ఉప్పెన కేవలం ఆయన కోసమే చేశా: విజయ్ సేతుపతి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ | Sakshi
Sakshi News home page

Vijay Sethupathi: ఉప్పెన రెమ్యునరేషన్‌పై విజయ్ సేతుపతి కామెంట్స్‌.. ఎంత తీసుకున్నారంటే?

Published Mon, Jun 10 2024 7:49 PM

Vijay Sethupathi Comments On Acting In Uppena Movie In Telugu

ఉప్పెన మూవీతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన కోలీవుడ్ స్టార్‌ హీరో విజయ్ సేతుపతి. ప్రస్తుతం మహారాజా చిత్రంతో ప్రేక్షకుల ముందుకొస్తున్నారు. క్రైమ్‌ సస్పెన్స్‌ థ్రిల్లర్‌గా వస్తోన్న ఈ చిత్రాన్ని నిథిలన్‌ దర్శకత్వంతో తెరకెక్కించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఈనెల 14న థియేటర్లలో సందడి చేయనుంది. ఇప్పటికే రిలీజైన ట్రైలర్‌ సినిమాపై భారీ అంచనాలు పెంచేసింది. ప్రస్తుతం ఆయన మహారాజా మూవీ ప్రమోషన్లతో బిజీగా ఉన్నారు. ఈ సందర్భంగా ఆయన ఉప్పెన చిత్రంపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.

విజయ్ సేతుపతి మాట్లాడుతూ..'ఉప్పెన సినిమా కేవలం నేను బుచ్చిబాబు కోసమే చేశా. ఆయనకున్న ప్యాషన్‌ చూసి నేను ఒప్పుకున్నా. చాలా తక్కువ రెమ్యునరేషన్‌కే ఉప్పెన సినిమా చేశా. మామూలుగా ‍అయితే నాలాంటి యాక్టర్స్‌ చేయడానికి వెనుకాడతారు. కానీ సినిమా పట్ల బుచ్చిబాబుకున్న ప్యాషన్ చూసే ఆ చిత్రంలో నటించా' అని అన్నారు. 

Advertisement
 
Advertisement
 
Advertisement