ప్రభాస్, బన్నీతో నటించిన ఈ హీరోయిన్ గుర్తుపట్టారా? ఇప్పుడేం చేస్తోంది? | Tollywood Actress Deeksha Seth Present Details | Sakshi
Sakshi News home page

Guess The Actress: 14 ఏళ్లుగా టాలీవుడ్‌కి దూరం.. ఇప్పుడు ఇంకా అందంగా

Feb 15 2026 9:16 PM | Updated on Feb 16 2026 8:57 AM

Tollywood Actress Deeksha Seth Present Details

తెలుగు ఇండస్ట్రీలోకి ఎప్పటికప్పుడు కొత్త హీరోయిన్లు వస్తూనే ఉంటారు. అప్పటికే ఉన్నోళ్లు మెల్లమెల్లగా సైడ్ అవుతూనే ఉంటారు. కాకపోతే కొందరు మాత్రం స్టార్స్ అవుతారనుకుంటే పట్టుమని పది మూవీస్ కూడా చేయకుండా తెరమరుగైపోతుంటారు. అలాంటి బ్యూటీనే ఈమె. అల్లు అర్జున్, ప్రభాస్, రవితేజ లాంటి స్టార్స్‌తో చేసినప్పటికీ మాయమైపోయింది. మరి ఈమెని గుర్తుపట్టారా? ఎవరో చెప్పేయమంటారా?

పైన ఫొటోలో కనిపిస్తున్న అమ్మాయి పేరు దీక్షా సేథ్. ఢిల్లీలో పుట్టిన ఈమె.. తండ్రి ఉద్యోగరీత్యా ముంబై, చెన్నై, కోల్‌కతా, రాజస్థాన్, గుజరాత్, ఉత్తరప్రదేశ్‌లో పెరిగింది. మంచి పొడగరి కావడంతో 2009లో ఫెమినా మిస్ ఇండియా పోటీల్లో పాల్గొంది. మోడలింగ్ అనుభవం లేనప్పటికీ టాప్-10లో ఒకరిగా నిలిచింది. ఓ మోడలింగ్ పనిమీద హైదరాబాద్ వచ్చినప్పుడు ఈమెని చూసిన దర్శకుడు క్రిష్.. 'వేదం'లో అవకాశమిచ్చాడు. ఇందులో పూజగా అల్లు అర్జున్ సరసన నటించింది. అలా టాలీవుడ్ దృష్టిలో పడింది.

(ఇదీ చదవండి: ఓటీటీ రివ్యూ: గుండె లోతుల్లో నిలిచిపోయే మలయాళ సినిమా)

తర్వాత రవితేజ 'మిరపకాయ్', నిప్పు, గోపిచంద్ 'వాంటెడ్', మంచు మనోజ్ 'ఊ కొడతారా ఉలిక్కిపడతారా', ప్రభాస్ 'రెబల్' సినిమాలు చేసింది. వీటిలో హిట్స్ కంటే ఫ్లాప్సే ఎక్కువ ఉండేసరికి తర్వాత తెలుగులో అవకాశాలు రాలేదు. అనంతరం హిందీలో రెండు, కన్నడలో ఓ మూవీ చేసింది. అయినా సరే పెద్దగా ఉపయోగం లేకపోయేసరికి పూర్తిగా నటనకు దూరమైపోయింది.

రీసెంట్ టైంలో ఈమె ఫొటోలు కొన్ని వైరల్ కావడంతో అసలు ఇప్పుడేం చేస్తుందా అని వెతకగా.. స్పెయిన్‌లో ఎంబీఏ పూర్తి చేసిన దీక్షా, అక్కడే ఓ కార్పొరేట్ కంపెనీలో సాఫ్ట్‌వేర్ జాబ్ చేసుకుంటోందట. అలానే ఫ్యామిలీ కూడా అక్కడే సెటిల్ అయిపోవడంతో జీవితాన్ని హ్యాపీగా ఎంజాయ్ చేస్తోంది. అయితే హీరోయిన్‌గా ఉన్నప్పుడు ఎలా ఉందో ఇప్పుడు కూడా అంతే క్యూట్, గ్లామర్‌గా ఉండటం విశేషం.

(ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చిన తెలుగు సినిమాలు)

Advertisement
 
Advertisement
Advertisement