అదే బాధగా అనిపిస్తుంది : సుహాస్‌ | Actor Suhas Made Interesting Comments About Hey Balawanth Movie, Check Out Media Meet Highlights | Sakshi
Sakshi News home page

Actor Suhas: అందుకే సెన్సార్‌ వాళ్లు టైటిల్‌ మార్చమన్నారు

Feb 17 2026 5:18 PM | Updated on Feb 17 2026 5:49 PM

Suhas Talk About Hey Balawanth Movie

నా కెరీర్‌ మొత్తంలో అతి తక్కువ సమయంలో పూర్తి చేసిన సినిమా ‘హే బల్‌వంత్‌’. కథ వినగానే నచ్చింది. ముఖ్యంగా ఎంటర్‌టైన్‌మెంట్‌తో పాటు ఎమోషన్‌గా కనెక్ట్‌ అయ్యాను. సినిమా మేము అనుకున్నదాని కంటే వందరెట్లు బెటర్‌గా వచ్చింది’ అన్నారు యంగ్‌ హీరో సుహాస్‌. ఆయన హీరోగా నటించిన తాజా చిత్రం ‘హే బల్‌వంత్‌' (హే భగవాన్‌ చిత్రం టైటిల్‌ మార్పు) . శివానీ నగరం, సీనియర్ నటుడు నరేష్, యాంకర్ స్రవంతి ప్రముఖ పాత్రల్ని పోషించారు. గోపీ అచ్చర దర్శకత్వంలో త్రిశుల్‌ విజనరీ స్టూడియోస్‌ పతాకంపై బి.నరేంద్ర రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ మూవీని ఫిబ్రవరి 20న రిలీజ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో హీరో సుహాస్‌  మంగళవారం  పాత్రికేయులతో ముచ్చటించారు. ఆ విశేషాలు..

భగవాన్‌ అంటే భగవంతుడు అనే అర్థం వస్తుంది కాబట్టి టైటిల్‌ మార్చాలని సెన్సారు వారు సూచించడంతో హేబల్‌వంత్‌గా మార్చాం. సినిమాలో  నరేష్‌ క్యారెక్టర్‌ పేరు మార్చాం. సినిమా టైటిల్‌తో పాటు సినిమా కాన్సెప్ట్‌ను కూడా సెన్సారు వాళ్లు పరిగణనలోకి తీసుకున్నారు.

చిన్నప్పటి నుంచి బిజినెస్‌ చేయాలని ఆలోచించే కుర్రాడు, నాన్న బిజినెస్‌ను టేకప్‌ చేయాలని అనుకుంటాడు. అప్పుడు అతనికి ఎదురైన పరిణామాలు ఏమిటి? నాన్న బిజినెస్‌ ఏమిటి? ఇలా సినిమా పూర్తి ఎంర్‌టైన్‌మెంట్‌గా, నా పాత్ర కూడా వినోదాత్మకంగా ఉంటుంది. ఈ మూవీతో నాకు విజయం అందుతుందనే నమ్మకం ఉంది.

ప్రతి సినిమా కోసం మీ ఎఫర్ట్‌ పెడుతున్నాను. కానీ సరైన విజయం అందడం లేదు.  విజయం కోసం ఎదురుచూడటమే కాస్త బాధగా అనిపిస్తుంది. కానీ వెంటనే తదుపరి సినిమాకు రెడీ అవుతున్నాను.

వరుస ఫెయిల్యూర్స్‌ తరువాత అందరూ  కంట్రోల్‌గా ఆలోచించి సినిమా చేయమని చెప్పారు. ఇంట్లో మా శ్రీమతి కూడా చెప్పింది. అందుకే మంచి సినిమాలు చేయాలని కొంత బ్రేక్‌ ఇచ్చి హేబల్‌వంత్‌ చేశాను. ఈ సినిమాపై చాలా నమ్మకం ఉంది. ‘మంచి యాక్టర్‌. మంచి సినిమా పడాలి’ అనే సానుభూతి అందరిలో ఉంది. ఇది నా అదృష్టంగా భావిస్తున్నాను.

తమిళ్‌ సినిమా మందాడిలో మెయిన్‌ విలన్‌గా చేస్తున్నా. సినిమా రిజల్ట్‌ తరువాత తమిళంలో బిజీ అయ్యే అవకాశం ఉంది. నేను వెయిట్‌ చేసిన లుక్‌ అండ్‌ క్యారెక్టర్‌. అంబాజీ పేట సినిమా చూసి ఈ సినిమా కోసం నన్ను అప్రోచ్‌ అయ్యారు.

నా కెరీర్‌ ప్రారంభంలో షార్ట్‌ఫిల్మ్‌స్‌లో నేను కామెడీ పాత్రలే చేశాను. ఈ సినిమాలో నా పాత్రను చూసి మా ఆవిడ కూడా ఇలాంటి సినిమాలు చేయమని కోరింది. లక్కీగా నాకు ఈ సినిమా వచ్చింది.

కెరీర్‌ పట్ల సంతోషంగా ఉ‍న్నాను. ఈ సినిమా హిట్‌ అయితే అది ఇంకా పెరుగుతుంది. అందరూ సినిమా మీద ఫుల్‌ కాన్పిడెంట్‌గా ఉన్నారు. పెద్ద విజయం రాబోతుంది. ఈ సినిమా మా వైఫ్‌ కూడా చూసి ఫుల్‌ ఎంజాయ్‌ చేసింది.

ప్రస్తుతం కార్తీక్‌ సుబ్బరాజు బ్యానర్‌లో ఓ సినిమా చేస్తున్నాను. ఆయన కథ అందిస్తున్నాడు. వాళ్ల అసోసియేట్‌ దర్శకుడు. తెలుగులో కొన్ని కథలు వింటున్నాను.త్వరలోనే ఫైలన్‌ అవుతాయి.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement