ఆదా శర్మ కీలక పాత్రలో వచ్చిన చిత్రం ది కేరళ స్టోరీ. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద ప్రభంజనం సృష్టించింది. ఎన్ని విమర్శలు, వివాదాలు ఎదురైనప్పటికీ ప్రపంచవ్యాప్తంగా అభిమానుల ఆదరణ దక్కించుకుంది. ఈ సినిమా సూపర్ హిట్ కావడంతో మేకర్స్ సీక్వెల్‌తో ప్రేక్షకుల ముందుకొస్తున్నారు. కేరళలోని అమ్మాయిలను మత మార్పిడి చేసి గల్ఫ్ దేశాలకు తీసుకెళ్లిన రియల్ స్టోరీతో ది కేరళ స్టోరీని తెరకెక్కించారు. . సుదీప్తో సేన్ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఏకంగా రెండు జాతీయ చలనచిత్ర అవార్డులు గెలిచింది.
తాజాగా ఈ మూవీకి సీక్వెల్ వస్తోన్న ది కేరళ స్టోరీ-2 గోల్ బియాండ్ ట్రైలర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. ట్రైలర్ చూస్తుంటే మనదేశంలోని పలు రాష్ట్రాలకు చెందిన అమ్మాయిలను లవ్ పేరుతో మత మార్పిడి చేసి చిత్ర హింసలకు గురి చేసే కథాంశంగా తెరకెక్కించినట్లు తెలుస్తోంది. ఈ మూవీ రియల్ సంఘటనల ఆధారంగానే రూపొందించారు. ఈ చిత్రాన్ని ముగ్గురు హిందూ అమ్మాయిల జీవితం ఆధారంగా తెరకెక్కించారు.
కాగా.. ఈ చిత్రానికి కామాఖ్య నారాయణ్ సింగ్ దర్శకత్వం వహించారు. ఈ మూవీని సన్‌షైన్ పిక్చర్స్ బ్యానర్‌లో విపుల్ అమృత్‌లాల్ షా నిర్మించారు. ఈ సినిమాకు మన్నన్ షా సంగీతం అందించారు. ఈ సీక్వెల్ ఫిబ్రవరి 27న థియేటర్లలో విడుదల కానుంది.
కాగా.. 2023లో విడుదలైన 'ది కేరళ స్టోరీ' బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్‌గా నిలిచింది. ఈ చిత్రంలో అదా శర్మ, సిద్ధి ఇద్నాని, యోగితా బిహాని, సోనియా బలాని ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ కథ కేరళకు చెందిన కొంతమంది మహిళలు ఇస్లాంలోకి ఎలా మారారు అనే కోణంలో ఈ మూవీని తెరకెక్కించారు.


