'45 ఏళ్ల ప్రేమాభిషేకం.. లక్షలాది హృదయాల్లో జీవించే ఉంటారు' | Akkineni Nageswara Rao Premabhishekam | Sakshi
Sakshi News home page

Premabhishekam: '45 ఏళ్ల ప్రేమాభిషేకం.. లక్షలాది హృదయాల్లో జీవించే ఉంటారు'

Feb 18 2026 4:07 PM | Updated on Feb 18 2026 4:17 PM

 Akkineni Nageswara Rao Premabhishekam

తెలుగు నట దిగ్గజం అక్కినేని నాగేశ్వరరావు నటించిన సూపర్ హిట్ మూవీ ప్రేమాభిషేకం. 1981లో రిలీజైన ఈ సినిమాకు దాసరి నారాయణ రావు దర్శకత్వం వహించారు. ఈ సినిమాకు అక్కనేని వెంకట్, అక్కినేని నాగార్జున నిర్మాతలుగా వ్యవహరించారు. ఈ ఐకానిక్ మూవీలో శ్రీదేవి హీరోయిన్‌గా నటించింది..

నేటితో ఈ మూవీ రిలీజై నేటికి 45 ఏళ్లు పూర్తయింది. ఈ సందర్భంగా అన్నపూర్ణ స్టూడియోస్‌  ప్రత్యేక వీడియోను విడుదల చేసింది. 'ప్రేమకు నిర్వచనం… త్యాగానికి ప్రతీక… సినీ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిన ప్రేమాభిషేకం' అంటూ క్యాప్షన్ రాసుకొచ్చింది.  ఈ చారిత్రాత్మక బ్లాక్‌బస్టర్ మూవీ 45 ఏళ్ల సెలబ్రేషన్స్ జరుపుకుంటున్నామని తెలిపింది. ఈ సినిమా రికార్డులు, భావోద్వేగాలు, ప్రభావం నేటికీ చెక్కుచెదరకుండా ఉన్నాయని ట్వీట్ చేసింది.  లక్షలాది హృదయాల్లో ఏఎన్నార్‌ ఎప్పటికీ జీవించే ఉంటారని ట్వీట్‌లో వెల్లడించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement