గాయంతో తిరిగి సెట్స్‌పైకి రామ్ చరణ్ | Ram Charan returns to Peddi Movie sets after injury | Sakshi
Sakshi News home page

గాయంతో తిరిగి సెట్స్‌పైకి రామ్ చరణ్

Mar 26 2026 11:58 PM | Updated on Mar 27 2026 11:51 AM

Ram Charan returns to Peddi Movie sets after injury

టాలీవుడ్ స్టార్ హీరో, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ షూటింగ్ సమయంలో గాయపడిన విషయం తెలిసిందే. ఆయన ఎడమ కంటికి తగిలిన దెబ్బ కారణంగా చిన్నపాటి సర్జరీ చేయాల్సి వచ్చింది. యూనిట్ ఈ గాయం పెద్దది కాదని ప్రకటించినప్పటికీ, తన అభిమానులు మాత్రం కొంత ఆందోళన చెందారు.  

అయితే గాయమైన గంటల వ్యవధిలోనే చరణ్ తిరిగి సెట్స్‌పైకి వచ్చాడు. గురువారం 'పెద్ది' చిత్ర షూటింగ్‌లో పాల్గొన్నాడు. దాంతో వందల సంఖ్యలో మెగా అభిమానులు సెట్స్‌కు చేరుకుని ఆయనను కలుసుకున్నారు. చరణ్ వారందరితో మాట్లాడి, సెల్ఫీ వీడియో కూడా దిగాడు. ఆ వీడియోను యూనిట్ సోషల్ మీడియాలో పోస్టు చేసింది. దీంతో చరణ్ స్వయంగా తన గాయంపై వస్తున్న ఊహాగానాలకు చెక్ పెట్టాడు.  

చరణ్‌కు సుధాకర్ ప్రసాద్ అనే వైద్యుడు మైనర్ సర్జరీ చేసినట్లు చిరంజీవి స్వయంగా వెల్లడించారు. డాక్టర్‌కు ప్రత్యేకంగా ధన్యవాదాలు కూడా తెలిపారు. ఇక మార్చి 27 (శుక్రవారం) రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా ఉదయం 9.45 గంటలకు పెద్ది నుంచి సర్‌ప్రైజ్ రాబోతోందని యూనిట్ ఇప్పటికే ప్రకటించింది. ఈ సందర్భంగా విడుదల చేసిన పోస్టర్‌లో ఏప్రిల్ 30న సినిమా రిలీజ్ అవుతుందని మరోసారి ధృవీకరించారు.  

Advertisement
 
Advertisement
Advertisement