కి ఉపయోగపడింది. ఈ సినిమాలో స్క్రాచ్ నుంచి వేసిన సెట్స్ 24 ఉంటాయి. అలా కాకుండా సెటప్స్ అయితే దాదాపు 60–70 పైనే ఉంటాయి. విజయనగరం ఏరియాలోని క్లాక్ టవర్, అక్కడి వీధులు... వీటన్నింటిని రీ క్రియేట్ చేశాం. విజయనగరం చుట్టుపక్కల ప్రాంతాలను కూడా డిజైన్ చేశాం. కుస్తీ సన్నివేశాల కోసం అండర్‌గ్రౌండ్ సెటప్ వేశాం. ఒక సినిమాకి సెట్ వేసినప్పుడు అది ప్రేక్షకులకు సెట్ అని తెలియకూడదు. నా వరకు ‘పెద్ది’ సినిమాకు వేసిన సెట్స్‌ను అవి సెట్స్ అని ప్రేక్షకులు గ్రహించలేరు. ఈ సినిమాకి ఓ హిల్ స్టేషన్లా ఉండే ఊరు కావాలి. ఈ సెట్‌ను హైదరాబాద్‌లోని బూత్ బంగ్లాలో వేశాం. ఈ సెట్ వేయడం సవాల్‌గా అనిపించింది. ప్రస్తుతం నానీగారి ‘ది ప్యారడైజ్’ సినిమా చేస్తున్నాను. అలాగే చిరంజీవి–బాబీగార్ల కాంబినేషన్లోని సినిమాకు వర్క్ చేస్తున్నాను’’ అని చెప్పారు. -
'ఆ విషయంలో నన్ను క్షమించండి.. పెద్ది తీసేయడం అంత ఈజీ కాదు'
మెగా ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తోన్న పెద్ది మూవీ రిలీజ్ డేట్ వచ్చేసింది. ఈ మూవీని జూన్‌లో ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తామని ఇప్పటికే ప్రకటించారు. తాజాగా ఇవాళ విడుదల తేదీని రివీల్ చేశారు మేకర్స్. ఈ చిత్రాన్ని జూన్ 4న రిలీజ్ చేయనున్నట్లు అఫీషియల్‌గా వెల్లడించారు. హైదరాబాద్‌లో ప్రెస్ మీట్ ఏర్పాటు చేసిన మేకర్స్ రిలీజ్ తేదీని ముందుకు తీసుకొచ్చారు. ఈ రూరల్ స్పోర్ట్స్ డ్రామాకు ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు సనా దర్శకత్వం వహించారు. ఈ సందర్భంగా ఈవెంట్‌కు హాజరైన పెద్ది డైరెక్టర్ ఆసక్తికర కామెంట్స్ చేశారు.బుచ్చిబాబు మాట్లాడుతూ.. 'ఏప్రిల్ 30న మేం రానందుకు నన్ను క్షమించండి. జూన్ 4న వస్తున్నందుకు ఆశీర్వదించండి. ప్రతి ఒక్కరికీ థ్యాంక్ యూ సో మచ్. పెద్ది మీ అందరికీ కనెక్ట్ అవుతుంది. పెద్దిని మీ హృదయాల్లోంచి తీసేయడం అంత ఈజీ కాదు. జూన్ 4న చరణ్ సార్‌పై ఉన్న నా ప్రేమను చూస్తారు. ఈ అవకాశమిచ్చిన చరణ్ సార్‌కు ధన్యవాదాలు' తెలిపారు. ఈ ప్రెస్‌మీట్‌కు దర్శకుడు సుకుమార్, నిర్మాత సతీశ్ కిలారు, సినిమాటోగ్రాఫర్ రత్నవేలు కూడా హాజరయ్యారు. -
మెగా ఫ్యాన్స్‌కు పండగే.. కాస్తా ముందుగానే పెద్ది రిలీజ్
మెగా ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తోన్న పెద్ది మూవీ రిలీజ్ డేట్ వచ్చేసింది. ఈ మూవీని జూన్‌లో ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తామని ఇప్పటికే ప్రకటించారు. తాజాగా ఇవాళ విడుదల తేదీని రివీల్ చేశారు మేకర్స్. ఈ చిత్రాన్ని జూన్ 4న రిలీజ్ చేయనున్నట్లు అఫీషియల్‌గా వెల్లడించారు. దీంతో కాస్తా ముందుగానే పెద్దిని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఈ రూరల్ స్పోర్ట్స్ డ్రామాకు ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు సనా దర్శకత్వం వహించారు.ఈ చిత్రంలో రామ్ చరణ్ సరసన బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్గా కనిపించనుంది. ఈ మూవీలోని ఐటమ్ సాంగ్‌లో కోలీవుడ్ భామ శృతిహాసన్ కనిపించనుంది. ఇప్పటికే ఈ సాంగ్ షూట్ కూడా పూర్తయింది. ఇప్పటికే రెండుసార్లు వాయిదా పడిన పెద్దిని ఎట్టకేలకు జూన్ 4న బిగ్ స్క్రీన్‌పైకి తీసుకొస్తున్నారు. దీంతో ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తోన్న మెగా ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్ వచ్చేసింది. ఈ మూవీకి ఏఆర్ రెహమాన్ సంగీతమందించారు. -
'పెద్ది'లో చరణ్ మూడో లుక్..? మెగా అభిమానులకు సర్ ప్రైజ్!
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు దర్శకత్వంలో వస్తున్న భారీ చిత్రం పెద్ది. పెద్దిపై ఆసక్తి రోజురోజుకూ పెరుగుతోంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి రెండు లుక్స్ వచ్చాయి. అయితే ఇప్పుడు ఈ సినిమాలో చరణ్‌కు మూడో లుక్ కూడా ఉందని తెలుస్తోంది. కానీ దాన్ని సీక్రెట్‌గా ఉంచుతున్నారట. ఈ విషయాన్ని రామ్ చరణ్ ఫిట్నెస్ ట్రయినర్ వెల్లడించినట్టు వార్తలు వస్తున్నాయి.పెద్ది సినిమా తొలి టీజర్లో చరణ్ పల్లెటూరి క్రికెటర్‌గా కనిపించాడు. ఇటీవల పెద్ది పహిల్వాన్ లుక్ ను కూడా విడుదల చేశారు. ఈ రెండూ మాత్రమే కాకుండా చరణ్‌కు ఈ చిత్రంలో మరో లుక్ కూడా ఉందనేది తాజా సమాచారం. ఈ మూడో లుక్ మెగా అభిమానులతో పాటు సినీ ప్రేక్షకులందరికీ పెద్ద సర్ప్రైజ్ అవుతుందని టాక్ వినిపిస్తోంది. అయితే దీనిపై అధికారిక ప్రకటన మాత్రం ఇంకా రాలేదు.ఇక ఇదిలా ఉంటే.. మరోవైపు పెద్ది విడుదల తేదీపై సస్పెన్స్ మాత్రం ఇంకా కొనసాగుతూనే ఉంది. ఇటీవల స్వయంగా దర్శకుడు బుచ్చిబాబు జూన్ చివరి వారం రిలీజ్ అని ప్రకటించాడు. కానీ ఇప్పుడు కొత్త ఊహాగానం చెలరేగుతోంది. టాక్సిక్ విడుదల వాయిదా పడటంతో ఆ తేదీకి, అంటే జూన్ 4వ తేదీకి పెద్ది వస్తుందనే ప్రచారం మొదలైంది.చరణ్-జాన్వి కపూర్ హీరో హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాలో శృతిహాసన్ ఓ ప్రత్యేక గీతంలో కనిపించనుంది. ఏఆర్ రెహ్మాన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు. గేమ్ ఛేంజర్ తర్వాత రామ్ చరణ్ నుంచి వస్తున్న సినిమా ఇదే కావడంతో మెగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. -
రామ్ చరణ్ పెద్ది.. రిలీజ్ డేట్ మారనుందా?
మెగా ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తోన్న చిత్రం పెద్ది. బుచ్చిబాబు సనా డైరెక్షన్లో వస్తోన్న రూరల్ స్పోర్ట్స్ డ్రామా జూన్‌లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే రెండు సార్లు వాయిదా పడిన ఈ చిత్రాన్ని జూన్ 25న ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తామి బుచ్చిబాబు ఇటీవలే ఓ ఈవెంట్లో ప్రకటించారు. ఓ ఐటమ్ సాంగ్ షూట్ పెండింగ్‌లో ఉండగా.. దాదాపు అది కూడా ఈ రోజుతో పూర్తయింది. దీంతో మూవీ టీమ్ పోస్ట్ ప్రొడక్షన్ పనులతో బిజీగా ఉన్నారు.రిలీజ్ డేట్ మారే ఛాన్స్..?అయితే పెద్ది మూవీ కాస్తా త్వరగానే ప్రేక్షకుల ముందుకు రానుందని నెట్టంట టాక్ వినిపిస్తోంది. జూన్ 4 రిలీజ్ చేయాలని మేకర్స్ ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. ఎందుకంటే ఆ రోజు విడుదల కావాల్సిన యశ్ టాక్సిక్ ఊహించినట్లే వాయిదా పడింది. దీంతో పెద్దిని 4 వ తేదీని రిలీజ్ చేసే ప్లాన్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. అదే జరిగితే మెగా ఫ్యాన్స్‌కు పండగే. అనుకున్న టైమ్ కంటే ముందుగానే పెద్దిని బిగ్ స్క్రీన్‌పై చూసే అవకాశం రానుంది. దీనిపై మేకర్స్ నుంచి క్లారిటీ రావాల్సి ఉంది. దీనిపై త్వరలో అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది. -
వారణాసి తర్వాత మహేష్ బాబు సర్పైజ్.. బుచ్చిబాబుతో క్రేజీ కాంబో?
-
'పెద్ది' సందేహాలన్నీ క్లియర్ చేసిన బుచ్చిబాబు
రామ్ చరణ్ 'పెద్ది' సినిమా వాయిదా మీద వాయిదా పడుతూనే ఉంది. ఎట్టకేలకు జూన్‌లో వస్తుందని అధికారికంగా ప్రకటించారు గానీ తేదీ ఎప్పుడనేది ఇంకా క్లారిటీ ఇవ్వట్లేదు. అలానే ఐటమ్ సాంగ్ షూటింగ్ ఎప్పుడు చేస్తారు? అందులో చేసే బ్యూటీ ఎవరు? తదితర వివరాలపై స్పష్టత రాకపోయేసరికి అభిమానులు ఫ్రస్టేట్ అవుతున్నారు. ఇప్పుడు వీటన్నింటిపై దర్శకుడు బుచ్చిబాబు క్లారిటీ ఇచ్చేశారు.(ఇదీ చదవండి: ఇవి ఉన్నాయి.. అవి వదిలేశా.. సమంత పోస్ట్ వైరల్)ధనుష్ 'కర' సినిమా ఈనెల 30న తెలుగు, తమిళంలో రిలీజ్ కానుంది. దీని ప్రీ రిలీజ్ ఈవెంట్.. ఆదివారం రాత్రి హైదరాబాద్‌లో జరిగింది. ఈ వేడుకలో పాల్గొన్న దర్శకుడు బుచ్చిబాబు.. జూన్ 25న 'పెద్ది' సినిమా థియేటర్లలోకి వస్తుందని ప్రకటించాడు. అలానే ఐటమ్ సాంగ్ చిత్రీకరణ జరుగుతుందని చెప్పాడు. దీంతో చరణ్ అభిమానులు ఇప్పుడు కాస్త ఊపిరి పీల్చుకుంటున్నారు.విలేజ్ స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ కథతో 'పెద్ది' తీస్తున్నారు. చరణ్ సరసన జాన్వీ కపూర్ హీరోయిన్. శివరాజ్ కుమార్ కీలక పాత్ర చేస్తుండగా.. జగపతిబాబు, దివ్యేందు తదితరుల ఇతర పాత్రలు చేస్తున్నారు. ఏఆర్ రెహమాన్ సంగీతమందించాడు. ఇప్పటికే రెండు పాటలు రిలీజ్ చేయగా అవి రెండూ సూపర్ హిట్ అయ్యాయి.(ఇదీ చదవండి: పెళ్లి చేసుకుని షాకిచ్చిన టాలీవుడ్ హీరోయిన్.. భర్త ఎవరంటే?)#Peddi - 25th June 🔒#RamCharan pic.twitter.com/Jnrer2KFrY— Suresh PRO (@SureshPRO_) April 26, 2026 -
రామ్ చరణ్ పెద్ది రిలీజ్.. భారీ రికార్డ్‌కు మేకర్స్ ప్లాన్..!
రామ్ చరణ్- బుచ్చిబాబు సనా కాంబోలో వస్తోన్న మోస్ట్ అవైటేడ్ మూవీ పెద్ది. శ్రీకాకుళం బ్యాక్‌డ్రాప్‌లో రూరల్ స్పోర్ట్స్ డ్రామాగా వస్తోన్న ఈ చిత్రం కోసం మెగా ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే రెండు సార్లు వాయిదా పడడంతో అభిమానుల్లో మరింత ఆసక్తిని పెంచుతోంది. ఓ ఐటమ్ సాంగ్ మినహా ఈ మూవీ షూట్ మొత్తం దాదాపు పూర్తయింది. ప్రస్తుతం ఈ సాంగ్‌ను హైదరాబాద్‌లోనే షూట్ చేస్తున్నారు. ఈ స్పెషల్ సాంగ్‌లో కోలీవుడ్ బ్యూటీ శృతిహాసన్ రామ్ చరణ్‌తో కలిసి స్టెప్పులు వేయనుంది.అయితే పెద్ది మూవీ జూన్‌లో రిలీజ్ చేస్తామని మేకర్స్ ప్రకటించారు. జూన్ 25న ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు సోషల్ మీడియాలో టాక్ నడుస్తోంది. విడుదల తేదీపై ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. అంతలోనే పెద్ది ప్రీమియర్స్‌కు సంబంధించిన మరో క్రేజీ టాక్ వినిపిస్తోంది. పెద్ది సినిమా ప్రీమియర్స్ విషయంలో కొత్త రికార్డ్ సెట్ చేయనుందనే వార్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. జూన్ 24 న సాయంత్రం ఆరు గంటల నుంచే పెద్దఎత్తున ప్రీమియర్ షోలు ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో మెగా ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. అయితే ఈ విషయంపై మేకర్స్ ఇంకా క్లారిటీ ఇవ్వాల్సి ఉంది. మరోవైపు రామ్‌చరణ్ స్పెషల్ సాంగ్‌లో స్టెప్స్ ఫ్యాన్స్‌కు గూస్ బంప్స్ తెప్పిస్తాయని అంటున్నారు. దీంతో పెద్ది మూవీపై అభిమానుల్లో అంచనాలు మరింత పెంచేసింది. కాగా.. ఈ సినిమాలో చెర్రీ సరసన జాన్వీ కపూర్ హీరోయిన్గా నటించింది. త్వరలోనే పెద్ది రిలీజ్ డేట్‌పై అధికారిక ప్రకటన వచ్చే ఛాన్స్ ఉంది. -
పెద్ది ఐటమ్ సాంగ్.. ఎట్టకేలకు స్టార్ హీరోయిన్ ఫిక్స్..!
రామ్ చరణ్ పెద్ది మూవీ కోసం మెగా ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే రెండు సార్లు రిలీజ్ వాయిదా వేయడంతో తీవ్ర నిరాశలో ఉన్నారు. ఇంకా ఓ ఐటమ్ సాంగ్ షూట్ పెండింగ్‌లో ఉండడంతో ఏప్రిల్ 30న రావాల్సిన పెద్ది జూన్‌కు షిఫ్టయ్యాడు. అయితే ఇప్పటి వరకు ఐటమ్ సాంగ్ కోసం హీరోయిన్ ఎంపిక చేయకపోవడంతో ఫ్యాన్స్‌లో క్యూరియాసిటీ మరింత పెరుగుతోంది. రోజుకొక హీరోయిన్ పేరు వినిపిస్తున్న వీటిపై అధికారిక ప్రకటనైతే రాలేదు.ఇటీవలే సంయుక్త మీనన్ ఈ ఐటమ్ సాంగ్ చేయనుందని టాక్ వినిపించింది. గతంలో మృణాల్ ఠాకూర్, మానస అని పలువురు కూడా తెరపైకొచ్చాయి. కానీ అంతలోనే ఊహించని మరో స్టార్ హీరోయిన్ పేరు బయటకొచ్చింది. పెద్ది ఐటమ్ సాంగ్‌లో కోలీవుడ్ భామ శృతి హాసన్ చేయనుందని లేటేస్ట్ టాక్ నడుస్తోంది. దాదాపు శృతిని మేకర్స్ ఖరారు చేశారని తెలుస్తోంది. అయితే దీనిపై మేకర్స్ నుంచి ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.ఒకవేళ ఇదే నిజమైతే పెద్ది సరసన శృతి హాసన్ చిందులేయనుంది. ఈ ఐటమ్ సాంగ్‌ను ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో ఫ్యాన్స్‌లో క్యూరియాసిటీ మరింత పెరిగింది. ఈ సాంగ్ కచ్చితంగా స్పెషల్‌గా ఉండనున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రంలో జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తోంది. కన్నడ స్టార్ శివరాజ్ కుమార్ సైతం కీలక పాత్ర పోషిస్తున్నారు. శ్రీకాకుళం బ్యాక్‌డ్రాప్‌లో రూరల్ స్పోర్ట్స్ డ్రామాని బుచ్చిబాబు తెరకెక్కిస్తున్నారు. -
'పెద్ది' ఇంకెన్నాళ్లు? అప్డేట్ ఇచ్చిన బుచ్చిబాబు
రామ్ చరణ్ 'పెద్ది' సినిమా షూటింగ్ సాగుతూ..నే ఉంది. లెక్క ప్రకారం గత నెలలో రిలీజ్ అని చాన్నాళ్ల క్రితం ప్రకటించారు. తీరా డేట్ దగ్గరపడేసరికి నెల తర్వాత అంటే ఏప్రిల్ 30 పక్కా విడుదల చేస్తామని ఏకంగా పోస్టర్ వదిలారు. కొన్నిరోజుల ముందు మళ్లీ వాయిదా అని షాకిచ్చారు. జూన్‌లో వస్తుందని ప్రకటించారు కానీ డేట్ చెప్పలేదు. జూన్ కూడా వాయిదా పడొచ్చనే రూమర్స్ వినిపిస్తున్నాయి. సరిగ్గా ఈ టైంలో దర్శకుడు బుచ్చిబాబు.. షూటింగ్ అప్డేట్ ఇచ్చాడు. పోస్ట్ పెట్టాడు.(ఇదీ చదవండి: ఓటీటీలోకి తెలుగు డిస్ట్రబింగ్ సినిమా)మరో ఆరు రోజుల షూటింగ్ మాత్రమే మిగిలుందని చెప్పిన డైరెక్టర్ బుచ్చిబాబు.. 'మై పెద్ది' అని క్యాప్షన్ ఇచ్చి రామ్ చరణ్‌తో దిగిన ఫొటోలని సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఇతడు చెప్పిన దానిబట్టి చూస్తే ఐటమ్ సాంగ్ చిత్రీకరణ చివరలో పెట్టుకున్నారనమాట. ఈ పాటలో చరణ్‌తో డ్యాన్స్ చేసేందుకు హీరోయిన్ సంయుక్తని తీసుకున్నారని రూమర్స్ వచ్చాయి. బహుశా ఈమెనే ఖరారు చేసినట్లు తెలుస్తోంది. షూటింగ్ పూర్తయితే రెహమాన్ వర్క్ మొదలవుతుంది. ఈయన టైంకి ఔట్పుట్ డెలివరీ చేస్తేనే జూన్‌కి సినిమా వస్తుంది. లేదంటే మళ్లీ వాయిదా తప్పదు.విలేజ్ స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ స్టోరీగా తీస్తున్న 'పెద్ది'లో చరణ్, జాన్వీ కపూర్ హీరోహీరోయిన్లు. శివరాజ్ కుమార్, జగపతిబాబు, దివ్యేందు తదితరులు కీలక పాత్రలు చేస్తున్నారు. ఇందులోని ఐటమ్ సాంగ్ కోసం మృణాల్ ఠాకుర్, మానస వారణాసి తదితరుల పేర్లు వినిపించాయి. ఈ స్పెషల్ సాంగ్ కోసం బ్యూటీ దొరక్కే షూటింగ్ ఇన్నాళ్ల పాటు ఆలస్యమైందనే టాక్ కూడా ఇండస్ట్రీలో ఉంది. ఏదైతేనేం ఎట్టకేలకు షూటింగ్ అయితే ముగించేస్తున్నారనమాట.(ఇదీ చదవండి: అందరూ ఫెయిల్! మలయాళీ సినిమాలే ఎందుకు ఆడుతున్నాయి?) View this post on Instagram A post shared by Buchi babu sana (@buchibabu_sana) -
'పెద్ది' కష్టం.. 5 నిమిషాల సీన్‌కు 3నెలల సమయం
రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న కొత్త సినిమా ‘పెద్ది’.. దర్శకుడు బుచ్చిబాబు తెరకెక్కిస్తున్న ఈ చిత్రం జూన్‌లో విడుదల కానుంది. ఈ మూవీ కోసం పనిచేసిన ఫ్రేమ్ ఎక్స్ వీఎఫ్ఎక్స్ సంస్థ అధినేత నిలేష్ పలు వ్యాఖ్యలు చేశారు. తాజాగా ఇంగ్లీష్ మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చిన ఆయన మూవీ వీఎఫ్ఎక్స్ పనిగురించి మాట్లాడారు. వృద్ధి సినిమాస్ పతాకంపై వెంకట సతీశ్ కిలారు ఈ మూవీని నిర్మిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సంస్థలు సంయుక్తంగా సమర్పిస్తున్నాయి. ఏఆర్ రెహమాన్ సంగీత స్వరకర్త.పెద్ది సినిమా వీఎఫ్ఎక్స్ వర్క్‌కు సంబంధించి ఫ్రేమ్ ఎక్స్ అనే సంస్ధ పనిచేస్తుంది. మూవీలోని కొన్ని సీన్స్ గురించి ఆ సంస్థ అధినేత నిలేష్ పలు వ్యాఖ్యలు చేశారు.పెద్ది సినిమాలోని 5 నిమిషాల రెజ్లింగ్ సీన్ వీఎఫ్ఎక్స్ కోసం చాలా ఎక్కువ సమయం పడిందని ఆయన అన్నారు. ఈ సీన్ పూర్తి చేసేందుకు సుమారు 3నెలల సమయం పడినట్లు ఆయన గుర్తుచేసుకున్నారు. వీఎఫ్ఎక్స్ పని ఫ్రేమ్ వారీగా ఉంటుందని, ఒక నిమిషానికి 1440 ఫ్రేమ్‌లు ఉంటాయని ఆయన పేర్కొన్నారు. అందువల్ల, ప్రతి ఫ్రేమ్‌లో చేసిన మెరుగుదల పరిధిని బట్టి పని ఖర్చు మారుతుంది" అని ఆయన చెప్పారు.పెద్ది గురించి నిలేష్ ఇచ్చిన అప్డేట్ అభిమానులను ఖచ్చితంగా సంతోషపరుస్తుంది. ఎందుకంటే ఎలాంటి రాజీ లేకుండా ప్రేక్షకులకు సాధ్యమైనంత ఉత్తమమైన అనుభూతిని అందించాలనే లక్ష్యంతో చిత్ర బృందం విఎఫ్ఎక్స్ (VFX) కోసం తగినంత సమయాన్ని కేటాయిస్తోంది. పెద్ది మూవీలో రామ్‌చరణ్ సరసన జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తుంది. శివరాజ్ కుమార్, జగపతిబాబు, దివ్యేందు శర్మ, బొమన్ ఇరానీ కీలక పాత్రలలో కనిపించనున్నారు. -
పెద్ది రిలీజ్ పై బిగ్ ట్విస్ట్.. మళ్లీ వాయిదా!
-
పెద్ది పహిల్వాన్ లుక్.. రామ్ చరణ్ అంతలా కష్టపడ్డారా?
రామ్ చరణ్- బుచ్చిబాబు కాంబోలో వస్తోన్న మోస్ట్ అవైటేడ్ చిత్రం పెద్ది. రూరల్ స్పోర్ట్స్ డ్రామాగా వస్తోన్న ఈ చిత్రంలో బాలీవుడ్ భామ జాన్వీ కపూర్ హీరోయిన్గా కనిపించనుంది. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇటీవలే రామ్ చరణ్ బర్త్ డే సందర్భంగా మేకర్స్ అదిరిపోయే ట్రీట్ ఇచ్చారు. పెద్ది గ్లింప్స్ రిలీజ్ చేసి ఫ్యాన్స్‌కు మరిచిపోలేని గిఫ్ట్ ఇచ్చారు.ఈ గ్లింప్స్‌లో రామ్ చరణ్ లుక్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంది. పహిల్వాన్‌గా చెర్రీ లుక్ అదిరిపోయింది. ఈ లుక్ చూసిన ఫ్యాన్స్ ఫుల్ ఫిదా అయ్యారు. అయితే ఇలా రెజ్లర్‌గా కనిపించేందుకు గ్లోబల్ స్టార్ కఠినంగా డైట్ తీసుకున్నారు. పహిల్వాన్లా కనిపించేందుకు దాదాపు 8 నెలల పాటు కేవలం కఠోర నియమాలు పాటించారు. అయ్యప్ప దీక్షలో ఉన్న రామ్ చరణ్ ఈ లుక్ కోసం తీవ్రంగా శ్రమించారని ఇటీవల డైరెక్టర్ బుచ్చిబాబు రివీల్ చేశారు.కఠినమైన డైట్..పహిల్వాన్ ఫిజిక్ రావాలంటే ప్రత్యేక డైట్ పాటించాల్సి ఉంటుంది. కేవలం జిమ్‌లో వర్కౌట్స్ చేయడం మాత్రమే కాదు..కఠిన ఆహార నియమాలు కూడా ఫాలో కావాల్సిందే. ఈ ట్రైనింగ్ జరుగుతున్న సమయంలో రామ్ చరణ్ అయ్యప్ప దీక్షలో ఉంటూ కఠిన నియమాలు పాటించారు. ఎక్కడా కూడా తన ఫిట్నెస్ రూల్స్ బ్రేక్ చేయలేదని బుచ్చిబాబు సనా తెలిపారు. కాగా.. ఈ సినిమా ఏప్రిల్ 30న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానుంది. -
గాయంతో తిరిగి సెట్స్‌పైకి రామ్ చరణ్
టాలీవుడ్ స్టార్ హీరో, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ షూటింగ్ సమయంలో గాయపడిన విషయం తెలిసిందే. ఆయన ఎడమ కంటికి తగిలిన దెబ్బ కారణంగా చిన్నపాటి సర్జరీ చేయాల్సి వచ్చింది. యూనిట్ ఈ గాయం పెద్దది కాదని ప్రకటించినప్పటికీ, తన అభిమానులు మాత్రం కొంత ఆందోళన చెందారు. అయితే గాయమైన గంటల వ్యవధిలోనే చరణ్ తిరిగి సెట్స్‌పైకి వచ్చాడు. గురువారం 'పెద్ది' చిత్ర షూటింగ్లో పాల్గొన్నాడు. దాంతో వందల సంఖ్యలో మెగా అభిమానులు సెట్స్‌కు చేరుకుని ఆయనను కలుసుకున్నారు. చరణ్ వారందరితో మాట్లాడి, సెల్ఫీ వీడియో కూడా దిగాడు. ఆ వీడియోను యూనిట్ సోషల్ మీడియాలో పోస్టు చేసింది. దీంతో చరణ్ స్వయంగా తన గాయంపై వస్తున్న ఊహాగానాలకు చెక్ పెట్టాడు. చరణ్‌కు సుధాకర్ ప్రసాద్ అనే వైద్యుడు మైనర్ సర్జరీ చేసినట్లు చిరంజీవి స్వయంగా వెల్లడించారు. డాక్టర్‌కు ప్రత్యేకంగా ధన్యవాదాలు కూడా తెలిపారు. ఇక మార్చి 27 (శుక్రవారం) రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా ఉదయం 9.45 గంటలకు పెద్ది నుంచి సర్ప్రైజ్ రాబోతోందని యూనిట్ ఇప్పటికే ప్రకటించింది. ఈ సందర్భంగా విడుదల చేసిన పోస్టర్లో ఏప్రిల్ 30న సినిమా రిలీజ్ అవుతుందని మరోసారి ధృవీకరించారు. -
పెద్ది వాయిదా తప్పదా.. అందుకే ఆ డేట్ మార్చారా?
రామ్ చరణ్- బుచ్చిబాబు కాంబోలో వస్తోన్న మోస్ట్ అవైటేడ్ మూవీ పెద్ది. రూరల్ స్పోర్ట్స్ డ్రామాగా వస్తోన్న ఈ సినిమా కోసం మెగా ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఒక్క రోజు ముందే రామ్ చరణ్ ఎడమ కన్నుకు చిన్న గాయం కావడంతో కాస్తా గ్యాప్ ఇచ్చారు. ఈ రోజు నుంచి యథావిధిగా పెద్ది షూటింగ్ ప్రారంభమవుతుందని మేకర్స్ క్లారిటీ ఇచ్చారు.అయితే ఇప్పటికే ఓసారి వాయిదా పడిన పెద్ది మూవీపై మరోసారి రూమర్స్ వినిపిస్తున్నాయి. ఏప్రిల్ 30న విడుదల కావాల్సిన ఈ చిత్రం పోస్ట్‌పోన్ కానుందని తెలుస్తోంది. ఎందుకంటే ఈనెల 27 నుంచి ఓవర్సీస్ బుకింగ్స్ ఓపెన్ చేస్తామని ముందుగానే ప్రకటించారు. కానీ ఈ డేట్ కూడా ఏప్రిల్ 8కి మార్చారు. దీంతో మరోసారి పెద్ది వాయిదా పడనుందనే టాక్ టాలీవుడ్లో వినిపిస్తోంది.తాజా అప్డేట్ ప్రకారం చూస్తే.. ఈ మూవీ షూటింగ్ ఇంకా జరుగుతూ ఉండడం.. పోస్ట్ ప్రొడక్షన్ పనుల వల్ల మరింత ఆలస్యం కావొచ్చని తెలుస్తోంది. ఏదేమైనా బుచ్చిబాబు ఏప్రిల్ 30న రిలీజ్ చేసేందుకు శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. అనుకున్న సమయానికి అన్ని పనులు పూర్తయితే చెప్పిన డేట్ ప్రకారమే పెద్ది థియేటర్లలో సందడి చేయనుంది. లేదంటే మే 21వ తేదీకి మారిపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. రాబోయే రోజుల్లో దీనిపై మరింత స్పష్టత రానుంది. మరోవైపు శుక్రవారం రామ్ చరణ్ బర్త్ డే సందర్భంగా టీజర్ కూడా రిలీజ్ చేస్తున్నారు. -
చరణ్‌కు గాయం.. 'పెద్ది' నుంచి ప్రత్యేక గ్లింప్స్?
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌కు ఇటీవల ప్రమాదవశాత్తూ గాయపడ్డారని వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. దాంతో చరణ్ నటిస్తున్న 'పెద్ది' సినిమా నుంచి రాబోయే అప్డేట్ ఆలస్యమవుతుందేమోనని అభిమానుల్లో సందేహాలు మొదలయ్యాయి. అయితే యూనిట్ తాజాగా ఇచ్చిన స్పష్టతతో ఆ అనుమానాలన్నీ తొలగిపోయాయి. చరణ్ ఎడమ కంటికి చిన్నపాటి గాయం మాత్రమే జరిగింది. దానికి వెంటనే ట్రీట్మెంట్ జరిగిందని 'పెద్ది' టీమ్ తెలిపింది. రేపట్నుంచే ఆయన తిరిగి సెట్స్‌లో పాల్గొనబోతున్నారని కూడా ప్రకటించింది. ఇక అభిమానులకు గుడ్ న్యూస్ ఏమిటంటే.. చరణ్ పుట్టినరోజు కానుకగా 'పెద్ది' నుంచి ప్రత్యేక గ్లింప్స్ రాబోతోంది. మార్చి 27 ఉదయం 11:07 గంటలకు దర్శకుడు బుచ్చిబాబు ఇప్పటికే రెడీ చేసిన టీజర్ విడుదల కానుంది. ఇప్పటికే చరణ్ చేసిన బ్యాట్ విన్యాసం సోషల్ మీడియాలో సూపర్ హిట్ అయింది. అదే తరహాలో ఈ బర్త్‌డే టీజర్ కూడా భారీ విజయాన్ని సాధిస్తుందనే అంచనాలు ఉన్నాయి. అంటే రామ్ చరణ్ గాయంపై ఎలాంటి ఆందోళన అవసరం లేదు. పెద్ది సినిమాకు సంబంధించిన అప్డేట్స్, సంబరాలు ఎలాంటి ఆటంకం లేకుండా కొనసాగనున్నాయి. ఈ విషయాన్ని తెలియజేస్తూ పెద్ది టీమ్ ఓ పోస్టర్‌ను కూడా విడుదల చేసింది. -
రామ్ చరణ్‌కు గాయం.. పెద్ది టీమ్ క్లారిటీ
మెగా హీరో, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గాయంపై పెద్ది టీమ్ స్పందించింది. ప్రస్తుతం అంతా బాగానే ఉందని.. ఎలాంటి ఇబ్బంది లేదని తెలిపింది. షూటింగ్లో చరణ్ ఎడమకన్నుకు చిన్న గాయమైందని వెల్లడించింది. అనంతరం రామ్ చరణ్‌కు చికిత్స అందించామని ప్రకటించింది. రేపటి నుంచి యథావిధిగా షూటింగ్ ప్రారంభమవుతుందని పెద్ది టీమ్ నోట్ విడుదల చేసింది. దయచేసి ఎటువంటి ఊహాగానాలు నమ్మవద్దని అభిమానులకు సూచించింది. పెద్ది షూటింగ్‌కు ఎలాంటి ఆటంకం లేదని క్లారిటీ ఇచ్చింది. ఈ ప్రకటనతో మెగా ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కాగా.. బుచ్చిబాబు- రామ్ చరణ్ కాంబోలో ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు. శ్రీకాకుళం బ్యాక్‌డ్రాప్‌లో రూరల్ స్పోర్ట్స్ డ్రామాని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఈ చిత్రంలో బాలీవుడ్ భామ జాన్వీ కపూర్ హీరోయిన్గా కనిపించనుంది. కన్నడ స్టార్ శివరాజ్ కుమార్ సైతం ఈ మూవీ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తోన్న ఈ చిత్రాన్ని ఏప్రిల్ 30న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేస్తున్నారు.An update regarding @AlwaysRamCharan Garu's injury on the sets of #Peddi.We promise everything is safe and on track ❤️Kindly do not speculate. Thank you. pic.twitter.com/5Abhs2QyHb— PEDDI (@PeddiMovieOffl) March 25, 2026 -
పెద్ది విడుదల మళ్ళీ వాయిదా? వార్తల్లో నిజమెంత?
-
తిలక్ వర్మకు గిఫ్ట్ ఇచ్చిన రామ్ చరణ్.. అదేంటంటే?
రామ్ చరణ్ హీరోగా వస్తోన్న స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా పెద్ది. ఈ చిత్రంలో జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తోంది. ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు దర్శకత్వంలో ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే రిలీజైన చికిరి చికిరి, రైరై రారా అంటూ సాంగ్స్ ఆడియన్స్‌ను అలరిస్తున్నాయి. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ చివరిదశకు చేరుకుంది.తాజాగా పెద్ది మూవీ సెట్స్‌లో వరల్డ్ కప్ హీరో, టీమిండియా క్రికెటర్ తిలక్ వర్మ సందడి చేశారు. మూవీ షూటింగ్ సెట్స్‌కు వెళ్లిన తిలక్ వర్మ.. రామ్ చరణ్‌తో ముచ్చటించారు. ఈ సందర్భంగా తిలక్ వర్మకు రామ్ చరణ్ ఓ బ్యాట్‌ను గిఫ్ట్‌గా ఇచ్చారు. పెద్ది మూవీ షూట్లో వాడిన పాత బ్యాట్‌ను తిలక్ వర్మకు బహుమతిగా అందించారు. అంతేకాకుండా వరల్డ్ కప్‌లో తిలక్ వర్మ ప్రదర్శనపై ప్రశంసలు కురిపించారు. దీనికి సంబంధించిన వీడియోను పెద్ది మేకర్స్ సోషల్ మీడియాలో షేర్ చేశారు. కాగా.. ఈ రూరల్ స్పోర్ట్స్ డ్రామా ఏప్రిల్ 30న థియేటర్లలో సందడి చేయనుంది. T20 World Cup champion @TilakV9 visited the sets of #Peddi ❤🔥He caught a glimpse of the film’s sports sequences and was thoroughly impressed.#PEDDI WORLDWIDE RELEASE ON 30th APRIL, 2026Mega Power Star @AlwaysRamCharan @NimmaShivanna #JanhviKapoor @BuchiBabuSana @arrahman… pic.twitter.com/Csyce4KCNH— Vriddhi Cinemas (@vriddhicinemas) March 18, 2026 -
టీమిండియా వరల్డ్ కప్ విన్.. పెద్ది సాంగ్ వీడియో వైరల్
టీమిండియా ముచ్చటగా మూడోసారి టీ20 వరల్డ్ కప్‌ను ముద్దాడింది. సూర్యకుమార్ యాదవ్ నేతృత్వంలోని టీమిండియా.. న్యూజిలాండ్‌ను చిత్తు చేసి విశ్వవిజేతగా నిలిచింది. దీంతో ఇండియా క్రికెట్ అభిమానులు సంతోషంలో మునిగిపోయారు. ఈ విజయాన్ని ప్రతి ఒక్కరు గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఈ గెలుపును తమకు నచ్చినట్లుగా పోస్టులు పెడుతూ ఎంజాయ్ చేస్తున్నారు.తాజాగా ఈ విజయాన్ని పెద్ది డైరెక్టర్ బుచ్చిబాబు సనా సెలబ్రేట్ చేసుకున్నారు. ఇటీవల రిలీజైన పెద్ది సెకండ్ సింగిల్ రైరా రారా అంటూ సాగే పాటతో టీమిండియా వీడియోను షేర్ చేశారు. రైరా రారా అంటూ సాగే ఈ పాటకు టీమిండియా ఆటగాళ్లతో వీడియోను రూపొందించారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో రామ్ చరణ్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. కాగా.. రామ్ చరణ్-బుచ్చిబాబు కాంబోలో వస్తోన్న పెద్ది మూవీ ఏప్రిల్ 30న థియేటర్లలో సందడి చేయనుంది. ఈ చిత్రంలో జాన్వీ కపూర్ హీరోయిన్గా కనిపించనుంది.🔥🔥🔥🔥🔥 pic.twitter.com/xLVcvmd1yM— BuchiBabuSana (@BuchiBabuSana) March 8, 2026 -
రామ్ చరణ్ పెద్ది మూవీ.. 24 గంటల్లోనే రికార్డ్
రామ్ చరణ్ హీరోగా వస్తోన్న స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా పెద్ది. ఈ చిత్రంలో జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తోంది. ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు దర్శకత్వంలో ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే రిలీజైన చికిరి చికిరి సాంగ్ ఆడియన్స్‌ను ఓ ఊపు ఊపేసింది. వ్యూస్ పరంగా రికార్డ్ స్థాయిలో దూసుకెళ్లింది.తాజాగా రిలీజైన రైరై రారా అంటూ సాగే సాంగ్ సైతం సరికొత్త రికార్డులు సృష్టిస్తోంది. ఈ పాట రిలీజైన కొన్ని గంటల్లోనే అత్యధిక వ్యూస్‌తో దూసుకెళ్తోంది. ఈ సాంగ్ విడుదలైన 24 గంటల్లోనే 31 మిలియన్ల వ్యూస్, 5లక్షల 30వేల లైక్స్‌ను సొంతం చేసుకుంది. కాగా.. ఈ పాటకు అనంత శ్రీరామ్ లిరిక్స్ అందించగా.. ఏఆర్ రెహమాన్ పాడారు. ఈ మోటివేషనల్ సాంగ్‌ను రెహమాన్ కంపోజ్ చేశారు. ఈ రూరల్ స్పోర్ట్స్ డ్రామా ఏప్రిల్ 30న థియేటర్లలో సందడి చేయనుంది. -
రామ్ చరణ్ 'పెద్ది' రన్‌టైమ్.. 4 గంటలపైనే?
పెద్ద సినిమాలు భారీ నిడివితో రావడం ఇప్పుడు సాధారణమైపోయింది. ఇటీవల యానిమల్ సినిమా రన్‌టైమ్ చూసి ప్రేక్షకులు ఆశ్చర్యపోయారు. ఇకపై వస్తున్న ధురంధర్-2 కూడా అంతకుమించిన నిడివితో వస్తోందనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇదే క్రమంలో పెద్ది కూడా భారీ రన్టైమ్తో వస్తోందనే ప్రచారం మొదలైంది. సినిమా టోటల్ ఫుటేజ్ 4 గంటలపైనే ఉందని, ఫైనల్ రన్‌టైమ్ 3 గంటలకు పైగా ఉంటుందనే కథనాలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. అయితే దీనిపై పెద్ది యూనిట్ స్పందించింది. పెద్ది రన్‌టైమ్‌పై వస్తున్న ప్రచారాన్ని నమ్మొద్దని విజ్ఞప్తి చేసింది. ప్రస్తుతం కేవలం తొలి సగం మాత్రమే లాక్ అయింది. రెండో భాగానికి సంబంధించిన షూటింగ్ ఇంకా కొనసాగుతోందని స్పష్టం చేసింది. ప్రస్తుతం పెద్ది నుంచి విడుదలైన రెండో పాట 'రయ్ రయ్ రారా'పై చర్చ జోరుగా సాగుతోంది. చరణ్ డాన్స్‌ను చిరంజీవి ప్రత్యేకంగా మెచ్చుకున్నారు. దాంతో అభిమానుల్లో పెద్ది చిత్రంపై ఆసక్తి మరింత పెరిగింది. దీనిపై దర్శకుడు బుచ్చిబాబు మాట్లాడుతూ, ఆ డాన్స్ చేస్తున్న సమయంలో చరణ్ తీవ్రమైన జ్వరంతో బాధపడుతున్నారు. షూట్ ఆపుదామని చెప్పినా వినకుండా జ్వరంతోనే డాన్స్ చేశారని గుర్తుచేసుకున్నారు.ప్రస్తుతం 'రయ్ రయ్ రారా' సాంగ్ సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవుతోంది. దీంతో సినిమా మీద హైప్ మరింత పెరిగింది. పెద్ది సినిమా రన్‌టైమ్‌పై వస్తున్న ప్రచారాలు నిజం కావని యూనిట్ స్పష్టతనిచ్చింది. అభిమానులు మాత్రం సినిమా ఫైనల్ రన్‌టైమ్‌పై అధికారిక అప్డేట్ కోసం ఎదురుచూస్తున్నారు. -
ట్రెండింగ్ లో PEDDI డ్యాన్స్ తో కుమ్మేసిన రామ్ చరణ్
-
'పెద్ది' మొదలుపెట్టేశాడు.. బుచ్చిబాబుని ఆడుకున్న చరణ్
మెగాహీరో రామ్ చరణ్ లేటెస్ట్ సినిమా 'పెద్ది'. బుచ్చిబాబు దర్శకుడు. లెక్క ప్రకారం మార్చి 27న పాన్ ఇండియా వైడ్ రిలీజ్ అని ప్రకటించారు. కానీ షూటింగ్ ఇంకా పెండింగ్ ఉండేసరికి వాయిదా వేశారు. ఏప్రిల్ 30న థియేటర్లలో తమ మూవీ విడుదల కానుందని కొన్నిరోజుల క్రితం పోస్టర్ వదిలారు. తాజాగా ఓ వైపు చివరి దశ చిత్రీకరణ జరుగుతోంది. మరోవైపు డబ్బింగ్ కూడా మొదలుపెట్టేశారు. తాజాగా ఆ వీడియోని చరణ్.. తన సోషల్ మీడియాలో పంచుకున్నారు.(ఇదీ చదవండి: అల్లు అర్జున్‌తో సినిమా.. 15 రోజులు తినడం మానేశా)'ఏమది' అనే డైలాగ్ చెబుతున్న వీడియోని పోస్ చేసిన చరణ్.. ఇందులో దర్శకుడు బుచ్చిబాబుని కూడా ఓ రేంజులో ఆటాడుకున్నట్లు కనిపించాడు. 'చికిరి చికిరి పాటలో మోహిత్ చౌహన్ వాయిస్‌కి నువ్వు ఎంత యాక్టింగ్ చేశావంటే ఆయనే పాడాడా అని డౌట్ వచ్చిందయ్యా. నా డబ్బింగ్లో అలా యాక్ట్ చేయకు' అని చరణ్ తెగ ఏడిపించేశాడు. ఈ వీడియో ఫన్నీగా అనిపిస్తూ అభిమానుల్ని ఎంటర్టైన్ చేస్తోంది.'పెద్ది' నుంచి వచ్చిన తొలి పాట 'చికిరి చికిరి' అద్భుతమైన రెస్పాన్స్ సొంతం చేసుకుంది. సోమవారం(మార్చి 02) ఈ మూవీ నుంచి రెండో సాంగ్ రిలీజ్ కానుంది. ఇకపోతే స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్‌తో తీసిన ఈ సినిమాలో రామ్ చరణ్ సరసన జాన్వీ కపూర్ హీరోయిన్. కన్నడ హీరో శివరాజ్ కుమార్ కీలక పాత్ర చేశారు. జగపతిబాబు, దివ్యేందు తదితరులు ఇతర కీలక పాత్రలు పోషించారు. ఏఆర్ రెహమాన్ సంగీతమందించారు.(ఇదీ చదవండి: శరత్ కుమార్ రెండో భార్యని తెగ పొగిడేసిన మొదటి భార్య) View this post on Instagram A post shared by Ram Charan (@alwaysramcharan) -
రామ్ చరణ్ పెద్ది మూవీ.. సెకండ్ సింగిల్ అప్డేట్
రామ్ చరణ్- బుచ్చిబాబు కాంబోలో వస్తోన్న స్పోర్ట్స్ డ్రామా పెద్ది. ఈ మూవీని ఉత్తరాంధ్ర బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రంలో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్ కాగా.. కన్నడ స్టార్ శివరాజ్ కుమార్ కీలక పాత్ర చేస్తున్నారు. ఈ సినిమా కోసం మెగా ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.తాజాగా ఈ మూవీ నుంచి క్రేజీ అప్డేట్ వచ్చేసింది. ఈ సినిమా నుంచి సెకండ్ సింగిల్ రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు. మార్చి రెండో తేదీన ఈ మాస్ సాంగ్‌ను విడుదల చేస్తామని డైరెక్టర్ ట్వీట్ చేశారు. నీ అయ్య వడ్డీ... నీ బిడ్డ కడితే… నువ్వేమి పొడిచావనే.. రై రై రారా రై రై రారా అంటూ సాగే పాట ఆడియన్స్‌ను అలరించనుంది.కాగా.. ఇప్పటికే రిలీజైన చికిరి చికిరి సాంగ్ అభిమానులను ఓ రేంజ్లో ఊపేసింది. ఈ పాటకు సోషల్ మీడియాలో పెద్దఎత్తున ఆడియన్స్ స్టెప్పులతో అదరగొట్టారు. ఈ పాటకు ఏఆర్ రెహమాన్ సంగీతమందించారు. కాగా.. ఈ సినిమా ఏప్రిల్ 30న థియేటర్లలో సందడి చేయనుంది. నీ అయ్య వడ్డీ...నీ బిడ్డ కడితే… నువ్వేమి పొడిచావనే!! రై రై రారా రై రై రారా… 🔥🔥🔥COMING SOON… Nee Ayya Vaddee… Nee Bidda Kadithe…Nuvvemi Podichaavanee… RAI RAI RAA RAA🔥🔥🔥This is the anthem of GRIT, GUTS & GLORY 🔥🔥🔥#Peddi second single #RaiRaiRaaRaa out… pic.twitter.com/Xzruw0SZPh— BuchiBabuSana (@BuchiBabuSana) February 26, 2026 -
రామ్ చరణ్ 'పెద్ది'కి భారీ డిజిటల్, ఆడియో డీల్
రామ్ చరణ్, బుచ్చిబాబు కాంబినేషన్లో వస్తున్న 'పెద్ది' సినిమా మీద అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఈ ప్రాజెక్ట్‌కి సంబంధించిన నాన్-థియేట్రికల్ బిజినెస్ ఇప్పటికే హాట్ టాపిక్‌గా మారింది. నిర్మాత సతీష్ కిలారు ఈ సినిమాను ఏప్రిల్ 30న విడుదల చేయాలని ప్రయత్నిస్తున్నారు. రామ్ చరణ్ సరసన జాన్వి కపూర్ హీరోయిన్గా నటిస్తోంది. ఈ చిత్రానికి సంగీతం ఎఆర్ రెహమాన్ అందిస్తున్నారు. ఓటిటి మార్కెట్ డౌన్ కాకముందే డిజిటల్ హక్కుల డీల్ ఫినిష్ చేసుకోవడం నిర్మాతల అదృష్టమనే చెప్పాలి. ఆ రోజుల్లో దాదాపు రూ. 130 కోట్ల భారీ బడ్జెట్ పెట్టి పెద్ది(Peddi) చిత్రాన్ని కోనుగోలు చేసిందట ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్.ఆడియో హక్కులు మరో 18 కోట్ల మేరకు వచ్చాయి. శాటిలైట్ హక్కులు ఇంకా ఫైనల్ కాలేదు. కానీ మంచి మొత్తంలో వచ్చే అవకాశం ఉంది. ఈ సినిమాను నేరుగా హిందీలో కూడా విడుదల చేయనున్నారు. అందువల్ల హిందీ డబ్బింగ్ అవసరం లేదు. కానీ హిందీ శాటిలైట్ హక్కులు వేరుగా ఉంటాయి. నాన్-థియేట్రికల్ ఆదాయం మొత్తం కలిపి 150 కోట్లకు పైగా వచ్చే అవకాశం ఉందని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న 'పెద్ది' విడుదలకు ముందే మంచి బిజినెస్ చేస్తోందనే చెప్పాలి. -
పెద్ది నటుడి బర్త్ డే గిఫ్ట్.. బుచ్చిబాబు ట్వీట్
రామ్ చరణ్- బుచ్చిబాబు కాంబోలో వస్తోన్న రూరల్ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా పెద్ది. ఈ సినిమా కోసం మెగా ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ ఏడాది మార్చి 27న రిలీజ్ కావాల్సిన ఈ సినిమా.. ఏప్రిల్ 30కి వాయిదా పడింది. ఈ చిత్రంలో బాలీవుడ్ భామ జాన్వీ కపూర్ హీరోయిన్గా కనిపించనుంది.పెద్ది మూవీ డైరెక్టర్ బుచ్చిబాబు బర్త్ డే సందర్భంగా రామ్ చరణ్ విషెస్ తెలిపారు. దర్శకుడితో షూట్లో ఉన్న ఫోటోను షేర్ చేశారు. తాజాగా పెద్ది మూవీ నటుడు శివరాజ్‌కుమార్ డైరెక్టర్ బుచ్చికి బర్త్ డే గిఫ్ట్ ఇచ్చారు. ఈ విషయాన్ని స్వయంగా బుచ్చిబాబు వెల్లడించారు. ట్విటర్ వేదికగా శివరాజ్‌కుమార్‌తో ఉన్న ఫోటోను పంచుకున్నారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ లవ్లీ గిఫ్ట్ అంటూ బుచ్చిబాబు ట్వీట్ చేశారు.Thank you so much for the lovely gift @NimmaShivanna Sir ❤️❤️🤗🤗It truly means a lot Sirrr. Love U Sirrr❤️❤️ pic.twitter.com/0YnhB48okh— BuchiBabuSana (@BuchiBabuSana) February 17, 2026 -
'పెద్ది' సెట్లో బుచ్చిబాబు బర్త్ డే సెలబ్రేషన్ (ఫొటోలు)
-
'మరిన్ని మ్యాజికల్ చేద్దాం'.. పెద్ది కెప్టెన్‌కు రామ్ చరణ్ స్పెషల్ విషెస్
రామ్ చరణ్ హీరోగా వస్తోన్న మోస్ట్ అవైటేడ్ రూరల్ స్పోర్ట్స్ డ్రామా పెద్ది. ఈ సినిమా కోసం మెగా ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ డేట్ అనౌన్స్ చేసిన మేకర్స్.. ఇటీవలే వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. ఈ ఏడాది ఏప్రిల్ 30న ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తామని ప్రకటించారు. ఈ చిత్రంలో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్గా కనిపించనుంది.తాజాగా రామ్ చరణ్ తన డైరెక్టర్‌కు విషెస్ తెలిపారు. ఈ రోజు బుచ్చిబాబు బర్త్ డే కావడంతో పెద్ది మూవీ షూటింగ్లో ఉన్న ఫోటోను షేర్ చేశారు. పెద్ది కెప్టెన్ బుచ్చిబాబుకు పుట్టినరోజు శుభాకాంక్షలు.. సెట్లో మీ అభిరుచి, వివరణాత్మక కథనం, పాతుకుపోయిన కథ చెప్పడం ప్రతిరోజూ స్ఫూర్తిదాయకంగా ఉంటాయని రాసుకొచ్చారు. మనిద్దరం కలిసి మరిన్ని మాయా కథలను సృష్టిద్దామని చెర్రీ తన టీట్‌లో రాసుకొచ్చారు. ఈ సంవత్సరం మీ కృషికి తగిన గుర్తింపును తీసుకురావాలని ఆకాంక్షించారు. ఈ విషయం తెలుసుకున్న మెగా ఫ్యాన్స్ కూడా బుచ్చిబాబుకు విషెస్ చెబుతూ పోస్టులు పెడుతున్నారు. Wishing my #Peddi captain @BuchiBabuSana Garu a very happy birthday! ❤️ ❤️ Your passion, detailing and rooted storytelling are inspiring every single day on set. Let’s create many more magical stories together.May this year bring you all the recognition your hard work truly… pic.twitter.com/NokRPm2HXV— Ram Charan (@AlwaysRamCharan) February 15, 2026 -
మెగా ఫ్యాన్స్‌కు షాక్.. పెద్ది మూవీ రిలీజ్ వాయిదా
రామ్ చరణ్ హీరోగా వస్తోన్న రూరల్ స్పోర్ట్స్ డ్రామా పెద్ది. ఈ సినిమా కోసం మెగా ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు మేకర్స్. ఈ ఏడాది మార్చి 27న రిలీజ్ చేస్తామని మేకర్స్ ప్రకటించారు. కానీ తాజాగా అభిమానులకు బిగ్ షాకిచ్చింది మూవీ టీమ్. పెద్ది విడుదలను వాయిదా వేస్తున్నట్లు వెల్లడించింది.పెద్ది మూవీ కొత్త రిలీజ్ డేట్‌ను మేకర్స్ అనౌన్స్ చేశారు. దాదాపు నెల రోజుల పాటు ఈ సినిమాను వాయిదా వేశారు. ఈ ఏడాది ఏప్రిల్ 30న ప్రేక్షకుల ముందుకు తీసుకు రానున్నట్లు పోస్టర్‌ను పంచుకున్నారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ఇన్‌స్టాలో పోస్ట్ చేశారు. దీంతో మార్చిలో పెద్ది చూడాలనుకున్న మెగా ఫ్యాన్స్ తీవ్ర నిరాశకు గురవుతున్నారు. ఈ సినిమాకు బుచ్చిబాబు సనా దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో బాలీవుడ్ భామ జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తున్నారు. దురంధర్-2 వల్లేనా?అయితే పెద్ది మూవీ వాయిదా వేయడంపై నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. రణ్వీర్ సింగ్ స్పై యాక్షన్ థ్రిల్లర్ సీక్వెల్ దురంధర్-2 మార్చి 19న థియేటర్లలో రిలీజ్ కానుంది. ఈ సారి దక్షిణాది భాషల్లోనూ ఈ సినిమాను విడుదల చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే పెద్దిని వాయిదా వేసి ఉంటారని నెటిజన్స్ భావిస్తున్నారు. ఇప్పటికే అడివి శేష్ నటించిన డకాయిట్ సైతం వాయిదా పడిన సంగతి తెలిసిందే. #PEDDI will see you on 30th APRIL, 2026 💪🏻🔥@NimmaShivanna #JanhviKapoor @BuchiBabuSana @arrahman @vriddhicinemas @VenkataSKilaru @MythriOfficial @SukumarWritings @PeddiMovieOffl pic.twitter.com/TTfrxi773W— Ram Charan (@AlwaysRamCharan) February 4, 2026 -
CAT కథ వినూత్నంగా అనిపించింది: పెద్ది డైరెక్టర్ బుచ్చిబాబు
జీవీ నాయుడు, వీజే బాలు, లావణ్య, కళ్యాణి రాణి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న తాజా చిత్రం ‘క్యాట్’(CAT). వీఆర్‌జీఆర్ మూవీస్ బ్యానర్ పై వై. గంగాధర్ ఐపీఎస్ సమర్పణలో, రజని గొంగటి నిర్మించిన ఈ చిత్రానికి జీవీ నాయుడు దర్శకత్వం వహించారు. ఫస్ట్ కాపీ రెడీ చేసుకుని త్వరలో రిలీజ్ కాబోతున్న ఈ చిత్రం ఫస్ట్ లుక్ పోస్టర్ ని ప్రముఖ దర్శకులు బుచ్చి బాబు సోమవారం హైదరాబాద్ లో విడుదల చేశారు.ఈ సందర్భంగా దర్శకుడు బుచ్చిబాబు మాట్లాడుతూ.. దర్శకుడు కమ్ యాక్టర్ జి.వీ నాయుడు నాకు ఎప్పటినుంచో తెలుసు, క్యాట్ స్టోరీ కూడా నాకు చెప్పాడు.ఈ కథ వినూత్నంగా చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపించింది. ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలని అందరికి పేరు తీసుకురావాలని, త్వరలొ విడుదలకు సిద్దమైన ఈ సినిమాని అందరూ ఆదరించాలని కోరుకుంటున్నాను’అన్నారు. డ్రామా, థ్రిల్లర్ జోనర్ లో తెరకెక్కిన ఈ చిత్రానికి మారుతి రాజా సంగీతం అందించగా, పంకజ్ తొట్టాడ సినిమాటోగ్రాఫర్‌గా వ్యవహరించారు. -
'పెద్ది'లో మరో స్టార్.. ఈ నటుడు ఎవరో గుర్తుపట్టారా?
రామ్ చరణ్ 'పెద్ది' మూవీ చివరి దశ చిత్రీకరణలో బిజీగా ఉంది. ఈ మధ్య ఢిల్లీ పలు సీన్స్ తీశారు. ఇందుకు సంబంధించిన కొన్ని ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ కూడా అయ్యాయి. చెప్పినట్లుగానే మార్చి 27న థియేటర్లలో రిలీజ్ చేయడమే లక్ష్యంగా మూవీని సిద్ధం చేస్తున్నారు. ఇప్పుడు ఇందులో నటిస్తున్న ఓ స్టార్ నటుడి ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. చూసిన వెంటనే ఆయనెవరో గుర్తుపట్టడం కష్టమే.(ఇదీ చదవండి: 'రాజాసాబ్' కొత్త ట్రైలర్ రిలీజ్)పైన ఫొటోలో కనిపిస్తున్న వ్యక్తి జగపతిబాబు. అప్పట్లో హీరోగా చేశాడు. గత కొన్నాళ్లుగా మాత్రం క్యారెక్టర్ ఆర్టిస్టుగా ఫుల్ బిజీగా ఉన్నాడు. ఈయన్ని మాస్ లేదా క్లాస్ పాత్రలు చేస్తూ వచ్చారు. కాకపోతే లుక్ మాత్రం దాదాపు ఒకేలా ఉండేది. 'పెద్ది' కోసం మాత్రం గుర్తుపట్టలేనంతగా మార్చేశారని చెప్పొచ్చు. అప్పలసూరి అనే పాత్రలో జగపతిబాబు కనిపించబోతున్నాడని మూవీ టీమ్ ప్రకటించింది. మరి ఈయనది పాజిటివ్ క్యారెక్టరా నెగిటివ్ క్యారెక్టరా అనేది సినిమా రిలీజ్ అయితే తప్ప తెలియదు.'పెద్ది' చిత్రాన్ని స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ స్టోరీతో తీస్తున్నారు. రామ్ చరణ్ సరసన జాన్వీ కపూర్ హీరోయిన్. కన్నడ స్టార్ శివరాజ్ కుమార్ కీలక పాత్ర చేస్తున్నారు. బుచ్చిబాబు దర్శకుడు. ఏఆర్ రెహమాన్ సంగీతమందిస్తున్నాడు. కొన్నాళ్ల క్రితం 'చికిరి చికిరి' అనే సాగే పాట రిలీజ్ చేస్తే ఎంత వైరల్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇప్పుడు ఫస్ట్ లుక్స్‌తోనూ మూవీ టీమ్ ఆశ్చర్యపరుస్తుండటం విశేషం.(ఇదీ చదవండి: కొత్త ఏడాది స్పెషల్.. ఈ వారం ఓటీటీల్లోకి వచ్చే సినిమాలివే)Honoured and super glad to be 'APPALASOORI' in #Peddi ❤🔥Thoroughly enjoyed playing this role. #PEDDI WORLDWIDE RELEASE ON 27th MARCH, 2026. pic.twitter.com/fYmuVeeTxc— Jaggu Bhai (@IamJagguBhai) December 29, 2025 -
పెద్ది మూవీపై చీప్ కామెంట్స్.. విశ్వక్ సేన్ ఫైర్..!
సినిమా ఇండస్ట్రీలో కామెంట్స్ చేయడం ప్రతి ఒక్కడికీ అదో ఫ్యాషన్ అయిపోయింది. ఎవడు పడితే మూవీలపై రివ్యూలు ఇస్తున్నారు. యూట్యూబ్ ఛానెల్ ఉన్న ప్రతి ఒక్కరూ తామేదో మేధావుల్లా ఫీలయి సినిమాలపై రివ్యూలు ఇచ్చేస్తున్నారు. సినిమా గురించి ఓనమాలు తెలియనివాళ్లు కూడా ఇష్టమొచ్చినట్లు సోషల్ మీడియాలో మాట్లాడేస్తున్నారు. టాలీవుడ్ చిత్రాలపై ఎలా పడితే అలా కామెంట్స్ చేసి చాలామంది తమ పబ్బం గడుపుకుంటున్నారు. అలాంటి యూట్యూబ్ రివ్యూవర్స్‌పై టాలీవుడ్ హీరో విశ్వక్ సేన్ ఫైరయ్యారు. తాజాగా టాలీవుడ్ హీరో రామ్ చరణ్ పెద్ది మూవీని ఉద్దేశించి కొందరు చేసిన కామెంట్స్‌పై టాలీవుడ్ యంగ్ హీరో విశ్వక్ సేన్ మండిపడ్డారు. ఇండస్ట్రీని ప్రయోజనం పొందుతూ కించపరిచేలా మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్ అని ప్రశ్నించారు. ఇలాంటి వాళ్లను పరాన్నజీవి అని పిలవడం సమంజసం కాదా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇండస్ట్రీ ద్వారా తనతో పాటు కుటుంబాన్ని పోషించుకుంటూ.. ఒక సినిమా రిలీజ్ కాకముందే నాశనం చేసేందుకు యత్నిస్తున్నారని మండిపడ్డారు. ఇలాంటి వాళ్లను చూస్తుంటే తాను తినే పళ్లెంలోనే ఉమ్మేసినట్లు ఉందని విశ్వక్ సేన్ ఫైరయ్యారు.ఈ వీడియో ఓ వ్యక్తి రామ్ చరణ్ పెద్ది సినిమాను ఉద్దేశించి అవహేళన చేస్తూ మాట్లాడారు. పెద్ది మూవీ స్టోరీ మీకు తెలుసా? నాకు తెలుసంటూ దర్శకుడిని కించపరిచేలా కామెంట్స్ చేశారు. ఇలాంటి స్టోరీ సినిమాకు చికిరి చికిరీలు అవసరమా? అంటూ ఎగతాళి చేశాడు. ఇది చూసిన విశ్వక్ సేన్ తనదైన స్టైల్లో వీరికి ఇచ్చిపడేశాడు. ఈ ట్వీట్ ప్రస్తుతం టాలీవుడ్లో చర్చనీయాంశంగా మారింది.Isn’t it fair to call someone like him a parasite to cinema? He benefits from the industry, feeds himself and his family through it, yet tries to destroy a film even before it’s released. It’s like spitting on the very plate he eats from. pic.twitter.com/WcLPOGA69k— VishwakSen (@VishwakSenActor) December 19, 2025 -
భారీ ధరకు ‘పెద్ది’ ఓటీటీ రైట్స్... రిలీజ్‌కు ముందే సంచలనం!
ఉప్పెన ఫేం బుచ్చిబాబు సానా దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘పెద్ది’. ఇందులో చరణ్‌కు జోడీగా జాన్వీ కపూర్ నటిస్తోంది. ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నాడు. ఈ మధ్యే రిలీజ్ అయితే ‘చికిరి’ సాంగ్ ఎంత పెద్ద హిట్ అయిందో అందరికి తెలిసిందే. సోషల్ మీడియాలో ఎక్కడ చూసిన ఈ పాటే వినిపిస్తోంది. అంతకు ముందు విడుదలైన గ్లింప్స్‌తో పాటు ఈ పాట కూడా హిట్ కావడంతో పెద్దిపై అంచనాలు అమాంతం పెరిగాయి.సినిమాకు వచ్చిన బజ్‌తో పలు ఓటీటీ సంస్థలు డిజిటల్ రైట్స్ కోసం పోటీపడ్డాయట. ముఖ్యంగా రెండు ప్రముఖ ఓటీటీ సంస్థలు పోటీలో నిలవగా.. భారీ ధరకు నెటిఫ్లిక్స్ డిజిటల్ రైట్స్‌ని కొనుగోలు చేసినట్లు సమాచారం. దాదాపు రూ. 130 కోట్ల భారీ బడ్జెట్ పెట్టి పెద్ది(Peddi) కోనుగోలు చేసిందట నెట్‌ఫ్లిక్స్. అన్ని భాషలకు గాను ఈ మొత్తాన్ని చెల్లించబోతుందట. షూటింగ్ మొత్తం పూర్తయి రిలీజ్ కాబోతున్న చిత్రాలకే ఓటీటీ బిజినెస్ అవ్వడం లేదు. అలాంటిది ఇంకా షూటింగ్ కూడా పూర్తికాని పెద్ది చిత్రానికి అప్పుడే ఓటీటీ డీల్ పూర్తి కావడం గొప్ప విషయమే. మల్టీస్పోర్ట్స్ నేపథ్యంలో రూపొందుతోన్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్‌లో జరుగుతోంది.హైదరాబాద్‌లోని అల్యూమినియం ఫ్యాక్టరీలో ప్రొడక్షన్ డిజైనర్ అవినాష్ కొల్లా సిద్ధం చేయించిన భారీ సెట్లో ఓ యాక్షన్ సీక్వెన్స్ చిత్రీకరణ జరుగుతోంది. రామ్‌చరణ్, ఇతర ఫైటర్లతో పాటు ఈ యాక్షన్ సీక్వెన్స్‌లో కన్నడ నటుడు శివ రాజ్‌కుమార్ కూడా పాల్గొంటున్నారు. బాలీవుడ్ స్టార్ విక్కీ కౌశల్ తండ్రి, ప్రముఖ స్టంట్ డైరెక్టర్ ‘దంగల్’ ఫేమ్ షామ్ కౌశల్ ఈ భారీ యాక్షన్ సీక్వెన్స్‌ను పర్యవేక్షిస్తుండగా, నవకాంత్ స్టంట్ మాస్టర్‌గా వ్యవహరిస్తున్నారు. ‘‘ప్రతి ఫైట్ సీక్వెన్స్‌ను ప్రత్యేకమైన కాన్సెప్ట్‌తో, ఉత్కంఠభరితంగా ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు బుచ్చిబాబు. ప్రస్తుతం జరుగుతున్న ఈ ఫైట్ సీక్వెన్స్ ఓ హైలైట్‌గా ఉంటుంది’’ అని యూనిట్ పేర్కొంది. మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సమర్పణలో వెంకట సతీష్ కిలారు నిర్మిస్తున్న ఈ చిత్రం వచ్చే ఏడాది మార్చి 27న విడుదల కానుంది. -
'పెద్ది' ఫైట్.. స్టార్ హీరో తండ్రి ఆధ్వర్యంలో!
మెగాహీరో రామ్ చరణ్.. 'పెద్ది' షూటింగ్లో బిజీగా ఉన్నాడు. ఇప్పటికే 'చికిరి' హిట్ కాగా.. డిసెంబరులో మరో పాట వచ్చే అవకాశముందని తెలుస్తోంది. ఈసారి ఎలాంటి సాంగ్ రాబోతుందోనని అభిమానులు అప్పుడే అంచనాలు పెంచేసుకుంటున్నారు. ప్రస్తుతానికైతే హైదరాబాద్‌లో ఫైట్ సీక్వెన్స్ తీస్తున్నారు. ఇది బాలీవుడ్ స్టార్ హీరో తండ్రి ఆధ్వర్యంలో తీస్తుండటం విశేషం. ఇంతకీ సంగతేంటి?'పెద్ది' మూవీ ప్రకటించినప్పుడు ఓ మాదిరి అంచనాలు ఏర్పడ్డాయి. ఎప్పుడైతే గ్లింప్స్, చికిరి చికిరి సాంగ్ వచ్చిందో.. తర్వాత నుంచి హైప్ పెరుగుతూ వస్తోంది. అందుకు తగ్గట్లే దర్శకుడు బుచ్చిబాబు పనిచేస్తున్నాడని తెలుస్తోంది. మూవీలో ఏకంగా ఎనిమిది ఫైట్ సీక్వెన్స్‌లు ఉన్నాయని తెలుస్తోంది. వీటిలో ఒకటి ఇప్పుడు హైదరాబాద్‌లోని అల్యూమినియం ఫ్యాక్టరీలో తీస్తున్నారట. దీనంతటినీ హిందీ హీరో విక్కీ కౌశల్ తండ్రి శామ్ కౌశల్.. దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారట. ఈయన గతంలో 'దంగల్' చిత్రానికి యాక్షన్ కొరియోగ్రాఫీ చేశారు.'పెద్ది' చిత్రాన్ని ఉత్తరాంధ్ర బ్యాక్ డ్రాప్ స్టోరీ బ్యాక్‌డ్రాప్ స్టోరీతో తీస్తున్నారు. క్రికెట్, కబడ్డీ లాంటి గేమ్స్ ఉండబోతున్నాయని తెలుస్తోంది. ఇందులో చరణ్ సరసన జాన్వీ కపూర్ హీరోయిన్ కాగా.. కన్నడ స్టార్ శివరాజ్ కుమార్ కీలక పాత్ర చేస్తున్నారు. జగపతిబాబు, దివ్యేందు తదితరులు ఇతర పాత్రల్లో కనిపించనున్నారు. ఏఆర్ రెహమాన్ సంగీతమందిస్తున్నారు. వచ్చే ఏడాది మార్చి 27న థియేటర్లలో రిలీజ్ అని అన్నారు. రీసెంట్ టైంలో పాన్ ఇండియా సినిమాలన్నీ చెప్పిన తేదీకి అస్సలు రావడం లేదు. మరి 'పెద్ది' చెప్పిన టైంకి వస్తాడా లేదంటే వాయిదా వేస్తాడా అనేది చూడాలి? -
'నా కెరీర్లో ఇదే ఫస్ట్ టైమ్'.. చికిరి సాంగ్ లిరిసిస్ట్ బాలాజీ కామెంట్స్!
రామ్‌చరణ్- బుచ్చిబాబు కాంబోలో వస్తోన్న మోస్ట్ అవైటేడ్ మూవీ పెద్ది. ఈ చిత్రంలో బాలీవుడ్ భామ జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తోంది. ఇటీవలే ఈ మూవీ నుంచి క్రేజీ సాంగ్ రిలీజ్ చేశారు మేకర్స్. చికిరి చికిరి అంటూ సాగే పాటను విడుదల చేశారు. ఈ పాట రిలీజైన కొద్ది గంటల్లోనే రికార్డ్ స్థాయి వ్యూస్‌తో దూసుకెళ్లింది. ఒక్క రోజులోనే మిలియన్ల వీక్షణలతో సరికొత్త రికార్డ్ సాధించింది. కాగా.. సింగర్ మోహిత్ చౌహాన్ పాడిన ఈ సాంగ్‌కు బాలాజీ లిరిక్స్ అందించారు. ఈ పాటకు ఏఆర్ రెహమాన్ సంగీతం అందించారు.తాజాగా ఈ పాట గురించి లిరిసిస్ట్ బాలాజీ ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. సిటీమార్, ఎంసీఏ పాటలకంటే నా కెరీర్లో ఒక్క రోజులోనే అత్యధిక వ్యూస్ వచ్చిన పాట ఇదేనని తెలిపారు. చికిరి.. చికిరి అనే పాట ఉత్తరాంధ్రలోని గ్రామీణ నేపథ్యంలోని వెనకబడిన జాతి నుంచి వచ్చిన యువకుడికి.. ఒక అందమైన అమ్మాయి కనిపిస్తే ఏమనిపించింది అనేదే కాన్సెప్ట్‌తో పుట్టుకొచ్చిందే ఈ పాట.చికిరి అంటే ప్రత్యేకంగా అర్థమేమి లేదన్నారు. ఆ అబ్బాయిని.. అమ్మాయిని పొగుడుతూ తన కోరికను ఇలా చికిరి పాట రూపంలో చెప్తాడని బాలాజీ తెలిపారు. ఈ సాంగ్ కోసం దాదాపు ఎనిమిది నెలలు ప్రయాణం చేశానన్నారు.ఈ మూవీని మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సమర్పణలో వృద్ధి సినిమాస్‌పై వెంకట సతీష్ కిలారు నిర్మిస్తున్నారు. ఈ మూవీలో జాన్వీకపూర్ అచ్చియ్యమ్మ పాత్రలో కనిపించనుంది. శివ రాజ్‌కుమార్, దివ్యేందు శర్మ, జగపతిబాబు కీలక పాత్రలలో నటిస్తున్నారు. ఈ మూవీ 2026 మార్చి 27న ప్రేక్షకుల ముందుకు రానుంది. -
ట్రెండింగ్ లో రామ్ చరణ్ 'చికిరి చికిరి' పాట డ్యాన్స్ (ఫొటోలు)
-
నా చిన్ననాటి కల.. 'పెద్ది'తో నిజమవుతుంది: రామ్ చరణ్
మెగాపవర్ స్టార్ రామ్ చరణ్‌తో దర్శకుడు బుచ్చిబాబు చేస్తున్న చిత్రం పెద్ది. పాన్ ఇండియా లెవల్లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో బాలీవుడ్ నటి జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తోంది. కన్నడ స్టార్ హీరో శివరాజ్ కుమార్ ఇందులో ప్రత్యేక పాత్రలో కనిపించనున్నారు.ఇప్పటికే ఏర్పడ్డ భారీ అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా బుచ్చిబాబు పెద్ది చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. ఇక రామ్ చరణ్ కూడా పెద్ది సినిమాపై చాలా నమ్మకంగా ఉన్నాడు.ఇదిలా ఉంటే, తాజాగా హైదరాబాద్‌లో ఆస్కార్ అవార్డు విజేత ఏఆర్ రెహమాన్ మ్యూజికల్ కాన్సర్ట్ జరిగింది. అందులో రెహమాన్ తాను చేసిన పాటలతో ఆడియన్స్‌ను ఉర్రూతలూగించాడు. భారీగా జరిగిన ఈ కాన్సర్ట్‌కు పెద్ది సినిమా టీం రామ్ చరణ్, జాన్వీ కపూర్, బుచ్చిబాబు సనా హాజరయ్యారు.ఈ సందర్భంగా రామ్ చరణ్ మాట్లాడుతూ.. ఏఆర్ రెహమాన్ గారితో సినిమా చేయడం నా చిన్ననాటి కల.. ఆ అవకాశం నాకు బాగా నచ్చిన పెద్ది లాంటి కథతో నిజం అవుతుండటం చాలా సంతోషంగా ఉంది. తాజాగా రిలీజైన చికిరి సాంగ్ అదిరిపోయింది. పెద్ది సినిమా కూడా మీకు తప్పకుండా నచ్చుతుంది, అంటూ రెహమాన్‌పై తనకు ఉన్న అభిమానాన్ని చాటుకున్నాడు. ఈ కామెంట్స్‌తో పెద్ది సినిమా చరణ్‌కు వ్యక్తిగతంగా ఎంతో ప్రత్యేకమైన ప్రాజెక్ట్ అని స్పష్టంగా తెలుస్తోంది. ప్రస్తుతం ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అలాగే పెద్ది సినిమాపై అంచనాలు ఇంకా పెంచుతున్నాయి. -
కొత్త ఇంట్లోకి సతీసమేతంగా 'బుచ్చిబాబు' గృహప్రవేశం
'ఉప్పెన' సినిమాతో దర్శకుడిగా అరంగేట్రం చేసి, జాతీయ అవార్డు అందుకున్న బుచ్చిబాబు కొత్త ఇల్లు నిర్మించుకున్నారు. మొదటి సినిమానే రూ.100 కోట్లకు పైగా వసూళ్లు సాధించి, 69వ జాతీయ చలనచిత్ర పురస్కారాలలో తెలుగులో ఉత్తమ చిత్రంగా ఎంపికైన విషయం తెలిసిందే. ప్రస్తుతం రామ్‌చరణ్‌తో కలిసి పాన్-ఇండియా ప్రాజెక్ట్ 'పెద్ది'ని తెరకెక్కిస్తున్నారు.కాకినాడ జిల్లా ఉప్పాడకు చెందిన బుచ్చిబాబు తాజాగా పిఠాపురంలో కొత్త ఇల్లు నిర్మించుకున్నారు. శనివారం సతీ సమేతంగా గృహప్రవేశం చేశారు. ఈ కార్యక్రమంలో కుటుంబ సభ్యులతో పాటు స్నేహితులు పాల్గొన్నారు. అభిమానులు కూడా ఆయనకు శుభాకాంక్షలు చెబుతూ పోస్టులు పెడుతున్నారు. గృహప్రవేశం కార్యక్రమంలో వల్ల గత రాత్రి జరిగిన ఏఆర్ రెహమాన్ మ్యూజికల్ కాన్సర్ట్‌కు బుచ్చిబాబు రాలేకపోయారు. కానీ, ఆయన తెరకెక్కిస్తున్న పెద్ది సినిమా సాంగ్ ఈ కార్యక్రమంలో మరోసారి ప్రేక్షకులకు లైవ్‌లో వినిపించారు.లైఫ్ ఇచ్చిన సుకుమార్బుచ్చిబాబు, సుకుమార్‌లది గురు-శిష్యుల బంధమని తెలిసిందే. సుకుమార్ కాకినాడలోని ఓ కాలేజీలో మ్యాథ్స్ లెక్చరర్‌గా పనిచేశారని తెలిసిందే. అయితే, అదే కాలేజీలో బుచ్చిబాబు స్టూడెంట్‌గా ఉన్నారు. ఈ క్రమంలో సుకుమార్ చెప్పే పాఠాలంటే బుచ్చిబాబుకు బాగా ఇష్టం ఉండేది. దీంతో వారిద్దరి మధ్య మంచి బంధం ఏర్పడింది. అయితే, గురువు దర్శకుడిగా మారడంతో తాను కూడా అదే దారిలో అడుగులు వేశారు. అలా ‘ఆర్య 2’ నుంచి సహాయ దర్శకుడిగా బుచ్చిబాబు పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చారు. తర్వాత సుకుమార్ తెరకెక్కించిన నాన్నకు ప్రేమతో, రంగస్థలం,100% లవ్ వంటి చిత్రాలకు అసిస్టెంట్ దర్శకుడిగా పనిచేశారు.పిఠాపురం లో కొత్త ఇల్లు కట్టుకున్న పెద్ది డైరెక్టర్ బుచ్చిబాబు సానా. శనివారం గృహ ప్రవేశ వేడుక జరిగింది.#Peddi #BuchiBabuSana #RamCharan pic.twitter.com/cOSJ3aIZLq— Tollywoodtopics (@filmytopics) November 9, 2025 -
పెద్ది 'చికిరి' బాగుంది.. కానీ, బిగ్ డౌట్
‘చికిరి చికిరి... నా ఒళ్లంతా ఆడిందే తైతక్కా...’ అంటూ రామ్ చరణ్ క్లాసిక్ స్టెప్పులేశారు. ఆయన హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘పెద్ది’. బుచ్చిబాబు సానా దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తున్నారు. తాజాగా విడుదలైన ఈ సాంగ్ విషయంలో చాలామందిలో ఒక ప్రశ్న మిగిలిపోయింది. సోషల్‌మీడియాలో పెద్ద చర్చగా సాగుతుంది. చికిరి అంటూ చరణ్ వేసిన స్టెప్పులు చాలా యూనిక్‌గా ఉన్నాయని అభిమానులు చెబుతున్నప్పటికీ వారిలో కూడా ఇదే ప్రశ్న తలెత్తుతుంది.పెద్ది సినిమా నుంచి శుక్రవారం తొలి పాటని విడుదల చేశారు. చికిరి చికిరి... అంటూ సాగే ఈ పాటని సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ స్వరపరచగా.. మోహిత్ చౌహాన్ ఆలపించారు. బాలాజీ సాహిత్యం అందించారు. సాంగ్ బాగుందని ప్రశంసలు కూడా వస్తున్నాయి. యూట్యూబ్‌లో అన్ని భాషలలో కలిపి 50 మిలియన్ల వ్యూస్‌కు చేరుకుంది. అయితే, అందరి మనస్సులలో ఒక ప్రశ్న ఉంది. ఈ పాటను తెలుగు, హిందీ, కన్నడ , మలయాళంలో విడుదల చేశారు. కానీ, తమిళ వెర్షన్‌ను మాత్రం రిలీజ్ చేయలేదు. అయితే, దానికి కారణం మాత్రం మేకర్స్ ప్రకటించలేదు.తమిళ ప్రేక్షకులు కూడా ఈ విషయంపై ట్వీట్లు చేస్తున్నారు. చరణ్, A.R. రెహమాన్ అభిమానులు కూడా సాంగ్ గురించి అప్డేట్ ఇవ్వమని కోరుతున్నారు. ప్రస్తుతానికి, ఈ విషయంపై చిత్ర యూనిట్ ఎటువంటి సమాచారం పంచుకోలేదు. అయితే, కొంతమంది A.R. రెహమాన్ తన హైదరాబాద్ కచేరీలో తమిళ వెర్షన్‌ను ప్రత్యక్షంగా పాడవచ్చని ఊహిస్తున్నారు. చికిరి చికిరి తమిళ వెర్షన్‌ను మేకర్స్ ఎలా మార్కెట్ చేయాలని ప్లాన్ చేస్తున్నారో చూడాలి. మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సమర్పణలో వెంకట సతీష్ కిలారు నిర్మిస్తున్నారు. ఈ చిత్రం 2026 మార్చి 27న ప్రేక్షకుల ముందుకు రానుంది. -
పెద్ది 'చికిరి' ఫుల్ సాంగ్ విడుదల
రామ్‌చరణ్- బుచ్చిబాబు ‘పెద్ది’ సినిమా నుంచి ఫస్ట్ సాంగ్ వచ్చేసింది. ‘చికిరి చికిరి..’ (Chikiri Chikiri Song)అంటూ సాగే ఈ పాటకు చరణ్ అదిరిపోయే స్టెప్పులు వేశాడు. సింగర్ మోహిత్ చౌహాన్ పాడిన ఈ సాంగ్‌ను బాలాజీ రచించారు. సంగీతం ఏఆర్ రెహమాన్ అందించారు. అలంకరణ అవసరంలేని ఆడపిల్లల్ని ముద్దుగా తమ గ్రామంలో చికిరి అని పిలుస్తారని దర్శకుడు ఇప్పటికే క్లారిటీ ఇచ్చేశాడు.మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సమర్పణలో వృద్ధి సినిమాస్‌పై వెంకట సతీష్ కిలారు నిర్మిస్తున్న ఈ మూవీలో జాన్వీకపూర్ అచ్చియ్యమ్మ పాత్రలో కనిపించనుంది. శివ రాజ్‌కుమార్, దివ్యేందు శర్మ, జగపతిబాబు కీలక పాత్రలలో నటిస్తున్నారు. ఈ మూవీ 2026 మార్చి 27న ప్రేక్షకుల ముందుకు రానుంది. -
పెద్ది ఫస్ట్ సింగిల్ కోసం బుచ్చిబాబు కష్టాలు
-
పెద్ది 'చికిరి' సాంగ్ అర్థమిదే..
రామ్‌చరణ్- బుచ్చిబాబు సినిమా ‘పెద్ది’.. ఈ మూవీ నుంచి మొదటి పాట 'చికిరి చికిరి' (Chikiri) విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. అయితే, చికిరి అంటే అర్థం ఏంటో చెబుతూ తాజాగా ఒక వీడియోలో బుచ్చిబాబు, ఏఆర్ రెహమాన్ పంచుకున్నారు. అలంకరణ అవసరంలేని ఆడపిల్లల్ని ముద్దుగా తమ గ్రామంలో చికిరి అని పిలుస్తారని దర్శకుడు చెప్పగానే దానికి రెహమాన్ కూడా బాగుంది కదా అంటూ.. ఈ పదంతోనే ఒక పాట ఇద్దామని పేర్కొన్నారు. అయితే పూర్తి పాట నవంబర్ 7న విడుదల కానుందని ప్రకటించారు.మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సమర్పణలో వృద్ధి సినిమాస్‌పై వెంకట సతీష్ కిలారు నిర్మిస్తున్న ఈ మూవీలో జాన్వీకపూర్ అచ్చియ్యమ్మ పాత్రలో కనిపించనున్నారు. ఈ మూవీ 2026 మార్చి 27న ప్రేక్షకుల ముందుకు రానుంది. -
రామ్‌చరణ్‌తో జోడీ?
హీరో రామ్‌చరణ్‌కి జోడీగా బాలీవుడ్ హీరోయిన్ కృతీ సనన్ నటించనున్నారా? అంటే అవుననే అంటున్నాయి ఫిల్మ్‌నగర్ వర్గాలు. ప్రస్తుతం బుచ్చిబాబు దర్శకత్వంలో ‘పెద్ది’ అనే పాన్ఇండియా సినిమాలో నటిస్తున్నారు రామ్‌చరణ్. ఈ చిత్రంలో బాలీవుడ్ బ్యూటీ జాన్వీకపూర్ హీరోయిన్గా నటిస్తున్నారు. శివరాజ్ కుమార్, జగపతి బాబు, దివ్యేంద్రు శర్మ ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సమర్పణలో వృద్ధి సినిమాస్‌పై వెంకట సతీష్ కిలారు నిర్మిస్తున్నారు. ఈ సినిమా చిత్రీకరణ శరవేగంగా జరుగుతోంది. 2026 మార్చి 27న ఈ చిత్రం విడుదల కానున్న సంగతి తెలిసిందే. ‘పెద్ది’ తర్వాత సుకుమార్ దర్శకత్వంలో నటించనున్నారు రామ్‌చరణ్. ‘ఆర్సీ 17’ అన్నది వర్కింగ్ టైటిల్. ‘రంగస్థలం’(2018) వంటి బ్లాక్‌బస్టర్ తర్వాత రామ్‌చరణ్–సుకుమార్ కాంబినేషన్లో రూపొందనున్న సినిమా ఇది. ప్రస్తుతం ఈ మూవీ ప్రీ ప్రోడక్షన్ పనుల్లో బిజీ బిజీగా ఉన్నారు సుకుమార్. ‘పెద్ది’ షూటింగ్ పూర్తయిన వెంటనే ఏమాత్రం విరామం లేకుండా ‘ఆర్సీ 17’ని సెట్స్‌కి తీసుకెళ్లనున్నారట రామ్‌చరణ్– సుకుమార్. అయితే ఈ సినిమాలో హీరోయిన్ ఎవరు? అనే విషయంపై ఇప్పటి వరకూ ఎలాంటి ప్రకటన రాలేదు.అయితే రామ్‌చరణ్‌కి జోడీగా కృతీసనన్ని తీసుకోవాలనే ఆలోచనలో ఉన్నారట సుకుమార్. మహేశ్ బాబు హీరోగా నటించిన ‘వన్: నేనొక్కడినే’ సినిమా ద్వారా కృతీసనన్ని తెలుగుకి పరిచయం చేశారు సుకుమార్. ఆ తర్వాత ‘దోచెయ్, ఆదిపురుష్’ వంటి తెలుగు సినిమాల్లో నటించారు కృతీసనన్. ప్రస్తుతం బాలీవుడ్లో బిజీగా ఉన్న ఈ బ్యూటీని ‘ఆర్సీ 17’ ద్వారా మరోసారి టాలీవుడ్‌కి తీసుకురానున్నారట సుకుమార్. మరి రామ్‌చరణ్‌కి జోడీగా కృతీసనన్ నటిస్తారా? లేదా? అనే విషయం తెలియాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాలి. -
పెద్ది 'రామ్ చరణ్' తల్లిగా సీనియర్ నటి
రామ్ చరణ్ పెద్ది సినిమా షూటింగ్ పనులు వేగంగా జరుగుతున్నాయి. ఉత్తరాంధ్ర నేపథ్యంలో సాగే పీరియాడిక్ మూవీగా దర్శకుడు బుచ్చిబాబు సానా తెరకెక్కిస్తున్నారు. రీసెంట్గా బెంగళూరులో చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ మూవీ ఇప్పుడు హైదరాబాద్‌లోనే చిత్రీకరణ జరుగుతుంది. అయితే, ఈ మూవలో రామ్ చరణ్ తల్లి పాత్రలో సీనియర్ నటి ఎంపిక అయ్యారని తెలుస్తోంది. ఈ మేరకు సోషల్‌మీడియాలో భారీగానే వార్తలు వస్తున్నాయి. దాదాపు ఆమె పేరు ఫైనల్ అయిందని త్వరలో అధికారికంగా ప్రకటించనున్నారని సమాచారం.పెద్దిలో పవర్ఫుల్ పాత్రలో రామ్ చరణ్ నటిస్తున్నారు. అంతే రేంజ్లో ఆయన తల్లి పాత్ర కూడా ఉండనుందట. అందుకే ఈ సినిమా కోసం సీనియర్ నటి విజి చంద్రశేఖర్‌ను తీసుకున్నారట. ఆమె ఇప్పటికే అఖండ సినిమాలో బాలకృష్ణకు తల్లిగా నటించి గుర్తింపు తెచ్చుకున్నారు. ఆమె ఎక్కువగా తమిళ, కన్నడ సినిమాలు, సీరియల్స్లలో నటించి గుర్తింపు తెచ్చుకున్నారు. 1981లో రజనీకాంత్ సినిమాతో పరిశ్రమలోకి అడుగుపెట్టారు. ఆమె విజయవాడలో జన్మించినప్పటికీ చెన్నైలో పెరిగారు. సీనియర్ నటి సరితకు విజి చంద్రశేఖర్ సోదరి అనే విషయం తెలిసిందే. మరో చరిత్ర, ఇది కథ కాదు, కోకిల వంటి చిత్రాలతో హీరోయిన్గా సరిత నటించారు. ఇప్పుడు పెద్ది సినిమాలో రామ్ చరణ్‌కు తల్లి పాత్రలో విజి చంద్రశేఖర్ నటిస్తుందని టాక్ రావడంతో సరైన ఎంపిక అంటూ ఫ్యాన్స్ కూడా కామెంట్లు చేస్తున్నారు.పెద్ది సినిమా వచ్చే ఏడాది మార్చి 27న విడుదల కానుంది. ఇందులో రామ్‌చరణ్ సరసన జాన్వీకపూర్ నటిస్తున్నారు. కన్నడ నటుడు శివరాజ్ కుమార్‌తోపాటు, జగపతిబాబు, దివ్యేందు శర్మ తదితరులు నటిస్తున్నారు. వృద్ధి సినిమాస్ పతాకంపై వెంకట సతీష్ కిలారు ఈ మూవీని నిర్మిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సమర్పిస్తున్నాయి. -
రామ్ చరణ్ పెద్ది.. వెయ్యిమందికి పైగా డ్యాన్సర్స్‌తో స్పెషల్ సాంగ్
గేమ్ ఛేంజర్ తర్వాత మెగా హీరో రామ్ చరణ్ నటిస్తోన్న పాన్ ఇండియా చిత్రం పెద్ది. ఇప్పటికే పెద్ది షాట్ పేరుతో గ్లింప్స్ విడుదల చేయగా మెగా ఫ్యాన్స్‌ను విపరీతంగా ఆకట్టుకుంది. రామ్ చరణ్ క్రికెట్ ఆడుతూ కొట్టిన షాట్ అద్భుతమైన క్రేజ్‌ను దక్కించుకుంది. ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు సనా ఈ స్పోర్ట్స్ డ్రామాను తెరకెక్కిస్తున్నారు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.ప్రస్తుతం పెద్ది షూటింగ్ కర్ణాటకలోని మైసూర్లో జరుగుతోంది. ఓ స్పెషల్ సాంగ్‌ను జానీమాస్టర్ కొరియోగ్రఫీలో చిత్రీకరిస్తున్నారు. దాదాపు 1000 మంది డ్యాన్సర్లతో ఈ స్పెషల్ సాంగ్‌ను షూట్ చేస్తున్నారు. ఇవాళ వినాయక చవితి సందర్భంగా స్పెషల్ విషెస్ చెబుతూ వీడియోను పోస్ట్ చేశారు. ఈ సినిమాకు ఏఆర్ రెహమాన్ సంగీతమందిస్తున్నారు. వెయ్యిమందితో చిత్రీకరిస్తోన్న ఈ ప్రత్యేక సాంగ్ పెద్ది మూవీలో హైలెట్‌గా నిలవడం ఖాయంగా కనిపిస్తోంది.కాగా.. ఈ సినిమాలో బాలీవుడ్ భామ జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తోంది. ఈ చిత్రంలో కన్నడ సూపర్‌స్టార్ శివ రాజ్‌కుమార్ కీలక పాత్ర పోషిస్తున్నారు. అంతేకాకుండా టాలీవుడ్ నటుడు జగపతి బాబు, దివ్యేందు శర్మ కూడా ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్లో వస్తోన్న ఈ సినిమా మార్చి 27, 2026న థియేటర్లలో సందడి చేయనుంది. ఈ మూవీని మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సమర్పణలో వృద్ధి సినిమాస్ బ్యానర్లో వెంకట సతీశ్ కిలారు భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. May Lord Ganesha bring peace, success and positivity into your lives.అందరికి వినాయక చవితి శుభాకాంక్షలు ✨@PeddiMovieOffl pic.twitter.com/DmGpC7wbuZ— Ram Charan (@AlwaysRamCharan) August 27, 2025 -
'పెద్ది'లో చరణ్ కోచ్‌గా స్టార్ హీరో.. ఫస్ట్‌లుక్ విడుదల
రామ్ చరణ్- బుచ్చిబాబు సానా కాంబినేషన్లో తెరకెక్కుతున్న చిత్రం 'పెద్ది'.. ఇప్పటికే విడుదలైన టైటిల్ గ్లింప్స్‌తో చరణ్ మెప్పించాడు. తనదైన శైలిలో బ్యాట్ ఝుళిపించి పాన్ ఇండియా బాక్సాఫీస్ వద్ద ‘పెద్ది’ సంతకం ఎలా ఉండబోతుందో చూపించాడు. అయితే, తాజాగా మరో స్టార్ హీరో ఫస్ట్ లుక్ విడుదల చేశారు. కన్నడ నటుడు శివరాజ్‌కుమార్ పుట్టినరోజు సందర్భంగా 'పెద్ది' సినిమాలో ఆయన లుక్ ఎలా ఉంటుందో మేకర్స్ రివీల్ చేశారు. ఇదే సమయంలో ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతూ తన పాత్ర పేరు 'గౌర్నాయుడు' అని రివీల్ చేశారు.పెద్ది సినిమా షూటింగ్ హైదరాబాద్‌లో వేగంగా జరుగుతుంది. ఇప్పటికే 2 రోజులు షూట్ కూడా పూర్తి చేసినట్లు శివరాజ్‌కుమార్ గతంలో ఇలా చెప్పారు. 'ఆ రెండు రోజులు చాలా సరదాగా అనిపించింది. తొలిసారి తెలుగులో మాట్లాడా. డైరెక్టర్ చాలా గుడ్ పర్సన్. నా షాట్‌ను ఆయన అభినందించారు. రామ్ చరణ్ బిహేవియర్ వెరీ గుడ్. ఈ సినిమాలో తొలిసారిగా తెలుగులో డైలాగ్ చెప్పాను. పెద్దిలో నా రోల్ చాలా స్పెషల్. బుచ్చిబాబు స్క్రిప్ట్ చాలా నచ్చింది.' అని ఆయన అన్నారు. ఈ సినిమాలో రామ్ చరణ్‌కు కోచ్‌గా శివరాజ్‌కుమార్ నటిస్తున్నట్లు సమాచారం.వృద్ధి సినిమాస్ పతాకంపై వెంకట సతీశ్ కిలారు నిర్మాత. మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. జాన్వీకపూర్ (Janhvi Kapoor) హీరోయిన్గా నటిస్తుంది. శివరాజ్ కుమార్‌తో పాటు జగపతిబాబు, దివ్యేందు శర్మ వంటి స్టార్స్ ఇందులో నటిస్తున్నారు. ఈ చిత్రానికి ఎ.ఆర్.రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. వచ్చే ఏడాది మార్చి 27న పెద్ది ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. View this post on Instagram A post shared by Buchi babu sana (@buchibabu_sana) -
భారీ ధరకు ‘పెద్ది’ ఓటీటీ రైట్స్.. రిలీజ్‌కు ముందే రికార్డు!
రామ్ చరణ్(Ram Charan) హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘పెద్ది’ (Peddi). ఉప్పెన ఫేం బుచ్చిబాబు సానా దర్శకత్వం వహిస్తున్న తొలి పాన్ ఇండియా చిత్రమిది. జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తోంది. ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నాడు. ఆ మధ్య ఈ సినిమా నుంచి గ్లింప్స్ వచ్చింది. ఒకే ఒక షాట్‌తో సినిమాపై అంచనాలను అమాంతం పెంచేశాడు. ‘ఏదైనా ఈ నేల మీదున్నప్పుడే సేసేయాల, పుడతాం ఏటి మళ్లీ’ అంటూ కోస్తాంధ్ర యాసలో రామ్‌చరణ్ చెప్పిన డైలాగులకు అద్భుతమైన స్పందన లభించింది. ఈ ఒక్క గ్లింప్స్‌తోనే ఓటీటీ డీల్ క్లోజ్ చేసుకుంది ఈ చిత్రం. భారీ ధరకు ఓటీటీ రైట్స్ ఇచ్చేశాడట నిర్మాత వెంకట సతీష్. డిజిటల్ రైట్స్ కోసం రెండు భారీ ఓటీటీ సంస్థలు పోటీ పడగా.. చివరకు నెట్‌ఫ్లిక్స్ సొంతం చేసుకుందట. అయితే ఈ డీల్‌లో కొన్ని కండీషన్స్ ఉన్నాయట. రూ. 105 కోట్లు తొలుత అందజేసి.. సినిమా రిజల్ట్‌ని బట్టి మరింత పెంచేస్తామని నెట్‌ఫ్లిక్స్ కండీషన్ పెట్టిందట. తెలుగు లో ఆడితే ఇంత.. హిందీలో ఈ స్థాయి కలెక్షన్స్ సాధిస్తే మరింత..అని ఒప్పందం కుదుర్చుకున్నారు. రిలీజ్ తర్వాత ఫలితాన్ని బట్టి రూ. 105 కోట్లతో పాటు మరింత అమౌంట్ నిర్మాతలకు వెళ్తుంది. షూటింగ్ అంతా పూర్తి చేసుకొని రిలీజ్‌కు రెడీ అయిన చిత్రాలకే ఓటీటీ డీల్ కావట్లేదు. ప్రభాస్ రాజాసాబ్, చిరంజీవి విశ్వంభర లాంటి చిత్రాలకు కూడా ఇంకా ఓటీటీ బిజినెస్ కాలేదు. అలాంటిది దాదాపు 50 శాతం షూటింగ్ పెండింగ్‌లో ఉన్న పెద్ది చిత్రానికి అప్పుడే ఓటీటీ డీల్ పూర్తి కావడం గొప్ప విషయమే. మల్టీస్పోర్ట్స్ నేపథ్యంలో రూపొందుతోన్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్‌లో జరుగుతోంది. కన్నడ స్టార్ శివరాజ్ కుమార్ కీలక పాత్ర పోషిస్తున్నాడు. వచ్చే ఏడాది మార్చి 27న ఈ చిత్రం రిలీజ్ కానుంది. -
మహేష్ బాబు తో మరో పెద్ది కారణం అదేనా ..!
-
సొంతూరికి రామ్ చరణ్ డైరెక్టర్.. గ్రామస్తులతో కలిసి భోజనం
ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు సనా ప్రస్తుతం రామ్ చరణ్‌తో జతకట్టారు. వీరిద్దరి కాంబోలో వస్తోన్న తొలి సినిమా కావడంతో అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇటీవల ఈ మూవీ టైటిల్‌తో పాటు ఫస్ట్ గ్లింప్స్‌ను మేకర్స్ విడుదల చేశారు. ఈ సినిమాకు పెద్ది అనే క్రేజీ టైటిల్ ఖరారు చేశారు. అంతేకాకుండా రామ్ చరణ్ గ్లింప్స్ సైతం అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంది. కాగా..ఈ చిత్రంలో బాలీవుడ్ భామ జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తోంది.ప్రస్తుతం పెద్ది సినిమాతో బిజీగా ఉన్న బుచ్చిబాబు ఓ ఫంక్షన్లో సందడి చేశారు. తన సొంతూరులోని ఓ వేడుకకు హాజరైనట్లు తెలుస్తోంది. ఆయన స్వగ్రామం అయినా కాకినాడ జిల్లా కొత్తపల్లిలో బుచ్చిబాబు ఓ వేడుకకు హాజరయ్యారు. డైరెక్టర్ రాకతో ఆ గ్రామంలో సందడి నెలకొంది. పలువురు సన్నిహితులు బుచ్చిబాబుతో ఫోటోలు దిగారు. ఈ వేడుకలో స్థానికులతో కలిసి భోజనం చేశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. -
పెద్దిలో మగధీర కాంబినేషన్?
-
'పెద్ది' సిక్సర్‌తో.. పుష్ప2, దేవర రికార్డ్స్ గల్లంతు
మెగా హీరో రామ్ చరణ్ కొట్టిన సిక్సర్‌తో ఇప్పటి వరకు ఉన్న రికార్డ్స్ అన్నీ గల్లంతు అయ్యాయి. తాజాగా విడుదలైన 'పెద్ది' గ్లింప్స్‌కు షోషల్‌మీడియా షేక్ అయిపోయింది. బుచ్చిబాబు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో జాన్వీకపూర్ (Janhvi Kapoor) హీరోయిన్గా నటిస్తుంది. ఫస్ట్ షాట్‌తోనే సినీ అభిమానులను రామ్‌చరణ్ ఆకట్టుకున్నాడు. ఇప్పటి వరకు విడుదలైన చిత్రాల గ్లింప్స్‌కు వచ్చిన వ్యూస్ విషయంలో దేవర (26.17 మిలియన్లు) టాప్‌లో ఉంది. ఇప్పుడు పెద్ది సినిమా గ్లింప్స్ ఆ రికార్డ్‌ను దాటేసింది. 24గంటల్లోనే ఏకంగా 30.6 మిలియన్ల వ్యూస్‌తో దుమ్మురేపింది. ఇప్పటి వరకు టాలీవుడ్లో ఉన్న అన్ని సినిమాల గ్లింప్స్ రికార్డ్స్‌ను పెద్ది దాటేసింది. దీంతో మెగా ఫ్యాన్స్ ఫుల్ జోష్‌లో ఉన్నారు. తప్పకుండా పెద్ది సినిమాతో భారీ హిట్ కొడుతున్నామని వారు పోస్ట్‌లు షేర్ చేస్తున్నారు. టాలీవుడ్లో పెద్ది గ్లింప్స్ టాప్-1లో ఉంటే.. ఇండియాలో టాక్సిక్ (36 మిలియన్లు)తో టాప్-1లో ఉంది.'పెద్ది' హిందీ గ్లింప్స్ విడుదల.. డబ్బింగ్ ఎవరంటే..?పెద్ది సినిమా పాన్ ఇండియా రేంజ్లో విడుదల కానున్న విషయం తెలిసిందే. అయితే, తాజాగా హిందీ గ్లింప్స్‌ను మేకర్స్ విడుదల చేశారు. హందీ వర్షన్లో తన పాత్రకు డబ్బింగ్ స్వయంగా చెప్పుకున్నారు. ఈ గ్లింప్స్ నుంచి ఇప్పటికే మిలియన్ల కొద్ది రీల్స్ సోషల్‌మీడియాలో వైరల్ అవుతన్న విషయం తెలిసిందే. ఈ చిత్రం 2026 మార్చి 27న విడుదల కానుంది.టాలీవుడ్ టాప్ (గ్లింప్స్) చిత్రాలుపెద్ది (30.6 మిలియన్లు)దేవర (28.7 మిలియన్లు)పుష్ప2 (27.11 మిలియన్లు)ఓజీ (27 మిలియన్లు)కల్కి (23.16 మిలియన్లు)గుంటూరు కారం (21.12 మిలియన్లు)ది ప్యారడైజ్ (17.12 మిలియన్లు) -
రామ్ చరణ్ 'పెద్ది' మూవీ ఫస్ట్ షాట్ (ఫొటోలు)
-
'పెద్ది' సర్ ప్రైజ్.. ఉగాదికి కాదు శ్రీరామనవమికి
రామ్ చరణ్ కొత్త సినిమాకు పెద్ది అనే టైటిల్ ఫిక్స్ చేశారు. తాజాగా ఇతడి పుట్టినరోజు సందర్భంగా రెండు పోస్టర్స్ రిలీజ్ చేసి మూవీ ఎంత రస్టిక్ గా ఉండబోతుందో చెప్పకనే చెప్పారు. అయితే పోస్టర్స్ తో సంతృప్తి పడని ఫ్యాన్స్.. గ్లింప్స్ ఎప్పుడొస్తుందా అని వెయిట్ చేస్తున్నారు. ఇప్పుడు దానిపై క్లారిటీ వచ్చేసింది.(ఇదీ చదవండి: 'మ్యాడ్ స్క్వేర్'కి ఊహించని కలెక్షన్స్)బుచ్చిబాబు దర్శకత్వం వహిస్తున్న ఈ విలేజ్ బ్యాక్ డ్రాప్ మూవీకి ఏఆర్ రెహమాన్ సంగీత దర్శకుడు. కొన్నాళ్ల క్రితం ఛాతీనొప్పి రావడంతో బెడ్ రెస్ట్ తీసుకున్నాడు. దీంతో పుట్టినరోజున గ్లింప్స్ ఉండకపోవచ్చని అనుకున్నారు. అలానే జరిగింది. శ్రీరామనవమి రోజున గ్లింప్స్ వీడియో రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు. పోస్టర్ కూడా రిలీజ్ చేశారు.బహుశా గ్లింప్స్ వీడియోలో రామ్ చరణ్ క్యారెక్టర్ తో పాటు రిలీజ్ తేదీపై కూడా క్లారిటీ ఇచ్చే అవకాశముంది. వచ్చే ఏడాది మార్చి 27న అనుకుంటున్నారు. కానీ మరి అది నిజమో కాదో చూడాలి. ఈ మూవీలో జాన్వీ కపూర్ హీరోయిన్ కాగా కన్నడ స్టార్ శివరాజ్ కుమార్ కీలక పాత్రలో కనిపిస్తారు.(ఇదీ చదవండి: పూరీ-సేతుపతి అఫీషియల్.. రెండు విషయాల్లో క్లారిటీ) -
రామ్ చరణ్ RC16 'టైటిల్, ఫస్ట్ లుక్' విడుదల.. బుచ్చి బాబు మార్క్
రామ్ చరణ్(Ram Charan) బర్త్ డే సందర్భంగా తన కొత్త సినిమా (RC16) నుంచి ఫస్ట్ లుక్ విడుదలైంది. ఇందులో అదిరిపోయే మాస్ గెటప్‌లో ఆయన కనిపిస్తున్నారు. దర్శకుడు బుచ్చిబాబు (Buchi Babu Sana) తన మార్క్ చూపించబోతున్నాడని క్లియర్‌గా అర్థం అవుతుంది. మల్టీ స్పోర్ట్స్ డ్రామా చిత్రంగా ప్రేక్షకుల ముందుకు పాన్ ఇండియా రేంజ్లో ఈ ప్రాజెక్ట్ రానుంది. అయితే, ఈ మూవీకి ‘పెద్ది’ అనే టైటిల్‌ను ఫిక్స్ చేశారు. ఈ చిత్రంలో జాన్వీ కపూర్( Janhvi Kapoor) హీరోయిన్గా నటిస్తుండగా, జగపతిబాబు, కన్నడ నటుడు శివ రాజ్‌కుమార్(Shiva Rajkumar), బాలీవుడ్ నటుడు దివ్యేందు ఇతర ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.క్రికెట్, కుస్తీ గురించే కాకుండా... మరికొన్ని ఇతర స్పోర్ట్స్ గురించిన ప్రస్తావన కూడా ఉంటుందని తెలిసింది. ‘జైలర్’ ఫేమ్ కెవిన్ కుమార్ ఈ యాక్షన్ సీక్వెన్స్ కు కొరియోగ్రఫీ చేయనున్నారని ఫిల్మ్‌నగర్ సమాచారం. సుకుమార్ రైటింగ్స్, మైత్రీ మూవీ మేకర్స్‌ల సమర్పణలో వృద్ధి సినిమాస్ పతాకంపై వెంకట సతీష్ కిలారు నిర్మిస్తున్న ఈ సినిమాను ఈ ఏడాదే రిలీజ్ చేయాలనుకుంటున్నారు. ఈ సినిమాకు సంగీతం ఏఆర్ రెహమాన్ అందిస్తున్నారు . గేమ్‌ఛేంజర్ పరాజయంతో నిరాశలో ఉన్న మెగా ఫ్యాన్స్‌కు రామ్‌చరణ్ ఫస్ట్ లుక్ ఫుల్ జోష్ నింపుతుంది. ఈసారి తప్పకుండా హిట్ కొడుతున్నాం అంటూ సోషల్‌మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. 𝐀 𝐌𝐀𝐍 𝐎𝐅 𝐓𝐇𝐄 𝐋𝐀𝐍𝐃, 𝐀 𝐅𝐎𝐑𝐂𝐄 𝐎𝐅 𝐓𝐇𝐄 𝐍𝐀𝐓𝐔𝐑𝐄 ❤️🔥#RC16 is #PEDDI 🔥💥Happy Birthday, Global Star @AlwaysRamCharan ✨#HBDRamCharan#RamCharanRevolts@NimmaShivanna #JanhviKapoor @BuchiBabuSana @arrahman @RathnaveluDop @artkolla @NavinNooli… pic.twitter.com/ae8BkshtR3— Mythri Movie Makers (@MythriOfficial) March 27, 2025 -
చెర్రీ మూవీలో స్టార్ హీరో.. జూబ్లీహిల్స్ పెద్దమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు
కన్నడ సూపర్ స్టార్ శివరాజ్‌కుమార్ ప్రస్తుతం రామ్ చరణ్ మూవీలో కీ రోల్ ప్లే చేస్తున్నారు. ఆర్సీ16 వర్కింగ్ టైటిల్ తెరకెక్కిస్తోన్న చిత్రంలో ఆయన నటిస్తోన్న సంగతి తెలిసిందే. ఇటీవలే అమెరికా వెళ్లి క్యాన్సర్ చికిత్స తీసుకుని ఇండియాకు తిరిగొచ్చారు. ప్రస్తుత చెర్రీ-బుచ్చిబాబు సనా కాంబోలో వస్తోన్న మూవీ షూట్ కోసం హైదరాబాద్‌కు వచ్చారు. ఈ సందర్భంగా ఆయన ప్రముఖ ఆలయాన్ని సందర్శించారు. అయితే క్యాన్సర్ చికిత్స తర్వాత ఆయన పూర్తిగా మారిపోయినట్లు కనిపించారు.భాగ్యనగరంలో అడుగుపెట్టిన శాండల్‌వుడ్ స్టార్ జూబ్లీహిల్స్‌లోని పెద్దమ్మ తల్లి ఆలయాన్ని సందర్శించారు. ఆయన సతీమణితో కలిసి అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. శివరాజ్‌కుమార్‌ను చూసిన భక్తులు ఆయనతో ఫోటోలు దిగేందుకు ఎగబడ్డారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా.. గతేడాది శివరాజ్‌కుమార్ నటించిన యాక్షన్ థ్రిల్లర్ భైరాతి రణగల్ మూవీతో ప్రేక్షకులను అలరించారు. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద పాజిటివ్ టాక్‌ను సొంతం చేసుకుంది. 2024లో శివరాజ్ కుమార్ నటించిన చివరి చిత్రం ఇదే కావడం విశేషం. ప్రస్తుతం ఈ సినిమా అమెజాన్ ప్రైమ్‌తో పాటు ఆహాలోనూ స్ట్రీమింగ్ అవుతోంది. #TFNExclusive: Actor @NimmaShivanna visits Shri Peddamma Talli Temple to seek divine blessings while in Hyderabad for #RC16 shoot🙏🏻✨#ShivaRajKumar #TeluguFilmNagar pic.twitter.com/SnkF2ZQQFo— Telugu FilmNagar (@telugufilmnagar) March 23, 2025 -
రామ్ చరణ్.. ఓ 'అద్దె ఆటగాడు'?
'గేమ్ ఛేంజర్' రిజల్ట్ ఏంటో అందరికీ తెలుసు. వెంటనే దాన్నుంచి బయటకొచ్చిన మెగా ఫ్యాన్స్.. చరణ్ (Ram Charan) కొత్త మూవీ కోసం చాలా ఎదురుచూస్తున్నారు. అందుకు తగ్గట్లే సోషల్ మీడియాలో ఎప్పుడూ ఏదో ఓ రూమర్ వినిపిస్తూనే ఉంటుంది. తాజాగా RC16 కథ ఇదేనా అని నెటిజన్లు మాట్లాడుకుంటున్నారు. 'ఉప్పెన' తర్వాత దర్శకుడు బుచ్చిబాబు చేస్తున్న సినిమా ఇది. 'పెద్ది' అనే వర్కింగ్ టైటిల్ అనుకుంటున్నారని టాక్. ఇందులో జాన్వీ కపూర్ (Janhvi Kapoor) హీరోయిన్. కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్ కీలక పాత్రలో నటిస్తున్నారు. స్పోర్ట్స్ డ్రామాగా దీన్ని తీస్తున్నారు. ఇప్పటికే వేగంగా షూటింగ్ చేస్తున్నారు.(ఇదీ చదవండి: మళ్లీ హాస్పిటల్ బెడ్ పై సమంత)స్పోర్ట్స్ డ్రామా స్టోరీ అని ఇదివరకే లీకైంది. ఇప్పుడు ఈ మూవీలో చరణ్.. అద్దె ఆటగాడిగా కనిపించబోతున్నాడని అంటున్నారు. అంటే క్రికెట్, కబడ్డీ, వాలీబాల్.. ఇలా ఏ గేమ్ అయినా సరే ఎంతో కొంత డబ్బులిస్తే, వాళ్ల టీమ్ తరఫున ఆడతాడు. మరి నిజమా కాదా అనేది చూడాలి.కొన్నాళ్ల క్రితం మైసూరులో షూటింగ్ ప్రారంభం కాగా.. ఎక్కువగా రాత్రుళ్లు జరిగే సీన్స్ తీస్తున్నారు. రీసెంట్ గా క్రికెట్ సీన్స్ తెరకెక్కించారట. పెద్దగా గ్రాఫిక్స్ లాంటివి లేవని, దీంత వీలైనంత త్వరగా పనిపూర్తి చేసుకుని ఈ ఏడాది థియేటర్లలో రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారట.(ఇదీ చదవండి: 'బిగ్ బాస్'కి వెళ్లకుండా ఉండాల్సింది.. ఏడేళ్లుగా బాధ: శిల్పా చక్రవర్తి) -
కన్ఫ్యూజ్ చేస్తున్న రామ్ చరణ్?
-
మాస్ యాక్షన్ షురూ
రామ్‌చరణ్(Ram Charan) హీరోగా బుచ్చిబాబు దర్శకత్వంలో రూపొందుతున్న మల్టీ స్పోర్ట్స్ డ్రామా ఫిల్మ్ ‘పెద్ది’ (ప్రచారంలో ఉన్న టైటిల్). ఈ చిత్రంలో జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తుండగా, జగపతిబాబు, కన్నడ నటుడు శివ రాజ్‌కుమార్, బాలీవుడ్ నటుడు దివ్యేందు ఇతర ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.కాగా ఈ సినిమా కొత్త షెడ్యూల్ ఇటీవల హైదరాబాద్‌లో ప్రారంభమైంది. ఓ సెట్లో నైట్ షూట్ జరుగుతోందని తెలిసింది. రామ్‌చరణ్, జాన్వీ కపూర్, శివ రాజ్‌కుమార్‌ల కాంబినేషన్ లోని సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారట. అలాగే ఈ సినిమాలో క్రికెట్, కుస్తీ గురించే కాకుండా... మరికొన్ని ఇతర స్పోర్ట్స్ గురించిన ప్రస్తావన కూడా ఉంటుందని తెలిసింది. ఇంకా ఈ షెడ్యూల్లోనే ఓ మాస్ యాక్షన్ సీక్వెన్స్‌ను తీసేందుకు టీమ్ రెడీ అయిందని, ‘జైలర్’ ఫేమ్ కెవిన్ కుమార్ ఈ యాక్షన్ సీక్వెన్స్ కు కొరియోగ్రఫీ చేయనున్నారని ఫిల్మ్‌నగర్ సమాచారం. సుకుమార్ రైటింగ్స్, మైత్రీ మూవీ మేకర్స్‌ల సమర్పణలో వద్ధి సినిమాస్ పతాకంపై వెంకట సతీష్ కిలారు నిర్మిస్తున్న ఈ సినిమాను ఈ ఏడాదే రిలీజ్ చేయాలనుకుంటున్నారు. ఈ సినిమాకు సంగీతం: ఏఆర్ రెహమాన్ . -
పార్లమెంట్‌కు రామ్ చరణ్.. ఎందుకంటే?
గేమ్ ఛేంజర్ తర్వాత గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటిస్తోన్న చిత్రం ఆర్సీ16. ఈ మూవీకి ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు సనా దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. కొద్ది రోజుల క్రితమే సెట్లోని ఫోటోలను కూడా సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు చెర్రీ. తన కూతురు క్లీంకారతో ఉన్న ఫోటోలను పంచుకున్నారు. ప్రస్తుతం ఆర్సీ16 మూవీ షూటింగ్ షెడ్యూల్ మైసూరులో జరుగుతోన్న సంగతి తెలిసిందే.మైసూరు షెడ్యూల్లో రామ్ చరణ్‌పై కీలక సన్నివేశాలు చిత్రీకరించారు. ఈ షెడ్యూల్ దాదాపుగా ముగిసినట్లు తెలుస్తోంది. ఆ తర్వాత రామ్ చరణ్ మూవీ టీమ్ ఢిల్లీకి షిఫ్ట్ అవుతున్నట్లు సమాచారం. ఢిల్లీలోని పార్లమెంట్లో మరిన్ని కీలక సన్నివేశాలు చిత్రీకరించనున్నట్లు టాక్ వినిపిస్తోంది. అంతేకాకుడా జామా మసీదు ప్రాంతంలోనూ షూట్ చేయనున్నారని టాక్. షూటింగ్ అనుమతులకు సంబంధించిన ప్రక్రియ ఇప్పటికే పూర్తయినట్లు తెలుస్తోంది. మార్చి 4న పార్లమెంట్లో చిత్రీకరణ ప్రారంభమయ్యే అవకాశమున్నట్లు తెలుస్తోంది.కాగా.. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్, వృద్ధి సినిమాస్ పతాకాలపై వెంకట సతీష్ కిలారు నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు పెద్ది అనే టైటిల్ ఖరారు చేసినట్లు ప్రచారం జరుగుతోంది. స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో దేవర భామ జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తున్నారు. ఈ చిత్రంలో కన్నడ సూపర్ స్టార్ శివరాజ్‌కుమార్, జగపతిబాబు, దివ్యేందు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమాకు ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. ఈ నెల 27న రామ్‌చరణ్ బర్త్ డే సందర్భంగా టీజర్ విడుదలయ్యే అవకాశమున్నట్లు తెలుస్తోంది. -
చెర్రీ బర్త్‌డేకి బిగ్ ట్రీట్ రెడీ..! ఫ్యాన్స్ కి పండగే ఇక..!
-
నాన్నా.. చరణ్ సినిమాకు అలా అడగాల్సిన పనిలేదు: బుచ్చిబాబు
ఉప్పెన(2021) సినిమాతో భారీ బ్లాక్ బస్టర్ అందుకున్నాడు దర్శకుడు బుచ్చిబాబు(Buchi Babu Sana). తొలి సినిమాతోనే రూ.100 కోట్లుకు పైగా కలెక్షన్స్ రాబట్టి రికార్డు సృష్టించాడు. అయితే ఈ సినిమా రిలీజై నాలుగేళ్లు అవుతున్నా.. బుచ్చిబాబు నుంచి మరో సినిమా రాలేదు. ప్రస్తుతం ఆయన రామ్ చరణ్(Ram Charan)తో సినిమా చేస్తున్నాడు. జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రానికి ఇంకా టైటిల్ ఖరారు చేయలేదు. రామ్ చరణ్ కెరీర్లో ఇది 16వ సినిమా(RC16). ఇటీవల విడుదలైన గేమ్ ఛేంజర్ చిత్రం డిజాస్టర్ కావడంతో మెగా ఫ్యాన్స్ అంతా బుచ్చి బాబు సినిమాపైనే భారీ ఆశలు పెట్టుకున్నారు. తమ హీరోకి ఎలాగైనా బ్లాక్ బస్టర్ అందించాలని కోరుతున్నారు. ఫ్యాన్స్ ఊహించినదానికంటే ఎక్కువ హిట్టే అందిస్తానని చెబుతున్నాడు బుచ్చిబాబు. తాజాగా ఓ ఈవెంట్ రామ్ చరణ్ సినిమాపై బుచ్చిబాబు ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.బ్రహ్మాజీ ప్రధానపాత్రలో తెరకెక్కిన ‘బాపు’ చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు ముఖ్యఅతిథిగా హాజరైన బుచ్చిబాబు మాట్లాడుతూ..‘మా నాన్న రైతు. చాలా కష్టపడి మమ్మల్ని పెంచాడు. వ్యవసాయం గురించి మా నాన్న నాతో ఓ మాట చెప్పాడు. ‘పేకాట ఆడితే డబ్బులు మనకో లేదా పక్కోడికో వస్తాయిరా..కానీ వ్యవసాయం చేస్తే ఎవడికి వస్తాయో తెలియదు..అంతా పోతాయి’ అని అనేవాడు. నిజంగానే ఏడాదంతా కష్టపడితే ఏకరం మీద రైతుకు మిగిలేది కేవలం ఐదు వేల రూపాయలు మాత్రమే. ఇప్పటికీ అదే పరిస్థితి ఉంది’ అని బుచ్చిబాబు అన్నారు. అలాగే తన నాన్న గురించి మాట్లాడుతూ..‘ఉప్పెన రిలీజ్ సమయంలో మా నాన్న థియేటర్ బయటే నిలబడి ‘సినిమా బాగుందా’ అని వచ్చిన వారందరినీ అడిగేవాడట. ఆయన సినిమా కూడా చూడకుండా థియేటర్‌కు వచ్చిన వారి అభిప్రాయాలు తెలుసుకున్నారు. ఆయన మా నుంచి బౌతికంగా దూరమై ఏడాది అవుతోంది. ప్రస్తుతం నేను చరణ్‌తో తీస్తున్న సినిమా బాగుందా అని ఎవరినీ అడగాల్సిన పని లేదు నాన్నా.. అది కచ్చతంగా హిట్ అవుతుంది’ అని బుచ్చిబాబు ఎమోషనల్‌గా చెప్పారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. -
బర్త్ డే స్పెషల్
‘ఉప్పెన’ సినిమాతో బ్లాక్‌బస్టర్ అందుకున్న దర్శకుడు బుచ్చిబాబు(Buchi Babu) సానా ద్వితీయ చిత్రాన్ని హీరో రామ్‌చరణ్(Ram Charan)తో చేసే అవకాశం దక్కించుకున్న సంగతి తెలిసిందే. రామ్‌చరణ్ హీరోగా రూపొందుతోన్న ఈ చిత్రానికి ‘ఆర్సీ 16’ అనే వర్కింగ్ టైటిల్ ఫిక్స్ చేశారు. మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సమర్పణలో వృద్ధి సినిమాస్‌పై వెంకట సతీష్ కిలారు నిర్మిస్తున్న ఈ పాన్ ఇండియా మూవీలో జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తున్నారు. కాగా శనివారం (ఫిబ్రవరి 15) బుచ్చిబాబు బర్త్ డే.ఈ సందర్భంగా సంస్థ కార్యాలయంలో ‘ఆర్సీ 16’ యూనిట్ ఆధ్వర్యంలో ఆయన పుట్టినరోజు వేడుకని నిర్వహించారు. రామ్‌చరణ్ కూడా బుచ్చిబాబుతో కలిసి ఉన్న ఫొటోని సోషల్ మీడియా వేదికగా షేర్ చేసి, పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఇదిలా ఉంటే.. ‘ఆర్సీ 16’ సినిమా తాజా షెడ్యూల్ హైదరాబాద్‌లో ముగిసింది.రామ్ చరణ్‌తో పాటు ముఖ్య తారాగణంపై కీలక సన్నివేశాలను చిత్రీకరించారు బుచ్చిబాబు. ఈ సినిమా ఈ ఏడాది విడుదల కానుంది. శివ రాజ్‌కుమార్, జగపతిబాబు, ‘మీర్జాపూర్’ ఫేమ్ దివ్యేందు ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తుండగా, రత్నవేలు సినిమాటోగ్రాఫర్‌గా వ్యవహరిస్తున్నారు. -
పెద్ది షూటింగ్ షురూ
రామ్‌చరణ్ హీరోగా ‘ఉప్పెన’ ఫేమ్ బుచ్చిబాబు సాన దర్శకత్వంలో పీరియాడికల్ స్పోర్ట్స్ డ్రామా ‘పెద్ది’ (ప్రచారంలో ఉన్న టైటిల్) రూపొందుతున్న సంగతి తెలిసిందే ఈ చిత్రంలో జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తున్నారు. ఈ సినిమా తాజా షెడ్యూల్ ఈ నెలాఖరున హైదరాబాద్‌లోప్రారంభం కానుందని తెలిసింది. హైదరాబాద్‌లో వేసిన ఓ సెట్లో రామ్‌చరణ్‌తో పాటు ఈ సినిమా ప్రధాన తారాగణం పాల్గొననుండగా కీలక సన్నివేశాల చిత్రీకరణను ప్లాన్ చేశారట.అంతేకాదు... ఈ సినిమాలో ఒకే ఒక్క క్రీడ కాకుండా రెండు మూడు రకాల క్రీడలకు సంబంధించిన ప్రస్తావన ఉంటుందట. ఈ చిత్రంలో రామ్‌చరణ్ డిఫరెంట్ గెటప్స్‌లో కనిపించనున్నారు. ‘తంగలాన్’ సినిమాకు వర్క్ చేసిన కాస్ట్యూమ్ డిజైనర్ ఏకాంబరంను ఈ సినిమాలో భాగం చేశారు. దీంతో రామ్‌చరణ్ లుక్స్ కొత్తగా ఉండనున్నాయని తెలుస్తోంది. సుకుమార్ రైటింగ్స్, మైత్రీ మూవీ మేకర్స్, వృద్ధి సినిమాస్ పతాకాలపై వెంకట సతీష్ కిలారు నిర్మిస్తున్న ఈ చిత్రం ఈ ఏడాదిలోనే రిలీజ్ కానుందని తెలిసింది. -
రామ్ చరణ్‌తో బుచ్చిబాబు సినిమా.. జగపతి బాబు లుక్ చూశారా?
గేమ్ ఛేంజర్ తర్వాత గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు సన డైరెక్షన్లో చెర్రీ నటించనున్నారు. ఇప్పటికే పూజా కార్యక్రమాలు పూర్తి కాగా.. ప్రస్తుతం షూటింగ్ జరుగుతోంది. ఈ మూవీలో టాలీవుడ్ నటుడు జగపతి బాబు కీ రోల్ ప్లే చేస్తున్నారు. షూట్లో బిజీగా ఉన్నారు. తాజాగా ఈ మూవీ షూట్‌కు సంబంధించిన వీడియోను ట్విటర్ షేర్ చేశారు.ఈ చిత్రంలో తన పాత్ర కోసం మేకోవర్ చేస్తున్న వీడియోను జగపతిబాబు సోషల్ మీడియాలో పంచుకున్నారు. 'చాలాకాలం తర్వాత బుచ్చిబాబు ఆర్సీ 16 కోసం మంచి పని పెట్టాడు..గెటప్ చూసిన తర్వాత నాకు చాలా తృప్తిగా అనిపించింది'అని ట్విటర్లో పోస్ట్ చేశాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ఆర్సీ16గా తెరకెక్కిస్తోన్న ఈ చిత్రంలో రామ్ చరణ్ సరసన దేవర భామ జాన్వీ కపూర్ హీరోయిన్గా కనిపించనుంది.ఈ సినిమాను బుచ్చిబాబు స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కించనున్నట్లు తెలుస్తోంది. గ్రామీణ నేపథ్యంలో సాగే కథతో ఈ మూవీని రూపొందిస్తున్నారు. ఇందులో కన్నడ నటుడు శివ రాజ్‌కుమార్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి రెహమాన్ సంగీతమందిస్తున్నారు.ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్, వృద్ధి సినిమాస్, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్లపై సంయుక్తంగా నిర్మిస్తున్నారు. Chaala Kaalam tharavaatha @BuchiBabuSana #RC16 ki manchi pani pettaadu.. get up choosina tharavaatha Naaku chaala thrupthi ga undhi. pic.twitter.com/aaiQ8HPErp— Jaggu Bhai (@IamJagguBhai) January 16, 2025 -
ఎన్టీఆర్.. ఇంత సన్నబడ్డాడేంటి?
'ఆర్ఆర్ఆర్' సినిమా హీరోలు రామ్ చరణ్, ఎన్టీఆర్ (NTR) మళ్లీ కలిశారు. ఇందుకు సంబంధించిన కొన్ని ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దర్శకుడు బుచ్చిబాబు, తమన్.. చరణ్(Ram Charan)-తారక్‌తో దిగిన ఫొటోలని పోస్ట్ చేయడంతో ఈ విషయం బయటపడింది. ఇంతకీ వీళ్లిద్దరూ ఎక్కడ? ఎందుకు కలిశారు?(ఇదీ చదవండి: సింగర్ రమణ గోగుల 'గుండు' వెనక ఇంత స్టోరీ ఉందా?)రీసెంట్గా అమెరికాలో రామ్ చరణ్ 'గేమ్ ఛేంజర్' (Game Changer) మూవీ ఈవెంట్ జరిగింది. దీనికి చరణ్, తమన్, బుచ్చిబాబు తదితరులు హాజరయ్యారు. రిట్నర్ వస్తున్న క్రమంలోనే దుబాయిలో దిగారు. అక్కడే ఎన్టీఆర్‌ని కలిశారు. మరి తారక్ హాలీ డే కోసం వెళ్తున్నాడా? వేరే షూటింగ్ ఏమైనా ఉందా? అనేది తెలియదు. కానీ ఎన్టీఆర్ లుక్ మాత్రం ఆసక్తికరంగా అనిపించింది.తారక్.. ఈ రెండు ఫొటోల్లో చాలా సన్నగా కనిపిస్తున్నాడు. ప్రస్తుతానికైతే 'వార్ 2' చేస్తున్నాడు. ప్రశాంత్ నీల్ (Prashanth Neel) సినిమా షూటింగ్ ఫిబ్రవరి నుంచి మొదలవుతుంది. ఇది పీరియాడికల్ మూవీ అని ఈ మధ్యే ఇంటర్వ్యూలో ప్రశాంత్ నీల్ చెప్పాడు. మరి తారక్ సన్నబడింది ఈ ప్రాజెక్ట్ కోసమేనా లేదా ఇంకేదైనా కారణముందా అనేది తెలియాల్సి ఉంది.(ఇదీ చదవండి: ఎన్టీఆర్ ఇంతవరకు సాయం చేయలేదు.. అభిమాని తల్లి ఆవేదన) -
స్టార్ హీరోలను మెప్పిస్తున్న యంగ్ డైరెక్టర్స్
సినిమాలో కంటెంట్ బాగుంటే చిన్నా పెద్దా అనే తేడాల్లేవ్. ఆడియన్స్ సూపర్ హిట్ చేస్తున్నారు. అలాగే కథలో బలం ఉందని హీరో–నిర్మాతలు నమ్మితే చాలు చిన్నా పెద్దా తేడాల్లేవ్, అనుభవం లెక్కలోకి రాదు. స్టార్ హీరోలు కొత్త దర్శకులతో సినిమాలు చేయడానికి రెడీ అయిపోతారు. కథ కోసం బడ్జెట్ కేటాయింపులకు నిర్మాతలు సిద్ధమైపోతారు. ఇలా తమ కలంతో స్టార్ హీరోలను ఒప్పిస్తున్న యువ దర్శకుల జాబితా టాలీవుడ్లో పెరిగిపోతోంది. స్టార్ హీరోలను డైరెక్ట్ చేయాలనే పట్టుదలతో బలమైన కథలు సిద్ధం చేసుకున్నారు కొందరు యువ దర్శకులు. ఆ కథలతో స్టార్ హీరోలను మెప్పించి, సినిమా చేస్తున్న ఆ దర్శకుల గురించి తెలుసుకుందాం.ఇద్దరు యువ దర్శకులతో... నూటయాభైకి పైగా సినిమాలు చేసిన చిరంజీవి వంటి అగ్రహీరో వరుసగా యువ దర్శకులకు చాన్స్ ఇస్తున్నారు. ప్రస్తుతం చిరంజీవి హీరోగా నటిస్తున్న ‘విశ్వంభర’ సినిమాకు వశిష్ఠ దర్వకత్వం వహిస్తున్నారు. ‘విశ్వంభర’కు ముందు వశిష్ఠ చేసింది ఒక్కటే సినిమా. అదే ‘బింబిసార’. తన ప్రతిభతో మెప్పించి, చిరంజీవి వంటి టాప్ హీరోతో సినిమా చేసే చాన్స్ దక్కించుకున్నారు వశిష్ఠ. అలాగే ‘దసరా’ సినిమాతో దర్శకుడిగా పరిచయం అయ్యారు శ్రీకాంత్ ఓదెల. నాని హీరోగా నటించిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ. 100 కోట్ల గ్రాస్ కలెక్షన్స్‌ను కొల్లగొట్టింది. శ్రీకాంత్ ఓదెల కథను మెచ్చి, ఈ యువ దర్శకుడికి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు చిరంజీవి. ఈ సినిమాకు హీరో నాని ఓ నిర్మాతగా ఉండటం విశేషం. ‘ప్యారడైజ్’ టైటిల్‌తో ఈ సినిమా తెరకెక్కనుంది. సంక్రాంతి తర్వాత... ఇండస్ట్రీకి చాలామంది దర్శకులను పరి చయం చేశారు నాగార్జున. తెలుగు ఇండస్ట్రీలో కల్ట్ క్లాసిక్‌గా చెప్పుకునే ‘శివ’ సినిమాతో రామ్‌గోపాల్ వర్మను దర్శకుడిగా పరిచయం చేశారు. ఇంకా నాగార్జున పరిచయం చేసిన దర్శకుల లిస్ట్ చాలానే ఉంది. ఈ విధంగా యువ దర్శకులతో పని చేయడానికి నాగార్జున ఆసక్తి చూపిస్తుంటారు. తాజాగా ‘హుషారు, రౌడీబాయ్స్, ఓం భీమ్ బుష్’ సినిమాలు తీసిన దర్శకుడు హర్ష కొనుగంటితో సినిమా చేసే ఆలోచన చేస్తున్నారట నాగార్జున. అలాగే తమిళంలో రెండు సినిమాలకు దర్శకత్వం వహించిన నవీన్ అనే దర్శకుడు చెప్పిన కథను కూడా ఓకే చేశారట. ఈ యువ దర్శకులతో నాగార్జున చేయాల్సిన సినిమాలపై సంక్రాంతి తర్వాత ఓ స్పష్టత వస్తుంది. పెద్ది ‘రాజమౌళి, శంకర్’ వంటి ప్రముఖ దర్శకులతో సినిమాలు చేసిన రామ్‌చరణ్ తన తర్వాతి సినిమాను ‘ఉప్పెన’ ఫేమ్ బుచ్చిబాబు చేతుల్లో పెట్టారు. దర్శకుడిగా బుచ్చిబాబుకు ఇది రెండో సినిమా. ఆల్రెడీ ఈ సినిమా చిత్రీకరణ ప్రారంభమైంది. జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాలో జగపతిబాబు, శివరాజ్‌కుమార్ లీడ్ రోల్స్‌లో నటిస్తున్నారు. అంతేకాదు... తన రెండో సినిమాకే ఆస్కార్ విన్నింగ్ మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్‌ను ఒప్పించగలిగారు బుచ్చిబాబు. ‘పెద్ది’ అనే వర్కింగ్ టైటిల్‌తో ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్, వృద్ధి సినిమాస్, సుకుమార్ రైటింగ్స్ పతాకాలపై వెంకట సతీష్ కిలారు నిర్మిస్తున్నారు. డీజే టిల్లు దర్శకుడితో... యువ హీరో సిద్ధు జొన్నలగడ్డతో ‘డీజే టిల్లు’ వంటి సూపర్‌హిట్ ఫిల్మ్‌తో దర్శకుడిగా పరిచయం అయ్యారు విమల్ కృష్ణ. కాగా విమల్ రెడీ చేసిన ఓ కథను అగ్ర హీరో వెంకటేశ్ ఆల్మోస్ట్ ఓకే చేశారట. వీరిద్దరి మధ్య కథా చర్చలు జరిగాయని, వీరి కాంబినేషన్లోని సినిమాపై త్వరలోనే ఓ స్పష్టత రానుందని ఫిల్మ్‌నగర్ భోగట్టా. కథ విన్నారా? ‘హాయ్ నాన్న’ సినిమాతో దర్శకుడిగా శౌర్యువ్ తెలుగు ఇండస్ట్రీకి పరిచయమై, ప్రేక్షకులను ఆకట్టుకోగలిగారు. ఎన్టీఆర్ కోసం శౌర్యువ్ ఓ కథను సిద్ధం చేశారట. ఈ స్టోరీని ఎన్టీఆర్‌కు వినిపించగా, శౌర్యువ్‌కి అంగీకారం తెలిపారట. దీంతో ఈ సినిమా స్క్రిప్ట్‌కు మరింత మెరుగులు దిద్దే పనిలో పడ్డారు శౌర్యువ్. ఫైనల్ కథతో ఎన్టీఆర్‌ను శౌర్యువ్ మెప్పించగలిగితే, దర్శకుడిగా ఆయన కెరీర్ నెక్ట్స్ లీగ్‌లోకి వెళ్తుందని ఊహించవచ్చు. అయితే ఎన్టీఆర్ ప్రస్తుతం ‘వార్ 2’తో బిజీగా ఉన్నారు. నెక్ట్స్ ప్రశాంత్ నీల్‌తో ‘డ్రాగన్’ (ప్రచారంలో ఉన్న టైటిల్) చేస్తారు. ఆ తర్వాత నెల్సన్ దిలీప్ కుమార్‌తో ఎన్టీఆర్‌కు ఓ కమిట్మెంట్ ఉంది. కాబట్టి... ఎన్టీఆర్–శౌర్యువ్‌ల కాంబినేషన్ సినిమాకు మరింత సమయం పట్టనుంది. మైల్స్టోన్ ఫిల్మ్‌కెరీర్‌లో మైల్స్టోన్ ఫిల్మ్స్ అంటే కొంచెం ఎక్స్ట్రా కేర్ తీసుకుంటుంటారు హీరోలు. అలాంటిది తన 75వ సినిమాను ఇప్పటివరకు ఒక్క సినిమా కూడా చేయని భాను భోగవరపు చేతిలో పెట్టారు రవితేజ. తన కథతో తొలి సినిమానే రవితేజతో చేసే చాన్స్ దక్కించుకున్నారు భాను భోగవరపు. ‘మాస్ జాతర’ టైటిల్‌తో రానున్న ఈ సినిమా చిత్రీకరణ శరవేగంగా జరుగుతోంది. సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య ఈ సినిమాను నిర్మిస్తున్నారు. మే 9న ఈ సినిమా విడుదల కానుంది. ఇలా బలమైన కథలతో స్టార్ హీరోలను మెప్పిస్తున్న మరికొంతమంది దర్శకులు ఉన్నారు. -
కథ రాశారు... స్టార్‌ని పట్టారు
సినిమాలో కంటెంట్ బాగుంటే చిన్నా పెద్దా తేడాల్లేవ్. ఆడియన్స్ సూపర్ హిట్ చేస్తున్నారు. కథలో బలం ఉందని హీరో నిర్మాతలు నమ్మితే చాలు చిన్నా పెద్దా తేడాల్లేవ్, అనుభవం లెక్కలోకి రాదు. స్టార్ హీరోలు కొత్త దర్శకులతో సినిమాలు చేయడానికి రెడీ అయిపోతారు. కథ కోసం బడ్జెట్ కేటాయింపులకు నిర్మాతలు సిద్ధమైపోతారు. ఇలా తమ కలంతో స్టార్ హీరోలను ఒప్పిస్తున్న యువ దర్శకుల జాబితా టాలీవుడ్లో పెరిగిపోతోంది. స్టార్ హీరోలను డైరెక్ట్ చేయాలనే పట్టుదలతో బలమైన కథలు సిద్ధం చేసుకున్నారు కొందరు యువ దర్శకులు. ఆ కథలతో స్టార్ హీరోలను మెప్పించి, సినిమా చేస్తున్న ఆ దర్శకుల గురించి తెలుసుకుందాం.ఇద్దరు యువ దర్శకులతో... 150కి పైగా సినిమాలు చేసిన చిరంజీవి లాంటి అగ్రహీరో వరుసగా యువ దర్శకులకు చాన్స్ ఇస్తున్నారు. ప్రస్తుతం చిరంజీవి ‘విశ్వంభర’ సినిమాకు వశిష్ఠ దర్వకత్వం వహిస్తున్నారు. ‘విశ్వంభర’కు ముందు వశిష్ఠ చేసింది ఒక్కటే సినిమా. అదే ‘బింబిసార’. తన ప్రతిభతో మెప్పించి, చిరంజీవి వంటి టాప్ హీరోతో సినిమా చేసే చాన్స్ దక్కించుకున్నారు వశిష్ఠ. ‘దసరా’ సినిమాతో దర్శకుడిగా పరిచయం అయ్యారు శ్రీకాంత్ ఓదెల. నాని హీరోగా నటించిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ. 100 కోట్ల గ్రాస్ కలెక్షన్స్‌ను కొల్లగొట్టింది. శ్రీకాంత్ ఓదెల కథను మెచ్చి, ఈ యువ దర్శకుడికి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు చిరంజీవి. ఈ సినిమాకు హీరో నాని ఓ నిర్మాతగా ఉండటం విశేషం. సంక్రాంతి తర్వాత... ఇండస్ట్రీకి చాలామంది దర్శకులను పరిచయం చేశారు నాగార్జున. తెలుగు ఇండస్ట్రీలో కల్ట్ క్లాసిక్‌గా చెప్పుకునే ‘శివ’ సినిమాతో రామ్‌గోపాల్ వర్మను దర్శకుడిగా పరిచయం చేశారు. నాగ్ పరిచయం చేసిన దర్శకుల లిస్ట్ చాలానే ఉంది. ఈ విధంగా యువ దర్శకులతో పని చేయడానికి నాగార్జున ఆసక్తి చూపిస్తుంటారు. తాజాగా ‘హుషారు, రౌడీబాయ్స్, ఓం భీమ్ బుష్’ సినిమాలు తీసిన దర్శకుడు హర్ష కొనుగంటితో సినిమా చేసే ఆలోచన చేస్తున్నారట నాగార్జున. తమిళంలో రెండు సినిమాలకు దర్శకత్వం వహించిన నవీన్ అనే దర్శకుడు చెప్పిన కథను కూడా ఓకే చేశారట. ఈ యువ దర్శకులతో నాగార్జున చేయాల్సిన సినిమాలపై సంక్రాంతి తర్వాత ఓ స్పష్టత వస్తుంది. పెద్ది ‘రాజమౌళి, శంకర్’ వంటి ప్రముఖ దర్శకులతో సినిమాలు చేసిన రామ్‌చరణ్ తన తర్వాతి సినిమాను ‘ఉప్పెన’ ఫేమ్ బుచ్చిబాబు చేతుల్లో పెట్టారు. దర్శకుడిగా బుచ్చిబాబుకు ఇది రెండో సినిమా. ఆల్రెడీ ఈ సినిమా చిత్రీకరణ ప్రారంభమైంది. జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాలో జగపతిబాబు, శివరాజ్‌కుమార్ లీడ్ రోల్స్‌లో నటిస్తున్నారు. అంతేకాదు... తన రెండో సినిమాకే ఆస్కార్ విన్నింగ్ మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్‌ను ఒప్పించగలిగారు బుచ్చిబాబు. ‘పెద్ది’ అనే వర్కింగ్ టైటిల్‌తో ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్, వృద్ధి సినిమాస్, సుకుమార్ రైటింగ్స్ పతాకాలపై వెంకట సతీష్ కిలారు నిర్మిస్తున్నారు. డీజే టిల్లు దర్శకుడితో... యువ హీరో సిద్ధు జొన్నలగడ్డతో ‘డీజే టిల్లు’ వంటి సూపర్‌హిట్ ఫిల్మ్‌తో దర్శకుడిగా పరిచయం అయ్యారు విమల్ కృష్ణ. కాగా విమల్ రెడీ చేసిన ఓ కథను అగ్ర హీరో వెంకటేశ్ ఆల్మోస్ట్ ఓకే చేశారట. వీరిద్దరి మధ్య కథా చర్చలు జరిగాయని, వీరి కాంబినేషన్లోని సినిమాపై త్వరలోనే ఓ స్పష్టత రానుందని ఫిల్మ్‌నగర్ భోగట్టా.కథ విన్నారా? ‘హాయ్ నాన్న’ సినిమాతో దర్శకుడిగా శౌర్యువ్ తెలుగు ఇండస్ట్రీకి పరిచయమై, ప్రేక్షకులను ఆకట్టుకోగలిగారు. ఎన్టీఆర్ కోసం శౌర్యువ్ ఓ కథను సిద్ధం చేశారట. ఈ స్టోరీని ఎన్టీఆర్‌కు వినిపించగా, శౌర్యువ్‌కి అంగీకారం తెలిపారట. దీంతో ఈ సినిమా స్క్రిప్ట్‌కు మరింత మెరుగులు దిద్దే పనిలో పడ్డారు శౌర్యువ్. ఫైనల్ కథతో ఎన్టీఆర్‌ను శౌర్యువ్ మెప్పించగలిగితే, దర్శకుడిగా ఆయన కెరీర్ నెక్ట్స్ లీగ్‌లోకి వెళ్తుందని ఊహించవచ్చు. అయితే ఎన్టీఆర్ ప్రస్తుతం ‘వార్ 2’తో బిజీగా ఉన్నారు. నెక్ట్స్ ప్రశాంత్ నీల్‌తో ‘డ్రాగన్’ (ప్రచారంలో ఉన్న టైటిల్) చేస్తారు. ఆ తర్వాత నెల్సన్ దిలీప్ కుమార్‌తో ఎన్టీఆర్‌కు ఓ కమిట్మెంట్ ఉంది. కాబట్టి... ఎన్టీఆర్-శౌర్యువ్‌ల కాంబినేషన్ సినిమాకు మరింత సమయం పట్టనుంది. మైల్స్టోన్ ఫిల్మ్ కెరీర్లో మైల్స్టోన్ ఫిల్మ్స్ అంటే కొంచెం ఎక్స్ట్రా కేర్ తీసుకుంటుంటారు హీరోలు. అలాంటిది తన 75వ సినిమాను ఇప్పటివరకు ఒక్క సినిమా కూడా చేయని భాను భోగవరపు చేతిలో పెట్టారు రవితేజ. తన కథతో తొలి సినిమానే రవితేజతో చేసే చాన్స్ దక్కించుకున్నారు భాను భోగవరపు. ‘మాస్ జాతర’ టైటిల్‌తో రానున్న ఈ సినిమా చిత్రీకరణ శరవేగంగా జరుగుతోంది. సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య ఈ సినిమాను నిర్మిస్తున్నారు. మే 9న ఈ సినిమా విడుదల కానుంది. ఇలా బలమైన కథలతో స్టార్ హీరోలను మెప్పిస్తున్న మరికొంతమంది దర్శకులు ఉన్నారు.– ముసిమి శివాంజనేయులు -
అఫీషియల్: చరణ్ సినిమాలో 'మీర్జాపుర్' మున్నా భయ్యా
ఓటీటీలో 'మీర్జాపుర్' వెబ్ సిరీస్ ఎంత ఫేమస్సో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అందులో ఉన్నవి బూతులే కానీ ఆడియెన్స్ వాటిని ఎంజాయ్ చేశారు. మరీ ముఖ్యంగా మున్నా భయ్యా అనే క్యారెక్టర్‌కి బోలెడంత మంది ఫ్యాన్స్ కూడా ఉన్నారు. ఇప్పుడు ఆ నటుడు తెలుగు సినిమాలో నటించేస్తున్నాడు.(ఇదీ చదవండి: 3 వారాల్లోనే ఓటీటీలోకి 'మట్కా'.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?)'గేమ్ ఛేంజర్' మూవీని రెడీ చేసిన రామ్ చరణ్.. ప్రస్తుతం బుచ్చిబాబు దర్శకత్వంలో నటిస్తున్నాడు. 'RC16' పేరుతో తీస్తున్న ఈ ప్రాజెక్ట్ షూటింగ్ కొన్నిరోజుల క్రితమే మైసూరులో మొదలైంది. ఇందులో కన్నడ స్టార్ హీరో శివన్న, జగపతిబాబు తదితరులు నటిస్తున్నారు. ఇప్పుడు తనకెంతో ఇష్టమైన పాత్ర అని చెప్పిన డైరెక్టర్ బుచ్చిబాబు.. మున్నా భయ్యా చరణ్ మూవీలో నటిస్తున్నట్లు ప్రకటించాడు.స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ స్టోరీతో చరణ్-బుచ్చిబాబు మూవీ ఉండబోతుందని తెలుస్తోంది. జాన్వీ కపూర్ హీరోయిన్. ఏఆర్ రెహమాన్ సంగీత దర్శకుడు. బహుశా వచ్చే ఏడాది చివర్లో లేదంటే 2026 ప్రారంభంలో మూవీ థియేటర్లలోకి వచ్చే అవకాశముంది.(ఇదీ చదవండి: చైతూ-శోభిత పెళ్లి సందడి.. హల్దీ ఫొటోలు వైరల్)Our favourite 'Munna Bhayya' will light up the big screens in a spectacular role tailor made for him ❤️🔥Team #RC16 welcomes the incredibly talented and the compelling performer @divyenndu on board ✨#RamCharanRevoltsGlobal Star @AlwaysRamCharan @NimmaShivanna #JanhviKapoor… pic.twitter.com/Q4I8w9Vqhh— Vriddhi Cinemas (@vriddhicinemas) November 30, 2024 -
రామచ్‌రణ్‌పై విమర్శలు.. స్పందించిన ఉపాసన
మెగాహీరో రామ్‌చరణ్ కడప పెద్ద దర్గాను సందర్శించారు. అక్కడ 80వ నేషనల్ ముషాయిరా గజల్ ఈవెంట్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్న విషయం తెలిసిందే. అయితే, కొద్దిరోజుల క్రితం నుంచి స్వామి మాలలో ఉన్న చరణ్ దర్గాకు వెళ్లడంతో పలువురు విమర్శించారు. కానీ, కొందరైతే అందులో తప్పేముందని చరణ్‌కు సపోర్ట్‌గా కామెంట్లు చేశారు. ఈ క్రమంలో తాజాగా రామ్‌చరణ్ సతీమణి ఉపాసన సోషల్‌మీడియా వేదికగా తన అసహనాన్ని వ్యక్తం చేసింది.రామ్‌చరణ్‌పై విమర్శులు చేయడాన్ని ఉపాసన తప్పపట్టారు. తన ఇన్‌స్టాగ్రామ్‌లో చరణ్ ఫోటోను షేర్ చేస్తూ సారే జహాసె అచ్ఛా హిందుస్తాన్ హమారా అనే గీతాన్ని జోడించారు. చరణ్ అన్ని మతాలను గౌరవిస్తారని ఆమె తెలిపారు. దేవుడిపై విశ్వాసం ఉంటే అందరినీ ఏకం చేస్తుందని ఆమె చెప్పారు. 'భక్తి ఎవరినీ చిన్నాభిన్నం చేయదు. మేము అన్ని మతాలను గౌరవిస్తాం. ఐక్యతలోనే మన బలం ఉంది. వన్ నేషన్.. వన్ స్పిరిట్' అని తెలిపారు.రామ్‌చరణ్, దర్శకుడు బుచ్చిబాబు కడప దర్గా కార్యక్రమంలో పాల్గొన్నారు. త్వరలో వారిద్దరూ కలిసి కొత్త సినిమా తీస్తున్నారు. ఈ నేపథ్యంలో సెంటిమెంట్‌గా వారు అక్కడకు వచ్చారు. గతంలో మగధీర విడుదల సమయంలో కూడా చరణ్ దర్గాను సందర్శించి అక్కడి పెద్దల ఆశీర్వాదం తీసుకున్నారు. ఆ సినిమా చరణ్ కెరిర్‌లోనే భారీ హిట్‌గా నిలిచింది. దీంతో కడప దర్గాకు ఎప్పటికీ రుణపడి ఉంటానని చరణ్ పేర్కొన్నారు. జనవరి 10న శంకర్ డైరెక్షన్లో తెరకెక్కిన గేమ్ ఛేంజర్ సినిమా విడుదల కానుంది. -
అయ్యప్ప మాలలో చరణ్.. కానీ దర్గాకు ఎందుకు వెళ్లాడంటే?
మెగాహీరో రామ్ చరణ్ సోమవారం రాత్రి కడప వెళ్లారు. పెద్ద దర్గాను సందర్శించుకున్నారు. సాధారణంగా అయితే ఇదేమంత పెద్ద విషయం కాదు. కానీ ప్రస్తుతం చరణ్ అయ్యప్ప మాలలో ఉన్నారు. అయినా సరే పెద్ద దర్గాను దర్శించుకోవడం వెనక ఓ కారణముంది. ఇచ్చిన మాట నిలబెట్టుకునేందుకు ఇలా చేసినట్లు స్వయంగా ఆయనే చెప్పుకొచ్చాడు.రామ్ చరణ్ లేటెస్ట్ మూవీ 'గేమ్ ఛేంజర్'. ఇది సంక్రాంతికి రిలీజ్ కానుంది. దీని తర్వాత 'ఉప్పెన' ఫేమ్ బుచ్చిబాబు దర్శకత్వంలో ఓ మూవీ చేస్తున్నారు. విలేజ్ బ్యాక్ డ్రాప్ స్టోరీతో తీస్తున్న ఈ చిత్ర షూటింగ్ త్వరలో మొదలుకానుంది. ప్రస్తుతం మ్యూజిక్, ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. ఈ ప్రాజెక్ట్‌కి ఏఆర్ రెహమాన్ సంగీత దర్శకుడు. ఈయన మూడు నెలల క్రితం రామ్ చరణ్‌ని పెద్ద దర్గాను సందర్శించాలని కోరారు. ప్రస్తుతం అయ్యప్ప మాలలో ఉన్నా సరే చరణ్.. రెహమాన్‌కు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు.(ఇదీ చదవండి: అక్కినేని వారి పెళ్లిసందడి.. మూడుముళ్లు వేసే టైమ్ వచ్చేసింది)కడప దర్గాలో 80వ జాతీయ ముషైరా గజల్ ఈవెంట్ జరిగింది. ఈ దర్గాకు రెహమాన్.. ప్రతి ఏడాది తప్పనిసరిగా వస్తుంటారు. ఈ సంవత్సరం జరిగే ముషైరా గజల్ ఈవెంట్‌కు చరణ్‌ని తీసుకొస్తానని అక్కడి వాళ్లకు మాటిచ్చారట. అలా ఏఆర్ రెహమాన్ ఆహ్వానం మేరకు ఓ వైపు బిజీ షెడ్యూల్, మరోవైపు అయ్యప్ప స్వామి దీక్షలో ఉన్నప్పటికీ ఈ కార్యక్రమానికి చరణ్ ముఖ్య అతిథిగా హాజరయ్యాడు. 'ఏఆర్ రెహమాన్.. ఈ దర్గాలో జరిగే కార్యక్రమానికి హాజరవ్వాలని మూడు నెలల ముందే చెప్పారు. వస్తానని ఆయనతో అన్నాను. ఆయనకు ఇచ్చిన మాట కోసం, మాలలో ఉన్నా కూడా ఈ దర్గాకు వచ్చాను' అని రామ్ చరణ్ చెప్పుకొచ్చారు. చరణ్‌తోపాటు దర్శకుడు బుచ్చిబాబు కూడా ఇక్కడికి వచ్చారు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.(ఇదీ చదవండి: ఫ్యాన్స్‌కు 'శంకర్' షాక్.. ఆ సినిమా రీషూట్ కోసం రూ. 100 కోట్లు)#ARRahman గారు ఈ దర్గాలో జరిగే కార్యక్రమానికి హాజరు కావాలంటూ మూడు నెలల ముందే ఆహ్వానించారు. వస్తానని ఆయనతో అన్నాను. ఆయనకు ఇచ్చిన మాట కోసం, మాలలో ఉన్నా కూడా ఈ దర్గాకు వచ్చాను. - @AlwaysRamCharan pic.twitter.com/4l7CSysAtq— Rajesh Manne (@rajeshmanne1) November 18, 2024 -
మైసూర్లో రామ్‌చరణ్,జాన్వీకపూర్ ప్రయాణం
హీరో రామ్‌చరణ్ ఓ వైపు శంకర్ దర్శకత్వంలో ‘గేమ్ ఛేంజర్’ అనే పాన్ ఇండియా మూవీ చేస్తున్నారు. మరోవైపు బుచ్చిబాబు సానా దర్శకత్వం వహిస్తున్న ‘ఆర్సీ 16’(వర్కింగ్ టైటిల్) చిత్రం షూటింగ్లో పాల్గొనేందుకు ఈ నెలలో మైసూర్ వెళ్లనున్నారాయన. తొలి చిత్రం ‘ఉప్పెన’ తో బ్లాక్‌బస్టర్ అందుకున్న బుచ్చిబాబు సానా ద్వితీయ చిత్రాన్ని రామ్‌చరణ్‌తో చేసే అవకాశం అందుకున్న సంగతి తెలిసిందే. మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సమర్పణలో వృద్ధి సినిమాస్‌పై వెంకట సతీష్ కిలారు ‘ఆర్సీ 16’ ని పాన్ ఇండియా స్థాయిలో నిర్మిస్తున్నారు.ఈ మూవీలో జాన్వీకపూర్ హీరోయిన్గా నటిస్తుండగా, కన్నడ స్టార్ హీరోల్లో ఒకరైన శివ రాజ్‌కుమార్ పవర్ఫుల్ రోల్ పోషించనున్నారు. కాగా ఈ సినిమా తొలి షెడ్యూల్ ఈ నెల 22 నుంచి కర్నాటక రాష్ట్రంలోని మైసూర్లో మొదలవుతుందని సమాచారం. రామ్ చరణ్‌తో పాటు ముఖ్య తారాగణంపై సన్నివేశాలను చిత్రీకరించనున్నారట బుచ్చిబాబు. అక్కడ నాన్‌స్టాప్‌గా 15 రోజుల పాటు షూటింగ్ జరుపుతారని తెలుస్తోంది. ఈ చిత్రానికి ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. -
త్రివిక్రమ్‌ను ప్రశ్నించే దమ్ముందా? నిర్మాతపై పూనమ్ కౌర్ ఫైర్
స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్, సినీ నటి పూనమ్ కౌర్ గొడవ గురించి టాలీవుడ్ ఇండస్ట్రీ మొత్తానికి తెలిసిందే. సందర్భం వచ్చినప్పుడల్లా అటు త్రివిక్రమ్, ఇటు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌పై ఆమె వరుస ట్వీట్స్ చేస్తారు. వారిద్దరు కలిసి తనకు చేసిన అన్యాయం గురించి బహిరంగానే వెల్లడిస్తారు. సినిమా అవకాశాల పేరుతో తనను మోసం చేసేందుకు ప్రయత్నించారని, వారి కోరిక తీర్చకపోవడంతో ఇండస్ట్రీలో ఎదగకుండా తొక్కేసారనేది పూనమ్ ఆరోపణ. అయితే ఆమె ట్వీట్స్‌పై అటు త్రివిక్రమ్ కాని, ఇటు పవన్ కాని స్పందించలేదు కానీ, ఇండస్ట్రీ ప్రముఖుల్లో కొంతమంది పూనమ్‌కి నిజంగానే అన్యాయం జరిగిందని అంటారు. మరికొంతమంది ఏమో ఫేమ్ కోసమే వారిపై ఇలాంటి ఆరోపణలు చేస్తుందని అంటున్నారు. సినీ నిర్మాత చిట్టి బాబు కూడా పూనమ్ ట్వీట్స్‌పై స్పందించాడు. (చదవండి: నిర్మాతకు మూడేళ్ల జైలు శిక్ష.. న్యాయం గెలిచిందంటూ మాల్వీ మల్హోత్రా)తాజాగా ఆయన ఓ ఇంటర్యూలో మాట్లాడుతూ..‘పూనమ్ ఫిర్యాదు ఇవ్వమని పిలిస్తే రాదు కానీ.. పిచ్చి పిచ్చిగా ట్వీట్స్ వేస్తారని’అన్నారు ఏం జరిగిందో కమిటికీ ఫిర్యాదు చేస్తే తెలుస్తుంది కానీ..ఇలా ట్వీట్స్ చేస్తే ఏం లాభం’అని చిట్టి బాబు అన్నారు. నిర్మాత వ్యాఖ్యలపై పూనమ్ కౌర్ మండి పడింది. మీకు త్రివిక్రమ్‌ను ప్రశ్నించే దమ్ముందా? అని నిలదీసింది.‘మీరు త్రివిక్రమ్‌ను ప్రశ్నించరు.. ప్రశ్నించలేరు.. నేను మీలా వెన్నుమొక లేని దాన్ని అయితే కాను. నా మీద కామెంట్ చేయడం కాకుండా.. త్రివిక్రమ్‌ను అడిగే దమ్ముందా? అంటూ నిర్మాతను ప్రశ్నించింది. దీనిపై చిట్టి బాబు ఎలా స్పందిస్తారో చూడాలి. పూనమ్ విషయానికొస్తే.. మాయాజాలం సినిమాతో టాలీవుడ్‌కు పరిచయమైంది ఈ బ్యూటీ. ఆ తర్వాత ఒక విచిత్రం, శౌర్యం, నిక్కి అండ్ నీరజ్, శ్రీనివాస కళ్యాణం, నెక్స్ట్ ఏంటి?, గగనం లాంటి చిత్రాల్లో నటించింది. 2022లో వచ్చిన నాతిచరామి సినిమాలో చివరిసారిగా కనిపించింది. ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉన్నా.. సోషల్ మీడియా ద్వారా మాత్రం ఫ్యాన్స్‌తో టచ్‌లో ఉంటుంది. It’s trivikram Srinivas who doesn’t and will not be questioned- I am not spineless like these men who run their show to project their fake masculinity- I dare him to question the director rather than commenting on me .— पूनम कौर ❤️ poonam kaur (@poonamkaurlal) October 7, 2024 -
పల్లె బాట పట్టిన టాలీవుడ్ హీరోలు.. హిట్ కొట్టేనా?
పల్లె కథలు, మట్టి కథలకు ప్రేక్షకులు పట్టం కడుతున్నారు. గత ఏడాది థియేటర్స్‌లోకి వచ్చిన నాని ‘దసరా’, సాయిధరమ్ తేజ్ ‘విరూపాక్ష’, సందీప్ కిషన్ ‘ఊరిపేరు భైరవకోన’, కార్తికేయ ‘బెదురు లంక 2012’, ప్రియదర్శి ‘బలగం’ వంటి పూర్తి స్థాయి పల్లెటూరి చిత్రాలు ప్రేక్షకులను మెప్పించడమే కాకుండా బాక్సాఫీస్ వద్ద హిట్స్‌గా నిలిచాయి. ఇటీవల హిట్స్‌గా నిలిచిన ‘ఆయ్, కమిటీ కుర్రోళ్ళు’ కూడా పల్లె కథలే. దీంతో ఓ హిట్‌ని ఖాతాలో వేసుకోవడానికి పల్లెకు పోదాం చలో... చలో అంటూ కొందరు హీరోలు పల్లె కథలకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారు. ఇక ఏయే హీరోలను పల్లె పిలిచిందో తెలుసుకుందాం. పల్లె ఆట రామ్‌చరణ్ కెరీర్‌లోని పర్ఫెక్ట్ రూరల్ బ్యాక్‌డ్రాప్ ఫిల్మ్ ‘రంగస్థలం’. 2018లో విడుదలైన ఈ మూవీ బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. ‘రంగస్థలం’కు దర్శకత్వం వహించిన సుకుమార్ వద్ద ఆ సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్‌గా చేసిన బుచ్చిబాబు సాన ఇప్పుడు రామ్‌చరణ్‌తో సినిమా చేసేందుకు ఓ పల్లెటూరి కథను రెడీ చేశారు. ఈ సినిమాకు ‘పెద్ది’ అనే టైటిల్‌ను అనుకుంటున్నారని తెలిసింది. ఉత్తరాంధ్ర నేపథ్యంలో విలేజ్ స్పోర్ట్స్ డ్రామాగా సాగే ఈ సినిమాలో రామ్‌చరణ్ అన్నదమ్ములుగా ద్విపాత్రాభినయం చేయనున్నారని సమాచారం. ప్రస్తుతం ఈ సినిమా మేకోవర్ పనులతో బిజీగా ఉన్నారు రామ్‌చరణ్. కథ రీత్యా పాత్ర కోసం బరువు పెరుగుతున్నారు. ఇందుకోసం ప్రత్యేక శిక్షణ తీసుకుంటున్నారు. స్పెషల్ డైట్ ఫాలో అవుతున్నారు. దసరా తర్వాత ఈ సినిమా చిత్రీకరణను ప్రారంభించాలనుకుంటున్నారు. సుకుమార్ రైటింగ్స్, మైత్రీ మూవీ మేకర్స్, వృద్ధి సినిమాస్ పతాకాలపై వెంకట సతీష్ కిలారు నిర్మించనున్న చిత్రం ఇది. జాన్వీకపూర్ హీరోయిన్గా నటించనున్న ఈ సినిమాలో కన్నడ నటుడు శివ రాజ్‌కుమార్ ఓ కీలక పాత్రలో కనిపిస్తారు. ఈ చిత్రానికి సంగీతం: ఏఆర్ రెహమాన్.తెలంగాణ కుర్రాడు తెలంగాణ పల్లెటూరి అబ్బాయిలా హీరో శర్వానంద్‌ను రెడీ చేస్తున్నారు దర్శకుడు సంపత్ నంది. వీరి కాంబినేషన్లో ఓ పల్లె కథ తెరకెక్కనుంది. కేకే రాధామోహన్ నిర్మిస్తారు. యాక్షన్, ఎమోషన్ ప్రధానాంశాలుగా ఈ చిత్రం 1960 కాలంలో సాగుతుంది. పీరియాడికల్ యాక్షన్ డ్రామాగా తెలంగాణ–మహారాష్ట్రల సరిహద్దు ప్రాంతాల నేపథ్యంలో కథనం ఉంటుంది. శర్వానంద్ కెరీర్‌లోని ఈ 38వ సినిమా చిత్రీకరణ త్వరలోనే ప్రారంభం కానుంది. ప్రస్తుతం ఈ సినిమా లుక్కు సంబంధించిన మేకోవర్ పనుల్లో ఉన్నారు శర్వానంద్. భీమ్స్ సిసిరోలియో ఈ సినిమాకు సంగీతం అందిస్తారు. బచ్చల మల్లి కథ వీలైనప్పుడల్లా సీరియస్ కథల్లోనూ నటిస్తుంటారు హీరో ‘అల్లరి’ నరేశ్. అలా ఆయన టైటిల్ రోల్లో నటిస్తున్న తాజా చిత్రం ‘బచ్చల మల్లి’. 1990 నేపథ్యంలో ఈ సినిమా కథనం సాగుతుంది. ఈ చిత్రానికి సంబంధించిన మేజర్ సన్నివేశాలు విలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో ఉంటాయని తెలిసింది. ఆంధ్రప్రదేశ్‌లో దొంగగా పేరుగాంచిన బచ్చలమల్లి అనే వ్యక్తి జీవితం ఆధారంగా ఈ సినిమా కథనం ఉంటుందనే టాక్ ఫిల్మ్‌నగర్ సర్కిల్స్‌లో వినిపిస్తోంది. ఇప్పటికే ఈ సినిమా చిత్రీకరణ దాదాపు పూర్తయింది. అమృతా అయ్యర్ కథానాయికగా నటిస్తున్న ఈ సినిమాను ‘సోలో బతుకే సో బెటర్’ సినిమా ఫేమ్ సుబ్బు దర్శకత్వంలో రాజేశ్ దండా నిర్మిస్తున్నారు. పల్లె బాటలో తొలిసారి... హీరో విజయ్ దేవరకొండ పల్లెటూరి బాట పట్టారు. కెరీర్లో తొలిసారిగా పల్లెటూరి కుర్రాడిగా సెట్స్‌కు వెళ్లనున్నారు. విజయ్ దేవరకొండ హీరోగా ‘రాజావారు రాణివారు’ ఫేమ్ రవికిరణ్ కోలా దర్శకత్వంలో ఓ సినిమా రూపొందనుంది. పక్కా పల్లెటూరి యాక్షన్ డ్రామాగా రానున్న ఈ సినిమాను ‘దిల్’ రాజు, శిరీష్ నిర్మిస్తారు. ఈ పీరియాడికల్ ఫిల్మ్ చిత్రీకరణ ఈ ఏడాదిలోనే ప్రారంభం కానుంది. ప్రస్తుతం గౌతమ్ తిన్ననూరి సినిమాతో బిజీగా ఉన్నారు విజయ్. ఈ సినిమా షూటింగ్ పూర్తి కాగానే విలేజ్ బ్యాక్‌డ్రాప్ సినిమా సెట్స్‌లోకి అడుగుపెడతారు విజయ్ దేవరకొండ. పల్లెటూరి పోలీస్ పల్లెటూరి రాజకీయాల్లో విశ్వక్ సేన్ జోక్యం చేసుకుంటున్నారు. విశ్వక్ సేన్ హీరోగా ఓ విలేజ్ పొలిటికల్ యాక్షన్ డ్రామా ఫిల్మ్ తెరకెక్కనుంది. విశ్వక్ కెరీర్‌లోని ఈ 13వ సినిమాతో శ్రీధర్ గంటా దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఈ చిత్రంలో కన్నడ బ్యూటీ సంపద హీరోయిన్గా కనిపిస్తారు. సుధాకర్ చెరుకూరి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో విశ్వక్ సేన్ పోలీస్ ఆఫీసర్ రోల్ చేస్తున్నారు. విశ్వక్ కెరీర్లో పూర్తి స్థాయి విలేజ్ బ్యాక్‌డ్రాప్ ఫిల్మ్‌గా ఈ చిత్రం ఉండబోతోందని ఫిల్మ్‌నగర్ సమాచారం. అమ్మాయి కథ యాక్షన్... లవ్‌స్టోరీ... పొలిటికల్... ఇవేవీ కాదు... భార్యాభర్తల అనుబంధం, స్త్రీ సాధికారత వంటి అంశాలతో సరికొత్తగా ఓ సినిమా చేస్తున్నారు తరుణ్ భాస్కర్. ఈ సినిమాలో తరుణ్ భాస్కర్‌తో పాటు ఈషా రెబ్బా మరో లీడ్ రోల్లో కనిపిస్తారు. విలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో సాగే ఈ సినిమాను సంజీవ్ ఏఆర్ దర్శకత్వంలో సృజన్ యరబోలు, వివేక్ కృష్ణ, సాధిక్, ఆదిత్య పిట్టీ నిర్మిస్తున్నారు. ఈ సినిమా చిత్రీకరణ పూర్తయింది. త్వరలోనే ఈ సినిమా విడుదల తేదీపై స్పష్టత రానుంది. కాగా మలయాళ సూపర్ హిట్ ‘జయ జయ జయ జయ హే’ సినిమాకు తెలుగు రీమేక్‌గా ఈ చిత్రం రూపొందిందనే టాక్ వినిపిస్తోంది. కాలేజ్ సమయంలో ప్రేమించి, మోస΄ోయిన ఓ అమ్మాయి వివాహ జీవితంలోకి అడుగుపెట్టిన తర్వాత అత్తింట్లో కొత్త సమస్యలు ఎదుర్కొంటుంది. ఆ తర్వాత భర్తకు ఎదురు తిరిగి, సొంతంగా వ్యాపారం పెట్టుకుని జీవితాన్ని ఎలా లీడ్ చేస్తుంది? అనే అంశాలతో ‘జయ జయ జయ జయ హే’ సినిమా కథనం సాగుతుంది. పోస్ట్‌మ్యాన్ స్టోరీ‘క’ అనే ఓ డిఫరెంట్ టైటిల్‌తో విలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో యాక్షన్ థ్రిల్లర్‌గా కిరణ్ అబ్బవరం ఓ సినిమా చేశారు. దర్శక ద్వయం సుజీత్, సందీప్ తెరకెక్కించిన ఈ సినిమా చిత్రీకరణ పూర్తయింది. ఓ గ్రామంలో సాగే ఈ సినిమా కథలో కిరణ్ అబ్బవరం పోస్ట్‌మ్యాన్ రోల్ చేసినట్లుగా తెలుస్తోంది. అయితే హీరో క్యారెక్టరైజేషన్లో డిఫరెంట్ షేడ్స్ కనిపిస్తాయి. నయన్ సారిక, తన్వీ రామ్ హీరోయిన్లుగా నటించిన ఈ సినిమాను చింతా గోపాలకృష్ణ నిర్మించారు. ఈ సినిమా విడుదల తేదీపై త్వరలో స్పష్టత రానుంది. ఇలా పల్లెటూరి కథలతో రూపొందుతున్న చిత్రాలు మరికొన్ని ఉన్నాయి. – ముసిమి శివాంజనేయులు -
రామ్ చరణ్ కొత్త సినిమా.. అప్పుడే మొదలెట్టేశాడు!
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం గేమ్ ఛేంజర్ మూవీతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఈ సినిమాకు శంకర్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో చెర్రీ సరసన బాలీవుడ్ భామ హీరోయిన్గా కనిపించనుంది. ఈ మూవీ డిసెంబర్లో థియేటర్లలో సందడి చేయనుంది. ఇప్పటికే గేమ్ ఛేంజర్ చాలాసార్లు వాయిదా పడుతూ వచ్చిన సంగతి తెలిసిందే.అయితే ఈ మూవీ షూటింగ్ పూర్తి కాగానే మరో సినిమాకు రామ్ చరణ్ సిద్ధమైపోయాడు. ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు డైరెక్షన్లో ఆర్సీ16 చిత్రంలో నటించనున్నట్లు ఇప్పటికే ప్రకటించారు. ఈ సినిమాకు సంబంధించిన పూజా కార్యక్రమం కూడా గ్రాండ్‌గా నిర్వహించారు. ఇందులో చెర్రీ సరసన బాలీవుడ్ భామ జాన్వీ కపూర్ హీరోయిన్గా ఛాన్స్ కొట్టేసింది.(ఇది చదవండి: రామ్ చరణ్ 'గేమ్ ఛేంజర్'ను ఢీ కొట్టనున్న విజయ్ సేతుపతి సినిమా)అయితే ఈ సినిమా కోసం రామ్ చరణ్ ప్రత్యేకమైన లుక్‌లో కనిపించనున్నట్లు తెలుస్తోంది. అందుకోసమే ప్రముఖ ఫిట్నెస్ కోట్ శివోహంతో కలిసి సాధన మొదలెట్టారు. దీనికి సంబంధించిన ఫోటోను ట్విటర్లో షేర్ చేశారు మెగా హీరో. బీస్ట్ మోడ్ ఆన్ అంటూ క్యాప్షన్ రాసుకొచ్చారు. స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్లో వస్తోన్న చిత్రం కావడంతో అథ్లెట్ లుక్ కోసం చెర్రీ కష్టపడుతున్నట్లు అర్థమవుతోంది. కాగా.. ఫిట్నెస్ ట్రైనర్ రామ్ చరణ్‌తో పాటు అమితాబ్ బచ్చన్, జాక్వెలిన్ లాంటి స్టార్స్‌కు సైతం కోచ్‌గా పనిచేశారు. Beast mode on 🔥#RC16 loading… @Shivohamshivfit pic.twitter.com/6Oz3bXpySp— Ram Charan (@AlwaysRamCharan) September 16, 2024 -
ఒక్క సెట్ కోసం అన్ని కోట్లా..?
-
మరోసారి రంగస్థలం తరహాలో మూవీ ప్లాన్ చేస్తున్న రామ్ చరణ్
-
ప్రభాస్, ఎన్టీఆర్, రామ్ చరణ్.. మూడు సినిమాలు ఒకేసారి!
టాలీవుడ్ ఇప్పుడు పాన్ ఇండియా సినిమాలకు కేరాఫ్‌గా మారింది. స్టార్ హీరోలంతా ఇప్పుడు తమ సినిమాని అన్ని భాషల్లో రిలీజ్ అయ్యేలా ప్లాన్ చేస్తున్నారు. అయితే బాక్సాఫీస్ బరిలో మాత్రం ఇతర పెద్ద సినిమాలు లేకుండా ప్లాన్ చేసుకొని సినిమాను విడుదల చేస్తున్నారు. కల్కి 2898 మూవీ కూడా ఇక్కడ సోలోగానే విడుదలై హిట్ కొట్టింది. అల్లు అర్జున్ పుష్ప 2, ఎన్టీఆర్ దేవర, రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ చిత్రాలు కూడా దాదాపు సోలోగానే రిలీజ్ కాబోతున్నాయి. కానీ వీటి తర్వాత ఈ స్టార్ హీరోలు నటించే సినిమాలు బాక్సాఫీస్ వద్ద పోటీ పడే అవకాశం ఉంది. ముఖ్యంగా ప్రభాస్, ఎన్టీఆర్, రామ్ చరణ్ మధ్య 2026లో బక్సాఫీస్ వార్ జరిగే అవకాశం మెండుగా ఉంది.(చదవండి: మహేష్ – రాజమౌళి మూవీ: విలన్‌గా స్టార్ హీరో!)కల్కి 2898 తర్వాత ప్రభాస్ ‘రాజా సాబ్’గా రాబోతున్నాడు. మారుతి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ మూవీ తర్వాత హను రాఘవపూడి దర్శకత్వంలో ప్రభాస్ ఓ లవ్ స్టోరీ చేయబోతున్నాడు. ఈ చిత్రం షూటింగ్ సెప్టెంబర్‌లో మొదలయ్యే అవకాశం ఉంది. 2025 చివరల్లో లేదా 2026 సంకాంత్రికి విడుదలయ్యే అవకాశం ఉంది. (చదవండి: నా బిడ్డను పైకి పంపించేయాలనుకున్నా.. ఏడుస్తూ భర్తకు చెప్పా: పాక్ నటి)మరోవైపు గేమ్ ఛేంజర్ తర్వాత రామ్ చరణ్..బుచ్చిబాబు దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడు. వాస్తవానికి ఈ సినిమా షూటింగ్ ఎప్పుడో ప్రారంభం కావాలి. కానీ గేమ్ ఛేంజర్ షూటింగ్ ఆలస్యం కావడంతో బుచ్చిబాబు మూవీ పట్టాలెక్కలేదు. సెప్టెంబర్‌లో ఈ మూవీ షూటింగ్ ప్రారంభం కానుంది. ఇప్పటికే ఈ మూవీ కోసం రెహమాన్ కొన్ని ట్యూన్స్ కూడా రెడీ చేశాడు. అన్ని కుదిరితే వచ్చే ఏడాది చివరిలో ఈ చిత్రం రీలీజ్ అయ్యే అవకాశం ఉంది. దేవర తర్వాత ఎన్టీఆర్..ప్రశాంత్ నీల్‌తో ఓ సినిమా చేయబోతున్నాడు. ఈ మూవీ షూటింగ్ కూడా సెప్టెంబర్ చివరి వారంలో ప్రారంభం అయ్యే అవకాశం ఉంది. 2026 ప్రారంభంలో పాన్ వరల్డ్ స్థాయిలో ఈ చిత్రం రిలీజ్ కానుంది. దాదాపు ఈ ముగ్గురు హీరోల సినిమాలు ఒకేసారి ప్రారంభం అవుతున్నాయి. పెద్ద సినిమాలు కాబట్టి ఏడాది వరకు నిర్మాణంలో ఉండడం సర్వసాధారణం. ఈ లెక్కన చూస్తే..మూడు సినిమాలు వారం అటు ఇటుగా ఒకేసారి విడుదలయ్యే అవకాశం ఉంది. మరి ఈ ముగ్గురు బాక్సాఫీస్ వార్‌లో ఉంటారా లేదా సోలోగానే వచ్చి హిట్ కొడతారా అనేది తెలియాలంటే కొన్నాళ్ల పాటు ఆగాల్సిందే. -
చరణ్ బుచ్చిబాబు మూవీపై విజయ్ సేతుపతి షాకింగ్ కామెంట్స్
-
ఆట కాదు సుమా!
క్రీడాకారుడి పాత్ర చేయడం అంటే ఆట కాదు సుమా అనాలి. ఎందుకంటే ఆ క్రీడ మీద ఎంతో కొంత అవగాహన సంపాదించాలి. అలాగే ఆ క్రీడకు తగ్గట్టుగా శరీరాకృతిని మార్చుకోవాలి. రామ్‌చరణ్ త్వరలో ఈ పని మీదే బిజీ కానున్నారు. బుచ్చిబాబు సన (ఆర్సీ 16) దర్శకత్వంలో రామ్‌చరణ్ హీరోగా స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్‌లో ఓ సినిమా రూపొందనున్న విషయం తెలిసిందే. ఈ చిత్రంలో చరణ్ కబడ్డీ ప్లేయర్‌గా కనిపించనున్నారని... కాదు రన్నర్‌గా కనిపిస్తారనే వార్తలు ప్రచారంలో ఉన్నాయి.ఏది ఏమైనా క్రీడాకారుడి పాత్రలో కనిపించడం ఖాయం. ఇందుకోసం రామ్‌చరణ్ కండలు పెంచాలనుకుంటున్నారట. ఈ మేకోవర్ కోసం ఆస్ట్రేలియా వెళతారని సమాచారం. అక్కడ దాదాపు రెండు నెలలు శిక్షణ తీసుకుంటారని భోగట్టా. ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో రామ్‌చరణ్ ‘గేమ్ చేంజర్’ చిత్రంలో నటిస్తున్నారు. వీలైనంత త్వరగా ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేసి, ఆస్ట్రేలియా ప్రయాణమవుతారని తెలిసింది. ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్ పూర్తయిన ‘ఆర్సీ 16’ షూటింగ్‌ని సెప్టెంబర్ లేదా అక్టోబరులో ఆరంభించేలా యూనిట్ ప్లాన్ చేస్తోందని టాక్. ఈ చిత్రంలో జాన్వీ కపూర్ హీరోయిన్గా నటించనున్నారు. -
ఆస్ట్రేలియా వెళ్లనున్న రామ్ చరణ్.. కారణం ఇదేనా..?
పాన్ ఇండియా హీరో రామ్ చరణ్- బుచ్చిబాబు కాంబోలో వస్తున్న చిత్రంపై అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా ప్రకటన వచ్చి ఇప్పటికే చాలా రోజులైంది. రీసెంట్గా పూజా కార్యక్రమం కూడా జరిగింది. కానీ, రెగ్యులర్ షూటింగ్ పనులు ఎప్పుడు ప్రారంభిస్తారు..? ఇతర నటీనటులు ఎవరు..? వంటి అప్డేట్స్ గురించి అభిమానులు ఎదురుచూస్తున్నారు. ప్రీ ప్రొడక్షన్ పనులు పూర్తి చేసుకున్న RC16 ప్రాజెక్ట్ ఇక పట్టాలెక్కడమే ఆలస్యం అని తెలుస్తోంది.ఈ చిత్రం కోసం రామ్ చరణ్ పూర్తిగా తన మేకోవర్‌ను మార్చుకోనున్నారట. ఈ సినిమాలో చరణ్ పాత్ర చాలా పవర్‌ఫుల్‌గా ఉంటుందని తెలుస్తోంది. అందుకు తగ్గట్లు కనిపించాలంటే మరింత కసరత్తులు తప్పవని ఆయన భావించారట. అందుకోసం ఆస్ట్రేలియా వెళ్లేందుకు చరణ్ సిద్ధం అవుతున్నారట. గేమ్ చేంజర్ చిత్రం పూర్తి అయిన వెంటనే వెళ్లనున్నట్లు సమాచారం. అక్కడ చరణ్ ఫిజికల్ ట్రైనింగ్ పూర్తి చేసుకున్న తర్వాత RC16 షూటింగ్ అక్టోబర్‌లో మొదలయ్యే అవకాశం ఉన్నట్లు టాక్.'ఉప్పెన' తర్వాత బుచ్చిబాబు దర్శకత్వం వహిస్తోన్న చిత్రమిది. స్పోర్ట్స్ డ్రామాగా, గ్రామీణ నేపథ్యంలో కథ సాగుతున్నట్లు తెలుస్తోంది. ఇందులో రామ్‌చరణ్ సరికొత్తగా కనిపిస్తారని, అందుకోసం ప్రత్యేక మేక్ఓవర్ తప్పదని మేకర్స్ ప్లాన్ చేశారని టాక్. రామ్ చరణ్ కోరుకున్న శారీరక రూపాన్ని పొందాలంటే కనీసం రెండు నెలలపాటు కఠినమైన శిక్షణ తీసుకోవాల్సిందేనని సూచించారట. దానికి కోసం ఆస్ట్రేలియాను ఎంపిక చేశారట.జాన్వీకపూర్ ఈ చిత్రంలో హీరోయిన్గా కనిపించనుంది. రెహమాన్ సంగీతం అందించనున్నారు. మైత్రీ మూవీ మేకర్స్, వృద్ధి సినిమాస్, సుకుమార్ రైటింగ్స్ సంస్థలు కలిసి ఈ భారీ బడ్జెట్ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. RC16 పేరుతో ఉన్న ఈ ప్రాజెక్ట్‌కు 'పెద్ది' అనే టైటిల్‌ను ఫిక్స్ చేశారని తెలుస్తోంది. -
స్టార్ హీరో పాదాలకు నమస్కరించిన టాలీవుడ్ డైరెక్టర్!
కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ సేతుపతి ప్రస్తుతం మహారాజా మూవీతో ప్రేక్షకుల ముందుకొచ్చారు. ఈ నెల 14న థియేటర్లలోకి వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఓ రేంజ్లో దూసుకెళ్తోంది. మొదటి రోజే పాజిటివ్ టాక్ రావడంతో కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. టాలీవుడ్‌లోనూ మహారాజా చిత్రానికి ఆడియన్స్ నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది.ఈ సందర్భంగా హీరో విజయ్ సేతుపతి హైదరాబాద్‌లో పర్యటించారు. ఓ హోటల్ జరిగిన ఈవెంట్లో విజయ్, టాలీవుడ్ డైరెక్టర్ బుచ్చిబాబు సనా పాల్గొన్నారు. విజయ్ సేతుపతి ఈ కార్యక్రమానికి వస్తుండగా ఓ ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. ఉప్పెన మూవీలో కలిసి పనిచేసిన బుచ్చిబాబు ఏకంగా విజయ్ సేతుపతి కాళ్లకు మొక్కారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.కాగా.. బుచ్చిబాబు తదుపరి చిత్రం రామ్ చరణ్‌తో కలిసి చేయనున్న సంగతి తెలిసిందే. ఈ మూవీలో విజయ్ సేతుపతి కూడా నటిస్తున్నారు. ఈ చిత్రంలో దేవర భామ జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తోంది. ప్రస్తుతం రామ్ చరణ్ గేమ్ ఛేంజర్‌లో నటిస్తున్నారు. శంకర్ డైరెక్షన్లో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. -
ఉప్పెన కేవలం ఆయన కోసమే చేశా: విజయ్ సేతుపతి ఇంట్రెస్టింగ్ కామెంట్స్
ఉప్పెన మూవీతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ సేతుపతి. ప్రస్తుతం మహారాజా చిత్రంతో ప్రేక్షకుల ముందుకొస్తున్నారు. క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్‌గా వస్తోన్న ఈ చిత్రాన్ని నిథిలన్ దర్శకత్వంతో తెరకెక్కించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఈనెల 14న థియేటర్లలో సందడి చేయనుంది. ఇప్పటికే రిలీజైన ట్రైలర్ సినిమాపై భారీ అంచనాలు పెంచేసింది. ప్రస్తుతం ఆయన మహారాజా మూవీ ప్రమోషన్లతో బిజీగా ఉన్నారు. ఈ సందర్భంగా ఆయన ఉప్పెన చిత్రంపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.విజయ్ సేతుపతి మాట్లాడుతూ..'ఉప్పెన సినిమా కేవలం నేను బుచ్చిబాబు కోసమే చేశా. ఆయనకున్న ప్యాషన్ చూసి నేను ఒప్పుకున్నా. చాలా తక్కువ రెమ్యునరేషన్‌కే ఉప్పెన సినిమా చేశా. మామూలుగా అయితే నాలాంటి యాక్టర్స్ చేయడానికి వెనుకాడతారు. కానీ సినిమా పట్ల బుచ్చిబాబుకున్న ప్యాషన్ చూసే ఆ చిత్రంలో నటించా' అని అన్నారు. I did #Uppena only because of @BuchiBabuSana , Less Remuneration కి ఆ సినిమా చేశాను - #VijaySethupathi pic.twitter.com/qRBIGwwFho— Rajesh Manne (@rajeshmanne1) June 10, 2024 -
భారీ ఎత్తున సెట్ నిర్మాణం.. సెట్ లో సినిమా మొత్తం..?
-
విలేజ్...సెట్...గో...
గెట్... సెట్... గో అంటారు. అయితే రామ్‌చరణ్ విలేజ్... సెట్... గో అంటూ పల్లెటూరికి వెళ్లనున్నారు. విలేజ్‌లో స్పోర్ట్స్ ఆడేందుకు రెడీ అవుతున్నారు రామ్‌చరణ్. ఆయన హీరోగా బుచ్చిబాబు సన దర్శకత్వంలో ఓ విలేజ్ స్పోర్ట్స్ డ్రామా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తారు. కన్నడ నటుడు శివ రాజ్‌కుమార్, బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ కీలక పాత్రల్లో నటించనున్నారనే టాక్ వినిపిస్తోంది. ఈ చిత్రంలో అన్నదమ్ముల్లా రామ్‌చరణ్ ద్విపాత్రాభినయం చేయనున్నారట.ఉత్తరాంధ్ర నేపథ్యంలో సాగే ఈ స్పోర్ట్స్ ఫిల్మ్ చిత్రీకరణకు రంగం సిద్ధమౌతోంది. ప్రస్తుతం హైదరాబాద్ శివార్లలో విలేజ్ సెట్‌ను రెడీ చేయిస్తున్నారు మేకర్స్. ఈ సెట్ పూర్తి కాగానే ఈ సినిమా చిత్రీకరణ మొదలవుతుంది. మేజర్ షూటింగ్ ఈ విలేజ్ సెట్లోనే ప్లాన్ చేశారట. ఈ సినిమాకు ఏఆర్ రెహమాన్ సంగీతం అందించనున్నారు.మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ పతాకాలపై వెంకట సతీష్ కిలారు నిర్మించనున్న ఈ సినిమా వచ్చే ఏడాది చివర్లో రిలీజ్ కానుందని ఫిల్మ్‌నగర్ టాక్. ఇదిలా ఉంటే... దర్శకుడు బుచ్చిబాబు తండ్రి గురువారం మరణించారు. ఈ నేపథ్యంలో ఈ సినిమా చిత్రీకరణ కాస్త ఆలస్యమయ్యే అవకాశం ఉంది. -
దర్శకుడు బుచ్చిబాబు ఇంట తీవ్ర విషాదం
టాలీవుడ్ దర్శకుడు బుచ్చిబాబు సానా ఇంట తీవ్ర విషాదం నెలకొంది. ఆయన తండ్రి పెదకాపు అనారోగ్యంతో శుక్రవారం కన్నుమూశారు. పెదకాపు మరణంతో బుచ్చిబాబు కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది. ఆయన మృతి పట్ల పలువురు సెలబ్రిటీలు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.కాగా బుచ్చిబాబు క్రియేటివ్ దర్శకుడు సుకుమార్ శిష్యుడన్న విషయం తెలిసిందే! ఈయన దర్శకత్వం వహించిన తొలి సినిమా ఉప్పెన. ఫస్ట్ చిత్రంతోనే రూ.100 కోట్లు కొల్లగొట్టి బ్లాక్‌బస్టర్ హిట్ ఖాతాలో వేసుకున్నాడు. ప్రస్తుతం రామ్‌చరణ్‌తో ఓ సినిమా చేస్తున్నాడు. ఇందులో జాన్వీకపూర్ హీరోయిన్గా నటిస్తోంది. RC16 అనే వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నాడు.చదవండి: 45 ఏళ్ల వయసులో పెళ్లిపీటలెక్కనున్న నటుడు! వచ్చే వారమే ముహూర్తం! -
రెమ్యునరేషన్ భారీగా పెంచేసిన రామ్ చరణ్?
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ రేటు పెంచేశాడు. తాను ఇప్పటివరకు తీసుకుంటున్న పారితోషికం ఒకెత్తయితే తర్వాత చేయబోయే మూవీ కోసం మాత్రం ఊహించని మొత్తం అందుకోబోతున్నాడు. ఇప్పుడు ఈ విషయం ఫ్యాన్స్ మధ్య చర్చనీయాంశంగా మారింది. అసలు ఇంతకీ చరణ్ రెమ్యునరేషన్ ఎంత పెంచాడు? ఏంటి సంగతి? అనేది ఇప్పుడు చూద్దాం.(ఇదీ చదవండి: బాలకృష్ణ చీప్ బిహేవియర్.. హీరోయిన్ ని తోసేసి, మద్యం తాాగుతూ)'ఆర్ఆర్ఆర్'తో అంతర్జాతీయ గుర్తింపు తెచ్చుకున్న రామ్ చరణ్.. దీని తర్వాత చేస్తున్న మూవీ 'గేమ్ ఛేంజర్'. దాదాపు మూడేళ్ల నుంచి సెట్స్‌పైనే ఉంది. ఎప్పుడు రిలీజ్ అవుతుందనేది అస్సలు అర్థం కాలేదు. అయితే ఈ ఏడాది అక్టోబరులోనే ఉండొచ్చని దిల్ రాజు కూతురు తాజాగా రివీల్ చేసింది. ఇకపోతే ఈ మూవీలో చేస్తున్నందుకు గానూ రూ.90 కోట్ల పారితోషికం చరణ్ అందుకుంటున్నాడట.దీని తర్వాత 'ఉప్పెన' ఫేమ్ బుచ్చిబాబు సానా దర్శకత్వంలో ఓ మూవీ చేస్తాడు. 'RC16' వర్కింగ్ టైటిల్. జాన్వీ కపూర్ హీరోయిన్. ఏఆర్ రెహమాన్ మ్యూజిక్. స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కే ఈ సినిమాని మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోంది. అయితే ఈ మూవీ కోసం చరణ్‌కి ఏకంగా రూ.125 కోట్ల మేర పారితోషికం ఇవ్వబోతున్నారట. ఒకవేళ ఇదే నిజమైతే మాత్రం తెలుగులో అత్యధిక రెమ్యునరేషన్ తీసుకునే వాళ్లలో చరణ్ ఒకడు అవుతాడు.(ఇదీ చదవండి: సైలెంట్‌గా ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు సినిమా.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?) -
నేడు ప్రత్యేక కోర్టు ముందుకు కవిత
సాక్షి, న్యూఢిల్లీ: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మూడు రోజుల కస్టడీ ముగియడంతో సీబీఐ అధికారులు సోమవారం ఆమెను ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి ఎదుట హాజరుపరచనున్నారు. ఉదయం పది గంటలకు న్యాయమూర్తి కావేరి బవేజా ముందు కవితను ప్రవేశ పెట్టనున్నారు. ఆదివారం విచారణలో భాగంగా ఆడిటర్ బుచ్చిబాబు ఫోను ద్వారా సేకరించిన చాట్లు, మహబూబ్‌నగర్‌లో భూమి ఒప్పందం, ఆప్ నేతలకు ప్రాక్సీ ద్వారా సొమ్ములు చేర్చడం, ఈ క్రమంలో బెదిరింపులకు పాల్పడడం తదితర అంశాలపై కవితను ప్రశ్నించినట్లు తెలిసింది. కాగా సీబీఐ కార్యాలయంలో ఉన్న కవితతో ఆమె భర్త అనిల్, సోదరుడు, మాజీ మంత్రి కేటీఆర్, న్యాయవాది మోహిత్‌రావులు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా తెలంగాణలో తాజా రాజకీయ పరిణామాలు, కోర్టులో అనుసరించాల్సిన వైఖరి తదితర అంశాలు చర్చించినట్లు సమాచారం. ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో మార్చి 15న ఈడీ అధికారులు కవితను అరెస్టు చేయగా, ప్రత్యేక కోర్టు మధ్యంతర బెయిలు నిరాకరించింది. రెగ్యులర్ బెయిలుపై ఈ నెల 16న విచారణ జరగనుంది. ఇటీవల సీబీఐ కూడా కవితను అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. -
కవిత కేసులో సంచలన విషయాలు బయటపెట్టిన ఆడిటర్ బుచ్చిబాబు
-
RC 16 Launching Ceremony: గ్రాండ్‌గా ప్రారంభమైన బుచ్చి బాబు-రామ్ చరణ్ సినిమా (ఫొటోలు)
-
ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు- రామ్ చరణ్ కాంబో.. గ్రాండ్‌గా పూజా కార్యక్రమం!
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం గేమ్ ఛేంజర్ సినిమాతో బిజీగా ఉన్నారు. ఇటీవలే ఈ సినిమా వైజాగ్ షెడ్యూల్‌ను పూర్తి చేసుకున్నారు. దీనికి సంబంధించిన రామ్ చరణ్ ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరలయ్యాయి. అయితే ఈ సినిమా తర్వాత చెర్రీ ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు దర్శకత్వంలో ఓ ప్రాజెక్ట్ ఓకే చేసిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ సినిమా పూజా కార్యక్రమం హైదరాబాద్‌లో గ్రాండ్‌గా నిర్వహించారు. ఈవెంట్‌కు ప్రముఖ దర్శకుడు శంకర్, సుకుమార్, చిరంజీవి, అల్లు అరవింద్, బోనీకపూర్,సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్‌తో పాటు పలువురు ఇండస్ట్రీ ప్రముఖులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా చిత్రబృందానికి అభినందనలు తెలిపారు. పూజా కార్యక్రమం అనంతరం రామ్‌చరణ్ మాట్లాడారు. బుచ్చిబాబు రాసిన కథ తనకెంతో నచ్చిందన్నారు. ప్రేక్షకులు తప్పకుండా ఎంటర్టైన్ అవుతారని చెర్రీ అన్నారు. కాగా.. ఉప్పెన తర్వాత బుచ్చిబాబు దర్శకత్వం వహిస్తోన్న చిత్రమిదే. స్పోర్ట్స్ డ్రామాగా గ్రామీణ నేపథ్యంలో ఈ సినిమాను తెరకెక్కించనున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రంలో రామ్‌చరణ్ పాత్ర పవర్‌ఫుల్‌గా ఉండనుంది. ఈ మూవీలో రామ్ చరణ్ సరసన జాన్వీకపూర్ హీరోయిన్గా కనిపించనుంది. ఈ చిత్రానికి ఏఆర్ రెహమాన్ సంగీతమందించనుండగా... మైత్రీ మూవీ మేకర్స్, వృద్ధి సినిమాస్, సుకుమార్ రైటింగ్స్ సంస్థలు కలిసి నిర్మిస్తున్నాయి. ప్రస్తుతం ఈ సినిమాను వర్కింగ్ టైటిల్ ఆర్సీ16తో రూపొందించనున్నారు. The stunning #RC16 pair looks soo adorable 😍✨@AlwaysRamCharan #JanhviKapoor #RC16PoojaCeremony #GameChanger pic.twitter.com/cdmMcnLajZ — Aℓω︎α︎yѕ🕊️ (@ALWAYSRAM16) March 20, 2024 They Called him a Mad Mann 🔥#RC16 #RC16PoojaCeremony pic.twitter.com/QipGxd9nzx — Raees (@RaeesHere_) March 20, 2024


