శ్రీ విష్ణు హీరోగా వస్తోన్న లేటేస్ మూవీ విష్ణు విన్యాసం. ఈ మూవీలో నయన్ సారిక హీరోయిన్‌గా కనిపించనుంది. ఈ సినిమాకు యదునాథ్ మారుతిరావు దర్శకత్వం వహించారు. ఈ చిత్రాన్ని శ్రీ సుబ్రమణ్యేశ్వర సినిమాస్ బ్యానర్‌లో జి సుమంత్ నాయుడు నిర్మించారు. ఇప్పటికే విడుదలైన రెండు పాటలకు ఆడియన్స్ నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది.
తాజాగా విష్ణు విన్యాసం మూవీ టీజర్‌ను మేకర్స్ విడుదల చేశారు. ఈ టీజర్ చూస్తుంటే ఫుల్ రొమాంటిక్ లవ్ స్టోరీగా తెరకెక్కించినట్లు తెలుస్తోంది. విష్ణు.. నీకు తెలిసిన అబ్బాయిల్లో ఎవరినైనా ఇచ్చి నాకు పెళ్లి చేస్తావా? అనే డైలాగ్ ఈ మూవీపై ఆసక్తిని మరింత పెంచింది. కాగా.. ఈ చిత్రంలో సత్య, మురళీ శర్మ, బ్రహ్మాజీ, ప్రవీణ్, సత్యం రాజేష్, శ్రీకాంత్ అయ్యంగార్, శ్రీనివాస్ వడ్లమాని, గోపరాజు రమణ కీలక పాత్రల్లో నటించారు. ఈ సినిమాకు రాధన్ సంగీతమందించారు.


