మా పూర్వీకులు భయంకరమైన దారుణాలు చేశారు.. రాజమౌళి తండ్రి | Vijayendra Prasad Apology And Latest Speech | Sakshi
Sakshi News home page

Vijayendra Prasad: వాళ్లు తప్పు చేశారు.. నేను క్షమాపణలు చెబుతున్నా

Feb 18 2026 11:03 AM | Updated on Feb 18 2026 11:45 AM

Vijayendra Prasad Apology And Latest Speech

దర్శకుడిగా రాజమౌళి ఎంత ఫేమస్సో.. ఈయన సినిమాలన్నింటికీ కథలు రాసే తండ్రి విజయేంద్ర ప్రసాద్ కూడా అంతే ఫేమస్. మహేశ్ బాబు 'వారణాసి'కి స్టోరీ రాసిన ఈయన.. ప్రస్తుతం పలు చిత్రాలకు కథలు రాసే పనిలో బిజీగా ఉన్నారు. అలాంటిది మంగళవారం రాత్రి హైదరాబాద్‌లోని రవీంద్ర భారతిలో జరిగిన మాతా రాంబాయి అంబ్కేడర్ మెమొరియల్ అవార్డుల కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా విజయేంద్ర ప్రసాద్ చేసిన వ్యాఖ్యలు షాకింగ్‌గా అనిపించాయి.

(ఇదీ చదవండి: మానస వారణాసి 'ఫ్రెండ్లీ' హిట్.. ఎవరీమె? బ్యాక్ గ్రౌండ్ ఏంటి?)

'మాది సంపన్న కుటుంబం. నాకు తెలిసీ ఎప్పుడూ తప్పు చేయలేదు. మా పూర్వీకులు మాత్రం అంటరానితనం పేరుతో, నోటితో చెప్పలేని భయంకరమైన దారుణాలు చేశారు. అ‍ప్పటి పరిస్థితులు తలుచుకున్నప్పుడు మనసు సిగ్గుతో, అవమానంతో కుంగిపోతుంది. మీ అందరికీ తలవంచి నమస్కరిస్తున్నా. క్షమించండి. క్షమించండి.. క్షమించండి' అని విజయేంద్ర ప్రసాద్ వేడుకున్నారు.

ఇప్పటికీ తన ఆఫీస్‌లో అంబేడ్కర్ ఫొటో మాత్రమే ఉంటుందని, ప్రస్తుతం ఆయనపై ఓ సినిమా కథ రాస్తున్నానని ఈ మేరకు పరిశోధన చేస్తున్నానని కూడా విజయేంద్ర ప్రసాద్ చెప్పుకొచ్చారు. ఏదేమైనా ఈయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో ప్రాధాన్యం సంతరించుకున్నాయి.

(ఇదీ చదవండి: ప్రముఖ హీరో ఇంట తీవ్ర విషాదం.. తండ్రి కన్నుమూత)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement