కోలీవుడ్ హీరో విజయ్ ఆంటోని అక్క కొడుకు అజయ్ దీషన్ కథానాయకుడిగా నటించిన లేటేస్ట్ మూవీ బూకీ(తమిళంలో పూకీ). ఈ సినిమాకు గణేశ్ చంద్ర దర్శకత్వం వహించారు. ఈ మూవీ తెలుగులో బూకీ పేరుతో రిలీజ్ చేస్తున్నారు. ఈ చిత్రాన్ని విజయ్ ఆంటోని నిర్మించడంతో పాటు ఓ ముఖ్యమైన పాత్రలో కూడా నటించారు. తాజాగా హైదరాబాద్‌లో ఈ సినిమా ఈవెంట్ నిర్వహించారు.
ఈ ఈవెంట్‌కు ముఖ్య అతిథిగా టాలీవుడ్ నటి మంచు లక్ష్మీ హాజరయ్యారు. ఈ సందర్భంగా వేదికపై హీరో అజయ్ దీషన్‌ను ఆసక్తికర ప్రశ్న అడిగారు. రిలేషన్‌షిప్ విషయంలో విజయ్ ఆంటోనీ మీకు ఎలాంటి సలహా ఇచ్చారని హీరోను అడిగింది. రిలేషన్‌షిప్‌లో ఒక ఫ్రెండ్‌గా ఉండమని చెప్పాడని.. ఆ స్నేహం ఒక ఐదేళ్ల పాటు కొనసాగితే అప్పుడు ఆలోచించాలని సలహా ఇచ్చాడని అన్నారు. ఇది విన్న మంచు లక్ష్మీ కలిసిన వెంటనే పెళ్లి చేసుకుంటానని చెప్పకు అని సలహా ఇచ్చింది.
అంతేకాకుండా ఈ మూవీ టైటిల్ గురించి కూడా మంచు లక్ష్మీ మాట్లాడింది. పూకీ అనే పదం తమిళంలో క్యూటీ అని అర్థమని చెప్పుకొచ్చింది. యంగ్‌స్టర్స్ ఎక్కువగా ఈ పదాన్ని వాడతారని తెలిపింది. సినిమాల వల్ల డబ్బులు పొగొట్టుకున్నారా అని మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా.. మంచు లక్ష్మీ స్పందించింది. అవునండి.. అప్పులు అనేవి వందశాతం నిజం.. ఐదేళ్ల క్రితం తీసిన సినిమా అప్పులు ఇంకా కట్టుకుంటున్నానని తెలిపింది.
కాగా.. ఈ చిత్రంలో ధనుషా హీరోయిన్‌గా నటించింది. ఈ మూవీలో పాండియరాజన్, సునీల్, ఇందుమతి, మణికంఠన్, వివేక్ ప్రసన్న, బ్లాక్ పాండి, ఆదిత్య కతిర్, ప్రియాంక తదితరులు నటించారు.
కలిసిన వెంటనే పెళ్లి చేసుకుంటానని చెప్పకు.. - మంచు లక్ష్మి రిలేషన్ షిప్ అడ్వైజ్#ManchuLakshmi #Bookie #AjayDhishan #VijayAntony pic.twitter.com/tzYpB01CQt
— Filmy Focus (@FilmyFocus) February 17, 2026


