breaking news
Kamakhya
-
కామాఖ్య ప్రారంభం
సమైరా, సముద్ర ఖని, అభిరామి ప్రధానపాత్రల్లో నటిస్తున్న మిస్టీరియస్ థ్రిల్లర్ సినిమా ‘కామాఖ్య’. అభినయ కృష్ణ దర్శకత్వంలో శ్రీ వాణీనాథ్, యశ్వంత్ రాజ్ నిర్మిస్తున్న ఈ సినిమా ప్రారంభోత్సవం హైదరాబాద్లో జరిగింది.ఈ కార్యక్రమానికి మాజీ ఎంపీ మధు యాష్కీ గౌడ్ ముఖ్య అతిథిగా హాజరై, ముహూర్తపు సన్నివేశానికి క్లాప్ ఇచ్చారు. ఈ సినిమాకు చెందిన ఇతర వివరాలను త్వరలోనే వెల్లడిస్తామని చిత్రయూనిట్ తెలిపింది. ఆనంద్, శరణ్య ప్రదీప్, వైష్ణవ్, ధనరాజ్, రాఘవ, ఐశ్వర్య ప్రధానపాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాకు సంగీతం: గ్యానీ, కెమెరా: రమేశ్ కుశేందర్ రెడ్డి. -
కామాఖ్య మాతను ప్రార్థించిన గోగోయ్!
గౌహతిః అసోం అధికార కాంగ్రెస్ పార్టీ నాయకుడు, ముఖ్యమంత్రి తరుణ్ గోగోయ్ తెల్లవారుజాము కామాఖ్య దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అసోం ఎగ్జిట్ పోల్స్ సర్వేలను బట్టి బీజేపీకే విజయం కలిసొచ్చే సూచనలు కనిపిస్తున్న నేపథ్యంలో... వెనుకబడిపోతున్న కాంగ్రెస్ కు విజయాన్ని చేకూర్చాలని కోరుతూ గోగోయ్ కామాఖ్య మాతను దర్శించి ప్రార్థించారు. మొత్తం 126 అసెంబ్లీ స్థానాలున్న అసోంలో పదిహేనేళ్ళుగా పాలనలో ఉన్న తమ పార్టీని ఈసారి అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లోనూ గట్టెంకించమని గోగోయ్ ఉదయం కామాఖ్య మాతను కోరుకున్నారు. ఫలితాల లెక్కింపు నేపథ్యంలో గురువారం ఉదయం ఆలయాన్ని దర్శించిన అనంతరం... ప్రజలే నిర్ణయాన్ని తీసుకుంటారని, ఫలితాలు ఎలా ఉన్నా శిరస్సావహించాల్సిందేనని అన్నారు. అయితే ప్రస్తుతం తమ విజయంతోపాటు, ప్రజలను రక్షించేందుకు కామాఖ్య మాత తప్పనిసరిగా సహాయపడుతుందని ఆశిస్తున్నట్లు తెలిపారు.