'రామ్ చరణ్‌కు అది చాలా ఇష్టం.. వద్దన్నా వినేవాడు కాదు': సురేఖ | Surekha konidela Reveals Ram Charan Favourite | Sakshi
Sakshi News home page

Ram Charan:'రామ్ చరణ్‌కు అదంటే ప్రాణం.. వద్దన్నా వినిపించుకోడు'

Feb 18 2026 6:33 PM | Updated on Feb 18 2026 7:26 PM

Surekha konidela Reveals Ram Charan Favourite

మెగాస్టార్ చిరంజీవి సతీమణి సురేఖ బర్త్‌ డే కావడంతో చిరు స్పెషల్ విషెస్ తెలిపారు.  ప్రతి మగాడి విజయం వెనక ఒక స్త్రీ ఉంటుందంటారు.. అలాగే తన విజయం వెనక కూడా భార్య సురేఖ ఉందన్నారు మెగాస్టార్. ఈ సందర్భంగా భార్యపై ప్రేమతో ఓ ఎమోషనల్‌ పోస్ట్‌ చేశారు. 1980 ఫిబ్రవరి 20న సురేఖతో నా పెళ్లి జరిగిందని.. అప్పటినుంచి తనే నాకు ప్రధాన బలంగా మారందని చిరంజీవి ట్విటర్ వేదికగా పంచుకున్నారు. సురేఖ బర్త్‌ డే విషయం తెలుసుకున్న అభిమానులు పెద్దఎత్తున జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.

అయితే గతంలో ఓ ఇంటర్వ్యూకు హాజరైన సురేఖ..తన కుమారుడు రామ్ చరణ్ గురించి ఆసక్తికర విషయాన్ని పంచుకుంది. రామ్ చరణ్ చిన్నప్పుడు చాలా సైలెంట్‌గా ఉండేవాడని తెలిపింది. అస్సలు అల్లరి చేసేవాడు కాదని.. టీనేజ్ వచ్చాక కొంచెం అల్లరి చేసేవాడని వెల్లడించింది. చరణ్‌కు కిల్లీ అంటే చాలా ఇష్టమని తెలిపింది. కిల్లీ చిన్నపిల్లలు వేసుకోవద్దని చెబితే.. పక్కకు వెళ్లి సందులో నిలబడి సైలెంట్‌గా అక్కడే నిల్చుని తినేవాడని సురేఖ ఆసక్తికర విషయాన్ని పంచుకుంది.

ఇక సినిమాల విషయానికొస్తే రామ్ చరణ్ ప్రస్తుతం పెద్ది చిత్రంలో నటిస్తున్నారు. ఈ రూరల్ స్పోర్ట్స్ డ్రామాకు బుచ్చిబాబు సనా దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీలో బాలీవుడ్ భామ జాన్వీ కపూర్‌ హీరోయిన్‌గా కనిపించనుంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement