
సమైరా, సముద్ర ఖని, అభిరామి ప్రధానపాత్రల్లో నటిస్తున్న మిస్టీరియస్ థ్రిల్లర్ సినిమా ‘కామాఖ్య’. అభినయ కృష్ణ దర్శకత్వంలో శ్రీ వాణీనాథ్, యశ్వంత్ రాజ్ నిర్మిస్తున్న ఈ సినిమా ప్రారంభోత్సవం హైదరాబాద్‌లో జరిగింది.
ఈ కార్యక్రమానికి మాజీ ఎంపీ మధు యాష్కీ గౌడ్ ముఖ్య అతిథిగా హాజరై, ముహూర్తపు సన్నివేశానికి క్లాప్ ఇచ్చారు. ఈ సినిమాకు చెందిన ఇతర వివరాలను త్వరలోనే వెల్లడిస్తామని చిత్రయూనిట్ తెలిపింది. ఆనంద్, శరణ్య ప్రదీప్, వైష్ణవ్, ధనరాజ్, రాఘవ, ఐశ్వర్య ప్రధానపాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాకు సంగీతం: గ్యానీ, కెమెరా: రమేశ్ కుశేందర్ రెడ్డి.