లుంగీ ధరించి రమ్మన్నారు.. నో చెబితే..: యాంకర్‌ | Anchor Sravanthi comments on her costume | Sakshi
Sakshi News home page

లుంగీ ధరించి రమ్మన్నారు.. నో చెబితే..: యాంకర్‌

Feb 15 2026 10:46 AM | Updated on Feb 15 2026 11:49 AM

Anchor Sravanthi comments on her costume

సుహాస్‌ హీరోగా నటిస్తున్న హే భగవాన్‌ చిత్రంలో యాంకర్‌, బిగ్‌బాస్‌ ఫేమ్‌ స్రవంతి  కూడా  ఒక కీలక పాత్రలో నటిస్తుంది. తాజాగా విడుదలైన ఈ మూవీ ట్రైలర్‌ నెట్టింట వైరల్‌ అవుతున్న విషయం తెలిసిందే.  ఫిబ్రవరి 20న ఈ మూవీ విడుదల కానుంది. దీంతో స్రవంతి ప్రమోషన్స్‌ కార్యక్రమంలో పాల్గొంటూ సినిమాపై బజ్‌ క్రియేట్‌ అయ్యేలా దూసుకెళ్తెంది. హీరోయిన్ల డ్రెస​్‌ల గురించి నటుడు శివాజీ చేసిన వ్యాఖ్యలు దుమారం అయిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే యాంకర్‌ డ్రెస్‌లు ఎవరు సెలక్ట్‌ చేస్తారనేది స్రవంతి క్లారిటీ ఇచ్చింది.

' ఏదైనా ఒక సినిమా ఈవెంట్‌కు వెళ్లితే మా కాస్ట్యూమ్స్ ఎలా ఉండాలి అనేది  వాళ్లే  డిసైడ్ చేస్తారు. ఎలాంటి దుస్తులు ధరించాలనేది మా చాయిస్‌ కాదు. శ్రీవిష్ణు నటించిన సింగల్‌ మూవీ ఈవెంట్‌ కోసం లుంగీ కట్టుకుని రమ్మని చెప్పారు. అప్పుడు అదే పనిగా కళ్లజోడు, లుంగీ కొనుగోలు చేసి వాటిని ధరించి యాంకరింగ్‌ చేశాను.నో చెబితే అవకాశాలు రావు. అందుకే ఈ విషయంలో మాకు ఆప్షన్‌ ఉండదు. దుస్తుల విషయంలో మాకు ఆప్షన్‌ ఇస్తే నేను ట్రెడిషనల్‌ డ్రెస్‌నే ఎంపిక చేసుకుంటాను. కొన్ని సినిమాలకు చీరలు కట్టుకునే ప్రమోషన్స్‌ కార్యక్రమాలకు పాల్గొన్నాను. నా వద్ద సుమారు వెయ్యికి పైగా చీరలు ఉన్నాయి.' అని స్రవంతి చెప్పింది.

హీరోయిన్ల దుస్తుల గురించి నటుడు శివాజీ వ్యాఖ్యలు సబబుగానే ఉన్నాయని స్రవంతి పేర్కొంది. కానీ, మహిళల గురించి మాట్లాడుతూ ఆయన నుంచి రెండు పదాలు తప్పుగా దొర్లాయి.. వాటిని తాను కూడా సమర్ధించను. తర్వాత శివాజీ కూడా క్షమించాలని బహిరంగంగానే చెప్పారని ఆమె గుర్తు చేసింది.
 

Advertisement
 
Advertisement
Advertisement