తెలుగమ్మాయి 'ఫ్రెండ్లీ' హిట్.. ఎవరీమె? బ్యాక్ గ్రౌండ్ ఏంటి? | Couple Friendly Fame Manasa Varanasi Full Details | Sakshi
Sakshi News home page

Manasa Varanasi: 'కపుల్ ఫ్రెండ్లీ'తో తొలి సక్సెస్.. టాలీవుడ్ నెక్స్ట్ స్టార్ అవుతుందా?

Feb 18 2026 10:01 AM | Updated on Feb 18 2026 10:48 AM

Couple Friendly Fame Manasa Varanasi Full Details

టాలీవుడ్‌లో హీరోయిన్లుగా చేసిన తెలుగమ్మాయిలు రీసెంట్ టైంలో బాగానే కనిపిస్తున్నారు. అలాంటి వాళ్లలో మానస వారణాసి ఒకరు. గత వీకెండ్ రిలీజైన 'కపుల్ ఫ్రెండ్లీ' మూవీతో తొలి సక్సెస్ అందుకున్న ఈమె.. సంతోషంలో మునిగితేలుతోంది. సోషల్ మీడియాలోనూ ట్రెండ్ అవుతోంది. ఇంతకీ ఎవరీమె? బ్యాక్ గ్రౌండ్ ఏంటి?

(ఇదీ చదవండి: కలిసిన వెంటనే పెళ్లి చేసుకుంటానని చెప్పొద్దు: మంచు లక్ష్మీ)

మాసన పక్కా హైదరాబాదీ. చిన్నప్పుడు ఇక్కడే చదువుకుంది గానీ తండ్రి ఉద్యోగరీత్యా మలేసియా వెళ్లింది. అక్కడే పదో తరగతి పూర్తి చేసింది. తర్వాత తిరిగి స్వస్థలానికి వచ్చిన తర్వాత హైదరాబాద్‪‌లోని వాసవి ఇంజినీరింగ్ కాలేజీలో చదివింది. ఆ టైంలోనే మోడలింగ్ వైపు అడుగులు వేసింది. 2020లో మిస్ తెలంగాణగా నిలిచింది. అదే ఏడాది.. ఫెమినా మిస్ ఇండియా, మిస్ ఇండియా వరల్డ్ కిరీటాలు కూడా సొంతం చేసుకుంది.

పలు మోడలింగ్ పోటీల్లో గెలిచిన ఈమెకు సహజంగా సినిమాలపై ఆసక్తి కలిగింది. కానీ ఇంట్లో వాళ్లు తొలుత వద్దని చెప్పడంతో హైదరాబాద్‌లోనే ఓ ప్రైవేట్ కంపెనీలో ఫైనాన్సియల్ ఇన్ఫర్మేషన్ ఎక్సేంజ్ అనలిస్టుగా కొన్నాళ్ల పాటు పనిచేసింది. ఆర్థికంగా కాస్త నిలదొక్కుకున్న తర్వాత ఇంట్లో వాళ్లని ఒప్పించి ఇండస్ట్రీలోకి ఎంటరైంది. తొలుత మహేశ్ బాబు మేనల్లుడు గల్లా జయదేవ్ హీరోగా నటించిన 'దేవకీ నందన వాసుదేవ' సినిమాలో హీరోయిన్‌గా చేసింది. లుక్స్ బాగున్నప్పటికీ హిట్ అయితే దక్కలేదు.

2024లో తొలి సినిమా రిలీజైతే.. రెండేళ్ల తర్వాత ఇప్పుడు 'కపుల్ ఫ్రెండ్లీ' మూవీతో వచ్చింది. ఇందులో మిత్ర అనే పాత్రలో అదరగొట్టేసింది. సంతోష్ శోభన్ హీరోగా చేసిన ఈ చిత్రంతో తొలి సక్సెస్ అందుకున్న మానస.. టాలీవుడ్ దర్శకనిర్మాతల దృష్టిలో పడింది. సంతోష్ శోభన్‌తోనే మరో సినిమా చేయనున్న మానసకు స్టార్ హీరోయిన్ అయ్యే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ఎందుకంటే ప్రస్తుతం తెలుగులో హీరోయిన్ల కొరత ఉంది. శ్రీలీల, భాగ్యశ్రీ లాంటి వాళ్లు ఉన్నప‍్పటికీ.. స్టార్ హీరోలకు సరైన జోడీగా మానస నిలిచే ఛాన్స్ ఉంది. మరి కెరీర్‌ని ఈమె ఎలా ప్లాన్ చేసుకుంటుందో చూడాలి?

(ఇదీ చదవండి: హీరోయిన్‌తో క్లోజ్‌గా ఉండే పాత్ర అని పిలిచి అవమానించారు: హీరో సుహాస్)

Advertisement
 
Advertisement
Advertisement