'మరిన్ని మ్యాజికల్ చేద్దాం'.. పెద్ది కెప్టెన్‌కు రామ్ చరణ్ స్పెషల్ విషెస్ | Tollywood Hero Ram Charan special Birthday Wishes To Buchi Babu Sana | Sakshi
Sakshi News home page

Ram Charan: పెద్ది కెప్టెన్‌కు రామ్ చరణ్ స్పెషల్ విషెస్

Feb 15 2026 10:21 AM | Updated on Feb 15 2026 11:39 AM

Tollywood Hero Ram Charan special Birthday Wishes To Buchi Babu Sana

రామ్ చరణ్ హీరోగా వస్తోన్న మోస్ట్ అవైటేడ్ రూరల్ స్పోర్ట్స్ డ్రామా పెద్ది. ఈ సినిమా కోసం మెగా ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ డేట్ అనౌన్స్ చేసిన మేకర్స్.. ఇటీవలే వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. ఈ ఏడాది ఏప్రిల్ 30న ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తామని ప్రకటించారు. ఈ చిత్రంలో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్‌గా కనిపించనుంది.

తాజాగా రామ్ చరణ్ తన డైరెక్టర్‌కు విషెస్ తెలిపారు. ఈ రోజు బుచ్చిబాబు బర్త్‌ డే కావడంతో పెద్ది మూవీ షూటింగ్‌లో ఉన్న ఫోటోను షేర్ చేశారు. పెద్ది కెప్టెన్‌ బుచ్చిబాబుకు పుట్టినరోజు శుభాకాంక్షలు.. సెట్‌లో మీ అభిరుచి, వివరణాత్మక కథనం, పాతుకుపోయిన కథ చెప్పడం ప్రతిరోజూ స్ఫూర్తిదాయకంగా ఉంటాయని రాసుకొచ్చారు. మనిద్దరం కలిసి మరిన్ని మాయా కథలను సృష్టిద్దామని చెర్రీ తన టీట్‌లో రాసుకొచ్చారు. ఈ సంవత్సరం మీ కృషికి తగిన గుర్తింపును తీసుకురావాలని ఆకాంక్షించారు. ఈ విషయం తెలుసుకున్న మెగా ఫ్యాన్స్ కూడా బుచ్చిబాబుకు విషెస్ చెబుతూ పోస్టులు పెడుతున్నారు.

 

 

Advertisement
 
Advertisement
Advertisement