రవితేజ ఇరుముడి.. మహా శివరాత్రి అప్‌డేట్ | tollywood Movie Actress Priya Bhavani Sankar first look poster | Sakshi
Sakshi News home page

Irumudi Movie: రవితేజ ఇరుముడి.. మహా శివరాత్రి అప్‌డేట్

Feb 15 2026 11:06 AM | Updated on Feb 15 2026 12:06 PM

tollywood Movie Actress Priya Bhavani Sankar first look poster

మాస్ మహారాజా నటిస్తోన్న లేటేస్ట్ మూవీ ఇరుముడి(Irumudi). ఈ సినిమాకు శివ నిర్వాణ దర్శకత్వం వహిస్తున్నారు. జనవరి 26న రవితేజ బర్త్ ‍డే సందర్భంగా ఈ మూవీ ఫస్ట్ లుక్‌ పోస్టర్‌ను మేకర్స్ రివీల్ చేశారు. ఈ పోస్టర్‌లో అయ్యప్పమాల ధరించిన రవితేజ.. చేతిలో మరో చిన్నారిని ఎత్తుకుని చాలా కొత్తగా కనిపించారు.

ఇవాళ మహాశివరాత్రిని పురస్కరించుకుని మేకర్స్ మరో అప్‌డేట్ ఇచ్చారు. హీరోయిన్ ప్రియా భవాని శంకర్‌ ఫస్ట్ లుక్‌ను రివీల్ చేశారు. ఈ సినిమాలో కావేరి అనే పాత్రలో ప్రియా భవాని శంకర్ కనిపించనుందని వెల్లడించారు. ఈ చిత్రంలో రవితేజ భార్యగా అభిమానులను మెప్పించనుంది. తాజాగా రిలీజైన ఈ పోస్టర్ టాలీవుడ్ సినీ ప్రియులను తెగ ఆకట్టుకుంటోంది.

కాగా..  ఈ మూవీని మైత్రీ మూవీ మేకర్స్‌ సంస్థ నిర్మిస్తుంది.  జీ.వీ ప్రకాష్‌ కుమార్‌ సంగీతం అందిస్తున్నారు. ఈ మూవీ అంతా తండ్రీకూతుళ్ల బంధం గురించి ఉండనున్నట్లు తెలుస్తోంది. తన కూతురిని రక్షించుకునేందుకు ఎంతవరకైనా వెళ్లే ఒక తండ్రిగా రవితేజ కనిపించనున్నట్లు టాక్ వినిపిస్తోంది. గతంలో దర్శకుడు శివ నిర్వాణ నిన్ను కోరి (2017), మజిలీ (2019), ఖుషి (2023) వంటి ప్రేమకథా చిత్రాలతో హిట్స్‌ కొట్టారు. రవితేజతో తీస్తోన్న పాన్‌ ఇండియా రేంజ్‌ మూవీ  2026లోనే ఈ విడుదల కానుంది.
 

 

Advertisement
 
Advertisement
Advertisement